Friday, June 29, 2012

మహా నగరం లో బాక్ పాక్ బకరా బాబు!

బాక్ పాక్ మానవుడు రోడ్డున పడ్డాడు. తల తిరుగు తోంది ట్రాఫిక్కు వేగం తో రణగొణ  ధ్వనులతో .

మానవుడి కళ్ళు ఎర్ర బడి ఉన్నాయి.

రేతిరి ఇంటికి చేర డానికి తెల్లారే. మళ్ళీ తెల్లారి పరుగు మొదలెట్టాడు.

చాలా కాలం మునుపు తట్టా తపేలా లు భుజాన వేసుకుని పనికి వెళ్ళే వాడు. కూలీ చేసుకునే వాడు. కూసింత గంజి తాగే వాడు.

ఇప్పుడు భుజాన బాక్ పాక్ వేసుకున్నాడు. ఇప్పుడూ కూలీ చేస్తూనే ఉన్నాడు. కూసింత తిండి సమయం లో కూడా ' luncheon meeting' 'let us lunch-workout meet' లో పాపం తిండి తినడం సగం మాట్లాడడం సగం వెరసి ఏదీ పూర్తిగా జరగని 'కాలాతీత' స్టేజీ లో నిమగ్న మై ఉన్నాడు.

అదిగో అతడి అడుగు జాడలు. భారీ గా నడిచిన అతడి అడుగు జాడలు. ఆ ఆడుగు జాడలలో అతని బరువైన జీవనం అతని ఎండ మావి జీవనం ప్రతి ఫలిస్తోంది.

మహా నగరం లో బాక్ పాక్ బకరా బాబు మరో రోజుకి స్వాగతం పలికాడు.

నగరం తన మానాన నదీ ప్రవాహాన్ని మించి జన ప్రవాహం తో పరుగులు పెట్టింది.

జిలేబి.



Wednesday, June 27, 2012

మహా నగరం లో వెర్రి మానవుడు

రాత్రి పన్నెండు అవుతోందండీ , ఇక ఇంటికి వెళ్ళాలి అన్నాడు మానవుడు.

వాడి ప్రాజెక్టు మేనేజరి  ణి (ఈ ప్రాజెక్టు మేనేజర్లంతా జిలేబీలు ఎందుకు అవుతారు చెప్మా?)  చిరాగ్గా చూసింది.

అయితే ఏమిటి ?

'ఇంటికి వెళ్ళి  కాసింత సేపు పిల్లలతో క్వాలిటీ టైం స్పెండ్ చేద్దామని ' నసిగాడు వెర్రి మానవుడు.

'ఏం  మాకు పిల్లా జెల్లా లేరా ? మేం ఆఫీసు లో వున్నాం కదా ఇంకా ? ' ప్రాజెక్టు మేనేజరి ణి గదమాయించి ఓ తీవ్రమైన లుక్కు ఇచ్చింది.

बेचारा మానవుడు ఉసూరు మని సీట్లో తగల బడ్డాడు మళ్ళీ - ముందు మానిటరు వెక్కిరించింది- నన్ను వదలి నీవు పో లేవులే, అదీ నిజములే అని.


మానవుడు లాగిన్ అయి ఓ మెయిలు చూసాడు. మళ్ళీ పని లోకం లో పడ్డాడు.

మహా నగరం లో వెర్రి మానవుడు పాపం జిలేబీ లకి बकरा  అయి పోయేడు.


నో చీర్స్
జిలేబి.

Saturday, June 23, 2012

మూడో మారు జిలేబీ కోరితే ఖబడ్దార్ పెళ్లి కాన్సిల్ !

ఈ మధ్య అరవ దేశం వెళ్ళా.

మా మనవరాలు అరవ పేపరు ఇచ్చి బామ్మా మిర్చీ ఖబుర్లు (శర్మ గారి, ఫణి బాబు గారి ఖబుర్ల లా అన్న మాట !) చదువు, టైం పాస్స్ అవుతుంది అసలే మద్రాసులో వేడి ఎక్కువ కాస్త ఊరట పడతావు అంది.

