కొన్ని కొన్ని బ్లాగులోళ్ళ కామెంటు బాక్సు ముందర కొన్ని విచిత్రమైన గొంతెమ్మ కోరికల్లాంటి నోటీసులు కనిపిస్తాయి.
కామెంట్లు తెలుగు లో ఏడవక పోతే మీ కామెంట్లు డెలీట్ !
మీకు ప్రొఫైల్ లేదా అయితే డెలీట్
మీరు టపాకి దూరం గా కామెంటు కొట్టారా డెలీట్ !
మీ కామెంటు నాకు నచ్చ లేదా డెలీట్
మీరు మేలా? ఫి' మేలా ? చెప్పరా ? ! అయితే డెలీట్ !
అంతటికి అడ్మిన్ నిర్ణయాలే ఫైసల్ :)
ఇత్యాది అన్న మాట
ఇట్లాంటి సౌకర్యాలు కామెంట్లు రాసేవారికి అస్సలు లేవు.
టపా నచ్చ లేదా ఓ డెలీట్ కొట్టే సదుపాయం అస్సలు గూగులోడు కామెంటర్ల కి ఇవ్వలే !
అట్లా ఓ పది మంది కామెంటర్లు డెలీట్ కొడితే టపా హుష్ కాకి అయి పోవాలి.
ఇట్లాంటి సౌకర్యాలు కామెంటర్ల కి లేక పోయెనే !
ఎంత అసమానత్వం !
అంతా సమనానమే అంటారు. మరి కామెంటర్ల పట్ల ఎందు కింత వివక్ష !
బ్లాగులోళ్ళు వెర్సస్ కామెంటర్లు అసమానత్వం ముర్దాబాద్ !
చీర్స్
జిలేబి.
:-D
ReplyDeletevarudhini = krishna = narada+ ......,
adedo sameta undi kada, cheppevadiki vinevadu lokuva ..is it correct andi?
కృష్ణ పాలకొల్లు గారు,
Deleteనెనర్లు ! సరిగ్గా పట్టేసారు :)
జిలేబి
'తెలుగు బ్లాగు' ప్రపంచపు వెలుగులార్ప
ReplyDeleteకంకణము కట్టుకున్నట్టు కనుపడెడిని ,
ఎందుకో యింత కక్ష ? రానుంది మచ్చ
తేట తెలుగు జిలేబీల 'తెలివి' మీద .
లక్కాకుల వారు,
Deleteఎందుకింత నిర్వీర్యం :)
సక్యమా ఎవరి కైనన్ తెలుగు బ్లాగు వెలుగు లార్ప ?
ఆంధ్రం పోయే ! తెలుగు తెములతుందో లేదో తెలీదు :) అంత లోనే రాయల్ కూడా వచ్చేసూచనలు కనిపిస్తున్నాయి బ్లాగు లోకపు కామింట్లు చదివితే :) జేకే !
తెలుగు బ్లాగు వెలుగు లార్పడం ఎవరి వల్లా కాదు అని జిలేబి కీబోర్డుపథం గా నొక్కి చెప్ప గలదు !
చీర్ అప్ )
జిలేబి
"సక్యమా", శక్యమా జిలేబీ గారూ?
ReplyDelete------------------
పదాల విరుపులో, కొత్త పదాలు తయారు చెయ్యడంలో మీకు మీరే సాటి. అందువల్ల, వేరే చోట మీరన్న "రాయలం" రూపు దాలిస్తే ఆ(మీ) కొత్త రాష్ట్రంలో అధికారభాషా సంఘం అధ్యక్షులు మీరే (అక్కడ ఆంధ్రమో, తెలుగో మరి?) :)
------------------
భంశు :) విన్నకోట వారు పట్టేసారు :౦ పట్టేసారా? :)
Deleteసక్యమా ?
జేకే ! ( అచ్చట సఖ్యమే సౌఖ్యం :)
జిలేబి
ReplyDeleteయే ఫోర్ నడుమందపు పి
ల్లా ఫా రెవరూ జిలేబి లాగున్నావే
కాఫరు నిండా డబ్బుల్
కాఫీ తాగన చటుక్కు కాంటిన్ రావే !
ReplyDeleteటీవీకి గలిగె లక్కుర
ఠీవిగ జూచు నిలియాన ట్వీటున దెలిసెన్
టాపును మాపును లేకన్ !
