Saturday, August 23, 2014

జిలేబి (ల) సింగపూరు విజయం!!


జిలేబి (ల) సింగపూరు విజయం!!

ఇదిగో జిలేబి సుష్మా మేడం ఫోను నీకు పెందరాళే ఫోను !

జిలేబి జి, కల్ హీ నికల్ చల్నా సింగపూర్ ఆ వైపు నించి మేడం గారి హుకుం !!

మరో రెండు గంటల్లో మరో ఫోను

మమతా దీది ఆన్ లైన్ లో ఉన్నారు -- ఈ మారు అయ్యరు గారు కొద్దిగా సందేహిస్తూ ఫోనిచ్చేరు 

"మోయ్ సింగపూర్ జాబో లాగే, అప్నోర్ పేక్ రెడీ కొరో '

మరో నాలుగు గంటల్లో మరో ఫోను

జిలేబి నువ్వేమన్నా మరీ అంత గొప్ప ఫిగర్ వా ? కేసీఆర్ ఆన్ లైన్ అయ్యరు గారు అబ్బుర పడేరు !

జిలేబి గారు, జర ఈ వారం లో సింగ పూరు కెళ్లాల . కూసింత మీరూ సాయం పడుదురూ ... అసలే అరవ మేళం అక్కడ కొంత మాట సాయం ఉంటాది '

బాల్చీ తంతే నెక్స్ట్ ఫ్లైటు లో మేడం సుష్మాజీ గారితో సింగపూరు లో పడ్డది జిలేబి !!
ఏమిటో మరి ఈ మధ్య వరస బెట్టి అందరూ సింగపూరు పయనం కట్టె స్తున్నారు !!

మన 'ఆచంద్ర తారార్కం' వారు  ఆంధ్ర దేశాన్ని సింగపూరు లా చేసేస్తా మన్నారు !!

అదేమీ సింగపూరు మాయయో అనుకుని జూస్తే 'సింగపూరు' సింగారి పాట గుర్తు కొచ్చింది

ఇక మిగిలింది సుష్మా గారి వెనకాల్నే మన మోడీ గారు 'సింగా పోరు' వెళ్ళడమే మరి !!

శుభోదయం
జిలేబి

4 comments:

  1. జిలేబి గారు,
    బిసీ, బిసీ, ఎంతమందిని రిచీవ్ చేసుకోవాలి? ఎంటో అందరూ సింగాపూర్ అంటున్నరు, ఏమి దాని మహిమ? సొల్లోంగో.
    Happy nu nr back again. :)

    ReplyDelete
    Replies

    1. కష్టే ఫలే వారు,

      అందరూ పోలో మని సింగా పోరు (పో) తున్నారు ! మనమూ వెళ్లి వద్దా మని !!

      జిలేబి

      Delete
  2. జిలేబి అందరకు యిష్టమైనదే .

    జిలేబి చుట్టటం మానేస్తానంటే ఎలాగండి ? జిలేబి ఎన్నటికీ లేజీ కానే కాదు .

    ReplyDelete
    Replies

    1. అబ్బే శర్మ గారు,

      ఆ టపాలో నే జెప్పా - ఇది బ్లాగు లోకపు సత్ సాంప్రదాయమని , అప్పుడప్పుడు ఇట్లా నే బోతా నే బోతా నని జెప్పి మళ్ళీ కొన్ని రోజుల తరువాయి దురదస్య దురదః జిలేబీ నామ్యా దురద గొంటాకుహ అన్నట్టు పునః దర్శనమివ్వడం ఇది ఒక సత్ సాంప్రదాయం ! అది నేను కూడా ఫాలో అవుదామని అంతే అన్న మాట |||||||!

      జిలేబి

      Delete