బ్లాగ్వాసుడి మోక్ష ప్రాప్తి !
ఒకానొకప్పుడు బ్లాగారణ్యం లో బ్లాగ్వాసుడనే కోపిష్టి ముని ఉండే వాడు . ఎవరి వల్ల నైనా చిన్న తప్పు జరిగితే చాలు , వెంటనే వెనకా ముందూ చూడ కుండా పెద్ద కామింటు శాపమివ్వడం ఆయన అలవాటు .
ఆ విధం గా ఒకసారి ప్రవీణు డనే ఒక రాజుపై ఆగ్రహించి , బ్లాగ్రాక్షసుడివి కమ్మని శపించాడు బ్లాగ్వాసుడు. ప్రవీణుడు బ్లాగ్రాక్షుడై కామెంట్ల తో ప్రజలను బాధించ సాగాడు .
ప్రవీణుడి మంత్రి శ్రీకాంతుడు . ఆయనకు జరిగిన విషయం తెలిసింది . వెంటనే ఆయన బ్లాగా రణ్యా ని కి వెళ్లి బ్లాగ్వాసుడి ని కలుసు కుని "ప్రవీణుడు మంచి బ్లాగ్రాజు . అతని బ్లాగ్రాతల తో ప్రజలు సర్దుకు పోయే వారు . మీ శాపం తో ప్రవీణుడు ఇప్పుడు బ్లాగ్రాక్షసు డై బ్లాగ్వీక్షకుల ను బాధిస్తున్నాడు . ప్రవీణుడి తప్పు కి ఇంత మంది బ్లాగ్లోక ప్రజలను ఉసురు పెట్టడం భావ్యం కాదు . దయ తలచి ఏదైనా తరుణో పాయం చెప్పండి అని వేడు కున్నాడు .
బ్లాగ్వాసుడు మంత్రి శ్రీకాంతుడి వైపు జాలిగా చూసి , "ఒకానొకప్పుడు బ్రహ్మ దేవుడు ఇచ్చిన వరాల వల్ల ఎందరో రాక్షసులు బలవంతులై ప్రపంచాన్ని బాధించారు. అంటే దేవుడి వల్ల తప్పు జరిగిందనా ? బ్లాగ్వీక్షకులు తమ కర్మ ఫలం అనుభ వించ వలసి నప్పుడు దేవుడు రాక్షసులకు వరా లిస్తాడు ; మునులు మనుషులకు శాపాలిస్తారు. ఇందులో నేను నిమిత్త మాత్రుణ్ణి . నన్నూ, నిన్నూ , అందర్నీ నడిపించే జిలేబి మాత పై నున్నది అని చెప్పాడు .
"మునివర్యా ! మీరు చెప్పింది అక్షర సత్యః ! బ్లాగ్వీక్ష కుల కర్మ ఫలం తీరి పోయే సమయం వచ్చిందేమో ? అందుకే నేను మీ దగ్గరకు వచ్చాను . నివార ణోపాయం చెప్పండి అని శ్రీకాంతుడు బ్లాగ్వా సుణ్ణి మరీ మరీ వేడు కున్నాడు .
చివరకు బ్లాగ్వాసుడు "నిన్ను చూస్తే నాకు జాలి కలుగు తోంది . కాబట్టి నీకు ఒక రహస్యం చెబుతున్నాను . విను. ఇక్కడి కి ఆమడ దూరం లో జిలేబీ ఆలయ మొకటి ఉన్నది . అందు లో నిలువెత్తు జిలేబి విగ్రహం సామాన్యుల గుండె లు జలదరింప చేసేటంత భయంకరం గా ఉంటుంది . నీవు ఆ విగ్రహం ముందు నిలబడి నీ శరీరం లో నువ్వు తక్కువ గా ఉపయోగించే భాగాన్ని అర్పిస్తే మనసులోని కోరిక తీరుతుంది వెళ్లు" అని చెప్పాడు .
