కోయంబేడు మార్కెట్లో కూనలమ్మ :)
ఏమండీ అయ్యరు వారు ఇవ్వాళ కోయంబేడు మార్కెట్ కెళ్దామా? అడిగింది జిలేబి.
అయ్యరు గారు ఓసారి ఎగాదిగా జిలేబి ని చూసారు.
మడిసార పట్టు చీర లో ధగధగ భుగభుగ లాడి పోతూ కనిపించింది జిలేబి.
ఏవిటి ? ఈ లాగే ? మడిసార లోనే ?
ఓసారి తన వైపు చూసుకుంది జిలేబి. ఏం ఇట్లా వెళ్తే ఏమంటా ?
ఏమీ లేదు లే గొణిగారు అయ్యరు గారు.
అయినా జిలేబి, కోయంబేడు మార్కెట్టు కు కాస్ట్యూమ్ కూనలమ్మ మడి సార మామి వేషం బాగోదేమో ? మళ్ళీ సందేహం అయ్యరు గారికి.
వెళ్దాం పదండి - బస్సులో అంది జిలేబి
ఏంటీ మద్రాసు బస్సులో నా ! గుండె గుభిల్లు మంది అయ్యరు గారికి ఇదేమి ప్రారబ్ధ కర్మ రా బాబోయ్ అనుకుంటూ .
అవునండీ బస్సులో నే !
హతోస్మి !
కోయంబేడు మార్కెట్ లో కూనలమ్మ దిగబడింది.
చుట్టూతా చూసింది.
జన వాహిని ; జన వాహిని.
కు కు కూ అంది.
వెంటనే ఓ తుంటరి పిల గాడు - విజిల్ వేసి - పాప్పాత్తి అమ్మ వందిరుక్కా డా అన్నాడు .
గుర్రు గా చూసింది కూనలమ్మ !
కత్తిరిక్కా ఎవళో ?
వాడో ధర చెప్పాడు.
అమ్మి మరో ధర చెప్పింది.
మధ్య లో అయ్యరు గారు వద్దే జిలేబి ఎక్కువ బేర మాడ బాక! అన్నాడు భయ పడుతూ.
అయ్యరు గారు అనుకున్నట్టే అయింది.
ఇదో - పొమ్నాట్టీ - వాంగినా వాంగు - ఇల్లేనా .....
వాడి పై జిలేబి గయ్యమని మళ్ళీ ఎగురుదామను కునే లోపల్నే అయ్యరు గారు డేమేజ్ కంట్రోల్ కోసం జిలేబి కో ణిసిధాత్వర్థం సమర్పించే సు కోవడం తో
మార్కెట్ ఉలిక్కి పడింది.
పాప్పాత్తి యమ్మా ఎంగయో పోయిడిచ్చు డా అంటూ మూర్చ పోయాడా అబ్బాయి
కోయంబేడు మార్కేట్టా మజాకా :)
చీర్స్
జిలేబి
(1). "మడిసార" యనగా నేమి?
ReplyDelete(2). ఈ టపాలో వాడిన తమిళపదాలన్నిటినీ తెలుగులో అనువదించి ఇక్కడ వ్రాయాలని కోరుతున్నాము అధ్యక్షా ☝️.
(మీ టపాల కోసం ఆంధ్రభారతి తో పాటు తమిళభారతి (లేదా తత్సమానమైనది) కూడా పక్కన పెట్టుకోవాలో ఏవిటో 🙁?)
అయినా ఆ తరం మద్రాసు జనం కూరగాయల కోసం ఎక్కువగా రంగనాథన్ స్ట్రీట్ కి (టి.నగర్) వెడతారనుకున్నానే!? 🤔
Deleteవికో వారు,
అస్కు బస్కు !
