Thursday, June 14, 2018

స్త్రీలకు మ్రొక్కిన ధనమును శ్రేయముఁ గల్గున్!




స్త్రీలకు మ్రొక్కిన ధనమును శ్రేయముఁ గల్గున్!
 


పాలేటి రాచ కన్యయు
కోలాహలము కలిగించు గోమిని లక్ష్మిన్
బాలకుమారా  కొల్చుచు
స్త్రీలకు మ్రొక్కిన ధనమును శ్రేయముఁ గల్గున్!


***

గోలల మనీపరసులో
లీలలు గలవయ ! జిలేబులీను జిలేబీ
లే! లక్షణముగ వారికి,
స్త్రీలకు మ్రొక్కిన ధనమును శ్రేయముఁ గల్గున్


***

చాలా చక్కగ యిస్త్రీ
చేలల కొనరిచి ధరింప చెప్పెడు పూబో
డీ లలనలు సతులవుదురు
స్త్రీలకు మ్రొక్కిన, ధనమును శ్రేయముఁ గల్గున్ :)


***

వేలకు వేల ధనమ్మును
చాల సమర్థులుగ "యైటి" సంగతి గనిరే :)
గోలలు వలదువలదనకు !
స్త్రీలకు మ్రొక్కిన ధనమును శ్రేయముఁ గల్గున్!


***


బేలలు బేలలనకు ! కర
వాలము బట్టిరి తుపాకి వాటము గనిరే !
కేలుమొగువు మానవుడా!
స్త్రీలకు మ్రొక్కిన ధనమును శ్రేయముఁ గల్గున్!


***

చాలమి లే, తిరుగాడిరి
గోళము లన్తిరిగిరి భళి గూగుల్ లో మీ
లా లక్షలను గడించిరి
స్త్రీలకు మ్రొక్కిన ధనమును శ్రేయముఁ గల్గున్!


***

జోలెలు బట్టిరి మగవాం
డ్లే !లెస్సగనయిరి మగువలే లబ లబలే
లా ! లావణ్యవతులయా !
స్త్రీలకు మ్రొక్కిన ధనమును శ్రేయముఁ గల్గున్!


***

మేలుగ విద్యల నేర్చిరి
కాళికలై కదము ద్రొక్కి ఖండాంతరముల్
మూలకు మూలల పోయిరి
స్త్రీలకు మ్రొక్కిన ధనమును శ్రేయముఁ గల్గున్!


***

లాలిత్యం బొప్పెడు నట
నా లావణ్యముల జూపి నవరసముల ధా
రాళముగ "అమ్మ" గనయిరి
స్త్రీలకు మ్రొక్కిన ధనమును శ్రేయముఁ గల్గున్!


***

ఏలెన్ దేశము బింద్రన్
వాలేలన్నడచెను భళి బాంకుల జాతీ
యాలై నిల్పెను వినుమా
స్త్రీలకు మ్రొక్కిన ధనమును శ్రేయముఁ గల్గున్


***

పాళీ బట్టి కలెక్టరు
లై లెస్సగ నామ్రపాలి లా యేలిరయా
మూలంబయ్యిరి ప్రగతికి
స్త్రీలకు మ్రొక్కిన ధనమును శ్రేయముఁ గల్గున్


***


బాలీ వుడ్డును నేలిరి
టాలీ వుడ్నందు బావుటా లెగరేయం
గా లావై వెల్గిరయా
స్త్రీలకు మ్రొక్కిన ధనమును శ్రేయముఁ గల్గున్!


***

గాలిని నడిపిరయ విమా
నాలను నేర్హోస్టెసులుగ నాణ్యపు సేవల్
లాలించుచు పాలించిరి
స్త్రీలకు మ్రొక్కిన ధనమును శ్రేయముఁ గల్గున్!


***

లాలను జూపుచు మాతా
శ్రీలై సంస్థాపకులుగ సిద్ధిన్ బుద్ధిన్
మేలుగు నిల్పిరి గారే
స్త్రీలకు మ్రొక్కిన ధనమును శ్రేయముఁ గల్గున్!


***

మాలాలా యూసఫులుగ
మూలాల నెదిరిచినారు మూలంబయి పూ
మాలై భువినే చుట్టిరి
స్త్రీలకు మ్రొక్కిన ధనమును శ్రేయముఁ గల్గున్!


***

డీలింగురూము, నెక్స్చేం
జీలన్,స్టాక్మార్కెటున గజిబిజియు లేకన్
వాలెట్లన్నింపిరయా
స్త్రీలకు మ్రొక్కిన ధనమును శ్రేయముఁ గల్గున్!


***

చాలా చక్కగ నార్టీ
సీలో కండెక్టరులయి జిలుగులొలుకుచున్
ఓలాడ్రైవర్లయిరే
స్త్రీలకు మ్రొక్కిన ధనమును శ్రేయముఁ గల్గున్!


***

భోళా శంకరు తలపై
మాలిని సుఖదగ నిముడుచు మరి నిల్లాపై
శైలజగా నిల్చిరిగా
స్త్రీలకు మ్రొక్కిన ధనమును శ్రేయముఁ గల్గున్!


***

బాలకుమారా! వినుమో
యీ ! లోలకము వలె తిరుగు యింతులకు కడున్
మాలోకంబై చుట్టెడు
స్త్రీలకు మ్రొక్కినఁ ధనమును, శ్రేయముఁ గలుగున్


***

లోలాక్షులు సీయెమ్ములు
గా లలనల్ " రాష్ట్రపతులు " గా మన దేశా
న్నేలిరి మహాజనులుగా
స్త్రీలకు మ్రొక్కినఁ ధనమును, శ్రేయముఁ గలుగున్!


***

జోలల్ పాడిరి తల్లులు
గా లలనామణి బసాలు గా తీపి జిలే
బీలయిరే బామ్మలు గా
స్త్రీలకు మ్రొక్కినఁ ధనమును, శ్రేయముఁ గలుగున్!


***

జాలీ జాలీ గా ప
ద్యాలల్లుచు శతకమునకు దారిన్ గనిరీ
వేళ విషయము పడతిగా
స్త్రీలకు మ్రొక్కినఁ ధనమును, శ్రేయముఁ గలుగున్!


***


మూలాధారము నుండి క
పాలములో బ్రహ్మరంధ్ర పరిణితి వరకున్
పాలిచ్చిన తల్లి చలువ
స్త్రీలకు మ్రొక్కినఁ ధనమును, శ్రేయముఁ గలుగున్!



***
జిలేబి
***


 

206 comments:

  1. అన్ని పద్యాలు సరళంగా ఉండి, అర్థం అయి చాలా బావున్నాయి. చివరిది ఇంకా నచ్చింది. ఏలోకంలోనైనా సన్మార్గం చూపే అమ్మ అమ్మే, మరో ప్రత్యామ్నాయం లేదు కదా!

    ReplyDelete


  2. ధన్యవాదాలండీ అన్యగామి గారు


    జిలేబి

    ReplyDelete
  3. డీలింగురూము, నెక్స్చేం
    జీలన్,స్టాక్మార్కెటున గజిబిజియు లేకన్
    వాలెట్లన్నింపిరయా
    స్త్రీలకు మ్రొక్కిన ధనమును శ్రేయముఁ గల్గున్ !

    ఏలెన్ దేశము బింద్రన్
    వాలేలన్నడచెను భళి బాంకుల జాతీ
    యాలై నిల్పెను వినుమా
    స్త్రీలకు మ్రొక్కిన ధనమును శ్రేయముఁ గల్గున్ !

    పద్య రచనలో పీక్ కి వెళ్ళిపోయారుగా.....జిలేబీకి కలదొక బుర్ర :)

    ReplyDelete
    Replies

    1. మీ జోష్ కి లాల్ సలామ్ :)

      దూకేయండీ మీరున్నూ శంకరాభరణము లోనికి :)


      జిలేబి

      Delete
    2. ప్రతిభల్ గల్గెడు గాక ! పద్యరచనన్ , పాండిత్య ప్రాకాండ సం
      స్తుతులన్ బొందెడు గాక ! , సంతత బుధాస్తో కాంతరంగాత్ములై ,
      చతురాహ్లాద మనోజ నైజ ప్రతిభల్ సల్లాపముల్ గోల్పడెన్ ,
      గతి దప్పెన్ , హితులన్ జిలేబి మరిచెన్ , కావివ్వి యభ్యున్నతుల్ .

      Delete


    3. మరిచా మెవ్వరి నన్నా !
      పిరియపు నేస్తమ ! జిలేబి విదురుని పలుకుల్
      మరిచెనె పుడయ్య ! రాజా!
      సిరి మత్తేభముగ చెంత చేరిరి నెనరుల్ !

      జిలేబి

      Delete
    4. సాలె గూటి లోకి జన్న యమాయిక
      ప్రాణి కోటి రీతి పండిత చెఱ
      జిక్కి విమల మతులు చెడుదురు సహజత్వ
      ప్రతిభ గోలుపోయి పటిమ తరిగి .

      Delete


  4. సహజత్వమున్న వారికి
    బెహతరు యిదియున్నదియు గబీలస లేలా !
    విహితుడ! విద్యగ నేర్వన్
    మహిని, జిలేబుల్ వరుసగ మనదై వచ్చున్ !