టీవీ అయినాను గాదె ఠీకుగ జూడన్ :)
టీవీనైనా కాకపోయానే అని వగపా? "రాయినైనా కాకపోతిని రామపాదము తాకగా" అని పాడుకుంటే కాస్త పుణ్యమైనా వస్తుంది గదా.
ReplyDeleteఅయినా అంటే అన్నామంటారు గానీ, సోషల్ మీడియాలో రాతలు వెర్రితలలు వేసి,జనాలు మరీ విచక్షణ లేకుండా పెట్రేగి పోతున్నారండి. ఆ ఇలియానా గారిని ఆ కాస్త ఆచ్ఛాదన కూడా తీసేసి కూర్చుని టీవీ చూసుకోమనండి, ఎవరు వద్దన్నారు? ఆవిడ తన ఇంటిలోపల ఏం చేసుకుంటే ఎవరిక్కావాలండి? దాన్ని తీసుకొచ్చి ట్వీట్ చెయ్యడమేమిటి అసహ్యంగా, మరీ బరితెగింపు కాకపోతే!
అవునూ, ఇలియానా ఎదురుగా ఉండే ' లక్కు ' కలిగిన టీవీ మీద మీరు ఈర్ష్య పడుతున్నారంటే 'జిలేబీ" ఓ పురుషపుంగవుడే అని బ్లాగులోకం అనుకుంటున్నది నిజమేనన్నమాట? చూశారా దొరికిపోయారు :)
- విన్నకోట నరసింహారావు
ఆవిడ జిలేబి మగరా
ReplyDeleteజే ! విను కోట నరసింహ జేజే చెప్పెన్
కోవిదులకు గలద తరత
మావళి మేటరు గదోయి మనసును దోచున్ :)
ReplyDeleteముఖమున నవ్వున్ జూచితి
మఖమలు వోలెన భళీర ! మంచిగ నవ్వూ
జఖిమును జేయదు నిదియెన్
బిఖరెను నలుదెస జిలేబి ప్రియముగ నవ్వూ
ReplyDeleteఒకమొద్దుబాబు జూచితి !
బెకబెక మాటల గజిబిజి బిరియాని తినెన్
మిగులుత మూటన గట్టెను
బికిరము తిండిగొనలేని బీదల కిచ్చెన్
ReplyDeleteకొక్కర కోయనె కోడియు
చక్కెర కేళియు జిలేబి చకచక వచ్చెన్
చిక్కిన సమస్య జూడ, గ
బుక్కున పూరిం చెనుగద బుడిబుడి నడతన్
ReplyDeleteబేతల హాము నగరముర !
జోతలు జేయుము ! జొహోవ జోహారు యనన్
గాతును నిచ్చున్ రీతిన
ఈతాకుల గుడిసె లోన నినుఁ డుదయించెన్ !
ReplyDeleteవేచితి జూచితి కాపల
గాచితి నాదరి జిలేబి కాదన రావే
నాచిరు బొజ్జకు ఓవృష
లోచన! నిను జూడ నోరు లొట్టలు వేసెన్ !
సదనపు సమస్య పూరణ
ReplyDeleteకదనపు కామింట్ల నిడుట కలలు గనుదు నే
ను! దరువు వేయుచు జేయన్
పదవీ విరమణము గొప్ప వర మగును గదా :)
ReplyDeleteమోహన మన మోహనమే
శ్రీహరి చలువ మన దేశ సిరియని తెలియన్
ఆహా స్వతంత్ర దేశము
ఆ హంస అహింస మార్గ మాహుతి వచ్చెన్
ReplyDeleteచీరల సొగసుల జూడుము
ఓ రమణీమణి ! జిలేబి ! ఒద్దిక అనమా
కే! రాణులము గదా! మరి
ఆరాముగ జూడవలెను! ఆపై గొనుటే :)
ReplyDeleteశోధిని వచ్చెను తెచ్చెను
మీదగు మీ శ్రీనివాసు మీరును జూడన్ !
