Monday, January 12, 2015

ఓ టీ టీ డీ కళ్ళు తెరు !


ఈ మధ్యన తిరుమల శ్రీనివాసుని దర్శనానికి వెళ్ళడం జరిగింది.

ముందురోజున సహస్ర దీపాలంకరణ సేవ ద్వారా దర్శనం చేసుకుని మర్నాడు పొద్దున్న మళ్ళీ ఇంకోసారి దర్శనం చేసుకుందామని VIP బ్రేక్ లో టికెట్స్ బుక్ చేశాము.
 
సరే ఉదయాన్నే లేచి స్నానాలు కానిచ్చి ఆరింటికల్లా క్యూలో నిలబడ్డాము.గేట్ దగ్గరకు వచ్చేసరికి అందరికీ ID కార్డ్స్ ఉండాలని గేట్లో ఉన్న ఉద్యోగులు పట్టుబట్టారు.టికెట్స్ బుక్ చేసేటప్పుడు నా ఐడీ మీద బుక్ చేశాము.సరిపోతుందిలే అనుకున్నాము.కానీ అలా కుదరదనీ,ఒక కుటుంబంలో నలుగురు ఉంటె నలుగురికీ ఐడీ కార్డులు తప్పనిసరిగా ఉండాలనీ ఉన్నవాళ్ళే లోనికి వెళ్ళమనీ లేకుంటే ఆగిపోమ్మనీ గేట్లో ఉన్న  TTD ఉద్యోగులు పట్టుబట్టారు.మాలాగే దాదాపు ఒక 50 మంది ఆగిపోయారు.వారిలో అహమ్మదాబాద్ మొదలైన దూరప్రాంతాలనుంచి వచ్చ్సినవారే గాక,విదేశాల నుంచి వచ్చినవారు కూడా ఉన్నారు.వారందరూ బిక్కముఖాలు వేసుకుని ఉద్యోగులను బ్రతిమిలాడుకుంటున్నారు.

ఆలయానికి ఉగ్రవాదుల నుంచి ప్రమాదం ఉండవచ్చు.దానికి జాగ్రత్తలు తీసుకోవచ్చు.ఎవరూ కాదనరు.కానీ దూరం నుంచి వచ్చినవారినీ,ఒకే కుటుంబంలోని వారినీ,కొందరిని వదిలి,కొందరిని వదలకుండా వాళ్ళు పెట్టె హింస చాలా చండాలం అనిపించింది.

అంతంత దూరాలనుంచి వచ్చి అంత చలిలో పొద్దున్నే క్యూలో నిలబడే వాళ్ళు టెర్రరిస్టులా లేక భక్తులా అన్న విచక్షణ అక్కడి ఉద్యోగులకు లేకపోవడం చూసి అసహ్యం కలిగింది.

కొద్దిసేపు అక్కడే ఉండి,ఆ గొడవ అంతా పరిశీలిస్తూ ఉన్నాను.బ్రతిమిలాడే వాళ్ళు రకరకాలుగా బ్రతిమిలాడుతున్నారు.ఉద్యోగులు కరగడం లేదు.

పరిస్థితి చాలా దయనీయంగా ఉన్నది.

ఎంతో దూరం నుంచి వచ్చి,డబ్బులు కట్టి టికెట్స్ బుక్ చేసుకుని,తీరా వాకిట్లోకి వచ్చేసరికి లోనికి వెళ్ళనివ్వకపోతే ఎంత బాధ కలుగుతుందో ఆ బ్రతిమిలాడే వాళ్ళను చూస్తె అర్ధమౌతుంది.నాకైతే వాళ్ళను చూస్తె అయ్యో పాపం అనిపించింది.వారి తరఫు నుంచి నేనూ కొంత సేపు ఉద్యోగులతో వాదించాను.కానీ వాళ్ళు వినడం లేదు.

