Wednesday, May 3, 2017

కంద గర్భిత శార్దూల విక్రీడితము - ఒక పరిశీలనకంద గర్భిత శార్దూల విక్రీడితము - ఒక పరిశీలన


ఈ మధ్య చిత్రకవితా ప్రపంచం వారి బ్లాగులో చదివిన కంద గర్భిత శార్దూల విక్రీడితమ్ (శార్దూల పద్యం లో కంద పద్యం యిమిడి ఉండటం) ఉదాహరణ చదివాక కొంత జోష్ కలిగింది; ఎట్లాగూ శార్దూలం కందం సమాంతరంగా ఔత్సాహికంగా సాధన (అనుకుంటా :)) చేస్తున్నాం కాబట్టి రెండింటిని కలిపి గట్టి కావేటి రంగా అందా మనుకుని మొదలెడితే కొన్ని జిలేబులు తయారైనాయి. వాటినన్నిటి ని  ఒక్క చోట పెడదామనే చిరు ప్రయత్నం.


శార్దూలం లో కందం ఇమడాలంటే -

మొదటి, మూడవ  పద్య పాదం లోని మొదటి అక్షరం నించి మొదటి మూడవ పాదం కందం వస్తుంది.
రెండు, నాలుగు పద్య పాదం లోని రెండవ అక్షరం నించి రెండు మూడు పాదం కందం వస్తుంది  (గుడ్డి గుర్తు :))

ఉదాహరణ

ఏలన్ బో రుచిరమ్ములౌ పురమునన్నేలన్ భళారే యనన్
గీ లాలమ్ములజూడనేల ! లవ యగ్గింపుల్లటన్ గానకన్
నేలన్ కాలటు జారనౌ పడతుల్ నేజెల్ల! నవ్వుల్ గనన్
బో,లాలిత్యముగా లివన్ బలములున్ బోయెన్ రొ దుర్యోధనా!

---

ఏలన్ బో రుచిరమ్ముల
లాలమ్ములజూడనేల ! లవ యగ్గింపుల్ !
నేలన్ కాలటు జారన
లాలిత్యముగా లివన్ బలములున్ బోయెన్


చీర్స్
జిలేబి


 

14 comments: 1. క గ శా వి

  ధారాళంబుగ జేయ సిద్ధి బడయన్ ధామంబిదేనమ్మ నో
  రారా రావము జేయు సూవె రసికా రావే శుభమ్ముల్గనన్
  ఏరాలంబు జిలేబు లూర వరమై పేరోలగంబుల్ భళీ
  రా రారాయని బిల్చు నిన్ను రమణీ రావే శుభాంగీ చెలీ !


  --

  ధారాళంబుగ జేయ సి
  రా రావము జేయు సూవె రసికా రావే !
  ఏరాలంబు జిలేబులు
  రారాయని బిల్చు నిన్ను రమణీ రావే !

  జిలేబి

  జిలేబి

  ReplyDelete
 2. జిలేబీగారు,
  మీ‌ ప్రయత్నాలు అభినందనీయం. కాని ప్రతిప్రయత్నమూ‌ ప్రచురణార్హం కాదన్న సంగతి మీరు గుర్తెరగాలని నా ఆకాంక్ష. ఒక సారి ఎవరో విశ్వనాథవారిని అడిగారు - ఇప్పటికి మీరెన్ని పద్యాలు వ్రాసి ఉంటారూ అని. దానికి ఆయన ఇచ్చిన సమాధానం చూడండి. ప్రచురించిన ఒక నలభైవేలుంటాయేమో. వ్రాసి చింపేసినవి మరొక యభైవేలపైననే ఉంటాయి అని. ఆయన ఎందుకలా అన్నారో/చేసారో ఆలోచించి గ్రహించ ప్రార్థన. సామెత చెప్పినట్లు ఏదివ్రాసినా ఎక్కడో అక్కడ అచ్చేసి వదిలేయటం సరైన విధానం కాదు. అభ్యాసదశలో వ్రాసినవన్నీ నిజానికి హెచ్చుభాగం సిల్లీగా ఉంటాయి. పెద్దల సహాయంతో తప్పులు దిద్దుకోవటం ద్వారా పురోగతి కలుగుతుంది. అక్షరాలను గణబంధాల్లో ఇరికించటమే కవిత్వం అని భావించే పక్షంలో ఎవరికీ ఎవరూ ఏమీ చెప్పలేరు. స్వస్తిరస్తు.

