Saturday, August 19, 2017

మాలతి కథ



మాలతి పెళ్లీడుకి వచ్చింది.

తల్లి -లెక్ఖ ప్రకారం అమ్మాయి పెళ్లి వేగిరమయి పోవాలి.

ఏదో ఒక అయ్య చేతిలో దాన్ని పెడితే - దాని జీవితం సాగి పోయినట్టే లెక్ఖ.

అయ్య కి కూడా ఆతురత.

అమ్మాయి పెళ్లి ఎంత బిరీన అయి పోతే అంత మంచిది.

ఏళ్ళు పై బడే కొద్దీ అమ్మాయి పెళ్లి తను చెయ్యాలనుకున్నా అయ్యే ఖర్చులు తనని చెయ్య నివ్వవు.

సో, అమ్మాయి పెళ్లి వెంటనే అయి పోవాలి.

' అయ్యా నే పై చదవులకి వెళ్తా అన్నది మాలతి.

అమ్మ గుండె బరువయ్యింది. ఈ కాలం పిల్లలో ఇది ఎదురు చూసిందే - కాని తన మాలతి కూడా ఇలా అంటే ?

 ' పిచ్చి పిల్లా పై చదువులకి వెళ్లి ఏమి చేస్తావే ? పెళ్లి చేసేసు కో అంది.

 మాలతి పట్టు బట్టింది. గవర్నమెంటు చదువు చెప్పిస్త దయ్యా అంది. .

'ఎన్నేళ్ళు ?'

ఓ పాటి నాలుగు అంతే అంది మాలతి.

అయ్య నిట్టూర్చాడు. ఖర్చుల లెక్క ఊహించుకున్నాడు. ' గవర్నమెంటు ఇస్తాది లే అయ్యా' అంది మాలతి

నాలుగేళ్ళు తిరిగాయి. అమ్మాయి పట్నం లో ఇంజనీరింగ్ ముగించింది.

అమ్మాయ్ - ఇప్పుడు చేసేసుకోవే పెళ్లి అంది అమ్మ

'నాకు స్కాలర్షిప్ వచ్చింది అయ్యా' అంది మాలతి ' పై చదువులకి అమెరికా వెళ్తా అన్నది.


'దాని కేమి లే తల్లీ - ఆ పెళ్లి చేసేసుకుని వెళ్ళు ' అంది అమ్మ.


మాలతి నవ్వింది. అయ్య ఏమి జేప్పలేక పోయాడు.


ఎన్నేళ్ళు?

ఓ పాటి నాలుగు అంతే అంది మాలతి.

ఏళ్ళు తిరిగాయి. అమ్మి పై చదువులు అయింది.

ఆ పై చదువులకి వెళ్తా అన్నది మళ్ళీ -

ఈ పారైనా  పెళ్లి చేసుకో అంది అమ్మ.

అమ్మ తల నెరవడం గమనించింది మాలతి.

'లేదే - పై చదువులకి అక్కడే ఒప్పుకున్నా' అంది మాలతి ముభావంగా.

ఇంకా ఏమి పై చదువులే అమ్మీఇట్లా చదూతూ పోతా ఉంటే,  - నీకు మొగుడు చిక్కాలంటే - నీకన్న పై చదువులు చదివినాడు కావాలి కాదే మరీ? అంది తల్లి.

అయ్యా నువ్వైనా చెప్పు అంది అమ్మ .

ఎన్నేళ్ళు ? అడిగాడు అయ్య.

ఇది పై చదువులు అయ్య- రిసెర్చ్ తో బాటు - ఫెలోషిప్ అంది మాలతి.

మాలతి చెప్పింది తనకి అర్థమైనట్టు తలూపాడు అయ్య. అంటే ఏంటో తెలీదు. కాదనడ మెందుకు ?

ఇట్లా జరిగే నాలుగేళ్ల ప్రహసనం లో - ఓ మారు మాలతి తీరిగ్గా ఓ రోజు అద్దం ముందు నిలబడి ఉంటే  - ధగ ధగ మెరిసే నెరిసిన తల వెంట్రుక గమనించింది.

ఓ మారు ఆలోచింది తన కి ఎన్ని ఏళ్ళు? అని - దాదాపు యాభై దాపుల్లో ఉండవచ్చు అనుకుంది.

ఆ రోజు - తనతో బాటు తీరిగ్గా రిసెర్చ్ చేస్తున్న జోసెఫ్ - తనకీ ఓయాభై దాపుల్లో  వయసు ఉండవచ్చేమో - తనతో ' మనమిద్దరం పార్ట్ నర్స్ - అవుదామా అంది.

తలూపేడు జోసెఫ్ కూడా- తనకీ ఓ తోడూ నీడా ఉంటే  మంచిదే అనుకున్నాడు.

ఈ మారు అయ్యని అమ్మని కలవడానికి జోసెఫ్ ని వెంటేసు కొచ్చింది మాలతి.

ఎవరే అంది అమ్మ గుస గుసలాడుతూ. నేనితన్ని పెళ్లి చేసుకోబోతున్న అంది మాలతి - లైఫ్ పార్ట్ నర్స్ ని అమ్మకి ఎలా చెప్పాలో తెలియక.