పరాయి మతాలవాళ్ళు చర్చిల తలుపులు బార్లా తీసి లోనికి రమ్మని పిలుస్తుంటే మనం మాత్రం దైవదర్శనానికి టికెట్లు పెట్టి, డబ్బులు కట్టినవారిని కూడా నానా మాటలంటూ,పొమ్మని తోసేస్తున్నాము.

మన హిందూమతం ఎలా బాగుపడుతుంది?

ఇలాంటి అవమానాలు పొందిన కొందరు ఈ ఖర్మ మనకెందుకంటూ ఇతర మతాలకు మారడం నాకు తెలుసు. అక్కడైతే ఎదురు డబ్బులు ఆస్తులు ఇచ్చి మరీ లోనికి రమ్మంటారు. ఇక్కడేమో వాకిట్లోకి వచ్చినవారిని పోపొమ్మంటున్నారు.

భలే వింత!!

పైగా,మన మతాన్నీ మన దేవాలయాలనూ మన దేవుళ్ళనూ విమర్శించడానికి ఇలాంటి చర్యలద్వారా మనమే ఇతర మతాలకు చక్కని అవకాశం కల్పిస్తున్నాం.

పూర్తి గా శ్రీ సత్యనారాయణ శర్మ గారి టపా - ఆలోచింప జేసేది


ఓ టీ టీ డీ కళ్ళు తెరు

జిలేబి
 

Friday, January 9, 2015

సనాతన ధర్మ ఉద్దీపకుడు క్రీస్తు ప్రభువు !


"బ్రిటిష్ వాళ్ళు ఇండియా కి రాకుండా ఉంటె ప్రస్తుతం మన భారత దేశం ఎట్లా ఉండేది ?" అన్న దాని మీద  ఆ టాపిక్ పై ఆలోచిస్తే - బ్రిటిష్ వాడు రాకుండా ఉంటె భారత దేశం లో హిందూ ధర్మ నిలిచి ఉండేదా అని సందేహం కలిగింది.

ఎందు కంటే పక్క దేశాలైన మలేసియా ఇండోనేసియా లాంటి దేశాల్ని చూస్తె - బ్రిటిష్ వాడి రాక మునుపు దేశం ఇస్లాం వైపు మొగ్గు వేస్తూన్నట్టు గా కనిపిస్తుంది.

ముసల్మాను రాజుల దండ యాత్రలు - ఆ పై మన దక్షిణ భారత దేశం లో కూడా శ్రీ కృష్ణ దేవరాయల సంతతి తిరోగతి - సుల్తానుల ప్రాబల్యం ఎక్కువవుతున్న కాలం లో - ఆ సమయం లో బ్రిటిష్, వాడు ఇండియా కి రావడం - వాడి తో బాటు వాడి సంస్కృతి, మతం - ఇండియా కి రావడం - ఓ లాంటి చెక్ పాయింట్ అయ్యింది -

ఇస్లాం ఇంకా తీక్షణం గా భారత దేశం లో ప్రాబల్యం కాకుండా ఉండడానికి - వీడే రాకుండా ఉంటె - సుల్తానుల ప్రాబల్యం తో భారత దేశం - ఓ మోస్తరు ప్రస్తుతం ఇస్లామిక్ దేశం గా ప్రస్తుతం ఉండేదేమో? -

ఇది ఊహా చిత్రం కాబట్టి - వాదనలకి చాల తావుంది ఈ చిత్రం లో - మీ అభిప్రాయలు - భిన్న అభిప్రాయాలు - కచ్చితం గా ఈ విషయం పై ఉంటాయీ.

గీత లో శ్రీ కృష్ణ భగవానుడు - యదా యదాహి ధర్మ స్య గ్లానిర్భవతి భారతా- తానూ మళ్ళీ మళ్ళీ వస్తానంటాడు. అంటే బ్రిటిష్ వాడి రాక దీన్ని సూచిస్తుందా? - క్రీస్తు మతం - ఇండియా కి రావడం - దీన్ని సూచిస్తుందా? -

ఆలోచనలకి మంచి పదును పెట్టె విషయం ఇది.

