కంద గర్భిత శార్దూల విక్రీడితము - ఒక పరిశీలన
ఈ మధ్య చిత్రకవితా ప్రపంచం వారి బ్లాగులో చదివిన కంద గర్భిత శార్దూల విక్రీడితమ్ (శార్దూల పద్యం లో కంద పద్యం యిమిడి ఉండటం) ఉదాహరణ చదివాక కొంత జోష్ కలిగింది; ఎట్లాగూ శార్దూలం కందం సమాంతరంగా ఔత్సాహికంగా సాధన (అనుకుంటా :)) చేస్తున్నాం కాబట్టి రెండింటిని కలిపి గట్టి కావేటి రంగా అందా మనుకుని మొదలెడితే కొన్ని జిలేబులు తయారైనాయి. వాటినన్నిటి ని ఒక్క చోట పెడదామనే చిరు ప్రయత్నం.
శార్దూలం లో కందం ఇమడాలంటే -
మొదటి, మూడవ పద్య పాదం లోని మొదటి అక్షరం నించి మొదటి మూడవ పాదం కందం వస్తుంది.
రెండు, నాలుగు పద్య పాదం లోని రెండవ అక్షరం నించి రెండు మూడు పాదం కందం వస్తుంది (గుడ్డి గుర్తు :))
ఉదాహరణ
ఏలన్ బో రుచిరమ్ములౌ పురమునన్నేలన్ భళారే యనన్
గీ లాలమ్ములజూడనేల ! లవ యగ్గింపుల్లటన్ గానకన్
నేలన్ కాలటు జారనౌర పడతుల్ నేజెల్ల! నవ్వుల్ గనన్
బో,లాలిత్యముగా లివన్ బలములున్ బోయెన్ రొ దుర్యోధనా!
---
ఏలన్ బో రుచిరమ్ముల
లాలమ్ములజూడనేల ! లవ యగ్గింపుల్ !
నేలన్ కాలటు జారన
లాలిత్యముగా లివన్ బలములున్ బోయెన్
చీర్స్
జిలేబి