Thursday, September 13, 2018

ఒంటికొమ్ముదేవర! నమో ! నమో !



వినాయక చవితి శుభాకాంక్షల తో



 
 
 
ఏనుగు మొగమయ్య! గణప
తీ! నిను తలచెద, జిలేబి తీయందనముల్
జ్ఞానము నొసంగు శాంకరి,
యీనాటి చతుర్థి నీది హేరంబ ! నమో !

జిలేబి
 

Monday, September 3, 2018

శ్రీ కృష్ణం వందే జగద్గురుమ్ !




శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలతో



చిత్రం కర్టసీ : http://kamadenu.blogspot.com/  -   
Shri Keshav of The Hindu Fame


జిలేబి

Monday, August 20, 2018

ఇమ్రాన్ ఖాన్ - ఇన్ షా అల్లా - పాకిస్తాన్ - తక్డీర్ బద్లేగీ ?



ఇమ్రాన్ ఖాన్ -
ఇన్ షా అల్లా -
పాకిస్తాన్ -
తక్దీర్ బద్లేగీ ?


This is the time that we decide to change our destiny
I wish that the PM House will be turned into a university.
It is in a great location to be one







ఇమ్రాన్కాను ప్రధాన మంత్రి! కిరికెట్కీసారి సిక్సర్ భళా!
సామ్రాజ్యంబిక జోరుగాంచునకొ? యీసారైన తక్దీరులన్
టుమ్రీలా సరి జేయునా నితడు? పాటోళీగ ఆర్మీ సయిన్
హమ్రంగీవలె తోక ద్రిప్పునకొ? బే హాల్,కాహిలీ మారునా?


Debt burden is now at Rs28 trillion. We haven’t been as indebted in our entire history as we have become in the last ten years

The interest that we have to pay on our debt obligations too has reached levels where we have to take on more debt just to settle it

We are unfortunately among the five countries where infant mortality is highest because they do not have access to clean water

We also have the highest rates of mortality for pregnant women

I want to speak about how the rich and powerful live in this country (Bharat Ek Toilet Story- remember Modi's speech?)

On one hand we don’t have money to spend on our people, and on the other we have people living like our colonial masters used to live?

 five-point agenda

First is supremacy of law
The second thing is Zakat. What does Zakat mean? It means that I spend based on what I have on those who do not have enough
The third is compassion.
The fourth is merit. Without merit you cannot do anything. The responsibilities of the ruler entail that they are sadiq and amen.
The fifth is education. The Holy Prophet stressed education above everything else.


Cutting down his own as well the country's expenditure.

I  further wish that the PM House will be turned into a university. It is in a great location to be one.

Tax reforms instead of loans
Pay your taxes so that we can lift our destitute out of poverty.
We will also enact a law for whistleblowers like we did in Khyber Pakhtunkhwa. Whoever helps identify corruption will get a share of the money that we recover
Revamping the judiciary

We also need to fix our police," Khan said. "The Khyber Pakhtunkhwa police is our biggest success. We won the election because of how good our police had become

More to read:

https://www.dawn.com/news/1427995/prime-minister-khan-asks-nation-to-have-compassion-for-poor-adopt-austerity


All the best Imran.

Zilebi



 

Wednesday, August 8, 2018

కరుణానిధి - బై బై


కరుణానిధి - బై బై 
 
The Last in the Row
 
Bye Mr Karuna




కరుణానిధి !
 
నివాళి

కరుణానిధి! తమిళుల"మా
బెరుం కళై న్యరు"లకట కుబేరుని తలద
న్న రయముగ పయన మైనా
ర, రడారుడిగ హరివాసరమున జిలేబీ !

ఏకాదశి కి ముహూర్తం బెట్టుకున్నావా సామి!

ఇండ్రు పోయి నాళై వా !
 
హ్యాపీ ట్రావెల్ ఎహెడ్ 

జిలేబి
 

Tuesday, July 17, 2018

ఉత్పల మాల సాటియగు ఉత్పలమాల జిలేబి యేగదా - 2





పాపం కవి రాట్ :)


గిట్టని వారటంచు గిరి గీసుకొనన్ మది రాక బిల్వ గా
చట్టని వెళ్ళినాను కవి సత్కృతి జన్మ దినమ్ము మీకనన్
తట్టక పోయెనయ్య యిది తంత్రము హేళన చేయ నన్ను! హా!
పుట్టినరో జటంచుఁ గడుఁ బూనిక శోకసభన్ రచించిరే!