శ్రీకాంతుడు ఆమడ దూరం ప్రయాణం చేసి అక్కడ ఉన్న జిలేబి ఆలయం చేరు కున్నాడు . అక్కడ జిలేబి విగ్రహం భయానకం గా ఉన్నప్పటి కి చలింపక "మాతా ! నా ప్రవీణుడి ని మళ్ళీ మనిషి ని చేయి . అందుకు గాను నా శరీరం లో తక్కువ గా పని జేసే నా బుర్రను, పుర్రె ను నీకు సమర్పించు కుంటున్నా " అంటూ జేబులోంచి గిల్లోట్ రేజర్ తీసుకుని తన తల ను నరుక్కో బోయాడు .
అప్పుడక్కడ కనులు మిరు మిట్లు గొలిపే వెలుగు వచ్చింది . శ్రీకాంతుడు చూడలేక కళ్ళు మూసు కున్నాడు . ఆ మరుక్షణం "బ్లాగ్మానవా ! నీ రేజర్ బ్లేడు సాహసానికి మెచ్చాను . నువ్వు ఆదరా బాదరా నగరానికి తిరిగి వెళ్లి కష్టే ఫలే శర్మ వారి లా వేయి టపాల దరి దాపుల్లో టపాలు గుమ్మరించు . ఆ టపాలను చదవడం మొదలెడితే ఇక మధ్య లో మానా లని పించ కూడదు . అప్పుడా టపాలను ప్రవీణుడి కి చదివి వినిపించు . అతను తిరిగి మామూలు మనిషి కాగలడు " అన్న మాటలు శ్రీ కాంతుడి చెవిలో గణీల్ గణీల్ మని వినిపించేయి .
శ్రీ కాంతుడు కంగారు గా "జిలేబి మాతా ! నేను రాజనీతి కి సంబం ధించిన ఎన్నో గ్రంథాలు చదివాను . ఉపయోగం లేని ఉద్గ్రంథాలు ఎన్నో చదివాను . కాని నాకు బ్లాగ్సాహిత్యం పట్ల అంత రుచి లేదు . నా వంటి వాడి వల్ల కష్టే ఫలే వారి లా టపాలు కుమ్మరించ వీలగు తుందా ? " అని సందేహించాడు .
"నీకు వింటున్న కొద్దీ తన్నాలని పించే టీవీ న్యూస్ ఎంకర్లా కబుర్లు చెప్పడం చేతనవును కదా ! అవే కబుర్లను చదివిన కొద్దీ జుట్టు పీక్కోవా లని పించేలా పెద్ద టపాలు గా వ్రాయి . నీ టపా లను అన్ని వయసు వాళ్ళూ చదివి జుట్లు పీక్కుంటారు . ఆ టపాల వల్లే నీ ప్రవీణుడికి కూడా శాప విముక్తి కలుగు తుంది . ఇదియే జిలేబి ఇచ్చిన వరం గా భావించి నేను చెప్పినట్టు చేయి " అన్న మాటలు శ్రీకాంతుడి చెవిలో గొయ్ గొయ్ మని మారు మ్రోగేయి .
శ్రీ కాంతుడు ఆదరా బాదరా నగరానికి తిరిగి వెళ్లి ఓ నెల రోజులు కష్ట పడి వేయి టపాల మహిమాన్విత మైన ఒక బ్లాగు ని రచియించి తరువాయి బ్లాగ్రాక్షసుడై తిరుగాడు చున్న ప్రవీణు న్ని వెతుక్కుంటూ వెళ్ళేడు .
రాక్షస రూపం లో ఉన్న ప్రవీణుడు భీకరం గా అరిచి శ్రీకాంతుడి మీది కి వచ్చాడు . శ్రీకాంతుడు చలించ కుండా తన బ్లాగు మూత తీసి ఆ వేయి టపాలను ఓపిగ్గా బ్లాగ్రాక్షసుడి కి చదివి విని పించ సాగాడు .
(సశేషం )