మోదము! తెలుగుకు చేవగ
కాదగు సంకలిని వచ్చె గదవే జూడన్ !
http://www.sodhini.com
http://www.sodhini.com/blogs
చీర్స్
జిలేబి
ReplyDeleteచిలుకల పలుకులు తెలియక
అలుకగ జూసెను జిలేబి అద్దరి వాటిన్
పలుకుల నేర్చిన చిలుకలు
కొలికెను కందము శుభమన కొమ్మల మాటున్ :)
సావేజిత
జిలేబి
ReplyDeleteభామలు తపస్సు జేసిరి! బ్రహ్మ ముదము
బొందె వరమును యిచ్చెను బో! వనితలు
గాంచిరి మగసిరి యిలన! కక్ష గట్టి
గడ్డములఁ బెంచి మురిసిరి కాంత లెల్ల :)
సావేజిత
జిలేబి
ReplyDeleteహుక్కా బట్టెను చక్కగ !
పక్కా జెంటిలుర తాత ! ప్రక్కన బెట్టెన్
చక్కా లాప్ టాప్ ! జూచెన్
మిక్కిలి ఆనందముగను మిథునం సినిమా !
ReplyDeleteచల్లగ నిదియే కవితల
నల్లగ పద్యముల గూర్చన సహాయముగా
అల్లపు మరబ్బ తినవే
మెల్లగ గిచ్చుచు జిలేబి మేధను జేర్చున్ :)
సావేజిత
జిలేబి
ReplyDeleteవింతగ జిలేబి జెప్పెను
కౌంతేయుల - మేనమామ కర్ణుండుగదా !
ఎంత తెలివి నీకని మరి
అందరు మెచ్చిరి సభాషు ఆదరు వివ్వన్ :)
ReplyDeleteపద్యము నేర్వన్ విధిగా
విద్యగ నిటులన్ జిలేబి విరివిగ వ్రాయన్
పద్యము దరిద్ర మనియెన్
మధ్యన అన్నా నిమస్సు మట్టుగ నచటన్ :)
అసహాయ శూరులివ్విధి
Deleteపస వీడుట పాడిగాదు , పద్యపు సొగసుల్
రస సారస్యము దెలిసిన
అసమ శరము గద ! జిలేబి , అన్యుల కెరుకా ?
ReplyDeleteకనిపించిరి మా ప్రభువులు !
తినిపించిరి యీ ప్రసాద తినుబండారం!
హనుమంతుడి ముందు నిటుల
పనిమంతుడివోలె మారు పలుకక తింటిన్
ReplyDeleteమేటి భారతమును మేలగు కావ్యము
మంగళముగ చదివి మదిని గొంటి
బుధుల పలుకు పూర్తి బుద్ధిని నివ్వగ
సోమ శేఖరునికి జోతు లిడితి !
ఆది పురుషు డచట పార్థసారథి గాగ ,
మంగళకర ముగను మనుజు డచట
సోమ పాన మత్తు సోమరి తనమును
వదిలె! పోరు సల్పె బుధుడు నయ్యె !
సావేజిత
జిలేబి
ReplyDeleteనువ్వుల చపాతి చేయగ
పువ్వుల వోలెన్ రెపరెప పూచెను గదవే
రివ్వుగ వచ్చెను కవితల
నివ్వగ నిక్కడ జిలేబి నిద్దుర లేవన్ :)
జిలేబి
ReplyDeleteవచ్చెను వచ్చెను నిదిగో !
మెచ్చగ జనులెల్లరు ఘన మేలును గూర్చన్
ఇచ్చట వత్సర దుర్ముఖి
వచ్చెను ప్రొద్దుట పరిమళ వసుధను జూడన్ !
జిలేబి
ముచ్చెమటలు పోయించుచు
Deleteఅచ్చముగా నెండ తీవ్ర మయ్యె , సుముఖియున్
వచ్చె నిదే యదనని , రా
వచ్చా శుభ మీ తెలుంగు ప్రజకు జలేబీ !
ReplyDeleteలక్షాకుల వారికి ! నమో నమః !
మండు టెండల కాలము మధుర మాయె
నిండు వరదల జూడను నీళ్ళ జూడ !
మెండుగ వరద లొచ్చిన మేము భీతి
నొందుదముగదర వరదా ! ఒద్దు ఒద్దు !
పాల కడలిలో పవ్వళింపయను కొంటి
బెక్కు సౌఖ్యము స్వామికి ! భేషు! తెలిసె
వరద ఒచ్చిన స్వామియు వణుకు నిటుల !