ఆలోచించి చూడండి- భారతం - సంగమం - వివిధ మతాల సమ్మేళనం -

ఆ నాటి  బు ద్దుడి సమయం నించి చూస్తె భౌద్ధం , జైనం, ఇస్లాం - ఈ నాటి బాబాలు , స్వాములు - గురువులు యోగుల దాక భారత దేశం లో మతం మీద జరిగినంత వెరైటీ ఎక్స్ పెరి మెంట్స్ ఇంకా ఎ దేశంలో కూడా జరిగి ఉండదు. -

ఈ లాంటి సంక్లిష్ట వాతావరణం లో సనాతన ధర్మ పద్దతి - ఇంకా కొన సాగుతూనే ఉంది- కారణం ఏమంటారు? -

మనిషి ప్రగతి కి - ఆధ్యాత్మిక శిఖరాని అతను అందుకోవ డానికి - ఎలాంటి నిర్బంధాలు లేకుండా- వ్యక్తి  స్వేఛ్చ తో - భగవంతున్ని అనంతం తో నిలబెట్టి - నీకంటూ ఓపిక , ఇచ్ఛా ఉంటె- ఆ సర్వాంతర్యామి ని - రాయి లో నించి అనంతం దాక ప్రత్యక్షం చేసుకో - అన్న ఉదాత్త వేదాన్ని అతని ముందు ఉంచుతుంది.

సో, మొహమ్మదు , క్రీస్తు కూడా - ఇందులో ఓ భాగం గా ఇమడ గలగడం - ఆ సనాత న ధర్మ వైశాల్యాన్ని చూపెడుతూంది.

మీరేమంటారు?


జిలేబి.

Tuesday, January 6, 2015

ఓవర్ టైం అలోవేన్స్ కోరిన ఏడు కొండల వాడు !

ఓవర్ టైం అలోవేన్స్ కోరిన ఏడు కొండల వాడు !

పాల సముద్రం ! మధ్యలో అలవోక గా కనులు మూసుకుని శ్రీదేవి కాళ్ళు సుతారం గా ఒత్తు తూంటే అట్లా తీరిగ్గా జోగుతున్నాడు మహా విష్ణువు.

డమాల్ మని వైకుంటం తలుపులు తెరుచు కుని విస విస మిస్టర్ పెరుమాళ్ళు మిస్సెస్ అలమేలు మంగా వచ్చేరు !

తన అంశ ఐన వెంకన్న ని జూసి మహావిష్ణువు - రావోయ్ - ఏమి విశేషాలు - వైకుంట ఏకాదశి బాగా జరిగిందా అంటూ కుశల మడి గేడు .

లక్ష్మీ దేవి మంగా తాయారుని ఇంటి లోపలి తీసుకు పోయింది

ఏడు కొండల వాడికి మండి పోయింది . రెండు రోజులుగా జనవరి ఒకటి, వైకుంట ఏకాదశి అంటూ తన్ను ఓవర్ టైం చేయించి దస్కం బాగా దక్కినట్టు పేపర్లో వచ్చిన వార్త చదివి అప్పుడే హాట్ హాట్ గా ఉన్నాడు నామాల సామి.

నాజూగ్గా పాదాలు వత్తు తూంటే కులసాగ్గా జోగుతున్న మహా విష్ణువు ని జూస్తే మరీ మండి పోయింది కలియుగ దైవానికి.  తను రోజుల తరబడి నిల్చొని కలియుగ వరదు డై ప్రపంచాన్ని కాస్తూంటే , ఈ పెద సామి తీరిగ్గా కాళ్లార బెట్టు కుంటూ జోగుతున్నాడు !

వైకుంట ఏకాదశి అంటూ నన్ను మరీ ఓవర్ టైం గావించేసారు . ఇక నేను కలియుగ వరదు డై ఉండను . వేరే ఏదన్నా కాళ్ళు జాపు కుని ఉండే రోల్స్ అండ్ రేస్పాన్సి బిలిటీ నా కివ్వు  - డిమాండ్ చేసాడు వెంకన్న .