జిలేబి

Monday, July 9, 2018

జడకందం - మాకందములు - పుస్తకావిష్కరణ విశేషాలు



జడకందం - మాకందములు - పుస్తకావిష్కరణ  విశేషాలు


జడకందములన్ గలదో
యి డమడమ మజా జిలేబి యిమిడేను భళా!
చెడుగుడు లాడి తిరిగె సూ 
వె!డిమడిమ కవివరు నడుమ వేదిక నందున్ :)




మొదటి చిత్రము
వేదిక పైన ప్రౌడ్ ఓనర్స్ ఆఫ్ జడకందములు :)
రెండవ చిత్రము- కంది వారికి దుశ్శాలువ సన్మానము
 


శుబాకాంక్షలతో
జిలేబి వారి జాంగ్రీ

Thursday, June 14, 2018

స్త్రీలకు మ్రొక్కిన ధనమును శ్రేయముఁ గల్గున్!




స్త్రీలకు మ్రొక్కిన ధనమును శ్రేయముఁ గల్గున్!
 


పాలేటి రాచ కన్యయు
కోలాహలము కలిగించు గోమిని లక్ష్మిన్
బాలకుమారా  కొల్చుచు
స్త్రీలకు మ్రొక్కిన ధనమును శ్రేయముఁ గల్గున్!


***

గోలల మనీపరసులో
లీలలు గలవయ ! జిలేబులీను జిలేబీ
లే! లక్షణముగ వారికి,
స్త్రీలకు మ్రొక్కిన ధనమును శ్రేయముఁ గల్గున్


***

చాలా చక్కగ యిస్త్రీ
చేలల కొనరిచి ధరింప చెప్పెడు పూబో
డీ లలనలు సతులవుదురు
స్త్రీలకు మ్రొక్కిన, ధనమును శ్రేయముఁ గల్గున్ :)


***

వేలకు వేల ధనమ్మును
చాల సమర్థులుగ "యైటి" సంగతి గనిరే :)
గోలలు వలదువలదనకు !
స్త్రీలకు మ్రొక్కిన ధనమును శ్రేయముఁ గల్గున్!


***


బేలలు బేలలనకు ! కర
వాలము బట్టిరి తుపాకి వాటము గనిరే !
కేలుమొగువు మానవుడా!
స్త్రీలకు మ్రొక్కిన ధనమును శ్రేయముఁ గల్గున్!


***

చాలమి లే, తిరుగాడిరి
గోళము లన్తిరిగిరి భళి గూగుల్ లో మీ
లా లక్షలను గడించిరి
స్త్రీలకు మ్రొక్కిన ధనమును శ్రేయముఁ గల్గున్!


***

జోలెలు బట్టిరి మగవాం
డ్లే !లెస్సగనయిరి మగువలే లబ లబలే
లా ! లావణ్యవతులయా !
స్త్రీలకు మ్రొక్కిన ధనమును శ్రేయముఁ గల్గున్!


***

మేలుగ విద్యల నేర్చిరి
కాళికలై కదము ద్రొక్కి ఖండాంతరముల్
మూలకు మూలల పోయిరి
స్త్రీలకు మ్రొక్కిన ధనమును శ్రేయముఁ గల్గున్!


***

లాలిత్యం బొప్పెడు నట
నా లావణ్యముల జూపి నవరసముల ధా
రాళముగ "అమ్మ" గనయిరి
స్త్రీలకు మ్రొక్కిన ధనమును శ్రేయముఁ గల్గున్!


***

ఏలెన్ దేశము బింద్రన్
వాలేలన్నడచెను భళి బాంకుల జాతీ
యాలై నిల్పెను వినుమా
స్త్రీలకు మ్రొక్కిన ధనమును శ్రేయముఁ గల్గున్


***

పాళీ బట్టి కలెక్టరు
లై లెస్సగ నామ్రపాలి లా యేలిరయా
మూలంబయ్యిరి ప్రగతికి
స్త్రీలకు మ్రొక్కిన ధనమును శ్రేయముఁ గల్గున్


***


బాలీ వుడ్డును నేలిరి
టాలీ వుడ్నందు బావుటా లెగరేయం
గా లావై వెల్గిరయా
స్త్రీలకు మ్రొక్కిన ధనమును శ్రేయముఁ గల్గున్!


