ఈ అరవం వాళ్ళకి తెలుగోడిని చూస్తె అదో మజా. ఈ చిత్తూరు వాళ్ళలో చాలా మంది తమిళులు ఉండడం చేత వీళ్ళకి తమిళ నాడు తో బంధుత్వం రీత్యా రాక పోకలు చాలా ఉండటం తో మద్రాసు తెలిసనంతగా హైదరాబాదు గాని మరి ఎ ఇతర ఆంధ్ర దేశంలో ప్రసిద్ధి చెందిన ప్రదేశాలు తెలియక పోవడం అన్నది ఆ కాలం లో మాట. ఇప్పుడు కూడా ఇదేనా అన్నది నాకు తెలియదు. మా మిత్రుడొకడు అరవం వాడు - మాతో బాటే తెలుగు చదివి మా కన్నా తెలుగులో ఎక్కువ మార్కులు తెచ్చుకున్నవాడు - అరవం మాట్లాడం మాత్రమే తెలిసినవాడు - ఎందుకంటే ఈ చిత్తూరు అరవం వాళ్ళకి మాత్రు భాష అరవమైన కూడా ఆంద్ర దేశం లో ఉండటం వల్ల తెలుగు నేర్చుకునేవాళ్ళు కాబట్టి- సరాసరి మూడు నెలలకోసారైన తమిళనాడు కి అంటే దరిదాపుల్లో నున్న కాట్పాడి గాని మద్రాసు గాని వెళ్ళిరావడం అన్నది సర్వ సహజం. వీడు ప్రతి సారి తమిళనాడు కి వెళ్లి బంధు మిత్రులని కలిస్తే వాళ్లు పలకరింపు - "ఎన్నాబ్బ గొల్టి ఎప్పడి ఇరుక్కే " అనటం వీడు మండి పడి "నానోన్నుం గొల్టి ఇల్లే " అని సమజాయింపు చేసుకోవడం సర్వ సాధారణం ! ఈ గొల్టి పదం మరి ఇతర జిల్లాలో వాడతారో లేదో తెలియదు గాని చిత్తూరు జిల్లా వారికి ఈ పదం తో అవినాభావ సంబంధం తప్పక ఉంది. అంతే గాకుండా ఈ గొల్టి పదం ఓ మోస్తరు అయోమయం మనిషి అన్న పదాని కి కొన్ని మార్లు పర్యాయ పదం గా కూడా ఈ అరవం వాళ్లు ఉపయగొంచిడం కద్దు.
"ఎన్నబ్బ గొల్టి కథ అర్థమాచ్చ? "
ఛీర్స్
జిలేబి.
మధుమేహం ( షుగర్ )
-
*నవంబరు 14 మధుమేహ నివారణా దినోత్సవం సందర్భంగా మధుమేహం గురించి ఓ చిన్న
కధనం...,, *
*మధుమేహం ( షుగర్ ) ఒక వ్యాధి కాదు అనేక వ్యాధుల సమ్మేళనం.మధుమేహవ్యా...
8 hours ago
"ఎన్నబ్బ గొల్టి కథ అర్థమాచ్చ? "
ReplyDeleteఅర్థమాచ్చ? Ha ha ha.
No self respecting Tamil, even the half-baked kind would speak like that! :)
నాదీ చిత్తూరుజిల్లా కావడం వలన, ఈ పదం నాకూ పరిచయమే. ఈ విషయమై, చిన్నప్పుడు చాలాసార్లు గొడవపడ్డాను.తమిళులు, వారి స్వభావసిద్దమైన, కాస్త అతిశయంతో కూడిన అహంకారంతో, తెలుగువారిని కించపరచడానికి ఈ పదాన్ని ఉపయోగిస్తుంటారు. తెలుగువారి పోకడ లోకం పోకడకి వ్యతిరేకంగా ఉంటుందనేది వారి నిస్చితాభిప్రాయం. అందుకే, తమిళంలో తెలుగుని వెనకనించి చదివితే ఆ పదం వస్తుంది!
ReplyDelete