వినుమ ! వలదుగ అతి, యనా వృష్టి యుమరి !
సావేజిత
జిలేబి
ReplyDeleteజైగొట్టి ముక్కలను భా
షాగ్రేశ్వరులాంగ్లభాష చాటు టపాలున్
బాగుర ! ,తెలుగున వీరి
బ్లాగుల బీటులు, కమింట్ల భారీ బాగే !
ReplyDeleteఅంచిత చతుర్ధ జాతుడు
పంచమ మార్గమున పోయి ప్రథమ తనూజన్
గాంచెన్ తృతీయ మప్పురి
నుంచె ద్వితీయంబు దాటి నురుకుల వచ్చెన్
ReplyDeleteసీతను గొంపోయె గదా
నాతని జూచేను సీత నాథుడు నచటన్
చేతల మంచిగ జెప్పెను
బో!!తల గలవా డువినలె ! పోటుగ వేసెన్ !
ReplyDeleteమెట్లనగ మెట్లు నిటులన్
చెట్లన పాలేరు గాడు చేయి గలుప మా
బోట్ల నరులు కిటకిట లా
డేట్లుగ చెళ్ళనగ మాట టెక్కులు బోయెన్ !
ReplyDeleteతన్నును తిన్నగ నెరిగెను
మిన్నును మీరగ జిలేబి మిక్కిలి గాంచెన్ !
తిన్నగ జేసెన్ తంత్రిని
సన్నగ గాంచిన చమక్కు జ్వాలగ నయ్యెన్ !
ReplyDeleteఔరా ! ఠీవిని జూడుము !
పేరట హా! తేలు కుర్చి ! పెద్దగ యుండెన్ !
ఆరాము జేయ సుఖమును
జోరుగ నిచ్చును జిలేబి జోగుచు జూడన్ !
సావేజిత
జిలేబి
ReplyDeleteగంటిని హృదయపు కుహురము
మంటగ నాతడు మనంబు నందున గలడన్ !
క్వాంటము ఫిజిక్సు నందున
జాంటుల యందున జిలేబి శంభుని గాంచెన్
ReplyDeleteబోన్సయి బొమ్మకు మార్చిరి
జీన్సును, కట్టిరి జిలేబి చీరను మేలౌ!
చాన్సు యిది యామెది! విను, రొ
మాన్సుగ భారతి రమణిని మార్కెటు గాంచెన్ :)
ReplyDeleteకష్టా లే యిష్టాలని
నిష్టగ కష్టేఫలే యునికిని తెలిపెగా !
బెస్టు గద మాచన యిట
డ్జస్టును జేసెను లయిఫును డంగగు రీతిన్
ReplyDeleteనారద మణి బుర్రనుగన
బారులు తీరెను జిలేబి బాగుగ నిచటన్
దారుణ మన మా కమ్మా !
ఓ రమణీ టక్కులాడి ఓరము బొమ్మా :)
View Source Search for
ReplyDeleteh3 class='post-title entry-title' itemprop='name'
From there till you find
span class='post-author vcard' Copy
Open Blogger new post
Select HTML ; Now paste the entire content
All data is now available for edit/copy
Save it as Draft;
zilebi
ReplyDeleteఒక కంట నోర జూపున
ముఖ ఛాయ పసుపు జిలేబి ముంగురులు గనన్
బిగుతగు సిగకొప్పందపు
నగుమోము గచిగురుబోడి నను జూసె నిటన్ !
ReplyDeleteనా జీవన నక్షత్రము!
రాజీ పడనిక జిలేబి రమ్మా రాణీ !
రోజూ రాత్రుల మెరుపులు
నీ జూకాలపు చమక్కు నిక్కము నిదియే !
ReplyDeleteఆహా !వనజా వనమా
లీ!హాచ్ యనితుమ్మి విప్పె ఈ చిక్కు ముడిన్
మీ హర్మ్యంబగు బ్లాగుకు
ఆహార్యమిదే జిలేబి ఆనంద పడెన్
జిలేబి
ReplyDeleteబావి కాడ చిందు బావకై వేపుడు
తాళ లేక రమణి తాప ముగొనె
కుండ కొలది నీరు కురులకు బోసేను
నిండె గాదు మనసు నిదుర రాలె :)
జిలేబి
ReplyDeleteమాటల సమరము చూడను
తూటా వోలెన్ జిలేబి తూట్లను జేయున్ !