గతుక్కు మన్నాడు మహా విష్ణువు ! వెంకన్న ఆ రోల్ చెయ్యక బోతే తానె అతని పని కూడా చేయాలి - ఎట్లా అయినా వరదన్న ని బోల్తా కొట్టించి మళ్ళీ కొండకి పంపేయాలి అనుకుని మహా విష్ణువు నిమ్మళం గా చెప్పేడు -

దానికేమి వరదా ! అట్లా గె చేసేస్తా ! మిజోరం రాష్ట్రం అని ఒకటి ఉన్నది అక్కడికి నిన్ను బదలాయిస్తా ! సాఫీ గా దినాలు సాగిపోతాయి .  ఆంధ్ర దేశం ఇప్పుడు ఎట్లాగూ ఫాస్ట్ మోడ్ లో ఉంది కాబట్టి గట్టి గా నిలబడి పని జేసే ఆసామి ని ఎవర్నైనా జూసి కలియుగ వరదు ని గా పెట్టేస్తా చెప్పేడు స్వామి .

అది సరే, మిజోరం లో నిన్ను పెడితే అలోవేన్సు లు గట్రా వస్తాయి గాని , నీ కుబేరుని బకాయి తీరు తుందం టావా వెంకన్నా ? అడిగేడు మహా విష్ణువు సందేహం గా .

వెంకన్న గతుక్కు మన్నాడు . కుబేరుని బకాయి ఎప్పటి కి చెల్లు అవుతుందో తనకు లెక్కలు తెలియ వాయె ! అందరూ ఏడు కొండల పెరుమాళ్ళ కే ఎరుక అనేస్తారు గాని , ఈ కుబేరుని బకాయి మాత్రం తనకు అర్థం కాని గట్టి పిండం .

కుబేరుని బకాయి మిగులు ఎంతో నాకు తెలియదే మరి  జెప్పాడు వెంకన్న .

ఐతే మిజోరం వద్దులే . పనికి రాదు నీకు చెప్పేడు మహా విష్ణువు .

పోనీ ఇట్లా కాళ్ళ రి గి పోయే లా పని జేస్తున్నా కదా అట్లీస్ట్ ఓవర్ టైం అలోవన్సు అయినా సేన్క్షన్ చేయరాదూ ?? విన్న వించు కున్నాడు పెరుమాళ్ళు .

హమ్మయ్య వెంకన్న మన దారికి వచ్చేడు అనుకుని మహా విష్ణువు సంతోష పడి - దానికేమి లే , ఓవర్ టైం అలోవన్సు నీ కిచ్చేయ మంటా దేవస్థానం వారికి  ఆర్డరు పాస్ జేసెడు స్వామి -

"వెంకన్న కి ఓవర్ టైం అలోవన్సు ఇచ్చి - ఆ దస్కాన్ని డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ క్రింద వెంకన్న బకాయి అకౌంట్ విత్ కుబేరా బ్యాంక్ కి జమ చేయ వలసినది గా ఆర్డినేన్సు జారీ చేయ బడినది "


చీర్స్

జిలేబి

Sunday, January 4, 2015

గాంధీ 'సత్యాగ్రహం' - మోదీ 'అభ్యుదయాగ్రహం' !


గాంధీ 'సత్యాగ్రహం' - మోదీ 'అభ్యుదయాగ్రహం' !

జనవరి ఒకటి నాడు అభ్యుదయాగ్రహ 2015 నూతన సంవత్సర శుభాకాంక్షలు అని గ్రీటింగ్స్ చెబ్తే, ఓయ్ జిలేబి అభ్యుదయాగ్రహ మంటే ఏమిటి అని శ్యామలీయం వారు పృచ్చిం చేరు !

ఈ వాక్యం - గాంధీ 'సత్యాగ్రహం' - మోదీ 'అభ్యుదయాగ్రహం' ! తో అభ్యుదయాగ్రహ మంటే ఏమిటో ఇక వివరించ వలసి వస్తుందని అనుకోను !!