  ReplyDelete


 3. ధన్యవాదాలండీ శ్యామలీయం వారు

  ఈ టపా పెట్టిందందుకే నెనర్లు

  బ్లాగున్నది దేనికయా
  ఓ గురుడా మజ జిలేబు లూరన్ గదయా !
  మాగూడిది పద్యములన్
  సాగింపగ యత్నముల్ పసగన తలమహో !

  జిలేబి

  ReplyDelete

 4. క గ శా వి

  ఓమా శ్యామల రాయ రస్తు మకరందోత్సాహమంతే! ధమా
  కా! మామత్తమిదేనయా సుమములై గానన్నిటన్ పద్యమున్
  స్వామీ యత్నమిదౌ; మరింత గరిమన్ సాధింపగన్నౌ సయా
  టా; మేమిచ్చట జేయ సూవె మెకమాటంబై జిలేబుల్ గనన్ !

  ---

  ఓమాశ్యామల రాయర!
  మామత్తమిదేనయా సుమములై గానన్
  స్వామీ యత్నమిదౌ మరి
  మేమిచ్చట జేయ సూవె మెకమాటంబై !

  ஜிலேபி

  ReplyDelete

 5. క గ శా వి

  సాహోరేయని సాగు ముచ్చటగనన్ సాహిత్యమౌ పాడియా
  వౌ! హాహుండటదేవదూత హవణీ ! పారించుమా పాదముల్
  బాహాటమ్ముగ వచ్చు నున్నతి భళా పద్యంబులై సాగు న
  మ్మా!హాహారవముల్ జిలేబి హసనమ్మౌనౌ సఖీ వీడుమా !

  ---

  సాహోరేయని సాగుము
  హాహుండటదేవదూత హవణీ ! పారన్
  బాహాటమ్ముగ వచ్చును
  హాహారవముల జిలేబి హసనమ్మౌనౌ !

  ಜಿಲೇಬಿ

  ReplyDelete


 6. క గ శా వి


  పుంసాంమోహన రూప ముత్యపు జిగిన్ పుంఖానుపుంఖమ్ముభా
  సీంసంసక్తితదేవరూప సఖుడై సీతా సమేతంబుగా
  సంసారస్థితుఁడై, యతీశ్వరుడు పూజా భాజనుండయ్యెడు
  న్నంశాంశాశ్వతుడౌ వృషాంక సమమై నాడౌ రమానాధుడున్

  ---
  పుంసాంమోహన రూపము
  సంసక్తితదేవరూప సఖుడై సీతా
  సంసారస్థితుఁడై, యతి
  శాంశాశ్వతుడై వృషాంక సమమై నాడౌ !

  జిలేబి

  ReplyDelete 7. క గ శా వి


  ఆకాశమ్మున మబ్బులన్ గనుచు స్వప్నావస్థ లో యేలన
  మ్మో! కాకమ్మ కబుర్ల నీవు గయినన్ ముంతన్విడంగన్తగు
  న్నౌ కీలాలము లొల్కయమ్మ రమణీ? నాట్యమ్ము లేలన్ సుధా
  ర్నాకో! కావకమౌ జిలేబి కొమరారౌనో ?మదాలాపి లే !

  ---

  ఆకాశమ్మున మబ్బుల
  కాకమ్మ కబుర్ల నీవు గయినన్ ముంత
  న్నౌకీలాలము లొల్కయ
  కో! కావకమౌ జిలేబి కొమరారౌనో ?

  జిలేబి

  ReplyDelete


 8. క గ శా వి

  కౌసల్యాయని వీరుడున్ననుజుడున్ కాకుత్స్థ వంశస్థుల
  గ్గో!సాసుళ్ళట యూతగాన సరసన్ క్రోతుల్లటన్రాళ్ళ నె
  ల్లా శంఖిన్నురుకన్ సరాతి వలెనౌ లాగించె లంకేశ! రా
  జా! సాసేతును గట్టి నారు ఝకటా సాగున్నికన్గానురా !

  ---

  కౌసల్యాయని వీరుడు
  సాసుండట యూతగాన సరసన్ క్రోతు
  ల్లా శంఖిన్నురుకన్ సర
  సా!సేతువు గట్టి నారు ఝకటా సాగున్ !


