ప్రభ (ప్రముదితవదన , ప్రభాత , మందాకినీ , గౌరీ , చంచలాక్షీ) (పంచపాది)
నూతన సంవత్సరాన క్రొత్త జిలేబి ప్రయత్నం !
ఇవ్వాళ మన
శ్యామలీయం వారు ప్రముదిత వదన వృత్తం మీద టపా పెట్టేరు !
సరే ఏలాగూ ఇవ్వాళ క్రొత్త సంవత్సరం కాబట్టి వారి పంథా లో ఒక టపా కడతామని వారు చెప్పిన ప్రముదిత వదన తో నే మొదలెడతాము ఛందస్సు కలిగిన పద్యం ఒకటి (జిలేబి స్టైల్ లో ) రాద్దామని ప్రయత్నించడం జరిగినది !
వారి బ్లాగు లోను, శ్రీ కంది శంకరయ్య గారి బ్లాగు లోను
ఛందస్సు సాఫ్ట్ వేర్ లింకు ఉండడం తో అందులో జిలేబి వ్రాసిన పద పేర్పులను (శ్రీ శ్యామలీయం వారి శైలిని అనుకరించి) కట్ పేస్టూ చేసి సాఫ్టు వేరు సాఫ్టు వేరు నన్ను కొలువు అంటే జిలేబి యు ఆర్ స్మార్ట్ ! అరవై శాతం అంది !
సరే అని మరింత కుస్తీ పడితే 'యతి' యంటూ (ఎనిమిదవ స్థానం యతి ) తప్పులు చూపించింది !
యతి యంటే ఏమిటో ఎట్లా తెలిసేది అని గూగులమ్మ ని వేడుకుని , మళ్ళీ
కంది వారి ఛందస్సు ఒకటవ టపా క్షుణ్ణంగా చదివి మళ్ళీ మళ్ళీ శ్యామలీయం వారి టపా చదివి , ఛందస్సు సాఫ్ట్ వేర్ తో మేళ మాడి మొత్తం మీద మొదటి జిలేబి ఛందస్సు పద్యం వ్రాయ గలిగింది !
చదువు నేర్పిన గురువులు - శ్రీ శ్యామలీయం వారికి, శ్రీ కంది శంకరయ్య వారికి , గూగుల్ బ్రహ్మ వారికి ఛందస్సు సాఫ్ట్ వేర్ ని అత్యద్బుతం గా కనిబెట్టిన ఆ సైట్ అడ్మిన్ గారికి ఈ జగతి వృత్తం అంకితం !
నమో నమః !
ప్రముదిత వదన ! (ముదిత జిలేబి -> ప్రముదిత వదన - జిలేబి వదన మన్న మాట ! జేకే !)
ప్రభ (ప్రముదితవదన , ప్రభాత , మందాకినీ , గౌరీ , చంచలాక్షీ) (పంచపాది)
ప్రభ పద్య లక్షణములు
1.ఈ పద్య ఛందస్సుకే ప్రముదితవదన , ప్రభాత , మందాకినీ , గౌరీ , చంచలాక్షీ అనే ఇతర నామములు కూడా కలవు.
2.వృత్తం రకానికి చెందినది
3.జగతి ఛందమునకు చెందిన 1216 వ వృత్తము.
4.12 అక్షరములు ఉండును.
5.16 మాత్రలు ఉండును.
6.మాత్రా శ్రేణి: I I I - I I I - U I U - U I U
మిశ్రగతి శ్రేణి (3-5) : I I I - I I I U - I U - U I U
మిశ్రగతి శ్రేణి (5-3) : I I I I I - I U - I U U - I U
మిశ్రగతి శ్రేణి (4-5) : I I I I - I I U I - U U - I U
మిశ్రగతి శ్రేణి (5-4) : I I I I I - I U I - U U I - U
7.5 పాదములు ఉండును.
8.ప్రాస నియమం కలదు
9.ప్రతి పాదమునందు 8 వ అక్షరము యతి స్థానము
10.ప్రతి పాదమునందు న , న , ర , ర గణములుండును.
====================
జిలేబి మొదటి ఛందస్సు పద్యం
నినువిన రమణా నిధీ మాతృకా
సునయనవరుడా సుకావ్యా రమా
కనుకొలకున శంకరా కాయరా
మనన మిదిర రామ రామాయరా
మ నిను వినుతు శ్యామలీ యా రమా !
చీర్స్
జిలేబి