అరవం మనకి అంత గా చదవడం రాదు. అక్షరాలు కూడా బలుక్కుంటూ చదివా,

మద్రాసు లో ఓ పెళ్లి లో , ఓ పెద్దాయన జిహ్వ చాపల్యం కొద్దీ , గులాబ్ జామూను మూడో మారు వెయ్య మన్నాడు వడ్డించే వాడితో.

వడ్డించే వాడు కాంట్రాక్టరు , కుదరదు పో,  అన్నాడు. ఎందుకోయ్ అని గొడవ పడ్డాడు ఆ పెద్దాయన.

ఆకుకి ఒక్క స్వీటే కాంట్రాక్టు లో వేస్తాం అన్నాడు వడ్డించే వాడు.

మాటా మాటా పెరిగే. జుట్లూ జుట్లూ జగడా లాడే! వీడు వాణ్ని తన్నే. వాడు వీడి బుర్ర రామకీర్తన గావించే. పెళ్లి పెటాకులయ్యే  స్టేజీ కి వస్తే పోలీసొడు మధ్యస్థం చేసి పెళ్లి ఆగి పోకుండా చేసేడు.

అదీ కథ !

సో, మీరు ఏ పెళ్లి కయినా వెళితే ఒక్క పారి మించి జిలేబీ వడ్డించ మని అడగ మాకండీ!

బ్లాగ్ లోకం లో జిలేబీ  లంటారా, అన్లిమిటెడ్ ఎడిషన్ మరి !

ఎంజాయ్ మాడి !

'క్షీరస'
జిలేబి.

Saturday, June 16, 2012

ఒన్స్ అగైన్ త్రీ జీ (ఈ మారు నో స్కాం - ఓన్లీ స్పాం !)

దేశానికి జీ కీ రుణాను బంధం ఎక్కువ.

'జీ' లంటే మనకి మరే మరీ మరీ 'లైకింగు!

ఈ మారు బెనర్జీ కలాం కావాలంటే, సోనియా జీ ముఖర్జీ కి జై పలికే !

కలాం జీ - ఈ పేరులో జీ సరిగ్గా కలవదు.

కాబట్టి కలాం మరో కాలం ఉమర్ ఖయ్యాం రాయడానికి రైసినా హిల్ కి అర్హుడు కాడు.

మరి ముఖర్జీ ప్రెసిడెంట్ అయితే, మరి రాబోయే ప్రధాని రాజీవ తనయ రాహుల వారా ?

మా మనమోహనుల వారిని తప్పించి ఆ ప్రదేశం లో మరోక్కర్ని పరదాన మంత్రి గా చూడలేం అని అనుకున్న వారికి
ఇదే సంకేతం.

రాబోయే తరానికి రాజీవ తనయుని పట్టాభిషేకానికి నాందీ వాచకం కి సంకేతం - 'ప్రణవ' నాదం - ప్రణ బా నందుడు ఒక సమిధ.


చీర్స్
జిలేబి.

Thursday, June 14, 2012

సరోజ - సకల రోగ జంజాటం

సరోజ - సకల రోగ జంజాటం !

మాలిని - మానసిక లిప్తకాల నిస్త్రాణ

కౌముది - కౌమారంలో ముదిత దివాలా


ఏమండీ ఇవంటారా ?

రోగాల లిస్టులు సరదాగా ఇట్లా పెరేట్టా .

ఇంకా చాలా ఇట్లాంటివి పెట్టు కోవచ్చు .

మీరూ ప్రయత్నిం చండి .

నామీద కొడతరామో  నని ముందస్తే నా పేరూ జోడిం చేసా !


జిలేబి  - జివ్వున లెగ్గు బిగువు !

ఎందు కండీ ఇవన్నీ అంటారా ?

మన దేశం లో , ఈ భూగోళ మండలం లో - రోగాలు రోష్టులు ఎక్కువై పోతున్నాయి, క్వాలిటీ ఆఫ్ లైఫ్ తగ్గి పోతుంది అని డాక్ట రుల గోల మరి !


చీర్స్
జిలేబి.

Sunday, June 10, 2012

శబ్దం నిశ్శబ్దం

రెండు పదాల మధ్య నిశ్శబ్దం
వాటి  అర్థాన్ని చెబుతోంది


రెండు హృదయాల మధ్య
నిశ్శబ్దం వాటి అర్థాన్ని చెబుతోంది.


