అందరికీ 'న' 'మాష్' కారాలు :)
బ్లాగు లోకం లో పండితమ్మన్యులందరికి న 'మాష్' కారాలు :)
ఇంతటి తో జిలేబి బ్లాగు తెర వేసి బెట్ట బడినది.
అసహన ప్రక్రియా కార్యక్రమాల లో జిలేబి ని బక్రీ చేసి
చెడుగుడు
చెమ్మా చెక్కా
చెస్సు
ఆడిన వాళ్ళందరికి
'మొసలి' జిలేబి టాటా బై బై వీడు కోలు చెబ్తూ -
చీర్స్
సహిత
బిలేజి జిలేబి !
ఎలుక చేతను బట్టి యెదను పిడకల గొట్టి
ReplyDeleteఎలుగెత్తి ఎదురేగి పిలక బట్టి
చిలక పలుకుల తోడ వాతలెన్నియొ బెట్టి
కెలుకుచుండును కనుల కారమెట్టి ... (జిలేబీ మూట గట్టి)
... ... ...
దానయ్యల దారి వెంట మీట గొట్టి
మదిగొట్టెడు మాటలందు ఘనాపాఠీ
తగువెట్టెడు తపనలందు లేదు పోటీ
అయ్యయ్యో ఏమాయెను ఇంతలోకి ...
బ్లాగంతయు చుట్టబెట్టి పొగలూదుట కట్టి పెట్టి
లోకమంత పులియ బెట్టి మనసులన్ని ఎండగట్టి
ఉండుటెటుల ప్రక్క నక్కి మనసంతయు బిగియబట్టి
కట్టకమ్మ బైరాగుల జట్టి కొలుతుమమ్మ జెగజ్జెట్టి
కొందరికి గుండె కోత
ఎందరికో మండు రాత
పసందైన నవ్వుల తోట
అందరికీ జిలేబీ మాత
అమ్మా జిలేబీ మాతా
ప్రొద్దున్నే ఏమిటమ్మా మాకీ గుండెకోత
చూస్తుంటే చూట్టానికి బ్లాగుబలి
తట్టుకొనడమెట్లా ఈ ఘోరకలి !!!
ఏమిటో విధి వ్రాత
అకటా !! ఏమిటీ ఉదయ వార్త !!!
(సరదాగానే వ్రాసినా గానీ నిజంగానే మమ్మల్ని
విడిచి పోవద్దని జిలేబీ మాతకు సగౌరవ విన్నపం)
మీరు లేకపోతే ...
నో చీర్స్ ...
Vahvaa...vahvaa...
Deleteజిలేబీ మాత గారి కళ్ళద్దాలు పెట్టుకుని చూడ
Delete'హవ్వా హవ్వా' వలె కాన్పట్టుచున్నదే నీహారిక గారూ ...
:-)
గట్లనే ఉండాది. హవ్వ... హవ్వ...
Deleteహవ్వ ....హవ్వ ..నేను పొగిడినా తిట్టినట్లు కనపడుతుందేమిటి ఈ ఆంధ్రులకు ?
Deleteవినోదంలో వి భజన కూ మీకిది తగు ... నా !!!
Delete:-)))
Deleteబండి రావు గారు,
మీ పాద పద్యం బాగుండాది :)
@నీహారిక గారు,
హవ్వ్ హవ్వ్ :)
జిలేబి
ఏమిటి జిలేబీ సెలవు పుచ్చుకొనుటయా !
ReplyDeleteఏమిటీ ఇది నిజమేన్ లేక సరదాగా నలుగుర్నీ ఆకర్శించుటకు చేయుంచుంటిరా ! వీడ్కోలకూ, వేడ్కోలకూ స్వస్థి చెప్పి బ్లాగులొ కొత్త టపాలు వేసేయండి !
Deleteశుక్రాచార్య వారు,
మిమ్మ్లల్నంతా రమ్మని జెప్పి నేను పారి పోతా నంటా రా :)
రండి ఒక పట్టు పడతాం తెలుగు బ్లాగు లోకపు సీనియర్లను :)
జేకే !
జిలేబి
నమ్మం గాక నమ్మం.
ReplyDelete
Deleteపూల 'టీ'గ వారు,
అంత సులభం గా మిమ్మల్ని వదిలి పెడతామా :)
జిలేబి
ఎవరి మీదనో సంధించిన బాణం ఈ వెక్కిరింత?