రాబోయే కాలం లో ఆంధ్ర 'బారతి' లో అవన్నీ వచ్చేస్తయి
బాషా ది నోట్సవం
జిలేబి
నన్నేనా? "వికో" ఏమిటి 😡? మరాఠీవాళ్లు తయారు చేసే ఓ టూత్-పేస్ట్ పేరు లాగా, మీ తమిళనాట ఓ రాజకీయ నాయకుడి పేరుకి దగ్గరగా అనిపించేలాగా. నో, నేనొప్పను, ఒప్పనంతే. అసలు సిసలు తెలుగువాడిని☝️.
Delete
Deleteవికోన అంటే బాగుంటుందాండి ? జిలేబి లా వికోన కూడా జగణమే. సరిపోతుందా ?
వినుమోయ్ వికోన పలుకుల
ఘనుడౌ పంచదశలోక కామింట్ల జిలే
బి,నవనవోన్మేషణమున్
మనసున గాంచిన మనుజుడు మరకత మణియౌ !
జిలేబి
కత్తిరిక్కా ఎవళో అంటే
ReplyDeleteవంకాయ ధరెంతో అంటా
మరింకేం బోధపడదే తంటా
ఓ కూనలమ్మా
Deleteరావమ్మ మా కూనాలమ్మ !
అత్రిజాతుడు, అట్లకాడల
కత్రి పండుల, కాడ లాటల
చిత్రి కమ్ముల చిక్కు కొనియె !
జిలేబి
చెన్నై చంద్రమా...మార్కెట్ పోయిడిస్తివా ఎట్టెట్టా, రొంబా కష్టమైడ్చీ హా హా :)
ReplyDeleteచెన్నై చంద్రమా...మార్కెట్ పోయిడిస్తివా ఎట్టెట్టా, రొంబా కష్టమైడ్చీ హా హా :)
ReplyDelete
Deleteపూర్వాషాడ గారు,
మార్కెటు పోయిడిస్తే సినబ్బలు డమాలు అద్గదీ కత :)
నెనర్లు
జిలేబి
జిలేబిగా బస్సెక్కి కూనలమ్మగా బస్సు దిగిన వైనమేమిటయ్య వైనతేయా?😊
ReplyDelete
Deleteవై వీ యారు గారు,
కుకు కూ వైన మయ్యా !
జిలేబి
హసి దుగ్ధానన కూనలమ్మ మరి కోయంబేడు మార్కెట్టులో
ReplyDeleteకుసుమాస్త్రాంచిత కోక జుట్టి బసులో కూరల్ గొనన్ బోయెనా
పసి కుర్రాళ్ళకు కాయ పాయసములన్ పంచంగబో బోయెనా
ణిసిధాత్వర్థపు జుంటి తేనియల పానీయంబుకై బోయెనా .
Deleteణిసిధాత్వర్థము లన్సమీచి మనసున్నింపాదిగన్జేసి, తా
పసియై యెచ్చిరునయ్యరో!మనసునన్ పాటించు వైరాగ్యమున్,
వసపిట్టల్వలె పల్కు భార్య మదిలో వర్దిల్లు సావంతుడౌ
పసివా డయ్యరు గానుమయ్య సుకవీ , పక్కా జి లేబీయమై!
జిలేబి
ReplyDeleteఓ!సరసి! పెనిమిటికి గద
మీసము లందమ్ము! సతికి మెట్టెలకంటె
న్నాసంగంబేది గలదు
కూసము లాగి మగ వాడి కూర్చము తివియన్ !
జిలేబి
ReplyDeleteమిరియాల వారి యమ్మా
యి,రివ్వున నటునిటు తిరిగి యింగువ వారల్
చిరుబురుల గాంచి ముదమున
గురువా! రమ్మని పిలువఁగఁ గుపితుండయ్యెన్!