రెండు పదాల మధ్య
శూన్యత లోపిస్తే
వాటికి అర్థాలు లేవు.


ప్రభూ, నీకూ నాకూ మధ్య
శూన్యత లోపిస్తే
నా ఉనికి కి అర్థం లేదు.

జిలేబి.

Saturday, June 9, 2012

మేం వయసు కొచ్చేసాం!

మేం వయసు కొచ్చేసాం!

అదేమిటండీ, ఏ స్వీట్ సిక్స్టీన్ లోనో, కాకుంటే, టీన్ అటారః లో నో చెప్పాల్సిన మాట ఇట్లా రిటైర్మెంటు ఏజు లో చెబ్తున్నారు ?

అవునండీ, మరి, వయసు కొచ్చాం అంటే, ఏ వయసుకు అని అడగకుండా, మీరే అట్లా ఊహించు కుంటే ఎలా మరి !

ఇంతకీ ఏ వయసు కొచ్చారు?

మతిమరపు వయసు కొచ్చామండీ మరి !

అదేమిటండీ ??

అంతే కదండీ మరి, నిన్న మా జంబునాధన్ అయ్యరు గారి తో బజారు కెళ్ళి వారిని మధ్య దారిలో మరిచి ఇంటికి వచ్చాక,

'అయ్యోరామా, అయ్యరు గారు ఏమయ్యారు చెప్మా బామ్మా అంటే,

'ఔరా, వీర్ని మరిచి పోయామే ఎట్లా మరి అని వయసు కోచ్చేసాం అని తీర్మానించు కునేసా ! అదన్న మాట విషయం.

'జాంబజారు జగ్గు నా సైదా పెట్టై కొక్కు ' అని అరవం లో ఒక (మా) పాత కాలపు పాట ఉందండోయ్ !

అదేమిటండీ, పాత కాలపు పాటల్ని గుర్తుకు పెట్టుకున్నారు.

 (ఈ మాట అంటే, శ్యామలీయం వారు, అదీ సరిగ్గా గుర్తుకు పెట్టు కోలేదు సుమీ అంటారేమో మరి !- రుస రుస బుస బుస గుండమ్మ కథ లోనిది అని చెప్పినట్టు!) ,

మరి మీ ఈ కాలపు అయ్యరు గారిని మరిచి పోయారు సుమీ అంటారా ?

మరి ఈ 'మతిమరుపు' వయసు కొచ్చాం కాబట్టి, ఈ వయసు జాడ్యం కూడా ఇది మరి, పాతవన్నీ టపీ టపీ మని గుర్తు కోచ్చేస్తాయ్,

ప్రతి దానికీ, 'మా చిన్నప్పు డండీ అని మొదలెడతాం చూడండీ ,

కాకుంటే, మేం చదువుకునే రోజులల్లో అంటూ కథలు చెప్పడం మొదలెడతాం చూడండీ అప్పుడే తెలిసి పోతుంది మరి, మేం వయసు కొచ్చేసామని !

మా కాలం లో నండీ మరి ......

మిస్సమ్మ అనే చిత్రం లో 'పల్లెకు పోదాం, పారు ని చూద్దాం' అని ఓ బ్రహ్మాండమైన హిట్ సాంగ్ వుండే దండీ! ....


చీర్స్
జీరింగ్లీ జిలేబి.

Thursday, June 7, 2012

మీకు మీరే మాకు మేమే, ఎందుకీ రుస రుస బుస బుస !

మీకు మీరే మాకు మేమే, ఎందుకీ రుస రుస బుస బుస అని గుండమ్మ కథ లో అందంగా చెప్పే సేరు.

మా అయ్యరి గారి తో ఈ మాటే అంటే, పెళ్లి కి ముందు మాట వరసకి నేనన్న మాట గుర్తుకు తెచ్చేరు.

'జిలేబీ, పెళ్లి కి ముందు ఏమన్నావ్ '

ఏమన్నా అన్నా.

'మీ దారే మా దారి అండీ ' అన్నావా లేదా ?

అన్నా చెప్పా.

అయితే, ఇప్పుడు మీకు మీరే మాకు మేమే అంటే ఎట్లా ?