బ్రిటీషు వారి తుపాకీ కి అందని ది గాంధీ వారి సత్యాగ్రహ ఆయుధం ! (ఎవరన్నారు - గాంధీ అహింసా వాది అని? వారి సత్యాగ్రహ మే ఒక 'వాడి' ఆయుధం కాదూ ? ఆంగ్లేయులకి అర్థం కాని ఆయుధం గాంధీ వారిది!)

సో, అట్లాగే ప్రస్తుత భారత దేశానికి మోదీ వారిది అభ్యుదయాగ్రహ మహాయుధం  అన్న అర్థం వచ్చే రీతి లో ఆ నూతన సంవత్సర శుభాకాంక్షలు అంద జేయడం జరిగినది 

అదే రోజు మోదీ వారి నీతి ఆయోగ్ విల్లు ని ఎక్కు పెట్టేరు కూడాను !

సో బ్లాగోదరీ బ్లాగోదరుల్లారా !

ఇదియే జిలేబి 2015 కి ఇచ్చు విన్నూత్న పద కేళీ !

అభ్యుదయాగ్రహం !


చీర్స్ 
జిలేబి 

Thursday, January 1, 2015

అభ్యుదయాగ్రహ 2015 నూతన సంవత్సర శుభాకాంక్షలు !

 
వరూధిని బ్లాగు
పాటకుల  కందరికీ 
టపాలకి ప్రోత్సాహం
కలిగిస్తూ కామెంటిన 
బ్లాగు మిత్రులందరికీ 
అభ్యుదయాగ్రహ 
 
2015
 
నూతన సంవత్సర
శుభాకాంక్షల తో 
 
మీ 
చీర్సు సహిత 
'సహీ' జిలేబి !
 

Tuesday, December 30, 2014

పక్కింటాయన వర్సెస్ ఎదురింటావిడ !

పక్కింటాయన వర్సెస్ ఎదురింటావిడ !


ఇదిగో పక్కింటాయన గారు , మీకో విషయం తెలుసా ??

ఏమిటండి ??

పన్లేక మీ గురించి చాలా చాలా విషయాలు రాస్తున్నారట !

పొగుడు తున్నారా తెగుడు తున్నారా !

అబ్బే ! మనవాళ్ళు పొగడ్తల కి ఎప్పుడైనా పేరు పోయేరా !

అంటే తెగడ్తేనా ??

ఏమండీ ఎదురింటి ఆవిడ గారు , మీకో విషయం తెలుసా ??

ఏవిటో ??

కబుర్లాడ టానికి మీరే దొరికారన్న మాట పన్లేని వాళ్లకి !

ఆ ! ఎవరా బడుద్దాయిలు ?? ఏమన్నారు ??

పక్కింటా యన వర్సెస్ ఎదురింటి ఆవిడ వెరసి ....

ఆపెసారేం మధ్యలో !

ఇద్దరూ కూడ బలుక్కుని పై పైకి  వచ్చేరు మాడు పగుల గొట్ట టానికి !!

అబ్బే , నన్న న మా కండి ! నే నారదా య నమః అంటున్నా అంతే !!

ఎవరక్కడ ! ఆ పన్లేని వాళ్ళని తోలుకు రండి !

హుజూర్ ! జహాంపనా!

హుజూర్ మేం సాహిబా !!!

సందిట్లో సడే మియా జిలేబి పరార్! !

చీర్స్
జిలేబి

Saturday, December 27, 2014

జిలేబి కి బ్లాగ్ రత్న అవార్డు !


జిలేబి కి బ్లాగ్ రత్న అవార్డు !

రాబోయే కాలం లో బ్లాగ్ 'రత్తాలు', బ్లాగ్ 'v' భో షా ణా లు , బ్లాగ్ భో షా ణా లు, బ్లాగ్ శ్రీ లు రావచ్చు.