ReplyDeleteఎవరికో విరుగు నిక వారి అహంకారపు పిడత:-)
Deleteహరి బాబు గారు :)
అరివిమర్థనం స్వామి నిత్యనర్తనం |
హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే ||
చీర్స్
జిలేబి
పండితమ్మన్యులు = శుంఠలు
ReplyDeleteఅవుననుకోండి. కాని ఈ రోజుల్లో అంటే అధునికత పేరుతో భావం ముఖ్యం భాషను పట్టించుకోకూడదు అనే రోజులు కదా. పొరపాటున ఎవరైనా భాషలో తప్పును చూపితే వారిమీద అజ్ఞులూ విజ్ఞులూ అందరూ విరుచుకు పడిపోయే రోజులు కదా. అందుకని పాపం జిలేబీగారు గంభీరంగా ఏం చెబుదామని అనుకుంటున్నారూ అన్నది ముఖ్యం(ట) కాని నిజంగానో పొరపాటునో గ్రహపాటునో ఏం అన్నారూ - ఆ అన్న ముక్కకు అసలు అర్థం ఉందా ఉంటే ఆ ముక్క యొక్క అదృష్టం బాగుండి జిలేబీగారి కవితాత్మతో భావం పంచుకుందా అని అడక్కూడదు కదండీ. అన్నట్లు మీరు కూడా మరొకరు పొరపాటు అర్థంలో వాడిన మాటకు సమర్థింపుగానే మాట్లాడినట్లు గుర్తు - భావం చూడలీ వగైరా అంటూ. కాదంటారా ఏమిటీ కొంపదీసి?
Deleteఅక్కడ 'అశ్రువక్షరాలు' అనే మాటలను కవయిత్రి వాటి అర్ధంలోనే వాడినారు (పొరపాటు అర్ధంలో కాదు) , కొందరు 'అక్షరాశ్రువులు' ఉండాలికదా! అన్నప్పుడు , అలా మారిస్తే , కవయిత్రి భావం పూర్తిగా మారిపోతుంది కదా ! అన్నది వాస్తవం . కాదని ఎందుకంటాను ?
Deleteపూలతీగ వారూ ధన్యవాదములు .
'అశ్రువక్షరాలు' అన్నది సుష్టువైన మాట కాదనుకుంటానండీ. అలాగే ఆ కవయిత్రి(?) ఈ మధ్యనే 'నూతనోధ్యాయం' అనే హెడ్డీంగూ పెట్టారు! తెలుక్కవులకి తెలుగు రావాలా యేమిటి లెండి ఇవాళ్రేపు. పాంచాలి అన్నమాటకు కూడా అవిడ గొప్ప కొత్త ఆర్థం చెప్పారనుకుంటాను. తెలుగు తరించి -పోతున్నట్లే- ఉంది. వాళ్ళ రోజులు బాగుంటే చాలట తెలుగెలాపోతేనేంటి. ఏం రోజులో బాబూ.
Deleteపూలతీగ శ్యామలరావు గారూ ,
Deleteఅశ్రువక్షరాలు అన్నది సుష్టో రొష్షో ఇంకా ఎందుకండీ , కెలుక్కోవడం ? నాకంత దురద లేదు , మీరింకా తెరమరుగునుండి గోక్కుంటూనే ఉన్నారు , అది అంత సుళువుగా వదలదంటారు విజ్ఞులు మరి !
విజ్ఞులైన శ్యామలరావు గారికి నమస్సులు .
క్షమించాలి పూలతీగ శ్యామలీయం కాదు. అదీకాక శ్యామలీయం ఎప్పుడైనా తెరమరుగైనదా? లేదు కదా? నాది ఆథ్యాత్మిక వ్యాసంగం ఆ పూలతీగవన్నీ పాటలవలె ఉన్నాయి.
Deleteపూలతీగ శ్యామలరావుగారూ ,
Deleteనమస్కారాలండీ , మీబోటి పండితులంత గాక పోయినా , నాకూ కాస్త అక్షర జ్ఞానముందండీ .
పూలతీగ శ్యామలరూవుగారూ ,
మాచెవుల్లో పూలతీగలు గుచ్చొద్దండీ !
పూవుల ఊసులు పాటలు చాలు పూలతీగకి
Deleteపోలిక లెందుకు పోరులెందుకు పూలతీగకి
ఏమండీ లక్కాకుల వారు,
Deleteనిజం గా నే పూల తీగ రాగం శ్యామలీయ రాగమే నంటారా ?
