Tuesday, August 26, 2014

జిలేబి జాకెట్ ఛాలెంజ్ !

జిలేబి జాకెట్ ఛాలెంజ్ !

ఈ మధ్య ఐసు బకెట్ ఛాలెంజ్ అని ఎవరో అంటే , మరోక్కరు లోకలైజేడ్ వెర్షన్ రైజ్ బకెట్ ఛాలెంజ్ అంటే , మనం కూడా ఒక జిలేబి బకెట్ ఛాలెంజ్ అని ఛాలెంజ్ విసరోచ్చు కదా అని హెడ్డింగ్ పెడితే అప్పు తచ్చై అది జిలేబి జాకెట్ ఛాలెంజ్ అయి కూర్చోంది .

బకెట్ ఐతే నేమి, జాకెట్ ఐతే నేమి శ్రీ శ్రీ లాంటి కవులకి అగ్గి పుల్ల సబ్బు బిళ్ళ, కవితా వస్తు వైతే, సినీ 'కావు' కావు లకి కిటికీ లు పెట్టిన జాకెట్టు కిత కిత లు పెట్టె 'ఐటము సాంగోప సాంగము లైతే , మరి మనకు మాత్రం జిలేబి జాకెట్ ఛాలెంజ్ అన్న హెడ్డింగు ఎందుకు పనికి రాదు అనుకుని 'పని లేక' కాస్త 'కష్టే' పడి కామెంటు ఫలముల కోసం ఒక టపా కొట్టి చూద్దారి అనుకుని ఈ టపా మొదలెట్టా !!

ఇంతకీ ఈ జిలేబి బకెట్ ఛాలెంజ్ ఏమిటి ?

బ్లాగు లోకానికి తిలోదకాలిచ్చిన బ్లాగోదరుల్లారా, బ్లాగోన్మణీయు లారా , ఇదే జిలేబి బకెట్ ఛాలెంజ్  ! మీరందరూ మళ్ళీ బ్లాగు లోకాని రండి ! ఇదే ఈ బకెట్ ఛాలెంజ్ !! ఈ టపాలకి (నా ఒక్క టపా కి మాత్రమె కాదు ) ఈ 'ఈ' లోకపు , పంచ దశ లోకపు టపాలకి లైకులు కొట్టి బకెట్ ఛాలెంజ్ విసరండి !!

రండి ,అ బకెట్ల కొలది కామెంట్ల తో ఛాలెంజ్ లు విసురుకుని బ్లాగు లోకాన్ని  మళ్ళీ మక్కలిరగ దీద్దాం !!

శుభోదయం
చీర్స్
జిలేబి
జాకెట్ అని రాసానా అది క్లిక్కుల కోసం -- అప్పు తచ్చు ! బకెట్ ఛాలెంజ్ అన్న మాట !

12 comments:

  1. ఆ వచ్చె వచ్చె.... బకెట్ల కొద్దీ కామెంట్లంటే కష్టం కానీ... మై హాజిర్ హుం అనిపించుకుందుకు రెడీ....

    ReplyDelete
  2. ప్రోచేవారెవరురా నినువిన రఘువరా? మము......ఛాలెంజ్ బాగుందిగాని వినేవారెవరా అని...


    ReplyDelete
  3. mari inkem,, welcome back ,,, oka bucket jilebi lu pampicheyandi :)

    ReplyDelete
  4. జిలేబి బకెట్ ఛాలెంజ్ అంటే ఇక్కడెవ్వరూ రారు. మీరు కోల్‌కతాకో, వారణాసికో వెళ్ళాలి.
    ఇడ్లీ - సాంబార్ బకెట్ ఛాలెంజ్ అంటే చాలామంది రావచ్చు.

    ReplyDelete
  5. జాకెట్ ... సారీ బకెట్ చాలెంజ్ బాగుంది ..
    మీ పిలుపుకి ఎందరు వస్తారో చూద్దాం

    ReplyDelete
  6. నేను అప్పుడప్పుడు కనిపిస్తూనే వున్నానండీ. కాని నా బ్లాగ్ గోడు యెవరూ పట్టించుకున్నట్టు లేదు.

    ReplyDelete
  7. తలా బకెట్ జిలేబీలు పంపితే వస్తారట .....మీ తరపున అందరితో మాట్లాడాను

    ReplyDelete
    Replies
    1. మూర్తిగారు నాకో బకెట్ మర్చిపోకండేం

      Delete
  8. నేను మీతో చేతులు కలపొచ్చా...షేర్ల కోసం :-)

    ReplyDelete
  9. నాకేదో అనుమానమే కామెంట్ల కోసం జిలేబీ మేడం కావాలనే బ ని జ చేశారని.అయ్యరు గారికే తెలియాలి ఈ జిలేబీ కోత రహస్యం.కానీ పాపం అయ్యరు సారేమో నోరు లేని మగాదైపోయె?!

    ReplyDelete
  10. కం. కామెంట్లు నింపమంటే
    ఏ మంటాం మీ బకెట్టు ఇట్టే నింపే
    స్తా మంటాం కాదంటే
    ఏ మంటారన్న శంక లేల జిలేబీ

    ReplyDelete