The Mathematics of కందం !
ఈ మధ్య "A Beautiful Question" (Finding Nature's Deep Design- by Frank Wilczek-winner of the nobel prize in Physics) పుస్తకం చదువుతూంటే ఔరా ప్రకృతి గణిత మయం మాయం అనిపించే సింది !
ఈ మధ్య ముప్పావు సంవత్సరం పాటు ఊపులో శంకరాభారణ బ్లాగు లో చేస్తున్న సవారి , నేర్చుకుంటున్న (అనుకుంటున్నా :) వి, ఆ పై గురుళ్ళ సైడు కిక్కులు, (అకటా వికటాలు :) , అనానిమస్సు ల చీవాట్లు, చింపిరి హవా జుట్లు , దాంతో బ్లాగు లోకం లో 'గండర' గోళం మీద పడి రచ్చ చేయటం అన్నింటి మధ్యా నెవర్ గివ్ అప్ జిలేబి అనుకుంటూ ఈ కంద పద్యం తెలుగు లో ఎందు కంత పాప్యులర్ అయిపోయిందబ్బా అని ఒకింత దాంతో తలే ఉంగలీ దబాయించ కుండా ఉండక పోయా !
పై పుస్తకం చదువుతూంటే కందం లో ని మేథమేటిక్స్ దీనికి కారణ మయి ఉంటుందే మో అనిపించింది.
ఛందస్సు లో గణితం తప్పక ఉంది. (మూలం లోకి వెళితే ) కందం కూడా అందులో భాగమే ; కాని దీనికి గలిగినంత ప్రాముఖ్యత మిగిలిన వాటికి లేక పోవడం అనడం కన్నా ఇందులో ఉన్న సౌలభ్యం మిగిలిన వాటి లో లేక పోవడం ( ఆటవెలది, తేట గీతి కి ఉన్న సౌలభ్యం వదిలేస్తే ) మూల కారణం అరవై నాలుగు అన్న మేజిక్ నంబర్ అనుకున్నా !
గురు లఘు మాత్రలు మొత్తం వెరసి కందం లో అరవై నాలుగు . ఈ అరవై నాలుగు మధురగతి రగడ లో కూడా కనిపిస్తుంది. అయినా కందం టాప్స్ అండ్ రాక్స్ :)
మొదటి, మూడవ పాదం లో పన్నెండు మాత్రలు , రెండు నాల్గవ పాదం లో ఇరవై మాత్రలు మొత్తం కలిపి 12+20+12+20 = 64.
ఈ పన్నెండు ఇరవై కి 3:5 నిష్పత్తి మరో విశేషం ( సమత లేక పోవడం );
మధుర గతి రగడ లో అయితే సమతుల్యత దీనికన్నా ఎక్కువ ప్రతి పాదం లోనూ 16 ! అయినా దానికి ఇంత ప్రాచుర్యం లేదు !
ఈ అరవై నాలుగు ఒక మేజిక్ సంఖ్యే ! అరవై నాలుగు కళలు అంటాం ;
కందం లో ఉన్న not so even distribution (12,20) కూడా ఈ ప్రాముఖ్యత కి కారణం అయ్యుంటుందేమో మరి !
ఆ పై ఈ అరవై నాలుగు మాత్రలకి కొంత యతి ప్రాస కలిపి, ఆ పై జగణం పొజిషన్ ఖచ్చితం గా ఎక్కడ ఉండాలో చెప్పటం లాంటి నిర్దుష్టత తో పటిష్టం చేయటం (మధుర గతి రగడ లో దీనికన్నా ఇంకొంచెం పటిష్టత ఎక్కవే - అంత్యానుప్రాస కూడా ఉంది ) దీనికి సొబగు దక్కినట్టుంది !
మొత్తం మీద నాటి చందోకారుల మేథస్సు తీక్షణత కి యిది ప్రతీక అనుకోవచ్చు. కందం పొందిక దీనికి ఉదాహరణ !
సో నేటి కందం కందం :)
అరుబది నాల్గు కళలవలె
అరుబది నాల్గనగ మాత్ర లా కందంబూ !
పరిపరి విధముగ పదముల
సరితూకంబు గణితంబు చక్కగ కలిసెన్!
ముప్పది రెండుకు రెండుగ
నొప్పిన కందము జిలేబి నొకపరి గనుమా
అబ్బురమగు పదబంధము
అప్పటి కవుల గణితంబు అద్భుతము గదా !
చీర్స్
జిలేబి