Thursday, December 24, 2015

అయ్యరు గారి తో జిలేబి బాలి విజయం !

అయ్యరు గారి తో జిలేబి బాలి విజయం !

ఏమండీ అయ్యర్వాళ్ ! ఇండోనేషియా వారు ఇండియా వాళ్లకి వీసా ఫ్రీ ఎంట్రీ ఇస్తున్నారంట ! ఫ్లైట్ టికెట్టు తీసుకుని చేతి లో కోట్లాది ఇండోనేషియా రుపయ్యాలతో (జేకే -> ఒక కోటి ఇండోనేషియా రుపయ్యా దరిదాపుల్లో మన యాభై వేల రూపాయలు :) వెళితే చాలంటా ! అక్కడే వాళ్ళు ఫ్రీ గా వీసా స్టాంపు చేసేస్తారట అని మా అయ్యరు గారి తో చెప్పి (అంటే వారి కి పని పురమాయించి ) మొత్తం మీద బాలి ద్వీపానికి ప్రయాణం కట్టాము !

ఇండోనేషియా దరిదాపుల్లో పది హేడు వేల పై చిలుకు ద్వీపాల సమూహం; అందులో సుమారు ఆరు వేల ద్వీపాల ల లో జన సాంద్రత ఉన్న దేశం; మిగిలిన పదకొండు వేల చిల్లర ద్వీపాల కి అసలు పేర్లు ఉన్నాయా అన్నదే సందేహం :)
జనాభా దరిదాపుల్లో రెండు వందల అరవై మిలియన్లు (ఇరవై ఆరు కోట్లు ) ; అందులో అరవై శాతం జావా ద్వీపం లో నివాసం !

బాలి ద్వీపం (పురానా జమానా లో దీని ని వాలి ద్వీపం అనే వారట!) జనాభా సుమారు నాలుగు మిలియన్ (నలభై లక్షలు ) పై చిలుకు; అందులో ఎనభై శాతం హిందూ మతం !

బాలి ద్వీపం లో ని హిందూ మతం ప్రాముఖ్యత అక్కడి ప్రతి ఇంటిలో ఉండే దేవళం లో ప్రతి బింబిస్తుంది ! పెండ్లాము ని   ఇంటికి తెచ్చుకుంటే అయ్యరు వాళ్ ఇంట్లో ఒక దేవళం కట్టు కోవాల ట ! (పెండ్లాము ని తెచ్చుకుని తల పై బొబ్బ కట్టించు కోవడం తో బాటు దేవళం కూడానా జేకే !)

బాలి టూరు లో తీసిన కొన్ని ఫోటో లు -> బాలి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ -> దిగగానే మనకి ఆకర్షణీయం కనిపించే ది బాలి ద్వీపపు సాంప్రదాయ దేవాలయపు నమూనా ! ఆ పై ఆకర్షించేది -> స్వస్తి అస్తు అన్న బ్యానరు తో సుస్వాగతం చేసే వెల్కం బోర్డు :)





స్వస్తి అస్తు అని ఇండియా లో వెల్కం చెబితే సేక్యూలరిస్ట్ లు ప్రొటెస్ట్ చేస్తా రనుకుంటా :) జేకే !

ప్రతి పేరులో నూ దాని రూట్ పదం సంస్కృతం లో ఉందేమో అనిపించే లాంటి పదాలు ఎక్కువగా కనిపిస్తాయి నగరం మొత్తం లో ;

బాలి సముద్రం కడు సుందరం; ఆకర్షణీయం ; అయ్యరు గారికి నీళ్ళంటే భయ్యం ! సో నీళ్ళ దగ్గిరకి రాకుండా ఉండి పోయేరు :)

బీచ్ ! బీచ్ బీచ్ !

దేవళం దేవళం దేవళం !

జోక్ ఏమిటంటే ఏదో దేవాలయం అనుకుని వెళ్లి మొత్తం తిరిగి చూస్తూంటే ఒకావిడ నవ్వి 'నేను పని కోసం వెళ్ళాలి - ఇల్లు లాక్ చేసు కోవాలంది :) దేవళం ఇంట్లో దేవళం :)

బాలి లో గరుడా వారికి పెద్ద పీట ! అతి పెద్ద రాతి తో మలచ బడ్డ గరుడ ని చూడ వచ్చు; ఆ పై విష్ణువు మూర్తి కూడా;

భారతం నించి పంచ పాండవులు కుంతీ మాత తో కలిసి ఉన్న శిల్పాలు ! పాండవా బీచ్ దగ్గిర;

తానా లువాట్ దగ్గిర హిందూ దేవళా లు !