నోటన పలుకుల మాధురి
మీటగ మేలున్ గదోయి మీగడ వోలెన్ !
ReplyDeleteగాజులు కుట్టగ నొచ్చిన
రోజులు గడువును జిలేబి రొక్కము మిగులున్
తాజా బిజినెసు నిదియే
సూచకమును తెమ్ము గుచ్చ సూపర్బ్ గాజుల్
ReplyDeleteరౌండ్ నెక్ బ్లౌజుని చూడన్
వాట్ నెక్స్ట్ యనుచున్ జిలేబి వాటిని జూచెన్ !
బోట్ నెక్ ఫ్యాషన్ తెలిసెన్
లైన్ నెక్ కొలతకు లలామ లైకులు జేర్చెన్ !
ReplyDeleteచేతుల మీదన్ చేతులు !
గాతుల తోడన్ జిలేబి గానము జేసెన్!
నీతుల కథలన గావివి
ఖాతూన్ యనుచున్ రమణిని గాంచె కవులిటన్
ReplyDeleteసుమ అనసూయల సంపద
ల మర్మములిచట జిలేబి లబ్జుగ తెలిపెన్ !
రమణులకు గలిగె లక్కూ !
గమకము గూడెను విశాల కథలను వినగన్ :)
ReplyDeleteవెంబడి వచ్చిన దొరకున
సంబడము యనన్ జిలేబి సత్యము జూడన్
అంబకము గాగ శ్రీనిధి
సంబరము యనగ ప్రభువుని సఖియే జూడున్ !
ReplyDeleteరామా మా మధ్యకు రా
రా! మా దరి రా ! జిలేబి రాముని బిలిచెన్ !
ఏమాయెను నీ దేశము !!
పామరులము! మమ్ముగావ పాగెము నీవే !
ReplyDeleteశ్రీరామ రక్ష ! నాతని
నారాధననన్ జిలేబి నారాయణునిన్
పారాయణ జేసెను! రా
మా! రమ్మిట మమ్ముగావ మా సీతారామ్ !
ReplyDeleteవచ్చెను తెల్లని కొంగయు
తెచ్చెను మానస జిలేబి తెమ్మర జూడన్ !
పృచ్చెను ఊరిన కొంగలు
జచ్చెను నత్తను తెలియక జవసత్వముబో !
ReplyDeleteసుత్తి సుత్తి యనుచు సుందరి నొకతెయు
కత్తి చేత బట్టి కసబిస యని
కసరు కొనుచు తిరిగె కడు భయంకరముగా
సొగసు జూడ తెలిసె షార్పు నఖర ! :)
సెల్ఫీ :)
Deleteదీంతో అర్ధ నూటపదార్లు
ReplyDeleteసెల్ఫీ సరసము జూడన్
కుల్ఫీ కిక్కును జిలేబి కురచగ జేసెన్ :)
గుల్ఫామ్ యోగము గాంచెన్
ఉల్ఫా మీకిది గురువుల ఉద్దీపనగన్
సావేజిత
జిలేబి
ReplyDeleteసీతమ్మను తలువక నే
గీతమ్ముల గూర్చగాన గీసయు దక్కున్ ?
పాతమ్మను గూడి కొలువ
చేతన గల్గును జిలేబి చెంగట వచ్చున్ !
