అయ్యరు గారి తో జిలేబి బాలి విజయం !
ఏమండీ అయ్యర్వాళ్ ! ఇండోనేషియా వారు ఇండియా వాళ్లకి వీసా ఫ్రీ ఎంట్రీ ఇస్తున్నారంట ! ఫ్లైట్ టికెట్టు తీసుకుని చేతి లో కోట్లాది ఇండోనేషియా రుపయ్యాలతో (జేకే -> ఒక కోటి ఇండోనేషియా రుపయ్యా దరిదాపుల్లో మన యాభై వేల రూపాయలు :) వెళితే చాలంటా ! అక్కడే వాళ్ళు ఫ్రీ గా వీసా స్టాంపు చేసేస్తారట అని మా అయ్యరు గారి తో చెప్పి (అంటే వారి కి పని పురమాయించి ) మొత్తం మీద బాలి ద్వీపానికి ప్రయాణం కట్టాము !
ఇండోనేషియా దరిదాపుల్లో పది హేడు వేల పై చిలుకు ద్వీపాల సమూహం; అందులో సుమారు ఆరు వేల ద్వీపాల ల లో జన సాంద్రత ఉన్న దేశం; మిగిలిన పదకొండు వేల చిల్లర ద్వీపాల కి అసలు పేర్లు ఉన్నాయా అన్నదే సందేహం :)
జనాభా దరిదాపుల్లో రెండు వందల అరవై మిలియన్లు (ఇరవై ఆరు కోట్లు ) ; అందులో అరవై శాతం జావా ద్వీపం లో నివాసం !
బాలి ద్వీపం (పురానా జమానా లో దీని ని వాలి ద్వీపం అనే వారట!) జనాభా సుమారు నాలుగు మిలియన్ (నలభై లక్షలు ) పై చిలుకు; అందులో ఎనభై శాతం హిందూ మతం !
బాలి ద్వీపం లో ని హిందూ మతం ప్రాముఖ్యత అక్కడి ప్రతి ఇంటిలో ఉండే దేవళం లో ప్రతి బింబిస్తుంది ! పెండ్లాము ని ఇంటికి తెచ్చుకుంటే అయ్యరు వాళ్ ఇంట్లో ఒక దేవళం కట్టు కోవాల ట ! (పెండ్లాము ని తెచ్చుకుని తల పై బొబ్బ కట్టించు కోవడం తో బాటు దేవళం కూడానా జేకే !)
బాలి టూరు లో తీసిన కొన్ని ఫోటో లు -> బాలి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ -> దిగగానే మనకి ఆకర్షణీయం కనిపించే ది బాలి ద్వీపపు సాంప్రదాయ దేవాలయపు నమూనా ! ఆ పై ఆకర్షించేది -> స్వస్తి అస్తు అన్న బ్యానరు తో సుస్వాగతం చేసే వెల్కం బోర్డు :)
స్వస్తి అస్తు అని ఇండియా లో వెల్కం చెబితే సేక్యూలరిస్ట్ లు ప్రొటెస్ట్ చేస్తా రనుకుంటా :) జేకే !
ప్రతి పేరులో నూ దాని రూట్ పదం సంస్కృతం లో ఉందేమో అనిపించే లాంటి పదాలు ఎక్కువగా కనిపిస్తాయి నగరం మొత్తం లో ;
బాలి సముద్రం కడు సుందరం; ఆకర్షణీయం ; అయ్యరు గారికి నీళ్ళంటే భయ్యం ! సో నీళ్ళ దగ్గిరకి రాకుండా ఉండి పోయేరు :)
బీచ్ ! బీచ్ బీచ్ !
దేవళం దేవళం దేవళం !
జోక్ ఏమిటంటే ఏదో దేవాలయం అనుకుని వెళ్లి మొత్తం తిరిగి చూస్తూంటే ఒకావిడ నవ్వి 'నేను పని కోసం వెళ్ళాలి - ఇల్లు లాక్ చేసు కోవాలంది :) దేవళం ఇంట్లో దేవళం :)
బాలి లో గరుడా వారికి పెద్ద పీట ! అతి పెద్ద రాతి తో మలచ బడ్డ గరుడ ని చూడ వచ్చు; ఆ పై విష్ణువు మూర్తి కూడా;
భారతం నించి పంచ పాండవులు కుంతీ మాత తో కలిసి ఉన్న శిల్పాలు ! పాండవా బీచ్ దగ్గిర;
తానా లువాట్ దగ్గిర హిందూ దేవళా లు !
ప్రతి చోట్లా కనిపించే గణపతి బప్పా మోరియా :)
ఒక స్కూలు ముందర పెద్ద గణపతి విగ్రహం ! (భారద్దేశం లో స్కూలు ముందర గణపతి వారిని పెడితే ఇక సేక్యూలరిస్టులు ధర్నా చేస్తారేమో :)
ఇట్లా రాసు కుంటూ పోతే బీచ్ దేవళాలు అంటూ రాసు కుంటూ పోవాలి :)
ముఖ్యం గా గమనించినది ఏమిటంటే అన్నిటికి బేరమా డోచ్చు ! బేర మాడితే గిట్టు బాటు ! (జిలేబి కి ఇంక మజా చెప్పాలా ! బేర మాడి గీచి గీచి బేర మాడి తే గదా మానసోల్లాసం:)
గరుడ వాహన మహా విష్ణువు -> గరుడ విస్తా
పాండవా బీచ్
ఉలు వాటు దేవాలయం పై నించి సుందర సముద్ర నాయిక :)
తానా లవుట్ బీచ్ సీనిక్ వ్యూ
పార్థ సారథి ఆనగా పార్థుని వీర సౌరభం
బాలినీస్ డ్యాన్సు - గరుడ విస్తా
ఇందు గలడందు లేడని సందేహం వలదు -
ఎందెందు తిరిగిన అందందే విఘ్న వినాయకుడు
The Magnificent Garuda-Garuda Wista
శుభోదయం
జిలేబి