జేకే !
చీర్స్
జిలేబి
Deleteఏమండీ లక్కాకు ల వారు ,
ఇట్లా ఫెడీల్మని మన్యులని శుంటలు చేసేస్తే ఎట్లా గండీ ?
జిలేబి
Ayyo miru em chesarandi. You are just kidding right?
ReplyDelete
Deleteఏమో నండీ ఎంకి గారు,
నాకూ తెలీదండి; బ్లాగు లో జిలేబి ని బలి దానం చేసేసారు !
జిలేబి
Best joke of 2015
ReplyDelete
Deleteశ్రీనివాస్ గారు,
ఈ జోకులు అయ్యవారలు అప్పుడప్పుడు చేస్తూంటారు :) అట్లాగే అమ్మవారలూ ఫాలో ఆన్ జీవ్స్ అంటూ పీ జీ ఉడ్ హౌస్ స్టైల్ లో చేసేస్తూ ఉంటారు :)
జిలేబి
సంస్కృతాంధ్రాంగ్లాల సాహిత్యములతోడ
ReplyDeleteదీటైన ‘ పరిచయ ’ ధిషణ గలదు
మాటలకు ‘ విరుపుల ‘ మణిహారములు పేర్చు
గడుసైన బిగువు వాగ్ధాటి గలదు
తెలుగు బ్లాగ్వీధుల దిరిగి వ్యాఖ్యానించు
అరుదైన ‘ యభిరుచి ’ గరిమ గలదు
జన మనోరంజక వినుత హాస్యమ్మొల్కు
‘ చెణుకు ’లకు తుదల ‘ చీర్సు ’ గలదు
హాస రేఖల కస్త్ర సన్యాసమేల ?
పదభిఘావళికేల యీ బ్లాగు విడుపు ?
మాటగెలిచెడి యమ్మకీ మరుగులేల ?
స్వఛ్చ సౌహార్ధతలకేల స్వస్తి పలుక ?
సాహితీ లోక మందున్న ’ చతురు ‘ లొక్క
రొక్కరుగ బ్లాగ్విడిచి పోవ నొడుపు దప్పి
తెలుగు బ్లాగుల శారద తేజ మడగు _
మగుడి రారండి ‘ మన్నించి ’ మనసు మారి .
Deleteఆహా లక్కాకుల వారు,
టపా కి సార్థకత్వం దక్కింది ! నెనర్లు మీ పద సంపదాభిఘావళీ కి !
జిలేబి
త్వరలో రాబోయే ఆండ్రాయిడ్ కొత్త వెర్షన్‌కి "జిలేబి" అని పేరు పెడతారని సుందరం అయ్యవారు చెప్పారట!
ReplyDeleteకాబట్టి వెనక్కి వచ్చెయ్యండి, జిలేబి మాతా!
మన శ్రీ గూగుల్ పిచ్చయ్య గారు పాయసమో పరమాన్నమో మా అమ్మ గారి నడిగి పేరు ఫిక్స్ చేస్తానని అనటం చదివి, నా బ్లాగు మీదొట్టు - నేను కూడా జిలేబి పేరు అయితే బాగుంటుంది గదా అని ఫిక్స్ అయిపోయాను. కనుక మాతాశ్రీ బేగి వెనక్కొచ్చేయ్యండి పేరు పెట్టె టయ్యానికి - అప్పుడందరం కలిసి గ్రూప్ ఫోటో దిగే సదవవకాశం మాకిద్దురు గాని.
Delete"గూగులమ్మ ఓసుకి బిలేజమ్మ పేరంటా ..."
ఇదో అడవి రాముడి పాట ...
:-)
Deleteఆహా మా పిచ్చై ఇంత గా మా మీద అనురాగం చిందిస్తో న్నాడా బండి రావు గారు ! మా నాన్నే మా అమ్మే ! పిచ్చై నీకు ఇదే జిలేబి ఇచ్చు కితాబు ఆంధ్రాయిణి జిలేబి !
జిలేబి
తెర తీయవా...
ReplyDeleteజిలేబీ మాతా...
తెర తీయవా...
Deleteబోన గిరి గారు,
బోనగిరి అనగా నేమి ? అని ఆంధ్ర భారతి వారిని 'కొచ్చనించగా' వారు జెప్పింది ->
-->
•పెండ్లిలో మగపెండ్లివారికి ఆడు పెండ్లివారు పంపు ఫలహారాలు అని :)
కావున మీ ఈ ఫల హారపు పాట ని మన్నించ క బోతే మాకు విలువ దక్కదు !