***

గాలిని నడిపిరయ విమా
నాలను నేర్హోస్టెసులుగ నాణ్యపు సేవల్
లాలించుచు పాలించిరి
స్త్రీలకు మ్రొక్కిన ధనమును శ్రేయముఁ గల్గున్!


***

లాలను జూపుచు మాతా
శ్రీలై సంస్థాపకులుగ సిద్ధిన్ బుద్ధిన్
మేలుగు నిల్పిరి గారే
స్త్రీలకు మ్రొక్కిన ధనమును శ్రేయముఁ గల్గున్!


***

మాలాలా యూసఫులుగ
మూలాల నెదిరిచినారు మూలంబయి పూ
మాలై భువినే చుట్టిరి
స్త్రీలకు మ్రొక్కిన ధనమును శ్రేయముఁ గల్గున్!


***

డీలింగురూము, నెక్స్చేం
జీలన్,స్టాక్మార్కెటున గజిబిజియు లేకన్
వాలెట్లన్నింపిరయా
స్త్రీలకు మ్రొక్కిన ధనమును శ్రేయముఁ గల్గున్!


***

చాలా చక్కగ నార్టీ
సీలో కండెక్టరులయి జిలుగులొలుకుచున్
ఓలాడ్రైవర్లయిరే
స్త్రీలకు మ్రొక్కిన ధనమును శ్రేయముఁ గల్గున్!


***

భోళా శంకరు తలపై
మాలిని సుఖదగ నిముడుచు మరి నిల్లాపై
శైలజగా నిల్చిరిగా
స్త్రీలకు మ్రొక్కిన ధనమును శ్రేయముఁ గల్గున్!


***

బాలకుమారా! వినుమో
యీ ! లోలకము వలె తిరుగు యింతులకు కడున్
మాలోకంబై చుట్టెడు
స్త్రీలకు మ్రొక్కినఁ ధనమును, శ్రేయముఁ గలుగున్


***

లోలాక్షులు సీయెమ్ములు
గా లలనల్ " రాష్ట్రపతులు " గా మన దేశా
న్నేలిరి మహాజనులుగా
స్త్రీలకు మ్రొక్కినఁ ధనమును, శ్రేయముఁ గలుగున్!


***

జోలల్ పాడిరి తల్లులు
గా లలనామణి బసాలు గా తీపి జిలే
బీలయిరే బామ్మలు గా
స్త్రీలకు మ్రొక్కినఁ ధనమును, శ్రేయముఁ గలుగున్!


***

జాలీ జాలీ గా ప
ద్యాలల్లుచు శతకమునకు దారిన్ గనిరీ
వేళ విషయము పడతిగా
స్త్రీలకు మ్రొక్కినఁ ధనమును, శ్రేయముఁ గలుగున్!


***


మూలాధారము నుండి క
పాలములో బ్రహ్మరంధ్ర పరిణితి వరకున్
పాలిచ్చిన తల్లి చలువ
స్త్రీలకు మ్రొక్కినఁ ధనమును, శ్రేయముఁ గలుగున్!



***
జిలేబి
***


 

Monday, May 21, 2018

మండోదరి తనయ సీత మహిని జిలేబీ (ద్రవిడ రామాయణం ) :)




జిలేబి వారి ద్రవిడ రామాయణం
 
 
వామ్మో సీత మండోదరి కుమార్తె యా అని దాంతో తలీ ఉంగలీ దబాయీ :)
 
ఏమండీ ఈ కథ కు మూలం మరీ అవాల్మీకీయం గా ఉందంటే అద్భుత రామాయణం అని చెబ్తే
 
చూద్దారి ఈ 'అద్భుత' రామాయణం అని గూగ్లించి ,
 
ఆర్కైవ్ డాట్ ఆర్గ్ లో ఓ సో కాల్డ్ సంస్కృత హింది అద్భుత (' అత్యాద్భుత :))
 
రామాయణాన్ని తీసి చదివితే
 
వ్యాక్  అని వాంతి చేసు కోవాల్సి వచ్చింది !
 
కత మరీ జిలేబీయం ఇంతా అంతా కాదు నూటికి నూరు పాళ్ళు పుక్కిటి పురాణమే అన్నట్టు అనిపించింది.
 
హమ్మయ్య ఈ రామాయణం రంగనాయకమ్మ గారి కళ్ళ బడకుండా ఉండి పోయింది కదా అని సంతోష పడి పోయా !
 