ఆ కాలం లో పొస్తమస్ గా నా కేవ్వరైనా బ్లాగ్ శ్రీ లాంటివి, బ్లాగ్ 'భో షా ణం '  ఇస్తే గిస్తే బ్లాగ్ లోకం లో అప్పుడున్న బ్లాగ్ మణులు, మాన్యులు 'జిలేబీ కి  శ్రీ తగదు, 'భో షా ణం ' తక్కువ అని టపాలు కట్టి, జిలేబీ ని వాయ గొట్ట వచ్చు!

అందుకే పకడ్బందీ గా ఇప్పుడే ప్రకటించు కుంటున్నా !

అప్పుడు నాకు వారికి సై అనడా నీకో, వారి మన్ననలు పొంద డానికో అవకాశం ఉండదు కదా!

పై నించి చూసి, మా నాన్నే, మా బంగారమే, నేను బ్లాగులు రాస్తున్న సమయం లో మీరంతా 'బుడతలు', బుడ్డీ లు రా ! నా గురించి ఇంత గా మీరు కొట్లా డొ ద్దు అని ఊరట జెప్పే అవకాశమూ ఉండదు !

ఏమి మీ అపార మైన ప్రేమ జిలేబీ మీద అని 'అనాధ' భాష్పాలు చిందించినా వారికి తెలిసే అవకాశం లేదు గా మరి.

అంతే గాక, ఆ రాబోవు కాలం లో మీరు నాకు 'భోషాణం' ఇస్తే,  ఛ ,ఛ , నా కిది వద్దు పో ఇది చాలా తక్కువ అని నే జెప్పలేను కూడా .

పోస్తు మస్సు గా ఇస్తే, భోషాణం వద్దంటుంది ఈ జిలేబీ అని మీరు ఆవేశ పడి పోయి మళ్ళీ మరో వంద టపాలు, కామెంట్లు బర బర , గిర గిర  టప టప  లాడిస్తారు . ఎందుకు ఇన్ని భేషజాలు చెప్పండి?

అందుకే, ఇప్పుడే మీ కందరికీ చెబ్తా ఉండా , జిలేబీ కి 'బలాగు' రత్తాలు' అని ఇప్పుడే ప్రకటించు కుంటున్నా !

జిలేబి కి ఆ రాబోయే  కాలం లో 'భళా'గు రత్న ఇస్తే, ఆయ్, జిలేబి సమకాలీకులు బ్లాగు జ్యోతులు , పని లేని వాళ్ళు, కష్ట పడిన వాళ్ళు,  అర్పితలు,బ్లాగాడించిన వాళ్ళు, సుబ్బరం గా రాసిన వాళ్ళు, రోజుల తరబడి పద్యాలల్లిన వాళ్ళు, ఎంత మంది లేదు ? వాళ్లకు  ఇచ్చి ఉండవచ్చు గా అంటూ జిలేబి ని తుస్సు మని  వాళ్ళు వాయ గొడతారు !- అందుకే ఇప్పటికిప్పుడే నాకు నేనే 'బలాగు' రత్నం అని ప్రకటించు కుంటూం డా !

ఓ మారు జిలేబీ 'బాలా' గు బ్లాగ్ 'రత్తాలు' కి జే  జే కొట్టుడీ మరి ! జై ;బాలా, (గు) రత్నా ! జిలేబీ !


ఇట్లు
మీ అనుంగు
 బలాగు రత్నం
'సహీ' రత్న'
జిలేబి.

Friday, December 26, 2014

ఓం స్వామి- జ్ఞాపకాలు - కార్పోరేట్ జీవనం నించి -హిమవత్ శృంగం వైపు !

ఓం స్వామి- జ్ఞాపకాలు - కార్పోరేట్ జీవనం నించి -హిమవత్ శృంగం వైపు !
 
If Truth Be Told
 
A Monk's Memoir

http://omswami.com/2014/10/if-truth-be-told.html
 

Wednesday, December 24, 2014

ఇచ్చట మతములు అమ్మకానికి గలవు ! - ఆలశించిన ఆశా భంగం !

 
ఇచ్చట మతములు అమ్మకానికి గలవు ! - ఆలశించిన ఆశా భంగం !
 
