జిలేబి కి బ్లాగ్ రత్న అవార్డు !
రాబోయే కాలం లో బ్లాగ్ 'రత్తాలు', బ్లాగ్ 'v' భో షా ణా లు , బ్లాగ్ భో షా ణా లు, బ్లాగ్ శ్రీ లు రావచ్చు.
ఆ కాలం లో పొస్తమస్ గా నా కేవ్వరైనా బ్లాగ్ శ్రీ లాంటివి, బ్లాగ్ 'భో షా ణం ' ఇస్తే గిస్తే బ్లాగ్ లోకం లో అప్పుడున్న బ్లాగ్ మణులు, మాన్యులు 'జిలేబీ కి శ్రీ తగదు, 'భో షా ణం ' తక్కువ అని టపాలు కట్టి, జిలేబీ ని వాయ గొట్ట వచ్చు!
అందుకే పకడ్బందీ గా ఇప్పుడే ప్రకటించు కుంటున్నా !
అప్పుడు నాకు వారికి సై అనడా నీకో, వారి మన్ననలు పొంద డానికో అవకాశం ఉండదు కదా!
పై నించి చూసి, మా నాన్నే, మా బంగారమే, నేను బ్లాగులు రాస్తున్న సమయం లో మీరంతా 'బుడతలు', బుడ్డీ లు రా ! నా గురించి ఇంత గా మీరు కొట్లా డొ ద్దు అని ఊరట జెప్పే అవకాశమూ ఉండదు !
ఏమి మీ అపార మైన ప్రేమ జిలేబీ మీద అని 'అనాధ' భాష్పాలు చిందించినా వారికి తెలిసే అవకాశం లేదు గా మరి.
అంతే గాక, ఆ రాబోవు కాలం లో మీరు నాకు 'భోషాణం' ఇస్తే, ఛ ,ఛ , నా కిది వద్దు పో ఇది చాలా తక్కువ అని నే జెప్పలేను కూడా .
పోస్తు మస్సు గా ఇస్తే, భోషాణం వద్దంటుంది ఈ జిలేబీ అని మీరు ఆవేశ పడి పోయి మళ్ళీ మరో వంద టపాలు, కామెంట్లు బర బర , గిర గిర టప టప లాడిస్తారు . ఎందుకు ఇన్ని భేషజాలు చెప్పండి?
అందుకే, ఇప్పుడే మీ కందరికీ చెబ్తా ఉండా , జిలేబీ కి 'బలాగు' రత్తాలు' అని ఇప్పుడే ప్రకటించు కుంటున్నా !
జిలేబి కి ఆ రాబోయే కాలం లో 'భళా'గు రత్న ఇస్తే, ఆయ్, జిలేబి సమకాలీకులు బ్లాగు జ్యోతులు , పని లేని వాళ్ళు, కష్ట పడిన వాళ్ళు, అర్పితలు,బ్లాగాడించిన వాళ్ళు, సుబ్బరం గా రాసిన వాళ్ళు, రోజుల తరబడి పద్యాలల్లిన వాళ్ళు, ఎంత మంది లేదు ? వాళ్లకు ఇచ్చి ఉండవచ్చు గా అంటూ జిలేబి ని తుస్సు మని వాళ్ళు వాయ గొడతారు !- అందుకే ఇప్పటికిప్పుడే నాకు నేనే 'బలాగు' రత్నం అని ప్రకటించు కుంటూం డా !
ఓ మారు జిలేబీ 'బాలా' గు బ్లాగ్ 'రత్తాలు' కి జే జే కొట్టుడీ మరి ! జై ;బాలా, (గు) రత్నా ! జిలేబీ !
ఇట్లు
మీ అనుంగు
బలాగు రత్నం
'సహీ' రత్న'
జిలేబి.
కంగ్రాచ్యులేషన్స్.
ReplyDeleteబ్లాగు రత్న జిలేబీ గారికి జై!
ReplyDeleteకంగారు(గా)లేచన్స్ 'భళా'గురత్నం గారికి :)
ReplyDeleteకంగ్రాచ్యులేషన్స్.
ReplyDeleteThis comment has been removed by the author.
Deleteబ్లాగుల రత్తమ్మ గారికీ జై!
ReplyDeleteబ్లాగు రత్న గారి శుభాకాంక్షలు
ReplyDelete'జిలేబి 'గారికే నా కలకాలపు హృదయ పూర్వక శుభాకాంక్షలు:)
ReplyDelete"తననుతాను పొగుడుకుంటే తన్నుకున్నట్టుంటుందని" సామెత. ఎవరికి వారు రత్నాలు ప్రదానం చేసుకుంటే ఎంతందంగా ఉంటుందో! అదే గొప్పమరి, ఎంతయినా సంప్రదాయం తప్ప కూడదు కదా!.
ReplyDeleteగుంపుతో గోవిందా!
బ్లాగురత్న జిలేబిగారికి.. జ...యి
మీరు బ్లాగ్రత్న అయితే
ReplyDeleteనేను కామెంటు వజ్ర - దహా!
"భళా"గు రత్నకు కామెంట్వజ్ర "కలికి"తురాయి!?
బ్లాగ్ రత్న అవార్డ్ తేది 27-డిసెంబర్ -2014 నుండి అమలులోకి వచ్చింది అనుకుంటాను...మొట్టమొదటి బ్లాగ్ రత్న జిలేబి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు
ReplyDeleteజయీ భవ ! విజయీ భవ!
ReplyDeleteభళా గు రత్న జిలేబి కి జేజేలు పలికిన మిత్రులందరికీ ధన్యవాదాలు !
కామెంటిన అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షల తో
మీ
చీర్సు సహిత
సహీ జిలేబి