Thursday, August 12, 2010

జ్యోతిష్యం ఒక నమ్మక వాహిని

నమ్మకం అన్నదానికి అర్థం - తర్కికానికి ఆవల ఒక దాన్ని విశ్వసించడం అనుకో వచ్చు.

ఈ డెఫినిషన్ కింద ఆలోచిస్తే - జ్యోతిష్యం నమ్మే కొద్దీ దాని ప్రభావం మన జీవితాలలో పెరగడం దీన్ని నమ్మే వాళ్ళలో చాల మంది గమనించడం జరగడం సర్వ సాధారణం. - ఇందులో తల మునకలైన వాళ్లకి - ప్రతి విషయం జ్యోతిష్యం అలా చెప్పినందు వాళ్ళ ఇలా జరగడం అయ్యిందన్న మాట అని సరిపెట్టుకోవడం కాకుంటే దానికి పరిష్కారం చూడాలనుకోవడం లాంటి మరిన్ని "బై ప్రొడుక్ట్స్ " కింద వెళ్ళిపోవడం గమనించ వచ్చు.

సో, దీన్ని పాటిస్తే - ఓ మోస్తరు - అందులో నే మన జీవితం నిబిడీ కృతం అయినట్టు అని పిస్తుంది. ఉదాహరణకి ప్రతి పనిని మంచి గంటలో నే చెయ్యాలనుకుని - రాహు కాలం అనో కాకుంటే యమ గండం అనో - ఏదో ఒక గుళిక అనో ఎన్నో సార్లు చెయ్యాల్సిన మంచి పని ని కూడా వాయిదా పద్దతుల మీద సాగించే సాదా సీదా జనసాంద్రత మనం గమనించ వచ్చు.

సో, ఒక నమ్మకం మరో నమ్మకానికి - ఆ పై అది మరో నమ్మకానికి - ఇలా విచక్షణా రహితం గా - ఓ లాంటి పరమ పద సోపానం లో పామునోట పడ్డట్టు ఈ ఊబిలో చిక్కు పోతూ - మానవుని కర్మ సిద్ధాంతాన్ని - మరిచి పోయే తంటగా ఈ "కిక్కు" ఇవ్వ గలడం ఈ జ్యోతిష్యం యొక్క వీక్నేస్స్ అని చెప్పుకోవచ్చు కూడా.

వాహిని - ఒక ప్రవాహం. అందులో కొట్టుకుపోవచ్చు. ఈతాడ వచ్చు. జలకాలా వాడచ్చు. ఎంత కావాలంటే అన్ని నీళ్ళు ఉపయోగించ వచ్చు. కొంత ఆలోచిస్తే - ఈ జ్యోతిష్యం కూడా ఒక నమ్మక వాహిని అనిపిస్తుంది నాకైతే. దాన్ని ఎలా ఉపయోగించు కుంటామో దాన్ని బట్టి- మన ఇచ్ఛా శక్తి కూడా అభివృద్ధి చెందడానికి దోహద కారిగా నా కాకుంటే - మన మూఢ నమ్మకాలకి సోపానం గానా- అన్న దాని బట్టి ఈ శాస్త్రం ఉపయోగం అనిపిస్తుంది.

మరో విధం గా ఆలోచిస్తే- దీన్ని గురించి - ఈ శాస్త్రం గురించి తెలియని వాళ్లకి - "Ignorance is Bliss"!

చీర్స్
జిలేబి.

2 comments:

  1. It's is a belief, I agree. Problem araises when people try to support it with some funny scientific reasoning.

    ReplyDelete
  2. నుదుటిరాత,తలరాత,లలాట లిఖితం,విధి నిర్ణయం,(ప్రిడెస్టినేషన్),లాంటి కర్మ సిద్ధాంతాన్ని - మరిచి పోజేసే విద్యే జ్యోతిష్యం.అంతా నా తలరాత నా ఖర్మ, నొసట రాస్తే నోట పలుకుతుంది,రాత రాళ్ళేలమని ఉంటే... రాజ్యాలెలా ఏలుతారు...? అంటూ ఉంటారు.ఈ జన్మలోనే తిరిగి జన్మించడం అనేది క్రైస్తవమతంలో కీలక సిద్ధాంతం
    *జ్యోతిష్యంతో పనిలేని అబ్రహాము మతాలలో కర్మ సిద్ధాంతం ఇలా ఉంటుంది:

    "మనలను ముందుగా తనకోసరము నిర్ణయించుకొని జగత్తు పునాది వేయబడకమునుపే ఆయన మనలను ఏర్పరచుకొనెను.దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయముచొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు" (ఎఫెసీ 1:5,11)

    "విధివ్రాత ప్రకారమే ఏ పనైనాజరుగుతుంది" (ముస్లిం :1218),"ప్రతి మనిషీ తాను దేనికొరకు పుట్టించబడ్డాడో ఆ పనులే చేస్తాడు" (బుఖారీ 82:2).అలాగైతే మనిషి చేసే తప్పులకు దేవుడే కారణం కదా?అని ఆయా మతాలలోని హేతువాదులు ప్రశ్నిస్తున్నారు.

    ReplyDelete