నా చెప్పులు తెగి పోయేయి. మా వీధిలో ఉన్న చెప్పుల బాబాయి ఒక్కడే దిక్కు ఇక నాకు!
ఈ చెప్పుల దుకాణం ఈయన ఎప్పుడు పెట్టేదో నాకు తెలీదు. ఎందుకంటే నేను పుట్టి బుద్ధి వచ్చి నప్పటి నించి ఈ బాబాయి దుకాణం ఉంది కాబట్టి ఈయన మా వాడకందరకి బాబాయ్! ఆ మధ్య మా వీధికో కొత్త ఫ్యామిలీ వచ్చింది. నా చెప్పులు కుట్టుకునేందుకు వీధి చివర్న ఉన్న బాబాయి అంగడికి వెళితే ఆ ఫ్యామిలీ పెద్ద తన చెప్పులు కుట్టించుకుంటూ "ఏమిటోయి చెప్పులు కుట్టేదాని కి 10 రూపాయలు తీసుకుంటావ్ ఎన్ని రోజులకి గ్యారంటీ? అనడమున్ను చెప్పుల బాబాయి సీరియస్ గా ఈ కొత్తాయన వైపు చూడడమున్ను ఆ పై ఈ గీతోపదేశం చెయ్యడమున్ను కనుల ముందు చేవులాస్చర్యంగా సాగి పోవడమున్ను జరిగింది.
"ఏమండి ఓ పది రూపాయలిచ్చి పాత చెప్పుకు గ్యారంటీ అడుగుతారు? ఏమి గ్యారంటీ ఉందని ఈ వీధి మొదట్లో ఉన్న బ్యాంకులో డబ్బులు పెట్టేరు? తెలియకడుగుత మీరు ఆ బాంకులో డబ్బులు పెట్టి ఉంటే దీనికన్నా గ్యారంటీ గా తిరిగి వస్తుందని చెబ్తారా? "
పోనీ మన మున్సిపాలిటీ కోన్సేల్లెర్ మీకీ ఎ సహాయం చేస్తాడని గ్యారంటీ? మీ మంత్రులు మీకే మేలు చేస్తారని గ్యారంటీ కింద వాళ్ళని ఎన్నుకున్నారు? ఆ మాటకీ వస్తే మీ కి ఎ గ్యారంటీ ఉందని దేశం మంత్రులు వరల్డు బాంకులో అప్పు తీసేసుకుంటున్నారు? ఈ లా ఈయన ఉపన్యాసం మొదలెట్టేసరికి ఆ పెద్దాయన కి ఏమి పాలు పోక మనకెందుకులే అని సీరియస్ గా ఓ లూక్కు విసిరి వీసా వీసా వెళ్ళిపోయేరు. నాకైతే నవ్వాగ లేదు. ఏమి బాబాయ్ మరీ అంత సీరియస్ అయి పోయేవ్ అంటే " ఎమున్దమ్మ అంతా ఈ మధ్య గ్యారంటీ లదగతం మొదలెట్టేరు ! అదేదో అమెరికా దేశం లో ఇన్సురన్సు కంపనీలే మునిగి పోతావుంటే నా చెప్పులకి ఆ కుట్టుకి ఈళ్ళు గ్యారంటీ లదిగితే నేనేమి చేసేది! ఈ కుట్టే దారం నాదా ? ఈ సూది నాదా? లేకుంటే ఈ చెయ్యి నాదా? ఈ కన్నూ నాదా? - వీటి కన్ని టికి గ్యారంటీ ఇచ్చేవాడు ఉన్నాడో లేదో ఏమి గ్యారంటీ అంటూ వేదాంతము లోకి దిగి పోయీడు!
ఛీర్స్
జిలేబి.
సమస్య - 5006
-
18-1-2025 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కుమతులు మాత్రమె వసింత్రు గుంటూరు పురిన్”
(లేదా...)
“కుమతుల్ మాత్రమె వాసముందురు గదా గుంటూ...
13 hours ago
ఈ సూది నాదా? లేకుంటే ఈ చెయ్యి నాదా? ఈ కన్నూ నాదా? - వీటి కన్ని టికి గ్యారంటీ ఇచ్చేవాడు ఉన్నాడో లేదో ఏమి గ్యారంటీ
ReplyDeleteబ్రహ్మాండం