లేకుంటే వారి కళ్ళ బడి ఉంటే మజా యే మజా మరో దుమారం రామాయణ జిలేబి వృక్షం అని మరో పొత్తం వచ్చేసి ఉండేది :)
 
 'గొలుసు' నవలలు  వచ్చేవి. ఓ రచయిత విడిచిన భాగాన్ని ఊహా పూర్వకం గా మరో రచయిత అందుకుని కథ సాగించడ మన్న మాట :) అట్లా అతుకుల బొంత ఈ అద్భుత రామాయణం (మధ్య లో పదకొండో సర్గ లో ఎవడో మహాను భావుడు సాంఖ్య యోగాన్ని రాములోరి చేత హనుమంతుడి కి ఉపదేశం కూడాను :))
 
అక్కడక్కడా దొరికిన పేజీ లకు ముందూ వెనుకా కథ ల గట్టి మరీ ఓ నవల రాస్తే ఎట్లా ఉంటుంది ? అలా ఉంది.
 
ఈ సీత జన్మ వృత్తాంతం ఎనిమిదవ సర్గ లో వస్తుంది ఈ పుస్తకం లో . దానికి ముందు యేడు సర్గ లు వారెవ్వా ఏమి కథ రంజు గా కట్టే రండీ బాబోయ్ :)
 
ఒక్క సర్గ ముందు మా నారదుల వారు , శ్రీ కృష్ణ పరమాత్ములు, రుక్మిణి, సత్యభామ జాంబవతి కూడానూ రామాయణం లో పిడకల వేట కై వస్తారు :)
 
ఇప్పుడు వీటిని చదివేక నేను ద్రవిడ జిలేబీ రామాయణం రాద్దా మనుకుంటున్నా :)
 
ఇప్పుడు రాబోయే కాలానికి జిలేబీ రామాయణం కత టూకీ గా :)
 
 
(సందులో సడే మియా ద్రావిడ సీత కత తయార్ :) - ఈ రామాయణాన్ని కూడా రాబోయే కాలం లో వాల్మీకి ప్రణీత అని చెప్పేస్తారన్న ఆశయం తో :))
 
 
 
ఓ రోజు మండోదరి కళ్ళ నీళ్ళు బెట్టు కుంటూ రావణుడి దగ్గరకు వచ్చి ఫ్లాషు బ్యాకు చెబ్తుంది  -
 
స్వామీ ! మునులను జయించి , విజయసూచకముగా, వారి రక్తాని పూర్వం ఒక భాండం లో పెట్టేవు.
 
ఆ భాండాన్ని అంతకు మునుపు వంద కొడుకులున్న కత్స్నమదుడనే బ్రాహ్మణుడు తన యిల్లాలి కోరిక యై, లక్ష్మి తన యింట పుట్టాలని కోరుకుంటూ పాలను చేరుస్తూ, ప్రార్థిస్తూ వచ్చిన భాండము.
 
అందు మునుల రక్తముం గలిపి, యది విషమని, దానిని దాయుమని నీవు నాకిచ్చేవు. ఆ పై నువ్వు సందులో సడే మియా అన్నట్టు కన బడ్డ అప్సరసల వెంట పోయేవు.
 
నా కపకార మొనర్చుచున్నా వనుకుని , బలవన్మరణ మందుటకై, యా భాండమందలి ద్రవమునుం ద్రావఁగా, నాకు గర్భమైనది.  నీవే మో పర కాంత ల వైపు వెళ్లి ఓ సంవత్సర మైనా యింటి పట్టున ఉండక పోతివి . ఇప్పుడు గర్భ మాయె ! యెట్లా అని చింతించి
 
ఆ విషయమును నీకు దెలుప వెఱచి, తీర్థయాత్రలకుం బోవు నెపమున వెడలి,కురుక్షేత్రం లో గర్భ వినిష్కృత్య
చేసు కుని అక్కడ భూమిలో పాతేసా !
 
 సంతాన ప్రాప్తి  కై  జనకుఁ డా భూమిని దున్నఁగా నా బాలిక పేటికనుండి లభించెను.
 
భగవత్ప్రసాదముగా భావించి జనకుఁ డా బాలికను పెంచి పెద్దచేసెను. ఆ బాలికయే సీత. 
 
