Saturday, September 18, 2010

యోగః 'చిట్టా' వృద్ధి అభివృద్ధి కారకః!

పతంజలి యోగ సూత్రం - యోగః చిత్త వృద్ధి నిరోధః!
ఈ జమానా లో - యోగ అన్న పదం ఎంచక్కా చిట్టా వృద్ధి కారకః!
అంటే - యోగా పేరుతో ఎలాంటి జిమ్మిక్కులు చెయ్య వచ్చో విదేశాల్లోని యోగా కంపెనీ ల నించి నేర్చుకోవచ్చు. ఈ ప్రతిభ లో - మన వాళ్ళు ఓ మోస్తరు వెనుక బడ్డ వారే !
దేనికైనా యోగా టైటిల్ ముందో వెనుకో చేర్చడం - బ్రాండ్ వేల్యూ ని పెంపొందించే సులభ సూత్రం !
మన దేశం లో కూడా ఈ యోగా కొత్త పుంతలు తొక్కుతోంది - కాకుంటే హై ఎండ్ సొసైటీ లో

యోగా పేరుతో బ్రాండింగ్ ఎలా చెయ్య వచ్చో అలాగే - దాని నిర్మలమైన ఉపయోగాన్ని కూడా పొందితే - ఈ కాలం లో ఒక విధం గా యోగ ని సాధించినట్టే!

చీర్స్
జిలేబి.

Thursday, September 16, 2010

ఇండియన్ స్టాక్ మార్కెట్ - ఎ గతి?

నదీనాం సాగారో గచ్చసి అన్నది సుభాషితం.

ఈ స్టాక్ మార్కెట్ లకి సాగరం ఎక్కడ ఉన్నదన్నది నా పెద్ద సందేహం!

ఏదో కొంపలు మునిగి పోయేటట్టు - విపరతీం గా అమ్మేసుకుని అమ్మోయ్ మేమంతా నష్ట పోయామోచ్ అని తల మీద గుడ్దేసుకుని ప్రభుత్వాలని గెంజి , బతిమాలి కాకుంటే - మా కు ఆత్మా హత్యలే శరణ్యం అని బెదిరించి డబ్బులు - ప్రజల పన్నుల డబ్బులు లాగేసుకుని - మళ్ళీ జూమ్మని తెగ స్టాక్ లు కొనుక్కుంటూ వోయ్ ఇండియా ఆసియా లో తలమానికంగా వెలుగొంద బోతూందని స్టేట్మెంట్లు ఇచ్చేయ్యడం - !

విష్ణు మాయ కాకుంటే - ప్రతి కొన్ని సంవత్సరాలకి ఇది జరగడం - ఆ తరువాయి అంతా మరిచి పోయి - వోయ్ మంచి రోజులు వచ్చేసాయ్ అని చంకలు గుద్దేసుకుని సంతోష పడి పోవడం - కాదండీ మరి ? - ఈ గతి కి సముద్రం ఎక్కడ ఉన్నది?

చీర్స్
జిలేబి.

Saturday, September 11, 2010

మాడెర్న్ గణేశ - లేజీ గణేశా-!!


మౌసే జీవనం ఈ 'ఈ ' మానవునికి'-

లాప్ టాప్ - వెబ్ - ఆహారం 'ఈ ' మానవునికి-

'ఈ ' మానవుని లేజీ లైఫ్ కి గణేశా కూడా

లాప్ టాప్ తో లేజీ గా ఇవ్వాళ

గణపతి బొప్పా మోరియా అంటుంటే -

'దైవం' మానుష రూపేణా - అన్నది 'ఊర్ధ్వ మూలం అథః శాఖం అయినట్టుంది!


గణేశ చతుర్థి శుభాకాంక్షలతో !


'బి' లేజీ -

జిలేబి.

Tuesday, September 7, 2010

స్టార్ బక్స్ & 'బక్స్'వంతుడు - బ్రాండ్ లోకం

స్టార్ బక్స్ వాడు బ్రాండ్ పేరుతో కాఫీ ని - డాలర్ ల లో అమ్ముతాడు. బ్రాండింగ్ లోకం లో అన్నిటికి డిమాండ్ ఉంది. బ్రాండ్ బాగా చేస్తే - మన భాజా బజంత్రీలు బ్రహ్మాండం గా వెలుగు తాయి. మన ఐపిఎల్ లాగ అన్న మాట.
'కాసే దాన్ కడవులప్పా అన్నాడు ఒక తమిళ కవి. డబ్బుకు లోకం దాసోహం అని వాపోయాడు తెలుగు కవి.

మొత్తం మీద మన భగవంతుడు కూడా - 'బక్స్' వంతుడు అయిపోయే! బ్రాండింగ్ లోకం లో మా తిరుపతి కొండ దేవర ని కూడా పోటీ కి నిలబెట్టి - వాడి లడ్డూలకి కూడా బ్రాండింగ్ పెట్టి - మా దేవరలు - వెంకన్నని ' బక్స్' వంతుడు గా మార్చే స్తున్నారు.

ఓ దేవర- నీవు కుబేరునికి బకాయి పడ్డావు. నీ పాటి మానవులం మేము- నీ బుద్ధీ మాకే వచ్చే. నీ క్రెడిట్ తో మా పబ్బం గడుపుకోటానికి నిన్ను బక్స్ వంతుడు గ చెలామణి చెయ్యడం తప్పలే ! కాబట్టి- విన్నపాలు విన వలెను వింత వింతలూ - మాత్రమె కాదు - నీవు నేర్పిన విద్యయే నీరజాక్షా ! - అని నీ 'పద' కమలం లో ఈ 'బ్లాగు ' బాక్సు ' సమర్పితం !

చీర్స్
జిలేబి.

Monday, September 6, 2010

కృష్ణా - 'బాగా' నే 'బారో'

అప్పు చేసి పప్పు కూడు చిత్రం చూసాక - కృష్ణా నీవే బేగనే బారో అన్న కన్నడ పద జాలానికి నవ్వొచ్చింది. కృష్ణా బాగా నే బారో అన్నట్టుందే ఇది అని!

అయినా ప్రస్తుత జమానాలో - క్రెడిట్ లేనిదే దునియా లేదన్నుట్టుంది! ప్రతి ఒక్కటి క్రెడిట్ లో కొనాల్సొచ్చే రోజులు అయి పోయేయీ!

కాబట్టి - ఎట్లాగు క్రెడిట్ తప్పదు - సో బేగనే బాగా బారో చేసి - పప్పు కూడు తినవలె ! ఇది విస్సన్న చెప్పిన వేదం ఈ కాలానికి !( ఈ బ్లాగు మాత్రం ఏమి క్రెడిట్ మీద కాదూ రాస్తున్నది ? బ్లాగర్ వాడు స్పేస్ అరువిస్తే - అందులో మన రాతలు తెల్ల వారుతున్నాయి గదా! - అంతా అమెరికా వాడి మాయ ! )

చీర్స్
జిలేబి.