దేవా కన రావా కరుణించి ... " ఓ కొత్త భక్తుడు ప్రార్థించడం మొదలెట్టాడు.
పైనున్న కనులు కనబడని, చెవులు వినిపించని దేవునికి హటాత్తు గా కళ్ళు కనిపించి, చెవులు వినిపించడం మొద లెట్టింది . హటాత్తు గా అనడం తప్పు. ఈ మానవ మాత్రుల తో 'లావాదేవీ లు మాట్లాడి మాట్లాడి ,దేవుడు కూడా బిజినెస్స్ అంటే ఏమిటో ఓ మోస్తరు అర్థం చేసుకున్నాడు . బిజినెస్స్ కి కావాల్సింది న్యూ బిజినెస్స్ అన్న సూత్రం అన్నది గ్రహించేడు . అంటే, తన బిజినెస్స్ బాగా నడవాలంటే , ఆల్వేస్ కొత్త బిజినెస్స్ ఉండా లన్నది ప్రాథమిక మౌళిక సూత్రం .
అందుకే కొత్త భక్తుడు ఎవడైనా కొంత గీ పెట్టినా చాలు - వెంటనే తన్ని కలవడానికి, తనతో భేటి ఇవ్వడానికి , అతను చెప్పే మాటలు విని వెంటనే వాడికి ఓ సౌలభ్యమైన 'సొల్యూషన్' ఇవ్వడానికి పై నున్న భగవంతుడు వెంటనే ఆతురత చూపిస్తాడు . అదే పాత భక్తుడైతే వాడు అరిచి గీ పెట్టినా అస్సలు పట్టించు కోడు - అట్లాస్ట్ దేవేరి ఏమైనా రెకమెండు చేస్తే , అప్పుడు పోనీ లే అని కొంత కరుణి స్తాడు !
తన ద్వార పాలకుణ్ణి పిలచి ఆ కొత్త భక్తుడి మొరని వినడానికి ఉద్యుక్తు డయ్యాడు
నీ పేరేమి నాయనా ! కరుణాంత రంగుడై అడిగాడు భగమంతుడు!
కొత్త భక్తుడు పేరు చెప్పాడు !
అరె, నా అవతారాల లో రెండు పేర్లు కలిపి పెట్తుకున్నావే ! మెచ్చు కోలు గా చూసేడు భగవంతుడు . ఈ బిజినెస్స్ టెక్నిక్ కూడా భగవంతుడు ఈ మానవ మాత్రుల వద్దనించే నేర్చుకున్నాడు - ఏదైనా సరే మొదటి అప్ప్రీ షిఎట్ చేయాలి ! కొంత పెప్పర్ కలిపి అనినా సరే యు ఆర్ హేండ్ సామ్ యు నో అనాలి !
కొత్త భక్తుడు చెప్పాడు - అది మా పేరెంట్స్ నాకు తగలెట్టిన పేరు - అసహ్యం గా ముఖం తిప్పేడు .
భగవంతుడు గతుక్కు మన్నాడు ! వీణ్ణి వదిలించు కోవటం బెటరు అనుకుని
భక్తా నీ కోరిక ఏమి ? అడిగాడు
దేవా, నేను దయ్యాల్ని నమ్మి కథలు గట్రా రాసేను . మొదట్లో సూపెర్ డూపెర్ అయ్యేయి అవి . ఆ పై అంతా ఫ్లాప్ షో ఐ పోయేయి . వీటికి కారణం నేను దెయ్యాల్ని నమ్మటం వల్లే నని నమ్మి , ఇక మీదట మారాలి అనుకుని నిన్ను నమ్మడం మొదలెట్టా చెప్పాడు భక్తుడు -- "నా కథలు, బ్లాగులు గట్రా సక్సెస్ అయ్యే మార్గం చెప్పు .
మళ్ళీ లావాదేవీయేనా భగవంతుడు దీర్ఘం గా ఆలోచించి చెప్పేడు -
భక్తా ! నీ మార్పు కి సంత సించి నాడను !
నీకూ దెయ్యాలకి ప్రారబ్ధ కర్మ అవశేషం ఇంకా తీరలేదు కాబట్టి నువ్వు దెయ్యాల గురించి ఇంకా ఇంకా రాస్తూనే ఉంటావు కాని ఇప్పుడు నన్ను నమ్మాలని వచ్చేవు కాబట్టి చెబుతా - ఇక మీదట దేవుణ్ణి నమ్మిన దెయ్యాల గురించి కథలు, బ్లాగు లు టపాలు గెలుకు అవి సూపేరు డూపెరు అవుతాయి
ధన్యోస్మి ధన్యోస్మి స్వామీ ! చెప్పేడు కొత్త భక్తుడు సంతోషం తో !
చీర్స్
జిలేబి
దేవునితో వ్యాపారం బాగా కలిసొచ్చేది కదా!
ReplyDelete
Deleteశర్మ గారు,
దేవుడి తో వ్యాపారం ఎల్లప్పుడూ సుఖ దాయకమే . తానోడి తే వాడు మనవాడు ! మనమోడితే మనము వాడి వారము. ఏ విధముగా చూసినా మనమే 'విజయులం'!!
జిలేబి
కం. దేవుడితో బిజినెస్సా
ReplyDeleteదేవుడి లాభాన్ని గూర్చి దిగు లెందుకులే
దేవుడి దైనా మనదే
దేవుడు మనకిచ్చు తాను తినడు జిలేబీ
Deleteశ్యామలీయం వారు,
తానోడి నా, నేనోడినా తను నా వాడే !!
జిలేబి
యండమూరికి ఈ ట్రిక్కు తెలిస్తే మళ్ళీ రాస్తాడేమో తులసి దళం బదులుగా తులసి తీర్ధం dairy of Mrs Sharda కి బదులు dairy of Mrs jilaebee వగిరా వగైరా?
ReplyDeleteహరి బాబు గారు,
Deleteయండమూరి వారి పాత తరం. ఈ తరం వారు 'వరము' పొందిన వారు !!
ఇక డైరీ ఆఫ్ మిస్సేస్స్ జిలేబి పేరు చెప్పేరు చూడండి భేష్ భేష్!! టైటిల్ కాపీ రైట్ ఏక్ట్ క్రింద రిజిస్టర్ చేసి పెట్టేసు కుంటా ! ఏమో ఏ పుట్టలో ఏ పాముందో ! ఈ పేరుతో ఎవరైనా పుస్తకం పెట్టా లనుకుంటే మనకు కొంత గిట్టు బాటు జరుగు !!
చీర్స్
జిలేబి
జిలేబి