    జిలేబి

    ReplyDelete


  5. సత్యాన్నుంచాలోయీ
    సత్యముగ జిలేబి, నీవసత్యము లాడన్
    సత్యము బోవ బురదలో
    నిత్యము దొర్లెదవు నీవు నీరజ నేత్రా !

    జిలేబి

    ReplyDelete


  6. మీ రాతలందరికి సా
    మీ రవ్వంతైన లీన మీయదు! భువిలో
    నే రాదారిని నేర్పుత
    ధీరులకు, నలసుల ఖర్మ దీర్చతరమ్మే ?

    జిలేబి

    ReplyDelete


  7. హరిగాడు మిన్నకుండున
    కొ! రయ్యని జిలేబులొత్తి కొట్టక బోడే :)
    కరకర నహ్మదు చౌదరి
    శరముల త్రిప్పికొడుచున్ వెసవెసన్ రాడే :)

    జిలేబి

    ReplyDelete


  8. నాన్నల గురించి చక్కగ
    కొన్నైనా మంచిగ పలుకుల తెలిపిరిగా
    మిన్నగ రాసేరండీ
    వెన్న,అములుబట్టరున్ను విదురులు పొగడన్ :)

    జిలేబి

    ReplyDelete


  9. సరసపు వేళన తర్కము,
    బరబర మగడిని జిలేబి వాయించుట నీ
    కు రవణము కాదు సూ!అర
    కొర, విని గౌఁగిటను జేర్చుకొనుము లతాంగీ :)

    జిలేబి

    ReplyDelete


  10. పిరియపు పలుకుల జతగను
    మురిసితి నినుగని జిలేబి, ముదముగ రమణీ
    సరసకు రమ్మ! వలదు కొర
    కొర, విని గౌఁగిటను జేర్చుకొనుము లతాంగీ :)

    జిలేబి

    ReplyDelete


  11. జడ పద్యమ్ములు గురువుల
    దడదడ లాడించె గా, సదనమున గానన్
    తడయయ్యె భళారె జడా!
    గడగడ లాడింతువో పగడమై తలలో :)

    జిలేబి

    ReplyDelete


  12. కొత్త సామెత లొచ్చెనే కొమ్మ కొమ్మ
    ల కలుపుచు జిలేబీయమై లక్కు పేట
    రౌడి వచ్చెనే చాన్నాళ్లు రాక రాక
    యేమి టెస్టులు చేయనో నెవరి కెరుక :)

    జిలేబి

    ReplyDelete
  13. “జిలేబి” గారూ, మీరంతా తెలుగుభాషా ప్రవీణులు కదా, ఈ క్రింది వాక్యానికి కాస్త అర్థం చెబుతారా, చదువుతుంటే నాకు తికమకగా ఉంది.
    ————-
    పూజలను స..వి..వ..రం..గానూ, సం..క్షి..ప్తం..గానూ ఎలా చేసుకోవాలో మీకు అందిస్తున్నాం.
    —————
    ఈ వాక్యం ఒక తెలుగు టీవీ ఛానెల్ లో రోజూ ఉదయం 8.30 కు టీవీ తెరపై దర్శనమిస్తుంటుంది.

    ReplyDelete
    Replies

    1. సవివరము గా అనగా మీకష్టాలన్నీ పట్టీలను బట్టి చెప్పెదరు. మీకా కష్టములు లేకున్నా మీకుందనే భ్రామయన్ సర్వభూతాని మాయాలోకే అనుకునేటట్లు చేసెదరు‌.

      సంక్షిప్తము గా అనగా ఫీజులు గట్రా వివరాలు పెర్సనల్ గా కాలు చేయుడీ తెలిపెదము అని గూఢార్థము.


      నారదా
      జిలేబి

      Delete
  14. పద్యాలబ్లాగ్ లో ఈ రోజు మీరు చేసిన మనవి 👇
    ———————
    // “కందివారికి నెనరులు.

    జిలేబి పంచదశలోకము అని మార్చవలసినది గా విన్నపాలు.“ //
    ———————
    ఆశ 😀.
    రెండోది, too late కదా 😆.

    ReplyDelete
    Replies

    1. పాఠక సూపర్ స్టార్ అని వూరికే అన్నారా!

      సరిలేరు మీకెవ్వరు సాటి యిలలో విన్నకోట నరసరాయా !


      నెనరుల్స్
      ఏదో ఓ బంతి వేసి చూద్దామని.

      జిలేబి

      Delete


  15. దూరమున తాటి చెట్టుని
    నారాముగ చూడగా మనకనుల కట్లే
    ధారాళముగా భుజగపు
    కోరల వలె గాన్పడుగద గువ్వల చెన్నా :)

    జిలేబి

    ReplyDelete


  16. నీ పేరేమిట్రా యని
    దాపరియ! యనానిమస్సు! తాటవొలుతు నం
    టే పోరా పోకిరిగా
    డా! పేరేంటోయి నీకు డస్సులవేలా :)

    జిలేబి

    ReplyDelete


  17. పటపట పండ్లు కొరుకుచున్
    పిటపిట లాడు పరువంపు బింబోష్ఠిని, హా!
    జటబట్టిలాగు దుష్టుని,
    నిటలాక్షుఁడు, శివునిఁ, గాంచి నివ్వెఱబోయెన్ !

    జిలేబి

    ReplyDelete


  18. నీరవ నిశీధి యయెగా
    దా రుణ కృష్ణభుజగము ; సుధల్ వెలి గ్రక్కెన్
    నీరవ మోడియు నింగ్లాం
    డ్లో రయ్యని విజయమాల్య రూటున బోవన్ :)

    జిలేబి

    ReplyDelete


  19. కాళీయ మర్దనం !


    నీ రుణ మెట్లన తీర్చుదు!
    దారుణ మై బతికినాను దర్పము తో నా
    దారిని, కృష్ణా! యనుచున్
    దారుణ కృష్ణభుజగము సుధల్వెలి గ్రక్కెన్

    జిలేబి

    ReplyDelete


  20. భారంబయె బతుకునకు స
    దా, రుణ కృష్ణభుజగము ; సుధల్ వెలి గ్రక్కెన్
    ధీరత్వము జేర్చుచు నీ
    కారుణ్యపు చూపులయ్య కలియుగ వరదా!

    జిలేబి

    ReplyDelete


  21. పరమ శివుని నాగమడిగె
    గరుడునిఁ గని, సంతసించుఁ గద భుజగమ్ముల్,
    గురుడా బాగుండగ నీ
    వు! రుసరుసనతడనె తమరి పుణ్యంబు సుమా :)

    జిలేబి వారి వేదాంతము :)

    ReplyDelete


  22. రాముని యనుంగు మిత్రుడు
    సోముఁడు, నిప్పులను గురిసె సూర్యునివలెనే
    భీముని పైనాతండట
    రాముని కొట్టగ, జిలేబి రాధనమొందన్ !

    జిలేబి

    ReplyDelete
  23. ఈ వార్త చదివారా ?👇
    —————————————
    “Kochhar to go on leave”

    (Deccan Chronicle dt.19-Jun-2018 front page)
    ——————————————
    ప్రైవేట్ రంగ ‘హేమాహేమీలు’, ‘ఉద్దండులు’ ??
    Fall of giants అనచ్చా ?? 🤔

    ReplyDelete
    Replies


    1. కాల వాహిని అలలవి కాదు సూవె
      యెల్ల వేళలు మనవి పయిసల రాజ్య
      మెల్ల గందర గోళము మెండు గాను
      కాలము దరిదాపు గలదు కాచు కొనుమ !

      జిలేబి

      Delete
    2. This comment has been removed by the author.

      Delete
    3. హేమాహేమీలూ, ఉద్ధండులూ తప్పు చేయరా ?
      ఏ తప్పూ చేయనివారు ఈ భూమ్మీద ఉండరు.
      ఎంతటివారలయినా "పతీ"దాసీలే !

      Delete


  24. అందమైన తెలుగు చదువంగ సంత
    సంబ యెను నందు కొనుడమ్మ చక్క గ నభి
    నందనలను లలిత! శైలి నాట్య మాడె
    కొత్త పుంతల తొక్కుచు కొరత దీర్చె

    జిలేబి

    ReplyDelete


  25. ఇలలో టికాణ తిండికి
    కలగాంచుచు చూచు నతడు కనకపు ధారల్
    చెలువపు జిలేబిగా కవి
    తలలో, స్వర్గమ్ముఁ జూపు, ధన్యుఁడె కవియౌ !

    ***

    మిలమిల మెరియు కవివరు క
    నులు! తళతళలాడుచుండు నుంపారుగ గుం
    డు! లయ లొలికించుచు భళి వె
    తలలో, స్వర్గమ్ముఁ జూపు, ధన్యుఁడె కవియౌ !

    ***

    బలిమియు లేదు శరీరము
    న లెస్స గా పల్కలేడు ! నాన్చుడు వ్యవహా
    రి! లవించి పద్యముల తన
    తలలో, స్వర్గమ్ముఁ జూపు, ధన్యుఁడె కవియౌ !


    ***

    సలసల కాగెడు నూనియ
    న లబ్జుగా వేసి తీసి న జిలేబులలా
    పలు రీతుల మత్తున రా
    తలలో స్వర్గమ్ము జూపు ధన్యుడె, కవియౌ!

