ఆకాశవాణి సౌజన్యము -
ఆకాశవాణి సమస్యాపూరణ కార్యక్రమం - 10th Nov 2018
నిర్వహణ - శ్రీ బండకాడి అంజయ్య గారు
సౌజన్యం - ఆకాశ వాణి హైదరాబాదు
నేటి సమస్యాపూరణ కార్యక్రమం లో సమస్య
లయమే శాంతినిఁ గల్గఁ జేయును గదా రంజిల్ల సన్మార్గమై
జిలేబి పూరణ
భయమేలన్ సఖి! పెండ్లయెన్ గద! పతిన్! భార్యామణీ ప్రేయసీ
ప్రియుడన్! రావె శుభాంగి ! కొమ్మ! భువిలో ప్రేయస్సులన్గాంచి నా
శ్రయమున్ గోరుచు నీశుచెంత చెలిమిన్ సంపర్కమై చూడ నా
లయమే శాంతిని గల్గ జేయునుగదా రంజిల్ల సన్మార్గమై
చీర్స్
జిలేబి
ReplyDeleteఇవ్వాళ్టి ఆకాశ వాణి సమస్యా పూరణ కార్యక్రమం లో లక్కాకుల రాజారావు గారి పూరణ చదివినారోచ్ :)
జిలేబి
పూరణల్ జదివిన మోము దిబ్బ యగున ?
Deleteజదువ కున్న వన్నె చెదిరి చనున ?
ఇదియ కొలత బద్ద ? బుధుల మదిని గెల్చి
పద్య మలర వలయు , పండిత హిత !
Deleteచదివినా తప్పే ! చదవకున్నా తప్పే ! అబ్బబ్బ! యెట్లా యీ రాజులతో ... :)
చీర్స్
జిలేబి
లక్కాకల వారి స్టటయిల్
Deleteతక్కుంగల వారి కెట్లు దక్కును విహితా !
చిక్కని పెరుగన్నములో
మక్కుమతో పచ్చి మిర్చి నమిలిన భంగిన్ .
Deleteస్టయిలన్నారా సెటైర్ అన్నారా ? బాణం ఎక్కడో ఎక్కు పెట్టినట్టున్నారు :)
జిలేబి
జిలేబి గారూ: ప్రూఫులు వచ్చినవి. గురువుగారి "మున్నుడి" తరువాత ఒక పేజీలో మీ మూడు పద్యాలూ, శార్దూలం వెనుక కవరుపై అలరారుచున్నవి...
ReplyDeleteThe booklet is a riot :)
Deleteనమో నమః
శార్దూలంబుగ దూయు పొత్త మిక శ్రీ శాస్త్రీ సమాజమ్ముపై :)
నెనరుల్స్
జిలేబి
;)
Delete