జిలేబి
మీ ఊళ్ళో, మొన్న శనివారం సాయంత్రం వర్షానికి తనిసిరే/తడిసిరే
ReplyDelete"బాలయ్య" అంటే నందమూరి బాలకృష్ణ అనే అర్ధం ఇటీవలి కాలంలో మొదలైన ట్రెండ్ లాగా కనిపిస్తోంది. తరచుగా చాలా ఎక్కువగా వినిపిస్తోంది - రాతల్లోను / వార్తల్లోను, వేదికల మీద, బ్లాగుల్లోను. వినగానే పాతతరం వారికి కన్‌ఫ్యూజింగ్‌గాను, ఎబ్బెట్టుగానూ ఉంటోంది - ఆ ఫలానా సందర్భంలో బాలయ్య పేరు ఎందుకొచ్చింది అని. కాస్సేపటికి వెలుగుతోంది వీళ్ళు బాలకృష్ణ గురించి చెప్తున్నారు అని. బాలయ్య అనే పేరు గల, పేరుగాంచిన ఓ సీనియర్ నటుడు ఉన్నాడని అప్పుడే మర్చిపోయినట్లున్నారు! బాలకృష్ణ పుట్టకముందే తన సినిమాజీవితాన్ని ఆరంభించిన (1958 లోనే) నటుడు ఆయన. కొన్ని వందల సినిమాల్లో నటించాడు, హీరో పాత్రలూ చేశాడు. అటువంటి సీనియర్ నటుడి పేరుని - ఆయన ఇంకా ఉండగానే - కనుమరుగయ్యేలా చెయ్యడం భావ్యం కాదు. బాలకృష్ణే ఈ ట్రెండ్‌ని వారిస్తే బాగుంటుంది. అంతగా ముద్దుగా / ఆప్యాయంగా పిలుచుకోవాలనుంటే బాలకృష్ణ గారి అభిమానులు వారిని "బాలయ్య బాబు" అని పిలుచుకోవచ్చు కదా (సీనియర్ నటుడు బాలయ్య గారి గౌరవ సంరక్షణార్ధం) !
ReplyDeleteవారంగా బ్లాగులోకం చప్పచప్పగా ఉంది, ఉప్పులేని కూరలాగా :)
ReplyDeleteకుశలమేనా?
గురువు గారూ నాది కూడా సేం ఫీలింగ్ ...
Deleteఏదో ఆవిణ్ణి మంచి చేసుకుందామని ఓ నాల్గు లైన్లు
ఈ క్రింది లింక్ లో గిలికా ...
http://nmraobandi.blogspot.co.uk/2016/04/blog-post.html
రెండు వారాల శలవు వాడుకున్నారుగా! ఇక చాలు :) ఒక సారిక్కడ కనపడి మళ్ళీ శలవు తీసుకోవాలి :) ఎండలు దంచేస్తూనే ఉన్నాయి కదా!
DeleteThis comment has been removed by the author.
ReplyDeleteతిట్టో విట్టో తెలియకుండా జిలేబీ వొదుల్తున్న పద్యాలకి అద్డుచుకునే జనం బ్లాగుల్లోకి రావడం మానుకున్నారని నా అనుమానం!నా అనుమానం పెనుభూతమై ఆపైన సహానుభూతం కాకముందే జిలేబీమాత ఇంచక్కా ఇదివరకట్లా ఉంటేనే బావుంట్టుందేమో?
ReplyDelete
ReplyDeleteతాగుడు సమస్యా పూరణం :)
తాగెను తూగెను పతియే
శోకము వచ్చెను జిలేబి శోషను జెందెన్
వేగపు తాగుడు లెక్కల
యోగము జూచెను కొమరుని యోచన తెలిసెన్!
ReplyDeleteనీ కనులను నీకిచ్చితి
నా కను కొలకుల మరకత నాడివి నీవే !
మా కని గలవాడవు నీ
వే! కవి రాజా ! సకలము వేగిర గొనుమా !
సావేజిత
జిలేబి
ReplyDeleteనీవే రామా స్పూర్తీ ! నీవేరా, మా స్పూర్తీ !
దేవ ! మహాదేవా! శ్యా
మా! వాగీశా ! జిలేబి మానస సుకవీ !
నీవే రామా స్పూర్తీ !
నీ వరముగ నేర్చినాము నిజమిది సుమ్మీ !
చీర్స్
జిలేబి
దేవ ! మహాదేవా! శ్యా
Deleteమా! వాగీశా ! జిలేబి మానస సుకవీ !
నీవే రామా స్పూర్తీ !
నీ వరముగ నేర్చినాము నిజమిది సుమ్మీ !
నిజమిది సుమ్మీ! సత్యము నుడివితిరి, నమ్మితిమి, గురువులే నమ్మవలె
ReplyDeleteబింకము బోయిరి చదువుల
బంకలు శుంఠలు జిలేబి బద్మాషులిటన్
వంకలు జూసిరి తోడుగ
కింకరుడే రాజయి ఘన కీర్తిని బొందెన్ !