    ***

    భలె! తిరిగెడు కాళ్లున్ తి
    ట్టుల గూడెడు వాయి చేయి టుప్పనుచున్ తా
    గలగల తిరుగక, తన కవి
    తలలో స్వర్గమ్ము జూపు ధన్యుడె, కవియౌ!

    ***

    తలపులనసమాన ప్రతిభ
    గల మానవుడు కవివరుడు కలగాంచు భళా
    యిలని బయోస్కోపున, కై
    తలలో, స్వర్గమ్ముఁ జూపు, ధన్యుఁడె కవియౌ !

    ***

    తలపులనసమాన ప్రతిభ
    గల మానవుడు కవివరుడు కలగాంచు భళా
    యిలని బయోస్కోపున, కై
    తలలో, స్వర్గమ్ముఁ జూపు, ధన్యుఁడె కవియౌ !

    ***

    ఇలని పలమనేరున గల,
    పలుకుల నొయ్యారముగ సభాస్థలి నుంపా
    ర లయలొలికించు కవి, రా
    తలలో స్వర్గమ్ము జూపు ధన్యుడె, కవియౌ!

    ***

    అలవోకగ హరిగతి పరు
    గులెత్తెడు ప్రభాకరుల బిగువగు పదపు సొం
    పుల,నాటవిడుపులన్,రా
    తలలో స్వర్గమ్ము జూపు ధన్యుడె, కవియౌ!


    ***

    ReplyDelete


  26. ఇలని కవి క్రాంతదర్శి వె
    తల మీరుచు మేలుగ పలు తలపుల మదిలో
    మెలమెల్లగతట్టుచు రా
    తలలో స్వర్గమ్ము జూపు ధన్యుడె, కవియౌ!

    జిలేబి

    ReplyDelete


  27. భాసా! సరి జేయండీ!
    మీసమ్ములు లేని వనిత మేదినిఁ గలదే
    దోసము! మీ కాదండీ
    "మో" సమ్ములు లేని వనిత, మోహిని గలదే :)

    జిలేబి

    ReplyDelete


  28. తలమానికమ్ము శంకరు
    కొలువు కవులకున్ జిలేబి గూర్చన పద్యం
    బుల నందున సరదా కవి
    తలలో స్వర్గమ్ముఁ జూపు ధన్యుఁడె కవియౌ!


    జిలేబి

    ReplyDelete


  29. భాసా! సరి జేయండీ!
    మీసమ్ములు లేని వనిత మేదినిఁ గలదే
    దోసము! మీ కాదండీ
    "మో"సమ్ములు లేని వనిత, మోహిని గలదే :)

    జిలేబి

    ReplyDelete
  30. // “హేమాహేమీలూ, ఉద్ధండులూ తప్పు చేయరా ? ఏ తప్పూ చేయనివారు ఈ భూమ్మీద ఉండరు. ఎంతటివారలయినా "పతీ"దాసీలే ! “ //

    చెయ్యకూడదు నీహారిక గారూ. ముఖ్యంగా ఆర్ధికరంగంలో ఏ ఉద్యోగీ చెయ్యకూడదు, ఇక హేమాహేమీలుగా చలామణీ అవుతున్నవారి మాట చెప్పేదేముంది. పైగా తెలిసి తెలిసీ అస్సలు చెయ్యకూడదు. నేను చరణదాసి టైపు, కాబట్టి కోటానుకోట్ల రూపాయలు మా ఆర్యపుత్రులు పనిచేసే కంపెనీకి అప్పుగా ఇచ్చేస్తాను ... అంటే వీలవదండి. Conflict of interest అవుతుందా అని దృష్టిలో పెట్టుకోవాలి. ఆ డబ్బు మీలాంటి, నాలాంటి సామాన్యప్రజలు నమ్మకంతో బ్యాంకులో డిపాజిట్లుగా దాచుకున్నది. ఆ సొమ్ముకు బ్యాంకు వారు ధర్మకర్తలు trustees మాత్రమే. సరిగా చూసుకోకుండా ఇచ్చెయ్యడానికి భక్త రామదాసు గారు అన్నట్లు “ఎవడబ్బ సొమ్మనీ”?

    ReplyDelete
    Replies
    1. ఆవిడ తన భర్త పనిచేసే కంపెనీకి మేలు చేకూర్చేలా పనిచేసిపెట్టారని ఒక whistle blower అంటున్నారు.ఒక శక్తివంతమైన మహిళ ఈ సమస్య నుండి ఎలా బయటపడతారో చూద్దాం.

      Delete


    2. పెనిమిటి పనిజేసెడు కం
      పెనిలో తనకెంత వాట వెళ్ళెనకో తె
      ల్సిన చెప్పండీ జనులా
      ర! నాంచుడు కతలువలదిక రాబడి యెంతో ?

      జిలేబి

      Delete


  31. ఒకరినొప్పి నింకొకరికి త్రోయ లేను
    సరియు గాదిది పద్మను చల్ల గాలి
    లక్షణము నాది జవరాల లయలొలుకుట
    మాత్రమే తెలియును నాకు మది జిలేబి!

    జిలేబి

    ReplyDelete
  32. Replies


    1. వేదాలను చదవండోయ్
      వాదాలకు దూరమై సభామర్యాదల్
      ఆదరణ గనుడి! మనకిది
      గోదారి మునకలు వేయ గోవింద యనన్ !

      జిలేబి

      Delete


  33. అతుకుల బొంతగు తమ జీ
    విత మందున మందుకొట్టు విపరీతపు చే
    ష్ట తన పెనిమిటిది! దానిని
    పతి విడనాడిన సతికి శుభమ్ములు గలుగున్ !

    జిలేబి

    ReplyDelete


  34. కదిలె నోయి బండి జనుల కావ గాను
    కదిలె జనసైనికుడు మన కదన వీరు
    డయ్య పవనకళ్యాణుడు డస్సి బోడు
    రాష్ట్ర మున కితడె దెస బిరాన రండి
    చేయి చేయి కలుపగాను చేవ గూడు

    జిలేబి

    ReplyDelete


  35. అహమును పెంచును యోగము
    యిహమున కై పరమును త్యజియింప జిలేబీ !
    మహిత హితమ్మిది కాదోయ్
    సహనమ్మును పెంచవలెను సత్సంగమహో !

    జిలేబి

    ReplyDelete


  36. పరుగుల మసీదు బోవన్
    తురకలు, జంధ్యమ్ముఁ దాల్చుదురు యాజ్ఞికులై,
    యిరుబుట్టువులు, నొకండే
    పరమాత్ముడు చేరు గతులు పరిపరి సుమ్మీ !


    జిలేబి

    ReplyDelete


  37. పెరుగును నహము శరీరము
    తరుగుట యే యోగమనుచు తనువును నాడిం
    ప రకరకమ్ములుగ జిలే
    బి! రమావల్లభుని గనుము వీటిని మీరన్

    జిలేబి

    ReplyDelete


  38. వర సౌరమ్మను జన్నము
    పరహిత వైద్యుడు తెలుపగ పరిపరి విధముల్
    వరమియ్యదే మనకనుచు
    తురకలు జంధ్యమ్ము దాల్చుదురు యాఙ్ఞికులై

    ***

    పరమాత్ముని మస్జీదున
    శరణాగతి గాంచువారు సఖియా యెవరో?
    ధరణీ సురులెటు కొల్తురు?
    తురకలు; జంధ్యమ్ముఁ దాల్చుదురు యాజ్ఞికులై

    ***

    ReplyDelete


  39. సందర్భము - "ఆతుర " - వ్యాధిగ్రస్తుడు పరహిత వైద్యులు సంధ్య వారిస్తే రోగంపోతుందని చెప్పడము.



    పరమాత్ముని రూపమతడు
    వరమై కష్టేఫలి, అనపర్తి మనుజుడా
    పరహిత వైద్యుడనన్ "నా
    తుర" కలు,జంధ్యమ్ముఁ దాల్చుదురు యాజ్ఞికులై!

    జిలేబి

    ReplyDelete


  40. పురహిత దర్గా దారిన్
    తురకలు, జంధ్యమ్ముఁ దాల్చుదురు యాజ్ఞికులై
    పరుల హితమునకు పారులు,
    వరమయ్యిరి యనుగలమ్ము పరమావధిగన్!

    ***

    ఆహా ! తురకలు లో కల్లుని గాంచిరి !

    అదురహో కోటవారు !

    అరరే జిలేబియా జే
    తుర,కలు? జంధ్యమ్ము దాల్చుదురు యాఙ్ఞికులై,
    ధరణీ సురులుగదా! బా
    మ్మ, రాజ శేఖరుల పద్య మాధురి గనుమా!

    ***

    చెరువున పుకిలింతురు బో
    తురకలు, జంధ్యమ్ము దాల్చుదురు యాఙ్ఞికులై,
    సరసన పూజావిధిగన్
    ధరణీసురులు, వివిధములు ధ్యానపు తీరుల్

    ***

    ReplyDelete


  41. పరిచిరి పూసగ సీసము
    ల రాధనంబయె జిలేబులమరెన్ కందం
    బు రుచిర మాయెన్ సరికొ
    త్త రోహితము శంకరుని సదనమున కృష్ణా!

