బోడి గుండు చీఫ్ బాల్చీ తన్నే క - అప్పటికే మరో నియో బోడి గుండు సంఘం వాళ్ళు కొండ దేవరతో మొరలేట్టారు , ఘీమ్కరించారు - మా బోడి గుండు సంఘం కి కుంపటి వేరేగా పెట్టి తీరాల్సిందే అని.
కొండ దేవరకైతే - మరీ చీకాకు పుట్టింది. ఈ బాపతు లో వెళ్తూంటే తన పరపతి కే మోసం వచ్చేట్టు ఉందని అనిపించింది కొండ దేవరకి. పోను పోను అసలు జనాలు బోడి గుండు కొట్టుకోవటానికి తనని కొలవడానికి అసలు కొండ కి వస్తారా అన్న సందేహం కూడా వచ్చేసింది.
ఇట్లా అతలాకుతలం అవుతున్న తరుణం లో తిరపతయ్య తీవ్రం గా అలోచించి ఓ నిర్ణయానికి వచ్చాడు. ఇక తాను తన నిజ స్వరూపాన్ని చూపించాల్సిందే అని.
కొండ దేవర కూడా తీవ్రం గా అలోచించి తన కొండ పై జరుగుతున్నఈ సమస్యలకి ఓ సమాధానం కాకుంటే సర్దుబాటు చెయ్యాల్సిందే అన్న నిర్ణయానికి వచ్చేడు.
అల్కెమిస్ట్ పుస్తకం లో రచయిత పోలో కోఎల్హో ఒక చోట అంటాడు - ఒక మనిషి తాను కోరుకున్నది ఎట్లాంటి పక్షం లో నైన జరిగి తీరాలి అనుకుంటే - ప్రపంచం మొత్తం ఆతని ఆలోచనలకి సప్పోర్ట్ ఇస్తుందని. ఇదేమి కొత్త విషయం కాదు. యతో కర్మః తతో ఫలః అన్నదాన్ని కొద్ది పాటి మార్పులతో చేర్పులతో సుందరం గా ఇలా కూడా చెప్పవచ్చు. అంతే. !
ఇలా తిరపతయ్య , కొండ దేవరల ఆలోచనలు ఓ కొలిక్కి వస్తూనే - ఓ ఓ రోజు భారీ గా ప్రెస్ మీట్ కొండ దేవర సమక్షం లో తిరపతయ్య పెట్టి - జనాలకి షాక్ ఇచ్చాడు. - తన బోడి గుండు దుకాణం కట్టేస్తున్నాని - ఇక మీదట జనాలు కొండ మీది బోడి గుండు సంఘం వారి తో నే బోడి గుండు కొట్టించు కోవాలని - అంతే గాకుండా - తా ను కూడా తన యావద్పరివారంతో బాటు - బోడి గుండు సంఘం లో చేరి పోతున్నాని - తన దగ్గిర ఇక బోడి గుండు కొట్టించు కోవాలని ఆరాటపడే వాళ్ళు - ఇక మీదట తనని బోడి గుండు సంఘం వాళ్ళ ద్వారానే సంప్రదించాలని కూడా వాక్రుచ్చాడు.
ఆ ప్రెస్ మీట్ లో ఓ వెధవ రిపోర్టర్ ఎకసక్కం గా అడిగాడు - " తిరపతయ్య - మొదట్లో నీ కేమి సత్తా ఉందని బోడి గుండు దుకాణం పెట్టేవు ? ఇప్పుడు ఏమి క్వాలిఫికషన్ ఉందని బోడి గుండు సంఘం లో చేర్తున్నావు " అని - ఈ ప్రశ్న కి సమాధానమే - ఈ కథ కి అంతం కూడా. -
తిరపతయ్య - అప్పటిదాకా - సిని ప్రపంచంలో గాని - పబ్లిక్ ప్రదర్శనలలో గాని చూపించని నిజాన్ని సవినయం గా చూపాడు- తన తలపైనున్న విగ్గు ని ఊడ బెరికి - నునుపైన , సొంపైన , నిగ నిగ మెరిసే తన బోడి గుండు ని టీవీ వాళ్లకి , ప్రెస్ వాళ్లకి సవిస్తారం గా చూపి - ఇంతకన్నా ఏమి క్వాలిఫికేషన్ కావాలి నాకు బోడి గుండు దుకాణం పెట్టడానికి, కాకుంటే - బోడి గుండు సంఘం లో చేరడానికి అని ఎదురు ప్రశ్న వేసాడు తిరపతయ్య. !
శ్రీమధ్రమానంద హరీ ! హరిలో రంగ హరి ! ఈ తిరపతయ్య బోడి గుండు కథ పరిసమాప్తం ఇంతటి తో ! ఈ కథ చదివిన వారికి , విన్న వారికి , బ్లాగ్ లోకం లో కామేన్తినావారికి - అందరికి ఆ కొండ దేవర మా తిరుమలేసు ఆశీర్వాదాలు సకల వేళల ఉండాలని - మా తిరపతయ్య లా నిజాయితీ గా వాళ్ళంతా వర్ధిల్లా లని కొండ దేవర ని కోరుకుంటూ !!
(సమాప్తం)
చీర్స్
జిలేబి.
సమస్య - 5006
-
18-1-2025 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కుమతులు మాత్రమె వసింత్రు గుంటూరు పురిన్”
(లేదా...)
“కుమతుల్ మాత్రమె వాసముందురు గదా గుంటూ...
13 hours ago
>>>ఈ కథ చదివిన వారికి , విన్న వారికి , బ్లాగ్ లోకం లో కామేన్తినావారికి - అందరికి ఆ కొండ దేవర మా తిరుమలేసు ఆశీర్వాదాలు సకల వేళల ఉండాలని - మా తిరపతయ్య లా నిజాయితీ గా వాళ్ళంతా వర్ధిల్లా లని కొండ దేవర ని కోరుకుంటూ !!
ReplyDeleteఈ మాట అంటారని తెలిస్తే తొందరపడి చదవక పోదుమూ, కామెంటక పోదుమూ! :)
:)) hilarious . All 3 parts!!
ReplyDeleteహా....నేనెంత ఆలస్యంగా కంటినీ ఎకెసెక్కేలను!బోడిగుండ్ల సమూహ భాగోతమును బయటపెట్టిన ఈ గుండాబత్తుల బుచ్చమ్మగారు తెలుసుకోవలసినదేమంటే ఇంకనూ ఆ క్షవర కళ్యాణం కొనసాగుచూనే యున్నది మరో సెలూన్లో.
ReplyDeleteఇట్లు,
తమ ప్రియశిష్యుడు,
స్వామి కిచకిచానంద.
ReplyDeleteస్వామి కిచకిచానందా వారు !
బోడి గుండు కే ఇంత ఫ్లాట్ అయిపోతే ఎట్లాండీ ?
శ్రీ కృష్ణ విలాపాన్నీ చదవండీ :)
చీర్స్
జిలేబి