జిలేబి కూనలమ్మ :(
జిలేబి
ReplyDeleteఅర రే! తప్పుల జేయన్
చురచుర లాడుచు జిలేబి చురుకులు వేయన్,
బరబర లాగుచు కోర్టుకు
గురువా! రమ్మని పిలువఁగఁ గుపితుండయ్యెన్
జిలేబి
ReplyDeleteశ్రీ యన్యగామికి! జిలే
బీయమ్మకు కూనలమ్మ బిగువులు తెలియవ్ :)
సోయగముల లే మ శుభాం
గీయము ! కుకుకూ గురువుల కేకే కేకా :)
జిలేబి
ReplyDeleteకవితల్వ్రాయన్నాహ! చ
దివి యహహో యందురోయి తెలుగున పద్య
మ్మవి చేసుకున్న ఖర్మ, చె
లి, విరివిగ గనపడ సీ వెలివెలి తొలగుమీ :)
జిలేబి
ReplyDeleteకత్తి మహేశుడు పవనుడి
గుత్తే దారుల భయమ్ము కుత్తుక కనియెన్ !
చిత్తూరోడా! ఖత్తులు
కొత్తేమియు కాదు నీకు కుదుటల్లేలా !
జిలేబి
ReplyDeleteపథకమ్ముల పట్టి మగడి
కథలన్ సరిజూడు కవన కంజదళముఖీ !
విధవిధముగద జిలేబీ
పథమున నీవిచ్చు కిక్కు పల్కుల పాగుల్ !
జిలేబి
ReplyDeleteగోవిందా ! గోవిందా!
మా విఘ్న వినాయకా! సమాళించుమయా
యీ వరుణుడి తీవ్రతలన్
ఠావులు దప్పిరి మనుజులు ఠాణా ముంబై!
జిలేబి
ReplyDeleteసన్యాసిని యైనను బో
విన్యా సమ్ముల నయిటము విధిగా జేతున్
కన్య హయాతౌ పల్కుల
జన్యతలమ్మున జిలేబి జమిలిగ జేయున్ !
జిలేబి
ReplyDeleteడీమానిటైజు చేసితి
మీ! "మోడి" యెఫెక్టిదే సుమీ ! ఓ జైట్లీ
మీ మాటల తీరదురౌ
కామా ఫుల్స్టాపు లేక గనుడోయ్ వృద్ధిన్ !
జిలేబి
ReplyDeleteఎంతటి పరువంబైనన్
చెంతన యాంగన పదమును చేర్చ కుదురదోయ్ !
వింతైన సంధులు గదా
కొంతైనను సాయము సమ కూర్చవు సుమ్మీ :)
జిలేబి
ReplyDeleteఓలున్నాలూ ! ఓలూ
లాలీ ! లులలా లలేల ? లల్లల ? లాలా ?
లోలా లలోల ? లాలో?
లీలల లుల్యా ? ల ! లోల ! లిలలా లిలలీ :)
జిలేబి
ReplyDeleteచెండులు విసిరెడి వేళన
నిండగు పున్నమి సమయము నిమ్మళముగనన్
గండర గండడి నిగనుచు
పండుగనాఁ డేల నాకు పాఁత మగఁ డనెన్
జిలేబి
ReplyDeleteమా కూనలమ్మ మళ్ళీ
లోకాన పడెను జిలేబులో యమ్మ జిలే
బీ! కాణాచి గురువులౌ
బాకా వూదుదురు మేలు పదముల నీకున్ :)
జిలేబి
ReplyDeleteఓ కూనలమ్మ! కబ్జా
యై కాణాచిగ జిలేబి యైనా వా య
మ్మో! గడుసుదాని విగదా !
వా! కూ సింతై న సిగ్గు వలయున్ గదుటే ?
జిలేబి
కోయంబేడు చేపల మార్కెట్లో జిలేబమ్మా :) మడిచార కట్టుకుని వహ్వా ఎన్నాడా?
ReplyDelete
Deleteమత్స్యగంధి :)
మెడ్రాసు కోయంబేడు కూరగాయల మార్కెట్ కెప్పుడైనా వెళ్లారా మరి :)
జిలేబి
< "కోయంబేడు చేపల మార్కెట్లో జిలేబమ్మా :) మడిచార కట్టుకుని వహ్వా ఎన్నాడా?"
ReplyDeleteశర్మ గారు గట్టివారే, 1990ల నాటి ఓ హిట్ పాట ట్యూన్ లో వ్రాసారే పైన వ్యాఖ్య 👌👏🙂.