నెనర్లు
జిలేబి
మా ఇంటి పేరు ఊరి పేరు కాదా? మీరు చెప్పిన అర్థం విచిత్రంగా ఉంది.
Deleteఆంధ్ర భారతి వారిని ఎలా 'కొచ్చనించవలెనో' కాస్త చెప్తారా?
ఏమైనా మీరు మా మాట మన్నించి వెనక్కి వచ్చినందుకు అభినందనలు.
సాధారణంగా ఊరిపేరు ఇంటిపేరుగా ఉంటుంది. భువనగిరి జనవ్యవహారంలో బోనగిరి అయింది. అంతేకాని ఆంధ్రభారతి వారిచ్చిన అర్థానికి మీ ఇంటిపేరుకు సంబంధం లేదని నా ప్రగాఢ విశ్వాసం.
Deleteవద్దు వద్దు
ReplyDelete
Deleteపేపర్ టైగర్ వారు,
మీరు చెప్పినట్టే వద్దే వద్దు !
జిలేబి
ఈ మధ్య ఓ బ్లాగులో నా పేరు టపా హెడింగులోకి ఎక్కిందండోయ్ జిలేబీ గారూ!! మీ అందరిలాగే నేను కూడా "ఫేమస్" అయిపోతున్నానో ఏవిటో :)
ReplyDeleteమనలాంటి "ఫేమస్" వ్యక్తులు తెరమరుగునుండరాదు కాబట్టి మీరు త్వరగా పునర్దర్శనం ఇవ్వాలి.
Deleteవిన్న కోట వారు,
చూసా నండీ ! మీ పేరుకి ముందర తొక్క లో లేక పోవడం తో చాలా వెలితి గా నీహారిక వారి టపా 'కిక్కు' లేకుండా ఉదాసీనం గా ఉందండీ ఆ టపా !
@నీహారిక గారు,
తొక్క లేకుండా అట్లా టైటిల్ పెడ్తే ఎలా మీరు :)
నారదా!
జిలేబి
జిలేబీ గారూ, పాతతరం వారు కొంతమంది వంట మొదలెడుతున్నప్పుడు "పుండరీకాక్షా" అనేవారులెండి; అలాగ మీరు టపాలు, కామెంట్లు "వంట" వండుతున్నప్పుడు "నారదా" నా? ఏమైనా గానీ, వంటింట్లోను(ఆ గదిలోకి వెళ్ళే అలవాటుంటే), పూజగదిలోనూ, కరెంట్ పోయినప్పుడు కొవ్వొత్తి వెలిగించడానికీ తప్ప అగ్గిపెట్టె మీ చేతిలోకి తీసుకోవద్దని బ్లాగ్ లోక పౌరుల విజ్ఞప్తి మీకు (బ్లాగ్ లోక శాంతి కోరి) :)
Deleteజిలేబీ గారూ, క్రిందటేడు లాగానే ఈ ఏడు కూడా హైదరాబాద్ బుక్ ఫెయిర్ కు మీరు ప్రచ్ఛన్నంగా వచ్చి వెళ్ళే ప్లాన్స్ ఏమన్నా ఉన్నాయా? :)
ReplyDeleteనేను మొదటి రోజునే వెళ్ళొచ్చానులెండి. అక్కడ ఓ స్టాల్ లో ఉన్నవారిలో వలబోజు జ్యోతి గార్ని గుర్తుపట్టాను (నేనావిడ్ని లకరించలేదనుకోండి).
1. జిలేబీగారు హైదరాబాదు వాస్తవ్యులా? లేక పుస్తకప్రదర్శనం సందర్శించటానికి వస్తారా హైదరాబాదుకు?
Delete2. ఈ హైదరాబాదు పుస్తకప్రదర్శనం ఏరోజువరకూ ఉంటుంది? దయచేసి ఎవరైనా చెప్పండి.