ఈ పై పద్య నేపధ్యం ---
ReplyDeleteచదిన వాళ్లూ తమ ఓటు హక్కులని సద్వినియోగించక పోవడం వల్ల రాక్షసుల్లాంటి రాజకీయ నేతల బారి మనదనే అర్థం లో వ్రాయబడినది
ReplyDeleteమా ఆయన డాక్టరు విను
మా! ఆ పక్కింటి పడుచు మాట బలికెరా !
మీ ఆయన జబ్బు కవికి
మా ఆయన మందునిచ్చు మాలిని మేలౌ !
ReplyDeleteఅన్నానిమస్సుల హవా
కన్నావా మరి జిలేబి కవితలు వద్దే !
హన్నా! నమస్సు వారికి
జొన్నల చేలల జొరబడు జోగిణి వారల్ !
ReplyDeleteతస్మాత్ జాగ్రత !జాగృత !
విస్మయ వీధిన జిలేబి విరివిగ కవితల్
ఖశ్మము జెందెను గురుడుర !
భస్మము జేతము బిరబిర భామను రండూ :)
జిలేబి
ReplyDeleteమేనత్త కొడుకు యనుచున్
నీ నప్పని మాటతీరు నీచము యనకన్
మానితి! కాలము వచ్చెను
గానుర! చక్రము పురువును ఘాతము గొనగన్ !
సావేజిత
జిలేబి
ఏం పాపం, ఉన్నట్లుండి మేనత్తకొడుకుని ఆడిపోసుకుంటున్నారు?
Deleteవిన్న కోట వారు :)
Deleteమేనత్త కొడుక్కి అర్థమయినట్టుంది :)
జిలేబి
ReplyDeleteబాధలు వచ్చెను భువి యం
భోదము గోరెను జిలేబి భోరున ఏడ్చెన్
ఖేదముతో నీటికొరకు
పాదమ్ములు లేని తరులు పరుగిడఁ జొచ్చెన్
ReplyDeleteమోటారు బండి నెక్కిరి
బాటన బోవన్ జిలేబి భాయీ , స్వామీ !
ఫోటో జూడగ తెలిసెను
ధాటిగ రాముడు రహీము ధాత్రిన నొకరే !
ReplyDeleteఅలసెను సొలసెను మది కల
కలమున్ గని కవివరుండు కలవరమందెన్
నిలకడ రాగన్ పద్యము
నలవోకగజేయ వాణి నవ్యత గూర్చెన్ !
ReplyDeleteరామ రామ రామ యని నారాముగ కవి
యుండె! దారి విడిచెనుగ ! యుద్ధ భూమి
యనగ పాలిటిక్సును నాడి యతను బోయె
కాల మహిమ యనగ నిది కద జిలేబి !
జిలేబి
ReplyDeleteగిరగిర జిలేబి చక్రము
తిరిగెను వడివడి కరములు దిటవుగ మారెన్
వరమయ్యెగదా నతనికి
అరుదగు జీవన విధాన మాధురి జూడన్ !
ReplyDeleteవెంకట రమణుడు కొండల
చెంగట వెలసెను కొలిచిన చెరుపులు తొలగున్
నింగియు భువినందు గలడు
భంగిమ విధవిధము లనగ భక్తిగ గొలువన్
ReplyDeleteపచ్చ పసుపంద మనగన్
తెచ్చెను శోభను జిలేబి దేవికి మేలున్
హెచ్చుగ నుపయోగింతురు
నెచ్చెలులును సుందరాంగి నెరజాణ సుమీ !
ReplyDeleteవదనము మారెను! ఆ ద్రౌ
పది యగుపడెనచట!ఔర! పరిహాసమ్మా !
కుదురుగ తెలిసెను ! రగిలెను!
అదె! ఆ పాంచాలి జేత అగుమానమ్మా !
జిలేబి
ReplyDeleteతల్లీ ! నీమాటయనగ
వెళ్ళెద నడవికి నమస్సు! వేగిర వెడలెన్
భళ్ళన ఉదయము నయ్యెను
గొల్లనిరి పురజనులు, చన గోరిరి జూడన్!
ReplyDeleteపరమ భాగవతుల పరిచయ మనగాను
సాని పొందు మోక్ష సాధకమ్ము
ఔర! హనుమ ! వినుమ! అచ్చెరువును గాదు !
వారి చెంగట కలువ విరి బూయు !