    జిలేబి

    ReplyDelete


  42. " ఆబ" కం :)


    సరియై మాకిల వేల్పుల
    మరలేదౌ లవ్జిహాదు మరకల్ వలద
    య్య! రమానాధు శరణు గొ
    ల్తుర! కలుషితమవమికన్ ములుగు భాజ్పాయే!

    జిలేబి

    ReplyDelete


  43. ఆడు సెన్సులదిగదిగో నయ్య గూగు
    లోడి చలువ గావచ్చు హలో హలో య
    నుచు జిలేబులూరంగ తెనుంగు వారి
    కెల్ల,! వచ్చునోదస్కము కెంపులీన‌ :)

    జిలేబి

    ReplyDelete


  44. అదిగో యెలుకలు తినెన
    మ్మ దళసరిగ నోట్లనకట ! మన దేశములో
    పద రాజకీయ నాయకు
    ల దమ్ము గనెదిరిచి పోరులన్ జేయ నవిల్ :)

    జిలేబి

    ReplyDelete


  45. దెసయో కాదో తెలియదు
    పసగల్గిన వాళ్లు లేరు పడతి జిలేబీ
    వెస యెవరొచ్చిననూ మే
    లు సుమీ రాష్ట్రమును గావ లూటీ గనకన్

    జిలేబి

    ReplyDelete
  46. "తురకల సంజాతుల" సమస్య ఇప్పట్లో తీరేట్లు లేదే 😕?

    ReplyDelete

  47. ఒకటిన్నర రోజుల సమస్య :)

    మారిపోయింది కొత్త సమస్యొచ్చె :) ఎంటైర్ శివుని ఫామిలీ తో విష్ణు స్తుతి చేయిస్తున్నారు :) ఎప్పుడైనా వుల్టా చేయించేరా ? హు :) నో పార్షియాలిటీ :)


    జిలేబి

    ReplyDelete


  48. అడుగెయ్య వోయి ముందుకు
    బడబానలమైన బతుకు బాటను దాటన్
    విడవాలోయ్బంధాలను
    తడ యాధ్యాత్మికతకైన తరిమేయాలోయ్ !

    జిలేబి

    ReplyDelete


  49. హరిబాబు బజ్జి, లలిత
    మ్మ రవళి శంకరుకొలువుల మాకందంబుల్
    బిరబిర పద్మార్పితముల్
    తరమై పంచదశలోక దరువై వెలిగెన్ :)

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. బండి రావు గారి కరోకే లు (karaoke) కూడా కలపాలి సుమండీ ☝️🙂.

      Delete


    2. హరిబాబు బజ్జి, లలిత
      మ్మ రవళి శంకరుకొలువుల మాకందంబుల్
      కరయోకె బండి, పద్మా
      న్తరయున్ పంచదశలోక దరువై వెలిగెన్ :)

      జిలేబి

      Delete

  50. విన్న , కోట వారిని వదిలేస్తే యెట్లా :)

    హరిబాబు గారి బజ్జీ
    లు,రావు గారి కరఓకెలు, కులుకు కందాల్,
    నరసన్న వ్యాఖ్య,లలిత క
    బురులున్ పద్మార్పిత యెద పొంగులు వాహ్ వాహ్!


    జిలేబి

    ReplyDelete


  51. జరభద్రం కొడుకో విను
    చెరవాణి యదేలనోయి చెంతన ఛీ! ఛీ!
    సరసన నుండగ దూరపు
    వరుస పలకరింపులాయె వలదే వలపోయ్ :)

    జిలేబి

    ReplyDelete


  52. హృదయకుహరవాసా! దే
    వదేవ ! దైనందినమున వర్ధిల్లగ మ
    మ్ము దయగను! మాకు, మా రమ
    ణదేవ, హరి,సురగణేశ, నాణ్యత గూర్చన్

    జిలేబి

    ReplyDelete


  53. రాముని నామ జపమ్మును
    నీమము తప్పక సలుపుచు నిండుగ మనసా
    త్వామనురజామి యయ్యెడి
    కాముకులు పవిత్రు లనుట కల్ల యెటు లగున్?

    జిలేబి

    ReplyDelete


  54. అరయగ నహింస యే గొ
    ప్ప,రణము వలదిక తిననిక పాముల ననుచున్
    పరితాపముతో చిక్కిన
    గరుడుని, నొక వానపాము గ్రక్కున మ్రింగెన్

    జిలేబి

    ReplyDelete


  55. వేద్యంబగు యత్నింపగ
    మద్యంబునకన్న తీపి మధువిది వినుడోయ్
    విద్యార్థులార గురువులు
    పద్యమ్మును వ్రాయకున్న వహ్వా యనరే‌:)

    జిలేబి

    ReplyDelete


  56. తెలుగు నాట గలరయ పదిలముగా ని
    రువురు ప్రభువులు, "మాకంద" రుంద్రపు జడ
    పద్యముల మేమె ప్రచురింప వలసి వచ్చె
    చంద్రు లిద్ద రున్నను లేదు చంద్రకాంతి
    నైన నేమి చేసితిమి యత్నమ్ము తెలుగు
    పద్య మును నిలుప నదిగో వచ్చుచుండె

    జిలేబి

    ReplyDelete


  57. ముఖపుస్తక లోకములో
    సఖుడా దూషణలు లేవ? శాంతంబున దే
    లు ఖలులసలు లేని ములుగు
    ముఖాముఖి తలంబకో? ప్రముఖుడ! తెలుపుమా!


    జిలేబి

    ReplyDelete


  58. ముందరి మిత్రుడొ కండయె
    బిందా సైన తెలగాణ వీరుడొకడయెన్
    చిందరవందర జేయుచు
    కందుకముల మోడి నాడి కందించిరిగా :)


    జిలేబి

    ReplyDelete


  59. రాహులుడు నాడు తల్లితో :)

    కన్నూమిన్నూ కానక
    నన్నూ నిన్నూ తెలుగు జనాళియు నమ్మో
    బన్నము లాడిరి విడువక
    సున్న మిడవె యన్నమేల చుట్టంబునకున్ :)

    జిలేబి

    ReplyDelete


  60. పద్యము లన్వ్రాయుమయా
    మద్యము సేవించి, నడుపుమా వాహనమున్
    సేద్యపు రీతి గవనముగ
    వేద్యంబగునీకు దరువు వేగము గానన్ !

    నారదా!
    జిలేబి

    ReplyDelete


  61. కొంతయు చేసెనకో మా
    కింతైనన్ మేలు నేత! కితకిత జేర్చన్
    వింతగ నభమున కెత్తెడు
    సంతాపసభల్ జనులకు సంతస మొసఁగున్ :)

    జిలేబి

    ReplyDelete


  62. కవితా! నా బ్యూటీ!పద
    రు విరహముల బెంజిసెంటరు చివర నిలిపే
    వు! వగచితి నేనిపుడు రా
    వె వరూధిని! రా జిలేబి వెస సైయనుచున్!


    జిలేబి

    ReplyDelete


  63. ఏ పిట్టపొట్ట లోనన్
    ఓ పిట పిటలాడు పడతి గుట్టేదుందో?
    కౌపీనపునాటికతల
    టోపి జిలేబుల మయమ్ము టోక్రా బాబో ? :)


    జిలేబి

    ReplyDelete


  64. అమలాపురమమ్మాయిలు
    ఘమఘమలన్ మల్లియల సిగనిజొనుపుచు మా
    ర్గమున నడువన్ జిలేబీ
    కమలాప్తుని రశ్మి సోకి కమలెఁ గమలముల్.

    జిలేబి

    ReplyDelete


  65. నమస్తే హైద్రాబాదనెడు సినిమా నామనోభావముల్ మీ
    సమక్షమ్మందొచ్చే సమయ మిదిగో సాహితీ మిత్రులారా
    సమీపించే నగ్నంబుగ ని దియె చేసాను చిత్రంబుగా బ్లా
    గుమిత్రుల్ చూడండీ యిపుడె కథలోకూరినా సెంటిమెంట్లన్

    జిలేబి

    ReplyDelete


  66. వేదన పడకండి సుభిక్షమిదియె మనకు
    రాధనమును తెచ్చు జనులారా వినండి !
    రాదనగ వచ్చె తెలగాణ రాష్ట్రమున్ను
    లేదనఁగఁ గల్గు భోగభాగ్యోదయమ్ము

    ***

    వేదన వలదు గనుడు సుభిక్షమిదియె మనకు
    రాధనమును తెచ్చు జనులారా వినండి !
    రాదనగ వచ్చె తెలగాణ రాష్ట్రమున్ను
    లేదనఁగఁ గల్గు భోగభాగ్యోదయమ్ము



    జిలేబి

    ReplyDelete


  67. భళారే! ఈనాడే వరుస గ టపా వాడుకున్నారు! మీరే
    ములాజా లేకుండా సదరు కతలన్ ముందుగా కాపికొట్టే
    సిలాగించేసుండొచ్చుకద? నరుడా! సీ,మరీ యింతగామీ
    గులాబ్జామూనున్ కైవిడిచి రికదా! గోడుగా చింతలేలా :)


    జిలేబి

    ReplyDelete


  68. భక్తి యను గంధవతియే
    ముక్తికి మార్గమ్ము, మద్యమును గ్రోలుటయే
    రక్తికి మార్గము‌ బంధము
    యుక్తిగ వీడుము జిలేబి‌ యున్నతి గానన్ !

