Thursday, September 13, 2018

ఒంటికొమ్ముదేవర! నమో ! నమో !వినాయక చవితి శుభాకాంక్షల తో 
 
 
ఏనుగు మొగమయ్య! గణప
తీ! నిను తలచెద, జిలేబి తీయందనముల్
జ్ఞానము నొసంగు శాంకరి,
యీనాటి చతుర్థి నీది హేరంబ ! నమో !

జిలేబి
 

32 comments:

 1. చిత్రం బాగుందండీ.
  వినాయక చవితి శుభాకాంక్షలు.

  ReplyDelete

 2. పునరుక్తి లేక "వ" యు లే
  క నినుపొగిడెద హరిహయుడ! గణపతి! పిళ్లా
  రి! నమో! మూషకరథుడా!
  పనిచెఱుపులదొర! గజాస్య ! పాహి జిలేబిన్!


  జిలేబి

  ReplyDelete
  Replies
  1. http://www.eenadu.net/magazines/sunday-magazine/sunday-magazineinner.aspx?catfullstory=27301   జిలేబీ.. ఈ రుచికి సాటేది!

   Delete

  2. మానాన్నే మానాన్నే శిష్యకోటి పరమాణువా సరియైన సమయంలోనే సరియైన జిలేబి‌ మీది వ్యాసం లింకు తెచ్చేవు నాయనా ! సెభాష్ !   వద్దొద్దు అంటూనే ఇదే లాస్ట్‌ అని చెబుతూనే ఓ అరడజను దాకా అవలీలగా లాగించేస్తారు... ఆగలేరండీ బాబూ! :)


   జిలేబి

   Delete 3. మరువకపత్ర జిలేబిన్
  మరువక పరశుధర! పాహి మాం పిళ్లారీ!
  గురువందనము కరివదన
  అరుగున చేర్చితి కుడుముల నైవేద్యముగా !


  శుభాకాంక్షలతో

  జిలేబి

  ReplyDelete
  Replies


  1. గణేశ ఉవాచ
   --------
   కుడుములు లడ్డూ లిష్టము
   పడవు జిలేబీలు నాకు పండిత సుకవీ !
   విడువుము జిలేబి నామము
   అడిగితి నీ పేరు జెప్పి యర్చించు మికన్ .

   రాజారావు లక్కాకుల

   Delete


 4. పునరుక్తియు, గడపక్కర
  మును లేక పొగిడెదనయ !సుముఖుడా !పిళ్ళా
  రి! నమో! మూషకరథుడా!
  పనిచెఱుపులదొర! గజాస్య !పాహి జిలేబిన్!


  గడము - ఆటంకము;
  అక్కరము - అక్షరము

  గడపక్కరము - ఆటంకపరచు అక్షరము - నిషిద్ధాక్షరి :)


  జిలేబి

  ReplyDelete
  Replies


  1. గడము + అక్కరము = గడపుటక్కరము

   పోచిరాజు కామేశ్వరరావు గారు

   Delete

  2. హమ్మయ్య


   పునరుక్తి, గడపుటక్కర
   మును లేక పొగిడెదనయ !సుముఖుడా !పిళ్ళా
   రి! నమో! మూషకరథుడా!
   పనిచెఱుపులదొర! గజాస్య !పాహి జిలేబిన్!


   జిలేబి

   Delete


 5. నీ నామం బెద్ది జిలే
  బీ? నీకు తెలియని మనికి విఘ్నేశ్వరుడా
  యీ నేల పైన గలరా
  యేనుగు మొగమయ్య దేవ హేరంబ! నమో!


  జిలేబి

  ReplyDelete
  Replies

  1. జిలేబమ్మ పేరు రాజ్యలక్ష్మి :)   ఓ రాజ్యలక్ష్మి! నీవే
   బాలా పంచదశలోక పంచు జిలేబీ :)
   గోలా! బేల! వికీలీక్స్
   లైలా తెలివి సుమి యితరులకు గలదా పో :)


   జిలేబి

   Delete
  2. పేరు రాజ్యలక్ష్మి , పెన్నిధి ధిషణకు
   తెలుగు సంస్కృ తాంగ్ల ములలొ దిట్ట
   పట్టు బట్టి నేర్చె పద్యాలు వ్రాయుట
   పండితులును కవులు భయపడంగ .

   Delete


  3. కల్లా కపటంబెరుగవు!
   బుల్లెమ్మయె రాజ్యలక్ష్మి బొమ్మాళి యనన్
   సల్లాపంబులు సామీ!
   కల్లచ్చున నరగదీసి కానుము రాజా !

   జిలేబి

   Delete
  4. జొన్నలగడ్డ వారు ! దయ జూపుడు , మిమ్ము స్వరాజ్య లక్ష్మి గా
   నిన్న ధృవీకరించి , రిక నిన్ను జిలేబిగ గాక , పేరుతో
   మన్నన సేయ బూనితిమి , మా గణనాధుని సాక్షి , యొక్కటై ,
   చిన్నలు నన్నలున్ బుథులు , చెల్లి నిహారిక మాట దీటుగా .

   Delete
  5. అమ్మా సామ్రాజ్య లక్ష్మీ దృవీకరింపుడు.