ReplyDeleteపోరిని జూడక పోర్నుల
జోరుగ జూసెన్! జిలేబి జొచ్చెను లైఫున్
పోరి వలదంచు పోర్నుల
దారిని వీడె మగవాడు దంగా పడగన్ !
ReplyDeleteలవ్వాడెను యేనుగులున్
సవ్వడి వేదండములన చక్కగ భళిరా !
మువ్వల నూగుచు నాదం
బవ్వల జేయు మదమత్త భార్గవ మనగన్ !
జిలేబి
ReplyDeleteజిలేబి అయ్యరు గారిని పట్టిన విధానం వోలె ఉంది :)
అసలు సిసలు బంగారం
వసవస యను ఈ జిలేబి వగలాడి గనన్
కిసిమిసు యని వచ్చిన రూ
పసి బాలుని పెండ్లియాడె పడతి ముదమునన్ !
చీర్స్
జిలే(బి) !
ReplyDeleteపాపము పాండవు లకటా !
లోపడి నొప్పిల్ల జేతు లొగ్గిరి బాలా !
ఆ పరిధి మీర, పోరిడి
రా పరమాత్ముడు పరేశు రథసారథిగన్ !
ReplyDeleteపాపము ! దేవుడు ! ఏకాకి !
సోమరి ! కుమ్మరి ! బికారి !
భామా జిలేబి , మత్స్యము
నామము కూర్మపు వరాహ నరసింహమనన్!
వామనుడు పరశురాముడు
రామా! కృష్ణా! దశబల ! రమ్మా కల్కీ !
@హరిబాబు గారు ,
మీరే మంటారు ?
http://www.sakshyammagazine.com/2015/02/blog-post_25.html
నారదా !
జిలేబి
ReplyDeleteఅమ్మా! కమ్మని పాపడు
యిమ్ముగ నుండగ జిలేబి యిక్కడ యుంచెన్ !
తెమ్మర వచ్చెను తెచ్చెను
నిమ్మది యిదియే యనంగ నిదురను బోయెన్ !
ReplyDeleteరెహమానుకిచ్చిరి గదా
అహరహ కృషియన జిలేబి అద్బుత ఫుకువో
క! అమెత్ ఆర్ ఓ కంపో
కు, ఆసినుకునిచ్చిరి, మన కుర్రడు భేషూ !
ReplyDeleteకవివర! తెలియనిదా మత
మవివక్షితము! యవనారి మదిలో వాడే !
సువిశాలాకాశాత్పతి
త విరించిగ సూర్యచంద్ర తారలనంగన్ !
ReplyDeleteకాస్తా విను చిన్నమ్మా !
విస్తార మయినది లోక విస్మయ రీతుల్ !
చూస్తున్న మేర కలయే !
నాస్తిర్లోకం జిలేబి నాటక రంగం !
జిలేబి
ReplyDeleteసూరీ డలసెను సొలసెను
భూరిగ అస్తమయమయ్యె ! భువిలో సమయం
మారెను తోయధి రా కే
ళీరవముల ఓల లాడ ! లీలా రమణీ !
ReplyDeleteబాసూ పెళ్ళాం మాటలు
కూసింత వినవలె నోయి ! కొంపన కోపా
లూ సింతలున్ను గాయబ్ !
సుశ్రీ సంధ్యకి జిలేబి జోహార్ సుమ్మీ !
వేరే చోట మీ వ్యాఖ్య -
ReplyDelete"బులుసు సుబ్రహ్మణ్యం గారి బ్లాగు కిడ్నాప్ అయిపోయిందా !!!!!
జిలేబి"
-----------
వెబ్‌సైట్ వేరే, కానీ బ్లాగ్ పేరు ("నవ్వితే నవ్వండి") ఒకటే. అయినా కూడా బ్లాగ్ పేరు రిపీట్ అవకూడదని బ్లాగర్, వర్డ్‌ప్రెస్ వారు షరతు పెడితే బాగుంటుంది. కొత్త బ్లాగ్ రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి ఈ నిబంధన తప్పక పాటించాలని చెప్పాలి. జరిగేపనో, కాదో మరి :(
ReplyDeleteనీపాల నే పెరిగితిన్
నా పాలిటి కామధేను ! నాదగు రీతిన్
ఈపాటి రోటి నిత్తున్
ఓపారిటురమ్ము దూడ నునుపారుయనన్ !