ఇప్పుడెక్కడుందో ! ఏమిటో అంటూ కళ్ళ నీళ్ళు కావేరి లా కారి పోతోంటే , రావణుడు అయినదే మో అయినది నాకు కూడా కుమార్తె లు లేరు కదా ( నాకైతే తెలియదు రావణుని కి కుమార్తె లు ఉన్నారా లేదా అని మన కత కు ఇప్పుడు కొంత స్ట్రాంగ్ పాయింట్ కావాలి కాబట్టి :)) ఈ సీత ఎక్కడుందో తెలుసుకొని రమ్మందాము  మన యింటికి తెచ్చేసు కుందాం ; మండోదరి సంతోషమే తన సంతోషం అనుకుని తన చెల్లె లైన చుప్పనాతి ని పంపిస్తాడు వెళ్లి సీత ఎక్కడుందో ఏమి చేస్తోందో కనుక్కుని రా అని.
 
శూర్పణఖ వెళ్లి సీత ను కని బెడుతుంది దండ కారణ్యం లో.
 
అమ్మాయ్ నీకు నేను మేనత్త వరుస నవుతా. నీ తల్లి మండోదరి నాకు వదిన. నీకు తమ్ములు గట్రా ఉన్నారు . రా వెళ్లి చూద్దారి అని పిలుచుకు వెళ్తూ వుంటే సాదరంగా, లక్ష్మణుల వారు రాముల వారు కోపం తో , తన భార్య విడిచి పోతోందే అనే కారణం తో ఆవిడ ముక్కూ చెవులూ కోసి , ఓసీ ద్రవిడ పడతీ ! మా ఆర్య పుత్రి మీ యింటి అమ్మాయా ? కత లంటా వా అని తరిమి కొడితే , శూర్పణఖ వెళ్లి, అన్నతో మొర బెట్టు కుంటే, సాధువైన రావణుడు వచ్చి సీత ను స్వయంగా గౌరవంగా తన పుష్పక విమానం లో తొడుక్కుని వెళ్లి పోతాడు.
 
అక్కడ లంక లో సీత తన మాత తో సుఖం గా ఉంటూ ఉంటె, ఇక్కడ ఆర్య పుత్రులు కక్ష గట్టి రావణుడి పై యుద్ధానికి వెళతారు.
 
ఆ పై మీకు కత తెలుసు.
 
అంటే ఇది అల్లుడు అత్తా మామ ల పైన చేసిన దండ యాత్ర ! ఆత్తారింటికి దారేది అని వాపోతూంటే దారి లో హనుమాన్ అనే ముసల్మాన్ తోడై .....
 
ఈ కత ని మార్చి వాల్మీకి ఆర్యుల వైపు నించి లాక్కొచ్చి రావణుడిని దుష్టుడి ని చేసి పారేసాడు.
 
 
అబ్బో కత ఇంకా మరీ పెద్దదై పొతుందండీ !
 
కాబట్టి యిప్పటి కింతే :)
 
 
పిండా కూడు కతల మజ
దండిగ దట్టించిరి భళి ర్మపెబువులున్
ఖండిత గర్భంబకటా
మండోదరి తనయ సీత హిని జిలేబీ
 
 
జిలేబి
 

Wednesday, May 16, 2018

నిర్ధారిత సమయ సర్వ దర్శనము :)



నిర్ధారిత సమయ సర్వ దర్శనము :)


లచ్చిందేవి కాళ్ళొత్తే టప్పుడు స్వామి వారు అరమోడ్పు కనులతో తననే చూసే వారను కునేది .

అదేమిటో ఈ మధ్య అరమోడ్పు కనుల చూడటం మానేసేరు స్వామి వారు. ఛ ! తన పై యక్కర తగ్గిందే స్వామి వారికి అనుకున్నది దేవేరమ్మ.


ఏండ్ల తరబడి నిలబడి వున్నా, ఉస్సూరనక, వచ్చే లక్షలాది భక్త జన సమూహం లో తప్పీ 'తవరీ' ఎవరైనా ఓ నిజ మైన భక్తుడు వచ్చేస్తాడే మో , వాణ్ణి తాను చూడ కుండా జోగేస్తానే మో అన్న బెంగ తో యోగ నిద్ర లో ఉన్నా , అరమోడ్పు కన్నులైనా తెరిచి చూసే కొండల రాయుడు హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చు కున్నాడు నిర్ధారిత సమయ సర్వ దర్శనం అంటూ తనని చూడ టానికి ఆధారు కార్డు తో సహా రిజిస్టరు చేసు కొని 'స్లాటడు' సమయం లో నే యిక భక్తులు వస్తారని తెలుసు కునేక!