    జిలేబి

    ReplyDelete


  69. విద్యాదధాతి వినయము
    వేద్యంబగునపుడు మనకు వేదము మహిలో
    చోద్యంబదెట్లయా కవి
    విద్యాశూన్యుఁడు జనులకు వేదముఁ జెప్పున్?

    జిలేబి

    ReplyDelete


  70. మర్త్యు లార వినుడు మహిలోన బాధల
    శత్రు చయ మొసఁగుఁ, బ్రశాంతి నెపుడు
    మిత్రపక్ష మొసగు, మీటుగ విహితుల
    పటలి కై యతనము వలయు భువిని

    జిలేబి

    ReplyDelete


  71. ధారాళము పాలకడలి
    నా రాక్షసులు సురులు మధనమ్మట జేయన్
    పారిన గరళమ్మును మన
    సారా గొనె శివుడు లోకసంరక్షణకై!



    జిలేబి

    ReplyDelete


  72. నారా వారి ఉభయమయ!
    హేరాళమ్ముగ జిలేబు లేరాలముగన్
    వారుణి ! నారద తే! మన
    సారా గొనె శివుడు లోకసంరక్షణకై !

    జిలేబి

    ReplyDelete


  73. పణముగు పెట్టును మానము
    గుణహీనుం డైనవాఁడె, గురు వన నొప్పున్
    పణముగ సత్తును బెట్టెడు
    గుణవంతుడు మహిని సుదతి గురుతిది సుమ్మీ

    జిలేబి

    ReplyDelete


  74. మిరియాలు శొంఠి కలిపిన
    గరగర లాడెడు పయస్సు కస్సున నివ్వన్
    పరగడ మగనికి నరరే
    గిరిజా! పతి వానరమయి కిచకిచలాడెన్!

    జిలేబి

    ReplyDelete

  75. మనసు మహా చెడ్డది ప
    ద్మ నయన! నాపల్కుల వినదగును జిలేబీ !
    మనుజుల మిలలో వేచితి
    మి నీ టపా సరిగమల సమీరము కొరకై !


    జిలేబి

    ReplyDelete


  76. సంగీత పరముగా ఖుషి
    సాంగు భళా! స్పీడు కూడ చాంగు భళారే!
    డంగైతిని నరసన్నా !
    చెంగున పేరడి జిలేబి చిమచిమ లాడెన్ :)

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. పేరడి “చిమచిమలాడడం” ఏవిటండీ? అంటే మెచ్చుకున్నట్లా? గుమగుమలాడెన్ అన్నా కొంతలో కొంత నయం.

      Delete


  77. మాలిక డమాలు ! అరరే
    యేలనకో లక్కు పేట యేమా యెనకో ?
    స్క్రోలింగు పోయెను జిలే
    బీలకు మేటరు టపాలు విరివిగ లేవే :)

    జిలేబి

    ReplyDelete


  78. మీ పోయము కోసము ప
    ద్మా పడిగాపులు పడేము దామ్మా త్వరగా
    ఓపిక పోయె టపాసును
    రేపట్లోపల జిలేబి రెపరెప మననీ :)

    జిలేబి

    ReplyDelete


  79. తప్పు తెలుసుకుని సరిజే
    సెప్పటి కప్పుడు నడతను శీలములన్ తా
    చప్పున కాపాడుకొనగ
    గొప్పోడై నాయకుండగును నిక్కముగన్ !

    జిలేబి

    ReplyDelete


  80. అతుకుల బొంతగ రాముని
    కతను జిలేబి చదువంగ కందపు పాద
    మ్ము తనకు తోచగ నిట్లనె
    "పతియల్లుండై సపత్ని వరలెను సుతయై!"

    జిలేబి

    ReplyDelete


  81. పూరణ కిట్టింపులకై
    సోరణి దివ్వెల కళుకున సొంచాయింపన్
    సారమ్ము లేని పాద
    మ్మే రెపరెపలాడెనుగద మించార సుమీ :)

    జిలేబి

    ReplyDelete


  82. రాము లోరి సామి రచ్చబండని తాకె
    కర్మ యన్న నిదియె కాదకో జి
    లేబి? రూటు మార్పు లే జీవితమ్మున
    పునరపి పునరపిని పురిగొలుపునొ?

    జిలేబి

    ReplyDelete


  83. అరయ సతి మోము చంద్రుని యాననమ్ము
    నరయ సతి గుబ్బగవ యనలావృతమ్ము
    నరయ సతి యూరువులు మరి యరటిబోద
    లరయ కవుల తలపులు పొలపొల ‌సూవె!

    జిలేబి

    ReplyDelete


  84. సుర సుర యన నెండ తలపై సూటిగాను
    తగుల సతికి గొడుగుబట్టి తళుకు లీను
    కమ్మి చమకుల గాంచుచు కవియనెనయ
    "అరయ సతి!, గుబ్బగవ, యనలావృతమ్ము"

    జిలేబి

    ReplyDelete


  85. రాయస కారుల నడిగితి
    వా! యయ్యోరామ రామ ! వారు జిలేబీ
    లే! యట్లే యందురయా
    పాయసమున నుప్పు కలుపఁబడఁ దీయనయౌ!

    జిలేబి

    ReplyDelete


  86. వేదన లన్ బహుమతిగా
    స్వేదపు చినుకులనుకొనుచు స్వీకారమ్మై
    నీదైన శైలి లోనా
    మోదమ్మన కోరినావు మోహిని పద్మా !

    జిలేబి

    ReplyDelete


  87. నాకు తెలియదని చెప్పక
    తేకువ లేని వెధవల మతిభ్రమ దైవం
    బౌ! కల డన్నది బుచికీ
    యే! కొండలరాయ వినుమ యెంకటసామీ!

    జిలేబి

    ReplyDelete


  88. విఫలంబయ్యా ననుర
    క్తి ఫలింపక యనుచు పద్మ తిండాడుటదే
    ల! ఫకీరులవలె చింతిం
    చి ఫక్తు వేదన ల పడుచు చీకాకేలా !

    జిలేబి

    ReplyDelete


  89. అరయగ రాముని తమ్ముడు?
    దరమము విరిచి మనువాడె ధర్మము గానె
    వ్వరిని రఘురాముడు సుమీ?
    భరతుఁడు; పెండ్లాడినాఁడు భామిని సీతన్!

    జిలేబి

    ReplyDelete


  90. గుండెకు గాట్లిడు పద్మా
    పిండు హృదయమును జిలేబి పిప్పిరి జేయున్
    రెండున్నర యక్షరములు
    పండగ జేసుకొనెనోయి పరిపరి నిన్నే !

    జిలేబి

    ReplyDelete



  91. సరికొత్త లోకమును ప
    ద్మ! రయమునన్ ప్రేమతో‌సదా‌నిర్మాణం
    బరయగ వచ్చని చెప్ప
    మ్మ! రహస్యమిదియె‌ భువిని సమస్యల తీర్చన్ !

    జిలేబి

    ReplyDelete


  92. ఇద్దరు పిచ్చోళ్ళిక హా!
    ముద్దుగ కలుసుకొని దేశమునటన్ ప్రేమిం
    చేద్దారి యనుకొనెదరో!
    సుద్దుల నేర్చుకొని ట్రంపు చుమ్మా యిడునో :)

    జిలేబి

    ReplyDelete


  93. అది యుండెననుటకు భళా
    హృదియే యది యనుటకు పరిహృతమై బోవం
    గ దశానిర్దేశంబు మ
    న దైవ మనుటకు జిలేబి నమ్మక మేదోయ్ ?

    జిలేబి

    ReplyDelete


  94. విరిచెను రాముడు నాడే
    సరి చేసె మురారి నరుని సారధియై! అం
    బరమణి సరిజేయుచు భళి
    విరిచెన్ కైపదమునే కవీశ్వరుడగుచున్ :)

    జిలేబి

    ReplyDelete


  95. మీ యాశల సౌధమ్ములు
    ఓ యమ్మా పద్మ చెరిగి పోవు జిలేబీ !
    మీ యీ ధీమా సడలదు
    పో యెన్నటికిన్ శుభాంగి పుత్తడి బొమ్మా !

    జిలేబి

    ReplyDelete


  96. చేతి చిల్లిగవ్వయు లేదు చెంగటన్ జి
    లేబు లై‌ తలకాచగ లేరు పెద్ద
    వాళ్లు వీధిన పడినాను వారకాంత
    బతుకు తలిదండ్రులనుగావ పరిధి దాట
    ధర్మవర్తన మడ్డు కర్తవ్యమునకు

    జిలేబి

    ReplyDelete


  97. సలాంకొట్టేమయ్యా కవివరుడ! మీ సాటిగా వేసిరయ్యా
    కళావంతంబై వెల్గెనయ పదముల్ క్రాంతితో భీముడిన్ ని
    ల్పె లావణ్యంబొప్పంగ కనులెదుటన్! లెస్స శార్దూలమయ్యా!
    భళా! శ్రీరాజా! పాదపు వరుసలన్ బాగుగా గట్టిరయ్యా!

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. “కళావంతంబు” అనగా అర్థమేమిటి జిలేబి గారూ?

      Delete

    2. సమర్థముగా

      కళావంతుడు - సమర్థుడు.

      జిలేబి

      Delete
  98. కుశలమేగా “జిలేబి” గారూ?