అది సరే స్వామీ వారు, పెళ్లి కి ముందు అమ్మాయిని. ఇప్పుడు బామ్మని. కాదా మరి అన్నా.

అవును. అయినా ఆ పలుకు మారాలా ?

కాదా మరి ? మీకు వయసు మీద బడే. మీ దారే మాదారి అంటే, మీకు అసలే కళ్ళు  కనబడడం ఓ మోస్తరు అయి పోయింది. మీదారే మాదారి అని మిమ్మల్ని ఫాలో అవర్ హబ్బీ అని ఫాలో అయితే, నేరుగా ఏ  ఏట్లో  కో మీరు వెళి తే  నేనేమి చేసేది స్వామీ వారు ' అన్నా.

ఆ, అన్నారు మా అయ్యరు గారు.

మా కొండ దేవర అమ్మ వారు కూడా అంతే గా మరి, స్వామి వారు పై తిరుపతి లో ఉంటే, అలిమేలు మంగమ్మ వారు, సేఫ్ గా మంగా పురం లో సెటల్  అయి పోయేరు ఎందుకైనా మంచిది అని, అసలే స్వామీ వారు మరీ 'ఓల్డ్' మ్యాను ! అమ్మవారి పాటి తెలివి మా కుండ కూడదా మరి !

చీర్స్
జిలేబి.  

Tuesday, June 5, 2012

A women's favorite position is CEO!

"ఏమమ్మాయ్, ఏం ఉద్యోగం చెయ్యా లనుకుంటున్నావ్ ?" చాలా కాలం మునుపు మా నాన్న గారు అడిగేరు.

ఇంట్లో అమ్మ, బామ్మల 'స్టేటస్' వారి 'దాక్షీకం' చూసిన దానిని కాబట్టి, సూటిగా చెప్పేసాను- Nothing less than CEO నాన్న గారు అని.

'అర్థం అయి పోయింది, మీ బామ్మ ఇంపాక్ట్ నీ పై చాలా ఉందని ' అన్నారు నాన్న గారు.

కాదా మరి, మా బామ్మ ఇంట్లో సర్వాధికారిణి! ఆవిడ మాటలు మా నాన్న గారు కూడా ఎప్ప్పుడూ కాదన లేదు. మరి ఆవిడ పెంపక మాయే మనది!

ఇంతకీ ఈ విషయం ఇప్పుడు చెప్పటం ఎందుకు అంటారా ?

ఆ మధ్య రాసాను , మా మనవరాలు డిగ్రీ చేత పుచ్చుకుని, వారి 'పురచ్చి' తలైవి, లాప్ టాప్ ఇస్తే, దాంట్లో సినిమాలు చూస్తో కూర్చుంది అని.

ఆ మనవరాలు ఈ మధ్య వస్తే, 'ఏం, పిల్లా, ఏముద్యోగం చెయ్యాలను కుంటున్నావ్ ? అన్నా.

చెప్పిందే తడవు, తడ బడ కుండా చెప్పేసింది, 'Nothing less than CEO ' అని!

హమ్మోయ్, చర్విత చర్వణం! ఈ బామ్మ ఇంపాక్ట్ మరీ కొనసాగు తోనే ఉందన్న మాట మరి!

ఇంతకీ CEO అయి ఏం చెయ్యా లను కుంటున్నావ్ మరి అన్నా కొంత గిల్లి చూద్దామని. .

'నీలా , సబ్బాటికల్ చేద్దా మను కుంటున్నా బామ్మ అంది టప్పున.

ఔరా, ఈ కాలం అమ్మాయిలూ మరీ గడుసు వారే.

సరే, పెళ్లి, వగైరా ...?

పెళ్ళా, ఇప్పటికి వద్దన్నాడు తను' అంది చాలా కాష్యుల్ గా.

ఎవరే తను?

బాయ్ ఫ్రెండ్.

వామ్మో, మరో మెట్టు ఎక్కేసేరు ఈ కాలం అమ్మాయిలు మరి.

ఎవరే బాయ్ ఫ్రెండ్ ?

పరిచయం చేస్తాలే, సమయం వచ్చినప్పుడు అంది, మధ్యలో తను లాప్ టాప్ లో చాటింగ్ జరగటం అప్పుడే గమనించా నేను. ప్రొఫైల్ లో ఓ అబ్బాయి ఉన్నాడు.

