Tuesday, March 3, 2009

గూగుల్ అయ్యవారు - యాహూ అమ్మవారు

ఈ మధ్య మా అక్కయ్య అబ్బాయి (అదేదో దేశం కాని దేశం లో పని చేస్తున్నాడు - పేరేదో చెప్పాడు కాని నోట్లో తిరుగాడటం లేదు-) ధబీల్మని ఓ రోజు ప్రత్యక్షమై కథా కమామీషు గా ఈ గూగుల్ అయ్యవారు- యాహూ అమ్మవారి గురించి చెప్పాడు.

ఏమిటోయ్ మీ దేశం లో జనాలు ఎట్లా చదువు సాగిస్తున్నారు? అని అడిగితె అదేముంది ఎ ప్రశ్న కైనా గూగుల్ గాని యాహూ చేస్తేగాని సరిపోతుంది - చాంతాడంత ఆన్సర్ రాయవచ్చు అని కొట్టి పారేసాడు.

అదేమిటి విడ్డూరం ఇంక పిల్లకాయాకి ఎలారా విజ్ఞానం వస్తుంది? అని అడిగితె - విజ్ఞానం ఎందుకె పిన్నమ్మ - ఎ చదువైన "ధనం మూలం ఇదం జగత్" కొరకే గదా గూగుల్ అయ్యవారు యాహూ అమ్మవారు ఇంటింటా జ్ఞానాన్ని క్షణాల్లో ఇచీస్తుంటే - జ్ఞానాన్ని సముపార్జించుకుని లేకుంటే మూటకట్టుకుని ఏమి చేస్తాము ? అని శివాజీ బాస్ లెవల్లో అయిన ఈ జ్ఞానం ఇవన్ని మనం పోయేటప్పుడు మనతో బాటు వస్తాయా అని వేదాంతము వేరే చెప్పాడు!

అవురా ఈ జమానా కుర్రాళ్ళు ఏమి ఫాస్ట్ రా బాబోయ్ అని బుగ్గ నొక్కేసుకున్నా! అంటా విష్ణు మాయ గాకుంటే మరేమీ తన్టారూ?

మీ జిలేబి.

2 comments:

  1. గూగుల్ అయ్యవారు - యాహూ అమ్మవారు
    బాగుంది. అయినా గూగుల్ అయ్యవారెందుకయ్యారు,యాహూ అమ్మవారెందుకయ్యారు.

    ReplyDelete