చాల పాత ప్రశ్న భగవంతుడు ఉన్నాడా?
సరికొత్త జవాబు - ప్రతి మనిషి తన జీవితం లో వెతుక్కోవాలని చూడడం ఈ ప్రశ్న మహాత్మ్యం!
మానవ పుట్టుక నించి నేటిదాకా - ఇంకా చెప్పా లంటే - భవిష్యత్తు లో కూడా ఈ ప్రశ్న ఎవెర్ తాజా ప్రశ్నే!
కలడు కలమ్డనేవాడు కలడో లేదో అన్న సందేహం ఉత్పన్నమవుతూనే ఉంటుంది.
ప్రతి మానవుడు తన పరిధిలో నించి దీనికి సమాధానం ఇస్తాడు.
ప్రతి సమాధానం ఈ ప్రశ్న కి ఖచ్చిత మైన సమాధానం లా అనిపించిడం ఈ ప్రశ్న గొప్పతనం
అందుకని ఈ ప్రశ్న చాలా నిగూడమైన ప్రశ్న గూడ కాదు!
ఉన్నాడా లేదా?
అంతే!
ఆ పాటి దానికి ఎందుకీ కాలాల తరబడి నడుస్తూన్న సమాధాన పరంపరలు ?
అక్కడే కిటుకు ఉన్నట్టుంది
సమాధానం తెలిసిన వాడు - దాన్ని విసదీకరించలేక పోవడం - కాకుంటే దానికి నిర్వచనం - ఖచ్చితమైన నిర్వచనం ఇవ్వలేక పోవడం- బహుసా నిర్వచనానికి అది ఆవల ఉండడం హేతువేమో? - ఈ ప్రశ్న గొప్ప తనం !
సో , ఈ సమీకరణం లో - ఉన్నాడని నిరూపించలేక పోవడం - లేదని నిరూపించ లేక పోవడం - సమీకరణం యొక్క లిమిటేషన్ కూడా కావచ్చు. !
చూద్దాం - భవిష్యత్తులో - సైన్సు ఎలాంటి కదం తోక్కుతుందో- ఈ సమీకరణానికి ఎలాంటి జవాబు ఇస్తుందో?
చీర్స్
జిలేబి.
సమస్య - 5343
-
7-1-2026 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“ఖరమును సేవించి కనుఁడు గైవల్యంబున్”
(లేదా...)
“ఖరపాదద్వయకంజసేవనమునన్ గైవల్యమందం దగున్”
(బ్...
17 hours ago


భగవంతుడు అనే భావనని మనిషే పుట్టించాడు. పైగా ఒక్కరు ఒక్కొక్క రకంగా నిర్వచించారు. ఇది ఇప్పటివరకు భావన గానే ఉంది కాని నిరూపణ జరగలేదు. ఎవరైతే ఈ భావనని పుట్టించారో, ఎవరైతే సమర్థిస్తున్నారో వారే దీన్ని నిరూపించాల్సిన అవసరం ఉంది.
ReplyDelete