Wednesday, June 30, 2010

జ్యోతిష్యం ఎంత వరకు ఉపయోగం?

ఈ మధ్య తెలుగు యోగి శర్మ గారు వరుసగా జ్యోతిష్యం గురించి బ్లాగ్ ఆర్టికల్స్ రాస్తున్నారు. అది చదివిన తరువాయీ ఈ శీర్షిక - జ్యోతిష్యం గురించి ఆలోచిస్తుంటే - అసలు అంతా ఆల్రెడీ నిర్ణయించ బడి ఉంటె మన కర్మలు ఆల్రెడీ డిసైడ్ అయి పోయి ఉంటె- ఇక మానవ మాత్రులం మనం ఎందుకు కష్టించాలి? మనం ఎందుకు ప్రయత్నించాలి అన్న సందేహం రాక మానదు. ఈ ఒక్క లాజిక్ చాలు జ్యోతిష్యాన్ని తీసి పారేయడానికి. కాని దీనికి కారణం చెబ్తారు- జ్యోతిష్యులు- అంటే- మీ జాతకం లో - మీరు కష్టించి పైకి వస్తారని ఉంది కాబట్టి- మీ ఆలోచన ఆ పరిధి లోకి వెళ్లి మీరు అభివృద్ధి లోకి వస్తున్నారానో కాకుంటే- అధోగతి పాలవు తున్నారానో - దీనికి సమాధానం చెప్పుకొస్తారు.

సో, ఈ నేపధ్యం లో ఈ సబ్జెక్టు ఎల్లప్పుడూ వివాదాస్పదమే. కర్మ సిద్ధాంతం, మానవుని సంకల్పం, దైవ నిర్ణయం, ఇట్లా వేరు వేరు సిద్ధాంతాలు - కలగలపుగా ఉన్న మన దేశం లో - ఈ సిద్ధాంతాలు - ఒక దాని మీద ఒకటి పోటి గా మానవ మేధస్సుకి దాటీ గా - ఓ లాంటి చాలెంజ్ లేవదీస్తాయి - మనిషి మేధస్సుకి పరీక్ష పెడతాయి కూడా- వాదం, ప్రతి వాదం తార్కిక చింతన, ధ్యానం, నిర్వకల్పం, శరణాగతి, ఇట్లాంటి వేర్వేరు సిద్ధాంతాలతో - ఓ పాటి విలక్షణం గా ఉన్న భారత సంస్కృతి - ఓ విభిన్న ప్రకృతిని ప్రతిపాదిస్తున్దనడం లో సందేహం లేదు. ఎవరి ఆలోచన పరిధికి ఏది అందుతుందో అక్కడినుంచి వాళ్ళు - ఆ పై గతి కి ప్రయాణం సాగించ డానికి దోహద కారి అనిపిస్తోంది కూడా ఈ భారత చింతనా స్రవంతి !

చీర్స్
జిలేబి.

Monday, June 28, 2010

చిత్తూరు కోవా - కేరళ భామ

మన ఊరిగురించి ప్రక్క రాజ్యం వాళ్ళు ఓ ఎపిసోడ్ టీవీ లో చూపితే ఎవరికైనా చూడ బుద్దేస్తోంది. అదీను పొగడ్తల తో కాకుంటే ఓ మోస్తరు మనకు తెలిసిన విషయం గురించి షో పెడితే ఇంకా నచ్చుతుంది. అంతే కాకుండా అది ప్రక్క రాజ్యం గాకుండా ఇంకా కొంత దూరం లో ఉన్న రాజ్యం లో చూపెడితే - ఔరా మన ప్రదేశం గురించి ఇంత ముచ్చట గా చూపెట్టారే అని మరీ మురిసి పోవడం కద్దు. ఆ బాణీ లోనే ఈ కేరళ భామ ఫేవరెట్ ఇండియా షో - కైరలి టీవీ లో ఈ మధ్య చిత్తూరు గురించిన షార్ట్ ఎపిసోడ్ -

http://www.youtube.com/watch?v=RNUqGUAEtUM

లింక్:http://www.youtube.com/watch?v=RNUqGUAEtUM

చీర్స్
జిలేబి.

Sunday, June 20, 2010

కాలం - కలం - కల కలం

కాలం
కలం
సాయం కాలం
కల కలం
కలల కడలి కదలింది
కాలం - కారుణ్యం
కాలమై న కలల కలం
సుఫలాం సస్య శ్యామలాం అన్నది
మరి జీవనం జీవిత గమ్యం అయ్యిందా
కాకపొతే జీవితం జీవనం గమ్యం అయ్యిందా?
తెలుసా మీకేమైనా?

జిలేబి.

Friday, June 11, 2010

హృదయం - మనస్సు

హృదయం - మనస్సు రెండూ ఒకటేనా ? కాకుంటే వేరు వేరా? మీకేమైనా ఈ విషయం గురించి తెలిసి ఉంటె చెప్పగలరు. ఆధ్యాత్మిక పుస్తకాలలో చాల మటుకు ఈ మనస్సు గురుంచిన ప్రస్తావన వస్తూ వుంటుంది. కొన్ని మార్లు హృదయం తో మాట్లాడండి లాంటి పదాలు కూడా చదవడం కద్దు. మీ కేమైనా తెలిసి ఉంటె విశదీకరించగలరు.

చీర్స్
జిలేబి.

Tuesday, June 8, 2010

విన్నూత్న 'వరుడు' - వధువు ఎక్కడ?