ప్రతి చోట్లా కనిపించే గణపతి బప్పా మోరియా :)

ఒక స్కూలు ముందర పెద్ద గణపతి విగ్రహం ! (భారద్దేశం లో స్కూలు ముందర గణపతి వారిని పెడితే ఇక సేక్యూలరిస్టులు ధర్నా చేస్తారేమో :) 

ఇట్లా రాసు కుంటూ పోతే బీచ్ దేవళాలు అంటూ రాసు కుంటూ పోవాలి :)

ముఖ్యం గా గమనించినది ఏమిటంటే అన్నిటికి బేరమా డోచ్చు ! బేర మాడితే గిట్టు బాటు ! (జిలేబి కి ఇంక మజా చెప్పాలా ! బేర మాడి గీచి గీచి బేర మాడి తే గదా మానసోల్లాసం:)


గరుడ వాహన మహా విష్ణువు -> గరుడ విస్తా


పాండవా బీచ్

ఉలు వాటు దేవాలయం పై నించి సుందర సముద్ర నాయిక :)
 
 
తానా లవుట్ బీచ్ సీనిక్ వ్యూ
 
 
పార్థ సారథి ఆనగా పార్థుని వీర సౌరభం
 
 
 బాలినీస్ డ్యాన్సు - గరుడ విస్తా
 

 ఇందు గలడందు లేడని సందేహం వలదు -
ఎందెందు తిరిగిన అందందే విఘ్న వినాయకుడు

 
The Magnificent Garuda-Garuda Wista 
 
 
శుభోదయం
జిలేబి

12 comments:

  1. "స్వస్తి అస్తు" అనే చక్కటి పదాలతో కూడిన ఆ స్వాగతం బోర్డ్ ని ఓ ఫొటో తీసి బ్లాగులో పెడితే మేమూ ఆనందిస్తాంగా. మీ యాత్రలో ఏదైనా పర్యాటక స్ధలాల్లో ఆ బోర్డ్ కనపడితే ఫొటో తియ్యండి మీ తిరుగు ప్రయాణంలో ఎయిర్ పోర్ట్ లో ఫొటో తియ్యచ్చులే అనుకుంటే వీలవకపోవచ్చేమో; మీరు Departures కి వెడతారు కాబట్టి స్వాగతం బోర్డ్ బదులు వీడ్కోలు బోర్డ్ కనిపిస్తుందేమో? అది కూడా అంతే చక్కగా ఉండచ్చు. అది కూడా ఫొటో తియ్యండి. (సింహళ భాషలో కూడా చక్కటి పదంతో పలకరిస్తారు; ఆ పదం "ఆయుబువాన్" అని గుర్తు. చాలా ఏళ్ళ క్రితం నేను అక్కడికి వెళ్ళినప్పుడు విన్నాను. కానీ నేను ఫొటో తియ్యడం మరచిపోయాను. అందుకే బాలిలో తిరుగుతున్న మీకు నా ఉచిత సలహా.) :)

    మంచి ట్రావెలాగ్ టపా వ్రాసారు. మనదేశ సంస్కృతి ప్రభావం అక్కడ కనిపిస్తున్నదంటే ఆనందంగా ఉంది (వాళ్ళకి మన బ్రాండ్ సెక్యులరిజం గురించి ఎక్కువ చెప్పకండి). పాపం అక్కడ కూడా "గరుడు"ల వారికి "సేవ" తప్పలేదా :) భారతదేశం తిరిగి వచ్చిన తర్వాత మరిన్ని బాలి విశేషాలతో టపా వ్రాయండి.

    ReplyDelete
    Replies

    1. విన్న కోట వారు,

      మీ కోరిక మీద కొత్త ఫోటోల్ :)

      జిలేబి

      Delete
    2. Thanks జిలేబీ గారూ. "ఓం స్వస్తి అస్తు" అనే స్వాగతం బోర్డ్ ఫొటో చూసి ఆనందం.

      Delete
  2. బాలి బలి అన్న మాట.
    జేకే....

    ReplyDelete
    Replies

    1. బోన గిరి గారు,

      ఆహా ! బలి అక్కడ కూడానా :)

      జిలేబి

      Delete
  3. వాలి ద్వీపంలో కరెన్సీ లాగే అయ్యరువార్లను కూడా తక్కువకే బేరమాడవచ్చునా ?

    ReplyDelete
    Replies

    1. వేరే వాళ్ళ అయ్యవార్లను బేర మాడ వచ్చు :) భలే మంచి చౌక బేరము :) మా అయ్యరు వారు మాత్రం గోల్డు :)

      జిలేబి

      Delete
  4. మరో ముఖ్యమయిన విశేషమండోయ్... మీరు గమనించారో లేదో... ఇండోనేషియా 20,000 కరెన్సీ మీద మన వినాయకుడి బొమ్మ ఉంటుంది. అదే మన దేశంలో అయితేనా... ఊహించుకోవడానికి కూడా భయం వేస్తుంది..

    ReplyDelete
  5. ఫోటోలన్నీ మెతకవాసనెయ్యటంలా? :)

    ReplyDelete
    Replies

    1. వంక సన్నని వారు

      మెతక వాసన అనగా ఏమి ?

      Delete
  6. Replies

    1. శ్యామలీయం గారు


      బాలి అంతా శ్యామలీయుని మయం

      జిలేబి

      Delete