    ReplyDelete
    Replies

    1. ఉభయకుశలోపరి పాఠక సూపర్ స్టార్ గారు.
      జడకందాల్ని కొలవటంలో కొలువు తీరును చూడ
      వేంచేసి వున్నాం :)


      జిలేబి

      Delete
    2. హమ్మయ్య, “జిలేబి” గారు is back and all is well with the (blog) world 🙂.

      😎 ⭐️

      Delete
    3. ' హమ్మయ్యా ' యని పించెను
      ' అమ్మోరు తిరు గమన ' , నరసన్నకు , భళిరా !
      అమ్మో ! అమ్మో ! యింతగ
      గ్రమ్మెన ? అభిమాన భుగ భుగ , జిలేబీపై .

      Delete
    4. “జిలేబి” గారు ఉంటే సందడితో కళకళలాడి పో...”ద్ది” (పోద్ది = సినిమాల, ఇప్పుడు టీవీల తెలుగు) కదా రాజారావు మాస్టారూ 🙂. “జిలేబి” గారు కనబడనప్పుడు బ్లాగ్ లోకం కొంచెం చప్పగా ఉందనిపిస్తుంది 🙁. అందుకనన్నమాట వారి తిరిగిరాకకు “హమ్మయ్య” అన్నది.

      Delete

  99. బుచికోయమ్మ బుచికీ
    యేడ పోనావే జిలేబమ్మో ? సాన్నాళ్ళు కనబల్లే ?

    ReplyDelete

  100. ఒరేయ్ బుచికి బడుద్దాయ్

    ఎవర్రా నువ్వు .

    పేరు చెప్పి శరణు కోరరా ఢింభకా!



    జిలేబి

    ReplyDelete


  101. పరమత సహనమ్మని నా
    ర్ష రహిత దేశమును నిలుప రయ్యన పోటీ
    లరరే ద్వేషపు పలుకుల
    పరమేశుఁ గొలువ, నఘములు పండవె కరమున్?

    జిలేబి

    ReplyDelete


  102. కరముల్ మోడ్చుచు జనులున్
    పరమేశుఁ గొలువ, నఘములు పండవె? కరమున్
    శరణుశరణనుచు జేర్చగ
    వరమిచ్చునతడు జిలేబి వరదుండగుచున్

    జిలేబి

    ReplyDelete


  103. సరిసరి స్వాధ్యాయీ! గడు
    సరి వాడివి సూవె! నీదు సర్వంబును నొ
    డ్డి రమేశును,నీశుని నా
    పరమేశుఁ గొలువ, నఘములు పండవె కరమున్

    జిలేబి

    ReplyDelete
  104. 🙏 ఒక తెలుగు అభిమాని కవిత 🙏

    పూతరేకులరిసె పూర్ణాలు బొబ్బట్లు
    కాకినాడ కాజ కజ్జికాయ
    బాదుషాలు జాంగ్రి పాయసమ్ముల కన్న
    తీయనైన భాష తెలుగు భాష!

    మిసిమి బంగినపల్లి మామిడుల రుచులు
    తాటిముంజలు మేటి సీతాఫలాలు
    మెరయు చక్కెరకేళి మాధురులకన్న
    తీయనైనది నా భాష తెలుగు భాష!

    పెసర పిండి పైన ప్రియమగు నల్లంబు
    దాని పైన మిర్చి దద్దరిల్ల
    జీల కర్ర తోడచేర్చిన ఉప్మాకు
    సాటి తెలుగు భాష మేటి భాష

    స్వర్గ మందు దొఱకు చప్పని అమృతంబు
    తాగ లెక సురులు ధరణి లొన
    ఆంధ్ర దెశమందు ఆవిర్భవింతురు
    ఆవ కాయ కొఱకు నంగలార్చి.

    కూర్మి తోడ తెచ్చి గోంగూర యాకులు
    రుబ్బి నూనె మిర్చి ఇంపు తోడ
    కారమింగువలను తగిలించి తిను వాడు
    ఘనుడు తెలుగు వాడు కాదె భువిని

    ఆట వెలది యనిన అభిమానమెక్కువ
    తేట గీతి యనిన తియ్య దనము
    సీస పద్యమనిన చిత్తమ్ము రంజిల్లు
    కంద పద్యమెంత సుందరమ్ము

    ReplyDelete


  105. వేణీ! కందపు పద్యమాలికలివే వేగంబుగా రమ్మ ! శ్రీ
    వాణీ పుత్రులు నిన్ను మెచ్చి వరుసన్ పారించినారివ్వి! పూ
    బోణీ! నాల్గనగంట కొట్టగ భళా పొత్తమ్ము ప్రాప్తంబగున్
    కాణీ లెక్కల పేర్చి కూర్చినవివే ! కాంతామణీ రా గొనన్!

    జిలేబి

    ReplyDelete


  106. జడకందం మా కందములకు శుభాకాంక్షలతో

    సవాలాయెన్ రాణీ మదితిరిగె నీ సన్నిధిన్ కోరుచున్ మే
    ఘవర్ణంబై సర్పంబువలె కదిలెన్ కాంతివంతంబుగా నీ
    దు వేణీ! పూబోణీ! లలన! మగువా! దువ్వినావే వయారీ
    రవేసాకుల్తెమ్మా కవివరులకై రా! సభాప్రాంగణం బి
    ద్ది వేంచేపుల్ కందమ్మునకు తిరికిన్ తీర్థమిద్దే శుభాంగీ!


    జిలేబి

    ReplyDelete

  107. రచ్చబండకు చేసెనయ్య పరాకుచెప్పుచు బోధలన్
    పిచ్చివాళ్ళ కమింట్ల బాధ్యత పీకదాకను మీది సూ
    ఖచ్చితమ్ముగ వత్తురింకను కక్షగట్టుచు వేయగన్
    పచ్చిబూతుల నోరుజారెడు పాగలోళ్లట పూటుగన్

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. మొదటిది పేరు దాచుకొని అసమంజసమైన వ్యాఖ్యలను చేసే అవకాశం ఇవ్వకండి.
      రెండవది భావవ్యక్తీకరణస్వేఛ్ఛ అనేది నిర్నిబంధమైన దేమీ కాదు. అసమంజసమైన వ్యాఖ్యలు వ్రాసినవారిది ఎటువంటీ బాధ్యతారాహిత్యమో ఆవ్యాఖ్యలను ప్రచురించిన వారిదీ అంటే బాధ్యతారాహిత్యం అన్నది దయచేసి గమనించండి. కొంతమంది నోటిదురదో చేతిదురదో వదుల్చుకుందుకు మాత్రం పనికివస్తున్నాయే కాని వీటివలన సామాజికప్రయోజనం ఏమీ సిధ్ధించటం లేదని అనుమానించక తప్పటం లేదు.

      శ్యామలీయం.

      Delete
  108. ఈరోజు పేపర్ లో శ్రీదేవి కుటుంబం తిరుమలలో స్వామివారిని దర్శించుకున్నట్లు ఫోటో తో సహా వేసారు. సంవత్సరీకం అవకుండా ఆలయ ప్రవేశం చేయవచ్చా ?

    ReplyDelete
  109. నా సందేహం ఏవిటంటే స్త్రీలు చనిపోతే దేవుడికి పట్టింపు ఉండదా ?

    ReplyDelete
    Replies

    1. పిచ్చి పిల్లా

      ఎవరు బాల్చీ తన్నినా దేముడి బాబాయ్ కి పట్టింపు వుండదు.


      జిలేబి

      Delete


  110. మా లక్కు పేట రౌడీ
    జాలము లో కాలు బెట్టె జా జా చౌద్రీ
    కోలాటమ్ములు మొదలగు
    తాళము తకిటతధిమి మిధి తటకిత యగునే :)

    జిలేబి

    ReplyDelete


  111. తిమ్మిని బమ్మిగ చేయుచు
    నమ్మ బలికెడు కుహనా జనాళి గలరయా
    నమ్మకు అతిగా జ్యోతి
    ష్యమ్మును గురువుల పలుకుల చక్కగ వినుమోయ్!

    జిలేబి

    ReplyDelete


  112. నిత్య మైనది సత్యము నిక్కమదియె
    కాని ప్రాణమానములకు కష్టమైన
    సమయమున నప్రియంబు, పొసగనిదైన
    సత్యమును బల్క బుధు లపచార మంద్రు

    జిలేబి

    ReplyDelete


  113. బడానాయకుడు కొత్తగా చేరిన ఛోటానేతల తో :)

    అయ్యిరయ నేతలుగ నయ్యిరయ్య మిత్రు
    లార! గవనము మీకు వలయును మీరు
    సత్యమును బల్క బుధు లపచార మంద్రు
    రాజకీయమున పనికి రాని దదియె

    జిలేబి

    ReplyDelete


  114. ఆబ కందము :)


    ముత్యము లమ్ముట లోనన్
    నత్యంతపు టాక్సులందున నమో కవిరాట్
    గత్యంతరమిక లేదు,న
    సత్యము బల్కంగ తప్పసలులేదు సుమా !

    జిలేబి

    ReplyDelete


  115. లప్పున నిన్న కలిసితిమి
    ఒప్పులకుప్పవు వలదను టొప్పదు నీకున్.
    గప్పున వచ్చితి సామీ
    చప్పున కైపదము చూడ చక్కగ నుండెన్

    జిలేబి.

