అరవిందుని ఒక మండల డిల్లీ దర్బారు గురివింద గింజ మేళం అయి పోయింది !
కేజ్రివాలు క్రేజీ వాల్ అని ఆ మధ్య మన కష్టే ఫలే వారు కామేంటి తే , శర్మ గారు కూడా 'పద' జాలాల తో భలే ఆడు కుంటారు సుమీ అనుకున్నా
ఇప్పుడు డిల్లీ దర్బారు మూత పడి పోవడం తుగ్లక్ దర్బారు ని తలపిస్తోంది !
సరే దేశ రాజకీయం లో ఏదైనా జరగొచ్చు !
మీదేశం పిజ్జా కి పాపులర్ అయితే డానికి కావాల్సిన పెప్పర్ మా దేశం దోయ్ అని మన వారు నిరూపించేరు లోక్ సభ లో !
పిజ్జా పై టాపింగ్ గా పెప్పర్ బాగుంటుంది కాని కంట్లో పెప్పర్ టాపింగ్ చేస్తే ఎట్లా అని దేశం గగ్గోలు !
మధ్య లో అంబాని వర్సస్ అరవిందుని కేసులు కూడా తయారయ్యేటట్టు ఉన్నది !
ఏమిటో మరి !
ఇవ్వాళ డిల్లీ బావ కూడా ముంబై మరదలు పిల్ల తో లుంగి డాన్స్ చేయించ బోయే దినమాయే మరి !
కాబట్టి ఇవ్వాల్టి టపా ఇంతటి తో సరిబెట్టి రాబోయే 'కాళం' కోసం ఎదురు చూస్తో -
నమో మోడీ నమో నమః !
చీర్స్
జిలేబి
మహానాటకం లో అంతర్నాటకం లో ఒక అంకం పూర్తయింది. రెండు రోజులలో తెనుగునాట మరి సరికొత్త నాటకాంకం కి తెర లేవనుంది. వేచి చూడండి.
ReplyDeleteకికురె ముఖ్యమంత్రిగా ఉండి అంత భీబత్సంగా వ్యతిరేకించడం నుంచీ లోక్ సభ లో జరిగిన ఈ రౌడీజం వరకూ అంతా కాంగ్రెసు వాళ్ళు కూడబలుక్కుని చేసిన దుష్ట నాటకం. తెరాసా లో విలీనానికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని విలీనానికి ఒప్పించడానికి వేసిన మాస్టర్ ప్లాన్.
ReplyDeleteతెరాసాతో విలీనం వల్ల తప్ప సీట్ల సర్దుబాటు వల్ల కూడా తెలంగాణాలో పార్టీకి పరువు నిలబడదని తేలిపోయింది.విలీనానికి ఒప్పుకున్న తెరాసా అధినేతకూ, పక్క తాళం వాయించే ఉద్దండ పండితుడికీ కాంగ్రెసులో సుఖ ప్రయాణానికి మంచి బెర్తులు జమ అయిపోయినాయి. మధ్య అంతరువుల నుంచి కింది వాళ్లకి కూడా కాంగ్రెసు బెర్తులు ఇస్తే పార్టీలో ఉన్న తెకావాలు వూరుకోరు. విలీనం తిరుగుబాట్లు లేకుండా సున్నితంగా జరిగి పోవాలి.అందుకని తెరాసా లో విలీనాన్ని వ్యతిరేకించే వాళ్ళని మాన్సికంగా బ్రేక్ చెయ్యటానికి కొన్ని నెలల క్రితమే అన్ని అంకాలనూ ప్లాన్ చేసుకున్నారు. ఈ ప్లాన్ తెరాసా అధినేతకూ తెలుసు, బహుశా ప్లాను ఇచ్చిందే అతను అయి ఉండవచ్చు.
ఇంతకీ జరిగిందీ జరగబోయదీ యేమిటంటే, సభ బయట తమకు మరొకరితో ఉన్న ఒప్పందాన్ని ఖరారు చేసుకోవటానికి పార్లమెంటుని వాడుకోవటం.భారత ప్రజాస్వామ్యానికి మూలమయిన రెండు సభలూ కాంగ్రెసు రాజకీయ వ్యాపారానికి తక్కెడ సిబ్బెములుగా ఉపయోగ పడుతున్న్నాయి.పార్లమెంటు భవనం ఒక వ్యాపార వేత్త తన క్లయింటు తో తనకున్న ఒక ఒప్పందానికి ఆఖరి సంతకాఉ చేసుకునే కాంఫరెన్స్ హాల్ గా ఉపయోగపడుతున్నది.
100+ యేళ్ళ అచరిత్ర గలిగి యెక్కువ కాలం అధికారం లో ఉండి సభాసాంప్రదాయాల్ని పాటించటంలో మిగిలిన వాళ్ళ కన్నా యెక్కువ బాధ్యతగా ఉండాల్సిన పార్టీ సిగ్గు యేమాత్రమూ లేకుండా భాజపా లాంటి జాతీయ పార్టీ లన్నింటి సహకారం తో చెయ్యబోతున్న ఘనకార్యం ఇది.