కోయంబేడు మార్కెట్లో కూనలమ్మ :)
ఏమండీ అయ్యరు వారు ఇవ్వాళ కోయంబేడు మార్కెట్ కెళ్దామా? అడిగింది జిలేబి.
అయ్యరు గారు ఓసారి ఎగాదిగా జిలేబి ని చూసారు.
మడిసార పట్టు చీర లో ధగధగ భుగభుగ లాడి పోతూ కనిపించింది జిలేబి.
ఏవిటి ? ఈ లాగే ? మడిసార లోనే ?
ఓసారి తన వైపు చూసుకుంది జిలేబి. ఏం ఇట్లా వెళ్తే ఏమంటా ?
ఏమీ లేదు లే గొణిగారు అయ్యరు గారు.
అయినా జిలేబి, కోయంబేడు మార్కెట్టు కు కాస్ట్యూమ్ కూనలమ్మ మడి సార మామి వేషం బాగోదేమో ? మళ్ళీ సందేహం అయ్యరు గారికి.
వెళ్దాం పదండి - బస్సులో అంది జిలేబి
ఏంటీ మద్రాసు బస్సులో నా ! గుండె గుభిల్లు మంది అయ్యరు గారికి ఇదేమి ప్రారబ్ధ కర్మ రా బాబోయ్ అనుకుంటూ .
అవునండీ బస్సులో నే !
హతోస్మి !
కోయంబేడు మార్కెట్ లో కూనలమ్మ దిగబడింది.
చుట్టూతా చూసింది.
జన వాహిని ; జన వాహిని.
కు కు కూ అంది.
వెంటనే ఓ తుంటరి పిల గాడు - విజిల్ వేసి - పాప్పాత్తి అమ్మ వందిరుక్కా డా అన్నాడు .
గుర్రు గా చూసింది కూనలమ్మ !
కత్తిరిక్కా ఎవళో ?
వాడో ధర చెప్పాడు.
అమ్మి మరో ధర చెప్పింది.
మధ్య లో అయ్యరు గారు వద్దే జిలేబి ఎక్కువ బేర మాడ బాక! అన్నాడు భయ పడుతూ.
అయ్యరు గారు అనుకున్నట్టే అయింది.
ఇదో - పొమ్నాట్టీ - వాంగినా వాంగు - ఇల్లేనా .....
వాడి పై జిలేబి గయ్యమని మళ్ళీ ఎగురుదామను కునే లోపల్నే అయ్యరు గారు డేమేజ్ కంట్రోల్ కోసం జిలేబి కో ణిసిధాత్వర్థం సమర్పించే సు కోవడం తో
మార్కెట్ ఉలిక్కి పడింది.
పాప్పాత్తి యమ్మా ఎంగయో పోయిడిచ్చు డా అంటూ మూర్చ పోయాడా అబ్బాయి
కోయంబేడు మార్కేట్టా మజాకా :)
చీర్స్
జిలేబి