    ReplyDelete


  116. గడ్డుకాలము నందున కలసి మెలసి
    వున్న ప్రజ స్వతంత్రపు పరవు తరువాయి
    దేశ మున నొకరినొకరు ద్వేషపడుచు
    యడ్డుగోడఁ గట్టిరి, సమైక్యతను గోరి
    కంకణము కట్టుకొనవలె కరుణమీర!

    జిలేబి

    ReplyDelete


  117. ఆబ కందము :)

    ఇడ్డెనుల జిలేబీలన్
    లడ్డులు పుడ్డింగులన్ ఫలాదుల వడలన్
    వడ్డింపగా వలదనక
    నడ్డు యిడుపు గట్టిరి లలన!సమైక్యముగా!

    జిలేబి

    ReplyDelete


  118. తుఫాన్లో మాకష్టమ్ముల తలపులన్ దువ్వె మీ బ్లాగ్టపాయే

    ReplyDelete
    Replies


    1. సఫాచేసెన్గాదే తరువులనటన్ సామిరంగా తుఫానే

      Delete


    2. తుఫాన్లో మాకష్టమ్ముల తలపులన్ దువ్వె మీ బ్లాగ్టపాయే
      సఫాచేసెన్గాదే తరువులనటన్ సామిరంగా తుఫానే
      మఫాజాత్ వర్షంబై కసరు బలుపై మా వెతల్యేటమవ్వన్
      జఫాకష్లైనారమ్మ జనులు సహించన్ త్సునామీల సుమ్మీ

      Delete


  119. మనసా మాయమ్మై పో
    వ నమ్ము మేలు వినవమ్మ పద్మార్పిత ప
    ల్కు నలుగురి లోన నగుబా
    టు నీకు తప్పును జిలేబి టోక్రా తినకే !

    జిలేబి

    ReplyDelete


  120. మాయాబజార్ :)


    జిలేబీలున్ వహ్వా యరిసెలు ! భళీ జీడిపప్పుల్! మజారే
    విలాసంబే ! జంబూ యురికొలిపెరా ! వీరభోజ్యంబిదే ర
    మ్మ! లడ్డుల్ పోళీలున్నొసగిరి వడల్ ! మా యశోదేయుడే క
    ర్త! లావై కల్యాణమ్మగు మకరికారాజికల్ చెక్కిలిన్ దా
    కు లే! వహ్వారే లక్ష్మణుడు మగడౌ ! కుంభకోణంబిదేరా !

    జిలేబి

    ReplyDelete


  121. అరిసెలు బూరె జిలేబీ
    లరె నొసగిరి జంబు! రమ్మ లంబూ మన రా
    జు రసమయ లక్ష్మణకుమా
    రు రమణిగా నురికొలుపెదరు వివాహమునన్

    జిలేబి

    ReplyDelete


  122. ఎంత మంది చదివెదరు చెంత చేరి
    కొంత మంది చదివినను కొండ నెక్కి
    నంత సంతసమయ కావున కన బడ్డ
    మాధ్యములలోన ప్రచురణ మస్తు జేతు :)

    జిలేబి

    ReplyDelete


  123. మనుజునికి మూలమని కో
    తిని చూపిరి! తప్పు సూవె తిమ్మడికి నరుం
    డని మంత్రిబల్కె నిక్కం
    బని నొక్కుచు పల్కెదన్ సభాసదులారా !

    జిలేబి

    ReplyDelete


  124. నలభై యేండ్ల పయిబడిన
    పలుకుబడి కలిగిన ప్రెస్సు పంతుడ నాకే
    విలువలు మారిన కాలపు
    వెల బోయిన మీడియాను వెస తెలిపెదవో ?

    జిలేబి

    ReplyDelete


  125. చదవాలన్నట్టి యితము
    పద నే విడిచితి జిలేబి పరమాత్ముడొకం
    డు దలముకొనుచు చదువగన్
    పదిలంబగు నారచనలు పదికాలమునన్ !

    జిలేబి

    ReplyDelete


  126. అరిగిరి హస్తిన నురికిరి
    పరుగుల జూదమున పోయె పడతుక మానం
    బురివటలైతలయొగ్గిరి
    కరిచెన్ పాండవుల విధి యెకాయెకి సుమ్మీ

    జిలేబి

    ReplyDelete

  127. ఆబ కందము :)

    అరికట్టుమోయి మిత్రుడ!
    నురికింపకు గుర్రమును విను బృహన్నల! త్రి
    ప్పు రథము గిరికీల్గొట్టుచు
    పురమ్ము బోవ కరికెక్క పోదాము పదా!

    జిలేబి

    ReplyDelete


  128. మనము చెప్పి నట్లు మనసది వినునకొ?
    మనసు చెప్పి నట్లు మనము విన్న
    లోక మొప్పునకొ? ప్రలోభ ములకు లొంగి
    పోకు పద్మ నయన పూవుబోడి !

    జిలేబి

    ReplyDelete


  129. రచయితలు వ్రాయు బుచికీ
    రచనల చదివే సహనము రమణీ కలదే
    వచియింపుమకో? వినుమా
    పచారి పట్టీ చదివిన భళి మేలుకదా!

    జిలేబి

    ReplyDelete


  130. పలికిరి పలువురట పద్యములను జడ
    పైన! ప్రకటనమ్ము వడిని సభన
    కంది వరుని గళము గద్గగ మయ్యెను
    పలుకలేనివాఁడె పండితుండు.

    జిలేబి

    ReplyDelete


  131. జింజిరి జిలేబి భళిభళి
    కంజదళముఖి భళిరభళి కందంబు భళీ
    వింజామరయిది సుమ్మీ
    తంజావూర్బొమ్మ సూవె తలయాడింపన్!

    జిలేబి

    ReplyDelete


  132. రోబోతో కడతారే
    పూబోడీ రంకు నీకు పుత్తడి బొమ్మా
    నీ బాయ్ఫ్రెండెవడమ్మా
    కౌబాయా? జాలువారె కవితయు పద్మా!

    జిలేబి

    ReplyDelete


  133. జాలము లోన జిలేబికి?
    గాలికొమరు జఘ్నియేది? గాదిలి మీరన్
    బాలా! పెనిమిటి రాముడు?
    వాల మొకటె తక్కువ; గద; వసుధాత్మజకున్!

    జిలేబి

    ReplyDelete


  134. బండి వచ్చె బీరు పోసె భారి గాను; వై వి యారు
    కొండ నెక్కి కోరు నో పకోడి, వేయ రావు గారి
    యండ వచ్చు నో జిలేబి, “ఆవలోడు పారు, పారు”


    నారాయణ
    జిలేబి

    ReplyDelete


  135. మనసారా గ్రోలు మయా
    మన సారా, ద్వైతసార మదియె! విదేశీ
    గ్లెనులివెటను "సమ్ సారా"
    మనకేలా? మన జిలేబి మన గంధవతీ!

    జిలేబి

    ReplyDelete

  136. ఆధునిక ఉభయ కవిమి
    త్రా! ధౌరేయుండ! బండి రావు మనీషా!
    బోధగురో! సినిమా గీ
    తా ధృష్టుడ!మా జిలేబి తారీపు గొనన్!

    జిలేబి

    ReplyDelete


  137. లోలాక్షి!జగన్మాత వి
    శాలాక్షి!అవనిజ! సీత! జానకి! వైదే
    హీ!లిబ్బిపడతుక! ఘన
    జ్వాలమొకటె తక్కువ గద వసుధాత్మజకున్!

    జిలేబి

    ReplyDelete


  138. ఆబ కందము


    స్కూలున్ జేరెన్ జానకి
    బాలల వాలముల నరికి పడవేయ నహో
    చాలమి మీరగ సూ, కర
    వాలమొకటె తక్కువాయె వసుధాత్మజకున్ !

    జిలేబి
    స్వస్తి

    ReplyDelete


  139. హేరాళముగ పసారపు
    నారోగ్యపు పోషకము మనకదే విటమిన్ !
    కారము చేదున్, తీపియు
    సారము లేనట్టి తిండి శక్తినిఁ గూర్చున్!

    జిలేబి

    ReplyDelete


  140. ఆబ కందము


    పోరా మగడ యని సతి సు
    తారముగా పుట్టినిల్లు తా బోవన్ వాహ్!
    వారెవ్వా పిజ్జా ! సం
    సారము లేనట్టి తిండి శక్తిని కూర్చున్ !

    జిలేబి

    ReplyDelete


  141. ఫక్కున నవ్వితి కవిరాట్!
    పక్కా యిది గాలికబురు పారుడ వినకోయ్
    నిక్కా యేయవలె!నెటుల
    కుక్కకుఁ దలఁ బ్రాలు వోయు కుతుకము కలిగెన్?

    జిలేబి

    ReplyDelete


  142. అలలన్ ముద్దా డ పరుగు
    న లహరిగన్మార నలకనందగ మొదలై
    పలుదెసల బోవగ కడలి
    వెలఁది యురమ్మున నొక వటవృక్షము మొల్చెన్!

    జిలేబి

    ReplyDelete


  143. పోషణ భళి రాచకుమారు పోలికయ్యె
    భేషుగా తండి దొరికె సోంబేరి తనము
    పెరిగి యెలుకల వెంటాడ వెస మరువగ
    మూషికం బొండు పిల్లిని ముద్దులాడె!