భలే మంచి చౌక బేరము !
 
ఇచ్చట మతములు అమ్మకానికి గలవు ! -
 
ఆలశించిన ఆశా భంగం ! వెంటనే త్వర పడండి !
 
ఈ స్కీము వివరాలు -
 
ఈ ఐ పీ ఓ ఆఫర్ అవకాశం డిసెంబర్ 31 2014 తారీఖు వరకు మాత్రమె !
 
ఇది క్లోజ్ ఎండెడ్ స్కీమ్ !
 
ఆ పై మతాలని కావాల్సిన వారు వాటిని ఉన్న వాళ్ళ దగ్గిరే కొనుక్కోవలసి ఉంటుంది !
 
మీ మతమును 'డీ మెట్' చేసుకొను సౌకర్యము గూడా గలదు !
 
మీరెన్ని మతములనైనాను తక్కువ ధరలో కొనుక్కోవచ్చు !
 
వాటి కి సరియైన మార్కెట్టు ధర పలికినప్పుడు వాటిని 
నిమ్మళం గా మీరు  అమ్మెయ్య వచ్చు !
 
డిసెంబర్ 31 దాకా మీరెన్నెసి మతాలని అయినా కొనుక్కోవచ్చు !
 
టోకు ధరలో కావాల్సిన వారు డైరెక్టు గా సంప్రదించిన వారికి డిస్కౌంటు కూడా కలదు 
 
ఓపెన్ డే - ఆఫర్ - ఒక మతము కొన్న మరొక మతము ఫ్రీ ( 1:1 బోనస్ ఆఫర్)
 
అంతే గాక - మన దేశం లో రాబోయే కాలం లో పుట్టే పిల్లలకి మతముల ఆవశ్యం అయినప్పుడు మీరు వాటిని వారికి ప్రీమియం ధరల పై అమ్మకం చేయ వచ్చు 
 
మీరు ఏదైనా కొత్త మతములని ఫ్లోట్ చెయ్య దలచు కున్న వాటి పేరు , ఆ మతాల గురించి పూర్ణ మైన రిలీజ్ డాకుమెంట్ తో సహా మా కందిం చిన వాటి కి కాపీ రైటు చేసే సర్వీసు కూడా కలదు !
 
ఆ పై వాటిని మీరు ఐ పీ ఓ (ఇనిషి యల్ పబ్లిక్ ఆఫర్ ) క్రింద మార్కెట్ కి రిలీజ్ చేసు కోవచ్చు .
 
 
 
భలే మంచి చౌక బేరము 
వేగిరమే త్వరపడండి !

Tuesday, December 23, 2014

బ్లాగ్ గాంధీ - కష్టే ఫలే వారి తో ముఖా ముఖీయం - జిలేబీయం !


బ్లాగ్ గాంధీ - కష్టే ఫలే వారి తో ముఖా ముఖీయం - జిలేబీయం !


పల్లెటూరిలో పుట్టి, వృత్తిరీత్యా పల్లెలలోనే గడిపి, పల్లెలోనే నివాసముంటూ తన కాలక్షేపం కబుర్లు ద్వారా ప్రపంచ వ్యాపితంగా అభిమానులను సంపాదించుకున్న కష్టే ఫలే శర్మగారు అభినందనీయులు.

పేరుకే కాలక్షేపం కబుర్లని వ్రాస్తున్నా మాయమైపోతున్న అనేక మంచి సాంప్రదాయాలను, మంచి విషయాలను ఆయన తన బ్లాగులో టపాలుగా మనకి అందించారు. 

వారి తో పల్లె ప్రపంచం వారి ముఖా ముఖీ పూర్తి గా ఇక్కడ 

శ్రీ కష్టే ఫలే బ్లాగు శర్మ గారి ఫోటో - చౌర్యం బాతా ఖానీ ఫణి బాబు గారి కైంకర్యం !



(శ్రీ శర్మ గారి ఫోటో కర్టసీ -
 (దీనిని తెలుగు లో చౌర్యం అందురు ) !-