అయ్య చూసాడు - నెరిసిన జుట్టు అమ్మాయి - అంతకి మించి నెరిసిన జుట్టు అల్లుడికి - ఈడు జోడు బాగానే ఉంది కదా అనుకున్నాడు. - తండ్రి మనసు - నిట్టూర్చడానికి తావులేదు- ఇంత కాలం తరువాతైనా అమ్మాయి పెళ్లి చేసుకుంటా అన్నది కదా అనుకున్నాడు.


అమ్మ - మురిసిపోయింది. ఆవిడ బోసినవ్వు తో - గుస గుస లాడుకుంటున్న వాడ జనాల్ని గదమాయించింది- మా మాలతి కి కాబోయే మొగుడు అని చెబ్తూ.


పదహారులో క లలు కన్న స్వప్నం అరవై లో నైనా  నెరవేరిందని తల్లి హృదయం సంతోష పడింది. ఎంతైనా తల్లి హృదయం కదా మరి. !


మాలతి లాంటి మగువల చీర్సు కు
చీర్స్
జిలేబి

10 comments:

  1. కథలోని కమామిషు జె
    ప్పెద నాండాళ్ళూ ! చదువులు పెళ్ళిళ్ళకు నే
    విధముగ నడ్డము కా కూ
    డదు , జోసెఫు దొరక డేమొ ! డాబుకు పోగా ?

    ReplyDelete


  2. For all those ardent lovers of Chandamaama , the full serial of Ramayana as was published in the magazine put together as one PDF file.

    Enjoy Happy Reading !

    https://archive.org/details/Ramayana_201708

    Cheers
    Zilebi

    ReplyDelete
  3. అమూల్యమైన లింక్ 👌. ధన్యవాదాలు జిలేబి గారు.

    ReplyDelete
  4. ఆలోచింప జేసే మంచికథ. అభినందనలు జిలేబీ గారికి. (పిచ్చి పద్యాలను కూర్చటం ఆపేసి మరీ) యిలా మంచిమంచి కథలు వ్రాయండి దయచేసి.

    ReplyDelete
  5. ఈవేళ నేనూ ఒక కథను వ్రాస్తాను. (అనంతానంతానంతానం..ఆఫీసుపని మధ్యలో) ఎలాగో సందు చూసుకొని.

    ReplyDelete
    Replies

    1. పిచ్చి పద్యాలదా ? జిలేబి దా ? :) లేక ???

      జేకే
      నెనర్లు
      జిలేబి

      Delete

    2. శ్యామలీయం వారు_

      ఇంతకీ కథ ఎక్కడండీ ? కనిపించట్లే బ్లాగులో ?

      జిలేబి

      Delete
  6. అయ్యోరామా. ఇంకా ఇంటికే చేరందే!

    ReplyDelete
    Replies

    1. మీ మేడం గారికి నారదా అనేసా ఇట్లా మీరు ఆఫీసు లో కతలు గట్రా రాస్తున్నారనిన్నూ , పనులు చేయటం లేదనిన్నూ :)

      జిలేబి

      Delete
    2. అగ్గిపుల్ల గీసారు కాని వెలగలేదు లెండి. 'కథను వ్రాస్తాను' అన్నాను కాని ఆఫీసులో‌ కూర్చుని అనలేదే. ఆమాట వ్రాసినప్పుడు ఆరోజుకు దుకాణం‌కట్టేసి ఇంటికి బయలుదేరుతున్నాను - ఏడు దాటింది మరి. ఇంకా ఇంటికి చేరలేదని వర్తమానం ఇచ్చేసమయంలో నేను గృహోన్ముఖుడనై దారిలో కేబ్‌లో ఉన్నాను. ఇప్పుడు రా.8:40ని. అఫీసులో‌ కతలు గిలుకుతున్నానని ఎలా పితూరీ చేస్తారో మీరు. ఆఁయ్? మీ గడియారం వేరూ‌ భారద్దేశంలో గడియారం వేరూ‌ అని మరచిపోయి పప్పులో కాలేసారు. సరేనా? ఇప్పుడు వినండి జాగ్రత్తగా. ఇంకా బండెడు పనుంది నాకు. ఐనా ఎలాగో అలా వ్రాస్తాను సరేనా. అన్నట్లు పనెగ్గొట్టటం‌ మా యింటావంటా లేదు. రేప్పొద్దున్నకి పూర్తిచేద్దా మనుకున్న వ్యవహారాలూ మహారాజులాగా పూర్తవుతాయి. ఇంత రగడా చేసి నా కథ కాస్తా చదివి వ్యాఖ్యపెట్టకపోతే బాగుండదు మరి. సుబ్బరంగా మంచి వచనంలో ఐతేనే ఆకామెంటుకు మోక్షం వస్తుంది - దురదకందాలకు చోటులేదని గమనించ ప్రార్థన! లోకాస్సమస్తా స్సుఖినోభవంతు.

      Delete