ఉమన్ ఎంపవర్మెంట్ మరి.

చీర్స్
జిలేబి.

Sunday, June 3, 2012

ఇచ్చట ఉప (ఉప్మా) వాసములు చేయబడును !

మా కాలనికో బామ్మ ఉండేది మాకు.

ఆవిడ ఆరోగ్యం అమోఘమైనది కూడాను. అంటే, ఏమి తిన్నా జీర్ణించుకొనేది అన్న మాట. ఆ మాటే మాతోటీ చెప్పేది- జిలేబీ, రాళ్ళు తిన్నా జీర్ణించుకోవాలి సుమా అని.

మధ్య మధ్య లో చెప్పా పెట్ట కుండా ఇవ్వాళ ఉప వాసం అని హటాత్తుగా అల్టిమేటం ఇచ్చేది.

ఏమి బామ్మా ఉప వాసం అంటున్నావ్ ఇవ్వాళ అంటే, జీడి పప్పు ఉప్మా పెసరెట్టు (మన యరమణ గారి స్టైల్ అన్న మాట) తినాలని ఉంది జిలేబీ అందుకే ఇవ్వాళ ఉపవాసం అని 'సీక్రెట్' గా చెప్పేది.

అట్లా, మన దేశం లో ఇప్పుడు మన 'సోషల్ ఏక్టివిస్ట్  ' లు చెప్పా పెట్టకుండా ఇవ్వాళ నిరాహార దీక్ష సుమీ అని చెప్పేస్తున్నారు. వాళ్ళకీ జీడిపప్పు ఉప్మా పెసరట్టు తినాలని కాకుంటే, ఉత్తర భారత దేశం వారైతే, హాట్ హాట్ జిలేబీ, వేడి పాలు తాగాలని ఏమన్నా కోరిక గలిగితే వెంటనే నిరాహార దీక్ష చెయ్యాలని 'పూనకం' తెచ్చేసు కుంటారేమో సుమీ !

మా మనమోహనుల వారు 'డీప్ థింకింగ్' ముఖం తో కనిపించారు ఇవ్వాళ.

ఏమి దేవర ఇట్లా ముఖం వేలాడేసు కుని ఉన్నారు అంటే,

క్యా కరూంగా మేం సాహెబ్, 'కరప్షన్' ఫ్రీ కేబినేట్ నడపాలని నిరాహార దీక్ష చే బట్టారు అందుకే దిగాలు గా ఉన్నా అన్నారు వారు.

అది ఎట్లా వీలవు తుంది జీ సాహెబ్ అన్నా హాశ్చర్య పోయి.

'కేబినేట్ నడపొచ్చు. కరప్షన్ నడపొచ్చు. కాని కరప్షన్ ఫ్రీ కేబినేట్ నడప కూడ దంటా రేమి వీరు మరి' మా జీ సాహేబు వారు మళ్ళీ వాపోయారు.

'సాహెబ్, కరప్షన్ ఇండియా కా ప్రాబ్లెం అలోన్ నహీ హాయ్ '  అని పూర్వం దేవేరి వారు దీటు గా చెప్పెసేరు కాదా' అన్నా.

'మంచి మాట జ్ఞాపకానికి తెచ్చేరు మేమ్' అన్నారు సంతోష పడి పోయి మన మొహనుల వారు.

అబ్బా, వీరు పాలిటిక్స్ కి వచ్చాక ఇంత దద్దమ్మ ఎలా అయి పోయారు చెప్మా అని అనుకున్నా. దేశాన్ని దివాలా స్థితి నించి తీసుకొచ్చిన పెద్ద మనిషి, దేశ ఖజానాని ఘట్టి గా నడి పిన పెద్ద మనిషి, అదేమీ ఖర్మో, పాలిటిక్స్ కి వస్తూనే, ఇట్లా బుద్ధి మందగింపు ఎట్లా వచ్చేస్తుంది సుమీ !

అంతా విష్ణు మాయ కాకుంటే, వీరి కి ఇన్ని కష్టాలా మరి . దేశం లో అసలు వ్యవస్థే లేకుండా పోయింది సుమీ


జిలేబి.