శ్యామలరావు గారూ, జిలేబీ గారు హైదరాబాద్ నివాసి కాదనుకుంటాలెండి (బులుసు సుబ్రహ్మణ్యం గారు చెప్పిన "బెంగల ఊరు" అనుకుంటాను). పోయినేడాది నేను వచ్చివెళ్ళాను, మిమ్మల్నందరినీ చూసాను అని బ్లాగుల్లో అందర్నీ ఆట పట్టించే ప్రయత్నం చేసారుగా జిలేబీ గారూ. అందుకని ఈ సంవత్సరం ముందరి కాళ్ళకి బంధం వెయ్యడానికి ప్రయత్నించానన్నమాట (జిలేబీ గారి ఊతపదం "జేకే") :)
Deleteఈయేటి హైదరాబాద్ బుక్ ఫెయిర్ ఇందిరా పార్క్ దగ్గరనున్న NTR Stadium లో ఈ నెల 18న ప్రారంభమయింది. ఈ నెల 27 వరకూ ఉంటుంది. Monday to Friday 2pm to 8.30pm; Saturday, Sunday and public holidays 12noon to 9pm. Entry Fee Rs.5/-)
Deleteవిన్న కోట వారు,
ఈ మారు బెంగల ఊరు నించి బాలీ పయానం :) కాబట్టి ఆదరా బాదరా నగర దర్శనం లేదు ! సో నో 'తెలంగాణా' వారి బుక్ ఫెయిర్ :)
జిలేబి
Deleteశ్యామలీయం వారు,
జిలేబి ఆదరాబాదరా వాసి అయితే శ్యామలీయం వారి కంట అగుపడకుండా ఉండునా :)
జిలేబి
ReplyDeleteమా నాన్నే :) మా నాన్నే:) ఎంత మంది జిలేబి రావాలని మళ్ళీ తెర తీయాలని కోరు కుంటున్నారు !
అబ్బే ! మీ మాటల నందరిని మేం ఎట్లా కాదంటాం !
బ్లాగు కామెంటర్ల పలుకులే మాకు శిరోదార్యం :)
మిమ్మల్నందరిని బ్లాగు టపాల తో బాధ పెట్ట కుండా ఉండ బోనని ఇదే కీ బోర్డు పథం గా శపథం చేస్తో
చీర్సు సహిత
జిలేబి :)
ReplyDeleteకామెంటిన అందరికి నెనర్లు !
మీ అభిమానం నన్ను కట్టి పడేస్తోంది :) ఇంతకు మించి ఏమీ చెప్పలేను !
బ్లేడు జిలేబి :)
చీర్స్
జిలేబి
మూసేస్తున్నా నోచ్ అన్న
ReplyDeleteఒక్క దెబ్బకి 45 కామెంట్లు:-)
@ zilebi ...
ReplyDeleteఉగ్గబట్టి నోరు కట్టి అయినదొక్క వారము
గుక్కబట్టె లోకమంత చూడలేక ఘోరము
తినగ బట్టె రాతలన్ని తొక్కిపెట్టి దుఃఖము
చచ్చినట్టు నోట బెట్టి మరచి ఉప్పు కారము
అల్లరిట్ట సేయ బట్టె అటునిటు పరివారము
కలకత్తా కాళి మరచె కొరకు రాని కోపము
బిగియబట్టి తాపమంత చూపి కనికారము
జెల్లగొట్ట తిరిగి వచ్చె జిలేబమ్మ పాపము
ఘాటు మిరప బజ్జీలిక తయ్యారే ప్రతి దినం
బ్లాగు లోకమంత ఇంక అయ్యారే చలి జ్వరం
ఆవులింక మరలిపొండి రెండామడ దూరము
పుంజులంత తరలి రండి కత్తిగట్ట వైరము
వందనాలమ్మా జిలేబి మాతా వందనాలు
తిరిగినానమ్మా ఎన్నో గుళ్ళూ గోపురాలు
కోరలేదమ్మా నేనే మడులూ మాణిక్యాలు
కోరుకుంటినమ్మా నేనొకటే ... మీ అక్షింతలు !!! !!! !!!
:::---))) ...
పుంజులంత తరలి రండి కత్తిగట్ట వైరము
ReplyDeleteపిట్టలపైన ఎందుకింత కావరము ?
@ నీహారిక మేడం ...
Deleteపుంజులను కత్తిగట్టి కవ్వించు పి(పె)ట్టలను కూడా సమాదరించి,
పుంజు జాతిలోనే జమకట్టి, 'వేర్పాటు' వాదాన్నెత్తుకోలేదు -
ఇంతలోనే మీరు 'విభజన' రాగాన్నెత్తుకుని తలంటుతారనుకోలేదు ...
తదుపరి జాగ్రత్త పడగల వాడను ...
:-)