"బ్రిటిష్ వాళ్ళు ఇండియా కి రాకుండా ఉంటె ప్రస్తుతం మన భారత దేశం ఎట్లా ఉండేది ?" అన్న దాని మీద ఆ టాపిక్ పై ఆలోచిస్తే - బ్రిటిష్ వాడు రాకుండా ఉంటె భారత దేశం లో హిందూ ధర్మ నిలిచి ఉండేదా అని సందేహం కలిగింది.
ఎందు కంటే పక్క దేశాలైన మలేసియా ఇండోనేసియా లాంటి దేశాల్ని చూస్తె - బ్రిటిష్ వాడి రాక మునుపు దేశం ఇస్లాం వైపు మొగ్గు వేస్తూన్నట్టు గా కనిపిస్తుంది.
ముసల్మాను రాజుల దండ యాత్రలు - ఆ పై మన దక్షిణ భారత దేశం లో కూడా శ్రీ కృష్ణ దేవరాయల సంతతి తిరోగతి - సుల్తానుల ప్రాబల్యం ఎక్కువవుతున్న కాలం లో - ఆ సమయం లో బ్రిటిష్, వాడు ఇండియా కి రావడం - వాడి తో బాటు వాడి సంస్కృతి, మతం - ఇండియా కి రావడం - ఓ లాంటి చెక్ పాయింట్ అయ్యింది -
ఇస్లాం ఇంకా తీక్షణం గా భారత దేశం లో ప్రాబల్యం కాకుండా ఉండడానికి - వీడే రాకుండా ఉంటె - సుల్తానుల ప్రాబల్యం తో భారత దేశం - ఓ మోస్తరు ప్రస్తుతం ఇస్లామిక్ దేశం గా ప్రస్తుతం ఉండేదేమో? -
ఇది ఊహా చిత్రం కాబట్టి - వాదనలకి చాల తావుంది ఈ చిత్రం లో - మీ అభిప్రాయలు - భిన్న అభిప్రాయాలు - కచ్చితం గా ఈ విషయం పై ఉంటాయీ.
గీత లో శ్రీ కృష్ణ భగవానుడు - యదా యదాహి ధర్మ స్య గ్లానిర్భవతి భారతా- తానూ మళ్ళీ మళ్ళీ వస్తానంటాడు. అంటే బ్రిటిష్ వాడి రాక దీన్ని సూచిస్తుందా? - క్రీస్తు మతం - ఇండియా కి రావడం - దీన్ని సూచిస్తుందా? -
ఆలోచనలకి మంచి పదును పెట్టె విషయం ఇది.
ఆలోచించి చూడండి- భారతం - సంగమం - వివిధ మతాల సమ్మేళనం -
ఆ నాటి బు ద్దుడి సమయం నించి చూస్తె భౌద్ధం , జైనం, ఇస్లాం - ఈ నాటి బాబాలు , స్వాములు - గురువులు యోగుల దాక భారత దేశం లో మతం మీద జరిగినంత వెరైటీ ఎక్స్ పెరి మెంట్స్ ఇంకా ఎ దేశంలో కూడా జరిగి ఉండదు. -
ఈ లాంటి సంక్లిష్ట వాతావరణం లో సనాతన ధర్మ పద్దతి - ఇంకా కొన సాగుతూనే ఉంది- కారణం ఏమంటారు? -
మనిషి ప్రగతి కి - ఆధ్యాత్మిక శిఖరాని అతను అందుకోవ డానికి - ఎలాంటి నిర్బంధాలు లేకుండా- వ్యక్తి స్వేఛ్చ తో - భగవంతున్ని అనంతం తో నిలబెట్టి - నీకంటూ ఓపిక , ఇచ్ఛా ఉంటె- ఆ సర్వాంతర్యామి ని - రాయి లో నించి అనంతం దాక ప్రత్యక్షం చేసుకో - అన్న ఉదాత్త వేదాన్ని అతని ముందు ఉంచుతుంది.
సో, మొహమ్మదు , క్రీస్తు కూడా - ఇందులో ఓ భాగం గా ఇమడ గలగడం - ఆ సనాత న ధర్మ వైశాల్యాన్ని చూపెడుతూంది.
మీరేమంటారు?
జిలేబి.