పై చిత్రం- పల్లెకు పోదాం అంటున్న ముఖ్య మంత్రి- సిమిలారిటీ ఫోటో- వరుడు- ఆడియో లాంచ్ -

వధువు ఎక్కడ మరి?

చీర్స్
జిలేబి.

Sunday, June 6, 2010

మనః ద్వయం

మాట మౌనం
చేత అచేతనం
స్వరం నిశ్శబ్దం
గమనం అగమ్యం
వీరం నిర్వీర్యం
మనః ద్వయం చంచలం
అచంచలం మహా బాహో -
కిం కర్తవ్యమ్ మమ ?
చీర్స్
జిలేబి.

Saturday, May 29, 2010

గోవిందా గోవిందా గోవిందా

మా తిరుపతిలో జన సందోహం చెప్పలేనంతగా ఉంది.
గోవిందా గోవిందా గోవిందా !
రాజ్యం లో కల్లోలం చెప్పలేనంతగా ఉంది
గోవిందా గోవిందా గోవిందా
గుడి గోపురాలు నేల మట్టం
గోవిందా గోవిందా గోవిందా
కష్టాలు కార్పణ్యాలు కన్నీళ్లు వరదలు వానలు
గోవిందా గోవిందా గోవిందా
రాజ్యం వీర భోజ్యం !

జిలేబి.

Wednesday, May 26, 2010

మనసే ఊయల - కోతి కొమ్మచ్చి

ఊయల జూమ్మని ముందు వెనుక ఊగుతుంటే మనసుకి ఆహ్లాదం.

కోతి కొమ్మచ్చి ఆడుతుంటే పిల్లలకి పరమోత్సాహం

ధ్యాన మార్గం లో మరి మనసుని కోతి తోనూ - అదీ కల్లు తాగిన కోతితోనూ పోల్చి - మానవాధమ - నీ మనసు కోతి - దాన్ని వక్ర మార్గం నుంచి మళ్ళించి ధ్యానం చేయ్యవోయీ అంటారు.

అర్థం కాని విషయం. పిల్లకాయి కోతి కొమ్మచ్చి ఆడితే తాత గారికి పరమ సంతోషం

అదే తాతగారు - గురువుగారు తన మనసుని కోతితో పోలిస్తే పరమ విషాదం !

విష్ణు మాయ కాకుంటే - దేవుడు కోతిని పుట్టిన్చడమేమిటి- ఆ డార్విన్ మహాశయుడు- పోతూ పోతూ - వోయీ నరుడా - నీవు కోతినుంచి పుట్టావోయ్ అని ఓ కేక పెట్టి తానేమో బాల్చి తన్నేసాడు.

డార్విన్ పోయినా మన వాళ్ళు ఇంకా వాణ్ని వదల కుండా - " ఆ కోతి చేష్టలు ఏమిటి వెధవా- సరిగా నడవ లేవూ? అని రంక వెయ్యడమేమిటి

చాదస్తం కాకుంటే - ప్రతి ఒక్క శతాబ్దం లోను ఓ మోస్తరు సో కాల్డ్ గొప్పోల్లు పుట్టి మన ప్రాణాల్ని తోడేసాల అలా కామెంట్లు విసిరి ముసి ముసి నవ్వులతో వెళ్లి పొతే - మనమేమో సుద్ధ వెర్రి వాళ్ళలా, వాళ్ళు చెప్పిన దే వేదం అని గిరి గీసు కోవటం ఏమిటి? కొంత బుర్ర ఉపయోగించాల కాదా?

చీర్స్
జిలేబి.

Monday, May 24, 2010

నేనెందుకు ఆంధ్రా వాలా/ వాలి కాను?

నేనెందుకు ఆంధ్రా వాలా / వాలీ కాను?

ఇట్లాంటి శీర్షిక పెడితే నా బ్లాగు కి ఎక్కువ క్లిక్కులు వస్తాయని ఓ అరవ అమ్మాయి చెప్పడం తో సరే పోనీ ఇట్లాంటి టపా తో పోస్టింగ్స్ చేద్దామనే ప్రయత్నం షురూ చేసి ఈ రెండు వ్యాఖ్యలతో ముగిస్తున్నాను.

ఆలోచించి చూడండి - నేనెందుకు ఆంధ్రా వాలా కాకుంటే - ఆంధ్రా వాలీ కాను? ఈ మధ్య తెలుగు పేపర్లు చదువుతుంటే నిజంగా మనం ఆంధ్రులమేనా అన్న సందేహం రాక మానదు. ఏమంటారు?

చీర్స్
జిలేబి.

Thursday, May 13, 2010

కాంతం కనకం కర్పూరం

కర్పూరం తాను కరిగిపోతూ ప్రపంచానికి వెలుగునిస్తుంది.

కనకం తానూ కరగదు తనని సొంతం చేసుకున్న వాళ్ళని కరిగించదు.

మరిక కాంతం మాట ఏమిటి ?

కాంతం కనకము కర్పూరం కూడాను.

కాంతం కర్పూరం లా తానూ కరిగిపోతుంది.

భామతి కథ చదివారా ఎప్పుడైనా?

కాంతం కర్పూరం అనడానికి భామతి ఉదాహరణ.

కనకం లాంటి "కాన్" తాలు లేక పోలేదు. మన బెనర్జీ లూ - లాగ.

మరి కాంతం లాంటి కాంతం ఉన్నారా?
అబ్బో ఉంటె - మా లా ఉంటారేమో ?

cheers
జిలేబి.