  జిలేబి

  --

  శ్రీ కంది శంకరయ్య ఉవాచ

  కంద గర్భ వృత్తాన్ని బాగానే వ్రాశారు. కాని చదువుతుంటే ఇది తెలుగు కాక మరేదో భాష అనిపిస్తున్నది. పద్యం అర్థమయితే ఒట్టు! :)

  మొత్తము జిలేబి మయము :)

  ReplyDelete
  Replies

  1. కౌసల్యాయని - శ్రీరాముడు
   వీరుడు అనుజుడు లక్ష్మణుడు
   కాకుత్స్థ వంశస్థులు
   అగ్గో -అదిగో
   సాసుడు - విలుకాడు
   ఊత - సాయం
   శంఖి - సముద్రము
   ఉరుకన్ - దాటన్
   సరాతి - ఒక తెర లా ( వానరులు రాళ్ళని ఒక తెరలా వేసి ) సాసేతువు - సేతువు లాంటిదానిని

   ఝకటా - జగడము

   రాముని, లక్ష్మణుని సాయంతో వానరులు రాళ్లతో వారధి కట్టి యుద్ధానికి బయలు దేరారు
   ( ఈ పాటి ఒక వాక్యం వ్రాయడానికి అంత తల క్రిందుల తపస్సు చేయాలా ! జిలేబి కమాల్ హై ;))


   జిలేబి


   Delete
  2. కం. పద్యం బగు గద్యంబగు
   హృద్యంబుగ నుండవలయు నెంతే శ్రమతో
   పద్యంగణంబుల పదముల
   విద్యావిలసనము పేర పేర్చ దగదయా.

   Delete


 9. విద్యారంభము జేయ వీడుట జిలేబీవల్ల గాదోయ్ కవీ
  సద్యోగంబిదియే సుమా సరసనే సాహిత్యముల్నేర్వనౌ !
  పద్యంబైనను మాటలైన గురుడా పంకావలెన్ ద్రిప్పుచున్
  హృద్యంబైనటి రీతిగాన నుడులన్ నృత్యంబులాడించెదన్ :)


  జిలేబి

  ReplyDelete


 10. క గ శా వి

  హా సీతా! యన రావముల్ వనపు హాహాకారముల్ గానుమ
  య్యా, శాసించెను గోముగాను శరమై యా రన్, పతిన్ రోయ గ
  న్నా సౌమిత్రిని వాసిటన్ననుజుడా, నాధున్గనన్ వెళ్ళు మ
  య్యా సాసించుము కమ్ముదెంచు సధియై యావద్బలమ్ముల్ గనన్

  ---

  హా సీతా! యన రావము
  శాసించెను గోముగాను శరమై యార
  న్నా సౌమిత్రిని వాసిట
  సాసించుము కమ్ముదెంచు సధియై యావన్

  జిలేబి

  ReplyDelete
 11. నిన్న లక్కాకుల వారిచ్చిన శార్దూల కిక్కు,
  హరిబాబు గారిచ్చిన కందపు జోషు లతో
  హుషారొచ్చి, చాన్నాళ్ళ తరువాయి

  క గ శా వి !


  శార్దూలవిక్రీడితము

  చానా బాగుగ యుండెనయ్య గనుమీ సాహిత్య జిజ్ఞాసల
  న్నా నానా విధ యత్నముల్గన హరీ, నారిన్ సమాళింపనౌ,
  తానాడన్ మది యాడునయ్య పదముల్ తావిన్ గుభాళించు తా
  మై, నానాటి సయాటలన్ గనవయా మాయాద్యుతిన్నీవిటన్ !

  ****

  కందం

  చానా బాగుగ యుండెను
  నానా విధ యత్నముల్గన హరీ నారిన్
  తానాడన్ మదియాడును
  నానాటి సయాటలన్ గనవయా మాయన్ !


  చీర్స్
  జిలేబి

  ReplyDelete
  Replies
  1. అమ్మో ! అమ్మో ! అమ్మో !
   అమ్మోరి హుషారు చూడ , ఆగదు , శార్దూ
   లమ్మున కందం బిరికె గ
   దమ్మా ! ఈ కళలు గూడ తవరికి కలవా ?

   Delete