ద్వార పాలకుల ని పిల్చి ఆ రిజస్ట్రీ చూసి ఎవడైనా నిజమైన భక్తుడు వస్తే చెప్పండే అని ఆర్డరు వేసారు స్వామి వారు.

అప్పటి నించి తీరికే తీరికయి పోయింది. ఇప్పటి దాక జయ విజయులు ఒక్క కేసు కూడా తన ముందు పెట్ట లే :)

హమ్మయ్య అరమోడ్పు కనులవసరం లే !

నిజమైన భక్తుడు వస్తే ఎట్లాగూ జయ విజయులు తెలియ చేస్తారు ముందస్తే .కాబట్టి తానిక అరమోడ్పు కనులతో జాగారం చేయాల్సిన పని లే భక్తి కోటి కై !

సో, ఆ షెడ్యూల్డ్ టైం, అప్పాయింటడు టైం లో  కొంత కండ్లు తెరిచి ఆ వచ్చే భక్తుణ్ణి చూసేస్తే సరి అనుకుని స్వామి వారు మళ్ళీ కునుకేసారు.


లచ్చిందేవి కాళ్ళొత్తు తూ ఉండి పోయింది విచారంగా. కొండ పైనే మో స్వామి వారు నిలబడి పోయేరు హాయిగా .


జై శ్రీ మద్రమారమణ గోవిందో ! హరీ !


జిలేబి

 

Thursday, May 3, 2018

స్వాయంభువు - శత రూప



స్వాయంభువు - శత రూప
 
Tracking back పూరుడు !



శతరూప -స్వాయంభువుని భార్య. ఈమె బ్రహ్మచే మొట్టమొదట సృజియింపఁబడిన స్త్రీ.
స్వాయంభువుఁడు : ఒక మనువు. ఇతఁడు బ్రహ్మమానసపుత్రుఁడు. ఇతని భార్య శతరూప.

కొడుకులు ప్రియవ్రతుఁడు, ఉత్తానపాదుఁడు. కొమార్తెలు ప్రసూతి, ఆకూతి, దేవహూతి.

కర్దమప్రజాపతి : బ్రహ్మచ్ఛాయయందు పుట్టిన యతఁడు. భార్య దేవహూతి. కొడుకు కపిలుఁడు.

మరీచి : బ్రహ్మమానసపుత్రులలో ఒకఁడు. ఇతనికి కర్దముని కూఁతురు అగు కళయందు కశ్యపుఁడు అను కొడుకును, పూర్ణిమ అను కూఁతురును పుట్టిరి. ఈపూర్ణిమను కొన్ని ఎడల కొడుకు అనియు చెప్పి ఉన్నారు

కశ్యపుఁడు : ఒక ప్రజాపతి. ఇతఁడు మరీచికి కళవలన పుట్టినవాఁడు. ఈయన దక్షప్రజాపతి కొమార్తెలలో పదుమువ్వురను, వైశ్వానరుని కొమార్తెలలో ఇరువురను వివాహము అయ్యెను.

వివస్వతుఁడు : ద్వాదశాదిత్యులలో ఒకఁడు. తండ్రి కశ్యపుఁడు. తల్లి అదితి (దక్షప్రజాపతి రెండవ కుమార్తె). ఇతనినే సూర్యుఁడు అని చెప్పుదురు. ఇతఁడు విశ్వకర్మ కొమార్తెలు అగు సంజ్ఞాదేవి, ఛాయాదేవి అనువారిని వివాహమయ్యెను. ఈవివస్వతునికి వైవస్వతమనువు, యముఁడు, శని అని మువ్వురు కొడుకులును, యమున, తపతి అని ఇరువురు కొమార్తలును పుట్టిరి. 

