మన ఆర్ బీ ఐ చీఫ్ రాజన్ మానవుడు 'Inflation is a killer for economic growth' అంటే టాట్ టాట్ అని మార్కెట్టు డమ డమ పడి పోయింది ! స్వామీ చిదంబరం వారు కూడా దీనికి కౌంటర్ ఇచ్చేరు - 'టాట్ టాట్ - ఇంఫ్లేషన్ చాలా అత్యావసరమైన ది అని (అదీ ఎక్కడో ఐరోపా లోఅవ్వాళ కూర్చుని !) రాజన్ మానవుడు వడ్డీ రేపో రేటు క్వార్టర్ పాయింట్ పెంచితే మార్కెట్టు దమాలని 350 నిఫ్టీ పాయింట్లు వదిలించు కుంది - ఇదే కదా సందులో సడేమియా అంటే !
సరే ఇక మన అమెరికా సంగతి చూద్దాం ! 'ఎల్లమ్మ' గారు బెర్నాంకె తరువాయి పదవి ని అలంకరించు కుని నిన్న మొట్ట మొదటి సారి పబ్లిక్ స్టేట్ మెంట్ ఇచ్చేరు - నేను బెర్నాంకె చూపిన బాట లోనే నడవాలని అనుకుంటున్నా నని ! - స్టిములస్ విత్డ్రా చెయ్యడం అంచెల వారీ గా జరుగు తుంది ఐతే, రేటు మాత్రం బెర్నాంకె వారి అడుగు జాడల్లో అంటే తక్కువగా నే పెడతా నని !
అమెరికా మార్కెట్టు జూమ్మంది 'నా' దమ్' అయ్యింది !
అంతే గాక అమెరికా జాబ్ మార్కెట్టు గ్రోత్ తక్కువగా ఉండ డానికి కారణం వాతావరణం వల్లే అని వక్కాణించి 'అమ్మో వాతావరణా న్ని ఇట్లా కూడా ఉపయోగించు కోవచ్చు అన్న మాట అని పించేలా హాశ్చర్యం లో ముంచెత్తే సేరు కూడాను !
అమెరికా ఎల్లమ్మ చెబితే గొప్ప కాదూ మరి ! హే రాజన్ !
ఇవ్వాళ మన సో కాల్డ్ 'de-coupled' ఇండియా స్టాక్ మార్కెట్టు కూడా తధిగిణత్తొం అని అమెరికా మార్కెట్టు కి 'లుంగి డాన్స్' చేస్తుందేమో మరి !
అదీ గాక - ముంబై మరదలు - డిల్లీ బావ ల సరస మేళం నెల కూడా ఆయే ఈ ఫిబ్రవరీ నెల ! మరదలు పిల్ల ఇంకా ఏమేమి నృత్య భంగిమలు చూపించ బోతోందో మరి !
'భారాత్' నాట్యం !
శుభోదయం
జిలేబి
(సరదా గా - ఫెడ్ కొత్త చీఫ్ జానెట్ ఎల్లెన్ 'హాశ్చర్యం' గురించి చదివాక ! -
Yellen acknowledged she was surprised by the sluggish job gains the past two months. But she suggested that job growth might have been held down by severe weather and was not necessarily a signal of a slowdown.")
అంతా యెల్లమ్మ తల్లి దయ - యేటి సేత్తాం బావు? యేటి జరిగినా నా గత్తర నాకే !
ReplyDelete