   Delete
  6. https://varudhini.blogspot.com/2013/11/blog-post_9.html?m=0

   Delete


  7. ఇప్పుడే విన్నకోట వారికి సమాధానము ంంంంంంంంంంంంంంంం

   మీ బ్లాగులో రాసేనండి లక్కాకుల వారు


   జిలేబి

   Delete

  8. నీహారికా గారి షెర్లాక్ హోమ్స్ ఇన్వెస్టిగేషన్ లో బొక్క వున్నది.

   It is elementary my dear Watson :)

   that ...   Cheers
   జిలేబి

   Delete


 6. సైకత శిల్పంబదిగో
  మా కరివదనునిది పూణె మహరాష్ట్రాలోన్
  ఆ కలువఱేడు చూడన్
  తా కనులను మూసి కొని సితారల గాంచెన్ :)

  జిలేబి

  ReplyDelete
 7. “కష్టేఫలే” శర్మ గారి శ్రీమతి గారు మొన్న ఆరవ తేదీన స్వర్గస్ధులయ్యారని ఈ రోజు వారి అబ్బాయి గారి ద్వారా తెలియవచ్చింది. కబురు విని చాలా విచారించాను.. శర్మ గారికి ఇంత పెద్ద వయసులో ఈ దెబ్బ తగలడం దురదృష్టకరం. శర్మ గారికి, వారి తదితర కుటుంబసభ్యులకూ నా ప్రగాఢ సంతాపం తెలియజేసుకుంటున్నాను 🙏.

  (నాకు అర్థం కాని విషయం ఒకటి. తెలుగు బ్లాగులోకానికి ఆ..భరణం లాంటి ఒక బ్లాగ్ వారికి ఈ సమాచారం ఆల్రెడీ అందిందట. వేరే విషయం సందర్భంగా శర్మగారి తాలూకు వారు ఈ సమాచారం కూడా అందించారని తెలియవచ్చింది. అలాగే గనక జరిగుంటే, మరి ఆ బ్లాగ్ వారు ఈ కబురు తదితర బ్లాగ్ మిత్రులకు ఎందుకు చెప్పలేదో ఆశ్చర్యంగా ఉంది. సమాచారం అందుకున్న ఆ బ్లాగ్ వారే తమ బ్లాగ్ లో ఒక వ్యాఖ్య పెట్టుంటే సరిపోయేది. ఎంతయినా శర్మ గారు చాలా సీనియర్ బ్లాగరూ, వయోవృద్ధులూ కదా. వారికొచ్చిన ఈ కష్టం గురించిన సమాచారం తెలిసినవారు ఆ మాట నలుగురు మిత్రులతోనూ పంచుకుంటే బాగుండేది 🙁.)

  ReplyDelete
  Replies
  1. శర్మగారికీ , వారి కుటుంబ సభ్యలకూ మనోధైర్యాన్నీ ,
   పరమపదించిన అమ్మగారికి ఆత్మశాంతినీ ప్రసాదించుమని
   భగవంతుని ప్రార్థిస్తున్నాను .

   Delete
  2. This comment has been removed by the author.

   Delete
  3. Very sad news. శర్మ గారికి, వారి కుటుంబానికి ఆ పరమేశ్వరుడు ఈ బాధాకరమైన పరిస్థితిలో తగిన స్థైర్యాన్ని ప్రసాదించాలని ఆ దేవుణ్ణి మనసారా కోరుకుంటున్నాను __/\__.

   Delete
  4. శర్మ గారికి, వారి కుటుంబసభ్యులకూ నా ప్రగాఢ సంతాపం తెలియజేసుకుంటున్నాను. అమ్మగారికి ఆత్మశాంతి కలగాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నాను.

   Delete
  5. Very sorry about it. Hope the family recovers from the pain soon.

   Delete
 8. గురువుగారికి , వారి కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలుపుతున్నాను. ధన్యురాలైన గురుపత్నికి నమస్సుమాంజలి
  🙏⚘🙏⚘🙏

  ReplyDelete
 9. Very sorry to hear that Sarmagari wife passed away. I wish Sarmagaru will recover soon and continue to bless us with his take on life's journey through his blog. Sarmagaru we are all with you in these trying times in your life's journey.

  ReplyDelete

 10. కష్టేఫలి వారికి

  Good Soul.

  May her soul rest in peace.


  జిలేబి

  ReplyDelete
 11. అందరి వ్యాఖ్యలు ఇప్పుడే చూస్తున్నాను. చాలా బాధగా అనిపిస్తోంది. వారికి మనోధైర్యాన్ని ప్రసాదించమని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను _/\_

  ReplyDelete
 12. వినాయక చవితి రోజున (13-09-2018) పండగ శుభాకాంక్షలు అంటూ “కష్టేఫలే” శర్మ గారి బ్లాగ్ లో ఎప్పటిలాగానే నా వ్యాఖ్య పెట్టాను (YVR గారు కూడా). శర్మ గారి సతీమణి గారి మరణవార్త తెలియక చేసిన పని అది. తలుచుకుంటేనే చికాకుగా ఉంది నామీద నాకే.

  ముందే సమాచారం అందుకున్న ఫలానా బ్లాగ్ వారు (ref :- పైన ఉన్న 14వ తేదీ నాటి నా వ్యాఖ్య) నలుగురికీ తెలియజేయకుండా నిర్లిప్తంగా ఉండిపోవడం వలన మాలాంటి వారికి జరిగిన అనర్థం ఇది అనుకోవాలి నా మటుకు నేను. ఏవిటో??

  ReplyDelete