వైవస్వతుఁడు : ఒక మనువు. వివస్వతుని కొడుకు. భార్య శ్రద్ధ. కొడుకులు ఇక్ష్వాకుఁడు, నృగుఁడు, శర్యాతి, దిష్టుఁడు, ధృష్టుఁడు, కరూశుఁడు, నరిష్యంతుఁడు, వృషధ్రుఁడు, నభగుఁడు, కవి అను పదుగురు. వారలలో కవి అనువాఁడు బాల్యమునందే మృతుఁడు అయినందున సాధారణముగ ఇతనికి తొమ్మండ్రు కొడుకులు అనియే ఎల్లవారలు చెప్పుకొందురు.
ఈకుమారులు పుట్టకమునుపు వైవస్వతుఁడు పుత్రార్థియై ఒక యజ్ఞము చేయగా, అపుడు వైవస్వతుని భార్య తనకు కూఁతురు పుట్టునట్లు వేల్వుము అని యజ్ఞము నడపెడు హోతను వేఁడెను. కావున అతఁడు అందులకు తగిన మంత్రములను పఠించి వేల్చెను. అంతట ఇల అను కూఁతురు పుట్టెను. ఇల బుధుని పెండ్లాడి అతనివలన పురూరవుని కనెను. వానివలన చంద్రవంశము అభివృద్ధి పొందెను


పురూరవుడు - •వైవస్వతమనువు కొమార్త అగు ఇలకును చంద్రుడు కొడుకు అగు బుధునికిని పుట్టిన రాజు.
పురూరవునకు ఊర్వసి వలన ఆయువు, ధీమంతుఁడు, అమవసువు లేక విజయుఁడు, చిరాయువు లేక శతాయువు, శ్రుతాయువు లేక వసుమంతుఁడు అను పుత్రులు ఉదయించిరి
ఈతని రాజధాని ప్రతిష్ఠానపురము.
నహుషుఁడు : ఇతఁడు చంద్రవంశస్థుఁడు అగు ఆయువునకు స్వర్భానవి (స్వర్భానవి - Name of the Wife)  యందు పుట్టినవాఁడు. పురూరవుని పౌత్రుఁడు. ఈతని భార్య ప్రియంవద. పుత్రులు యతి, యయాతి, సంయాతి, ఆయాతి, ఉద్ధవుఁడు అని ఏవురు

యయాతి : నహుషునికిని ప్రియంవదకును పుట్టిన ఏవురు కొడుకులలో ఒక్కఁడు.
ఇతఁడు శుక్రాచార్యుల కొమార్త అయిన దేవయానను పెండ్లియాడి ఆమెయందు యదువు, తుర్వసువు అను ఇరువురు కొడుకులను, వృషపర్వుని కూఁతురును దేవయాన చెలికత్తెయును అగు శర్మిష్ఠయందు ద్రుహ్యుఁడు, అనువు, పూరుఁడు అను మువ్వురు కొడుకులను కనియెను

(సోర్స్ - పురాణ నామ చంద్రిక - యెనమండ్ర వెంకట రామయ్య - వయా - ఆంధ్ర భారతి ఆన్ లైన్ నిఘంటువు)


Tracking back పూరుడు !

శతరూప         - బ్రహ్మచే మొట్టమొదట సృజియింపఁబడిన స్త్రీ.

స్వాయంభువు - బ్రహ్మ మానస పుత్రుడు
కర్దమప్రజాపతి : బ్రహ్మచ్ఛాయయందు పుట్టిన యతఁడు
మరీచి : బ్రహ్మమానసపుత్రులలో ఒకఁడు.

శతరూప   + స్వాయంభువు  -> దేవహూతి.

దేవహుతి  + కర్దమ -> కళ

కళ +     మరీచి -> కశ్యప

కశ్యప + అదితి ->  వివస్వత

వివస్వత + సంజ్ఞాదేవి (I am assuming only as above does not show correctly) -> వైవస్వత

వైవస్వత + శ్రద్ధ (Not sure who are the parents of Shradda!) -> ఇల

ఇల + బుధ (చంద్రుడు కొడుకు) -> పురూరవుడు

పురూరవ + ఊర్వశి -> ఆయువు

ఆయువు + స్వర్భానవి (Not sure who are the parents of svarbhanavi) -> నహుషుడు

నహుష + ప్రియంవద -> యయాతి

యయాతి + శర్మిష్ఠ -> పూరుడు





ఇట్లా ట్రాక్ చేసుకుంటా పోతా ఉంటే కథ ఎప్పటికి తేలేది ?
ఒక్క పూరుడు ని ట్రాక్ చేయటానికి రెండు గంటలు పట్టింది ! పూరుడు తరువాత ట్రాక్ ఎవరికైనా తెలిసుంటే చెప్పండి .

ట్రాక్ ఫార్వార్డ్ ఇఫ్ యు కేన్ :)

శుభోదయం
జిలేబి