Tuesday, December 30, 2008

మా తాత గారి వేమన శతకం

రాయ చోటి లో ఉద్యోగ రీత్యా ఉన్నప్పుడు మా కొలీగ్ ఒకరు కడప జిల్లా వేంపల్లె వాస్తవ్యులు నాతొ బాటు పని చేసే వారు. వారు పిలవడం తో ఓ మారు వారి గ్రామం వేంపల్లె కి వెళ్ళడం తటస్చింది. రాయచోటి నించి రాజంపేట వెళ్ళే మార్గం లో ఈ వేంపల్లె గ్రామం. దగ్గిరలోనే ఓ నది. పేరు పాపాగ్నిమేము వెళ్ళినది మంచి ఎండా కాలంలో. దీని దరిపుల్లోనే గండి వీరాంజనేయ దేవస్థానం కూడా ఉంది. ఈ వేంపల్లె గ్రామలో నేను మొట్ట మొదటి సారి Stalactites and stalagmites చూడటం జరిగింది. వేమన గారి ఊరు ఈ వేంపల్లె నా అని అడిగితె కడప జిల్లా ప్రాచుర్యం వేంపల్లె ప్రాచుర్యం వేమన గారు అక్కడే పుట్టారని కథా కమామీషు గా పిచ్చా పాటి గా చర్చిండం జరిగింది.
ఈ నేపధ్యం లో మా తాతగారు తన స్వహస్తం తో వేమన శతకం లో రాసుకున్న ఈ క్రింది పద్యం ప్రస్తావిస్తే నాకు తన్నులు తప్పడమే నేను చేసుకున్న పుణ్యం. చెప్పింది కూడా శుద్ధ బ్రాహ్మణ పరివారం నడి ఇంట్లో- అదీను ఆ నడి మద్యాహ్నం వారు బ్రహ్మాండం గా పెట్టిన భోజనం శుభ్రం గా లాగించిన తరువాత.
వేమన తన కాలానికి నాకు అర్థమైనంతవరకు ఓ revolutionary.

ఈ పద్యం నిజంగా మా తాతగారు స్వహస్తాలతో రాసుకున్నది. అంటే ఓ 60 లేక 70 సంవత్సరాల క్రిందట ఉండవచ్చు. ఇది వారి కాలపు పేరడీ కూడా అయి ఉండవచ్చు. కాబట్టి దయచేసి నన్ను తప్పుగా అనుకోవద్దు.
పద్యం:
పిండములను జేసి పితరులను తలపోసి
కాకులకు బెట్టు గాదిదలార
పియ్య తినెడు కాకి పితరుడెట్లాయరా
విశ్వదాభి రామ వినుర వేమ.

జిలేబి.

1 comment:

  1. అయ్యా! మీ తాతగారే కాదు. ఆ వేమన పద్యం అచ్చు పుస్తకాల్లో కూడా వుంది.
    ఆటవెలది:-
    పిండములను జేసి పితరుల తలబోసి
    కాకులకును పెట్టు గాడ్దెలార!
    పెంట తినెడు కాకి పితరుడెట్లౌనురా!
    విశ్వదాభిరామ వినుర వేమ.

    మీ తాతగారి చేతి వ్రాత ప్రతినే స్కేన్ చేసి పెట్టివుంటే మంచి త్రిల్లింగుగా వుండేది.

    ReplyDelete