    ReplyDelete


  144. కలుగు లోన ముఖమునిడ కరకు గాను
    మూషికం బొండు పిల్లిని ముద్దులాడె,
    స్థాన బలిమి మహిమయది చక్క తెలుసు
    కొను జిలేబి జీవనమున కొనరు తెలివి !

    జిలేబి

    ReplyDelete

  145. అధిక్షేపాత్మక పూరణ

    కలగాంచితివో ? మత్తున
    వెలదుల సయ్యాటల బలుపెక్కితివో ! నీ
    పలుకుల యెరువులతో యే
    వెలది యురమ్మున నొక వటవృక్షము మొలచెన్?

    జిలేబి

    ReplyDelete


  146. మరణానికావలయు కవి
    వరులు సజీవముగ భువిని వర్ధిల్లెదర
    న్న ఋతపు దృష్టాంతముగా
    జరిపిరి జన్మదిన మనుచు సంతాపసభన్!

    जिलेबी

    ReplyDelete


  147. జిలేబి వారి జాంగ్రి :)


    అరె తల్లి దయని భువిలో
    న రమణముగ బిడ్డ పుట్టి నటునిటు నడయా
    డె రయము గన్ బ్రాకి, నరయ
    నరునకు వానరునకు నిల నాలుగు కాళ్లే !


    జిలేబి
    బొంగలూరు

    ReplyDelete


  148. అరయన్ పార్టీలనటన్
    జరిపిరి జన్మదిన మనుచు,సంతాపసభన్
    పిరియము గా గంధవతిన్
    సరసన జేర్చుకొనిరి సరసాంగి! జిలేబీ !


    జిలేబి

    ReplyDelete


  149. సకరుణుడు పెనిమిటి యుదయ
    ము కటంకటుడగును రేయి ముద్దుగులుకునే
    సకియ! వినవే జిలేబీ
    యొకచో సూర్యుఁడును జంద్రుఁ డొప్పిరి జంటన్!

    జిలేబి

    ReplyDelete


  150. అరరే కట్టెయు రాగన్
    జరిపిరి జన్మదిన మనుచు,సంతాపసభన్
    కురిపించిరి కన్నీళ్లన్
    సరి కట్టెయుబోవగాను సహజమిదిగదా!


    జిలేబి

    ReplyDelete


  151. ఆకట్టుకొనెడు కంఠపు
    లాకెట్టు చమక్కు, తళతళలను జిలేబిన్
    మాకందముగా కోరెడు
    చీఁకటిలో సూర్యునిఁ గని చేడియ నవ్వెన్!

    జిలేబి

    ReplyDelete


  152. కన్నీటి దారములతో
    మిన్నగ నౌ గుండె గాయ మెల్లన్ కుట్టే
    వన్న ప్రకటనము పద్మా
    సన్నుతి జేతున్ జిలేబి చక్కగ నిపుడే :)

    జిలేబి

    ReplyDelete


  153. వాకిట కొట్నపు కుండను
    తాకక తూలుచు సరకపు దారంబనుచున్
    మైకము లో విడువగ గో
    చీ, కటిలో సూర్యునిఁ గని చేడియ నవ్వెన్!



    జిలేబి

    ReplyDelete


  154. ఆటబట్టు కందము :)


    వాకిటి కొట్నపు కుండను
    తాకక నూదుచు బుగబుగ ధారాళముగా
    మైకము లో పడిన పతిని,
    చీఁకటిలో, సూర్యునిఁ గని చేడియ నవ్వెన్!

    జిలేబి

    ReplyDelete


  155. పుట్టుకు రావు జిలేబీల్
    కొట్టుకు రాలేము సూవె కొంగుపసిడియై
    పట్టవలె గట్టి యత్నము
    చెట్టాపట్టాలు వేయ చేవయు గూడున్ !

    జిలేబి

    ReplyDelete


  156. వారె వా జిలేబి :)

    చిదిమి దీపము నిడు చిన్ననాటి హరిమ
    నుండి నెరసిన తల నొంచు హరిమ
    దాక నిగ్గులాడి తను చింత తనకేల
    ముదిమి మీఁదఁ బడఁగ మురిసెఁ బడఁతి!


    జిలేబి
    కుదిరె పండిత సభ క్రుమ్మరింప కవితల్ :)

    ReplyDelete


  157. మనసు ద్రవించేలా వ్రా
    సినారు పద్మార్పితా ! పసిడిపల్కుల రా
    ణి! నెనరు లమ్మ జిలేబీ
    వినయమ్ముగ జోతలివియె విరివిగ మీకై !

    జిలేబి

    ReplyDelete


  158. దుష్టభాషకు జయమహో! ధూర్తపల్కు
    సర్వ సాధారణంబహో సాధువైన
    చాలు పద్యము వ్రాయవచ్చని తెలిసె జి
    లేబి రాసుకో పదముల లెస్సగాను :)

    జిలేబి
    (ఇవ్వాళ అన్నయ్య గారిని వదిలేది లే :))

    ReplyDelete


  159. ఆబ కందము :)




    చదువన్ బాగుగ పోడిమి
    కుదిరిన కొమరుడు మురిపెపు కోడలు మగడో
    పదిలము గా తన దాసుడు
    ముదిమిని ముద్దుల నొసంగె ముదిత జిలేబీ :)


    జిలేబి

    ReplyDelete


  160. నీ తలపుల్లో కరిగా
    నే తరుణీ పద్మనయన ! నీవే నావె
    ల్గై తరియింపు జిలేబీ
    ఖాతరు చేయను నెవరిని కంజదళముఖీ !

    జిలేబి

    ReplyDelete


  161. మనమెంత స్థాయి లో ప్రే
    మను పంచెదమో జిలేబి మనకా కైపే
    జనులందింతురు గౌరవ
    ము,నిక్కముగ ప్రేమను వినుము బతుకు బాటన్ !

    జిలేబి

    ReplyDelete


  162. తితిదే వారికి తెలుపం
    డి తమరి కేమి వలయును , గుడిని వెంకటసా
    మి తెరగును మార్చెదరు రం
    డి తరలి రండి జనులార డింగరులారా !

    జిలేబి

    ReplyDelete


  163. కావు కావు మటంచును కాచి వుందు
    రా పయిన కొంతయైన తీరక తమ యిడు
    ములట కష్ట పెట్టిన దైవము కన రాడు,
    దేవుఁడే లేఁ డటందు రాస్తికులు గాదె!

    జిలేబి

    ReplyDelete


  164. ఆంధ్రా కేదిస్తేను న
    రేంద్రుడ కావాలె మాకు రెండ్రెట్లెక్స్ట్రా
    చంద్రుడ నేనూరుకొనను
    రంధ్రము బెడతా పదవికి రఫ్ఫాడిస్తా !

    జిలేబి

    ReplyDelete


  165. మనసుకు నచ్చిన పద్యము
    విను పద్మార్పిత వినుమ సవినయము విషయం
    బును తెలుసుకొనమ్మా ఓ
    వనిత! జిలేబీ యమైన పథ్యంబిదియే !

    జిలేబి

    ReplyDelete


  166. కోవెల లోమస్జిదులో
    తావెలసెన్ చర్చి లోన తరియింపగ సు
    మ్మీ, విద్వేషమ్ములతో
    దేవుడు లేదాస్తికులట దెప్పుదురుగదా!

    జిలేబి

    ReplyDelete


  167. యతులవి మనకేలనయా సయాటగా ప్ర
    తి పదమూ మన దారిని తిరము గాన
    ప్రాసలవి మన కేల సుభాషితముగ
    సత్య మైన పలుకు సరసంబు గాన


    జిలేబి

    ReplyDelete


  168. వాటేసుకున్న రాహుల్
    దాటేయాలనుచు మోడి దాగుడు మూతల్
    కాటేయాలను కున్నా
    రో టోక్రా యివ్వ దలచి రువ్విరకో పో :)

    జిలేబి

    ReplyDelete


  169. ప్రేరణ వుంటే చాలం
    డీ రఫ్ఫాడించి పొడి పొడిగ చేసిపడే
    సే రసనగలదు, నరసిం
    హారావుని విన్నకోట యడ్డా మాదే !

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. భ్లాగే లేని చిన్నవాని కళ్ళు పలికే ఊసులూ
      టపాలన్ని గాలించి ఆలపించే పాటలూ
      క(ఖ)ర్మే నాకు పంచే జ్ఞాపకాలురా
      వాగే జిలేబే తలకు నెప్పిరా....

      Delete

    2. బ్లాగేలేదుర చిన్నవాని మనసే పల్కెన్ జిలేబీలపో

      (శార్దూలము ) :)

      జిలేబి

      Delete


  170. దత్తపది - 143
    చేప - రొయ్య - నత్త - పీత
    పై పదాలను అన్యార్థంలో ప్రయోగిస్తూ
    రామాయణార్థంలో
    +++++++

    చేపట్టెన్ సీతమ్మను
    శ్రీపతి, వనికేగెనత్తరి పితరు నాజ్ఞన్
    కాపాడెరొయ్యన మొనరి
    నోపికతో కాశ్యపీతనూజను సుదతీ


    జిలేబి

    ReplyDelete