Saturday, November 16, 2019

బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా! (పేలాల లవంగక శతకము ) - ఒరిజినల్ జిలేబి శతకము :)



బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!
(పేలాల లవంగక శతకము ) -
ఒరిజినల్ జిలేబి శతకము :)




1

పిస్తాలిస్తానంటే
వస్తా మల్మల్ కబురుల వయసున్నోడా
మస్తుగ చెబ్తా నాపై
బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!


2

మస్తుగ నేర్చితి టెల్గూ
జాస్తిగ ఛందమ్ము తెల్సు సాఫ్ట్వేరుందోయ్
కుస్తీల్జేస్తా వస్తా
బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!



3

మస్తైన శాస్త్రి వరుడా
కోస్తా నెల్లూరు మీది! కోసెడు కెళవున్
బస్తీ మాదీ! వస్తా
బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!



4

రాస్తా లో చదివితినే
బెస్తడి బాలసపు కైపు పీతల కత! నే
రాస్తా శతకముగా యిక
బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!



5

సుస్తీ పోగొడతా నే
బస్తెడు పేలాల నిస్తె; పద్యం చెప్తా
కాస్తా చెవుల దులుపగా
నేస్తమ్మును దేనికైన నేనే హితుడా!


6

వస్తిరి బ్రెజిలున కెల్లరు!
బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా
మస్తైన హింది నాదోయ్
నేస్తమునకు పేరు గన్న నెమ్మియు మాదోయ్!


7

విస్తారాన్వితగీతిన్
ప్రాస్తుత్యామ్నాయ శంకరాభరణమహో
పాస్తిభరణ్యువుల కొరకు
బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!


8

కోస్తాను పదమ్ములనే
రాస్తాను విడువక శంకరాభరణములో
విస్తారముగ జిలేబిన్
బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా! :)


9

ప్రస్తుత సమాజమున కవు
లాస్తులయెడు గ్రాంధికమ్ము లావుల్ దప్పన్
బస్తీ చౌకుని నమ్మిరి
"బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా"!


10

కోస్తా పేగులని జబ
ర్దస్తీగా ఛందమున పదమ్ముల నేస్తా
రాస్తా నేస్తమ్ములకై
బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!


11

పుస్తెల నమ్ముకు కొండకు
వస్తిని! శేషాద్రివాస! వరదా! కావన్!
నేస్తమ్మీవే స్వామీ!
బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!


12

వస్తాడండీ నారా
జొస్తాడిక వండనింట జొన్నయులేదే!
కాస్తా కరుణించండీ
బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!


13

కస్తూరీతిలకమ్మిడి
స్వస్తిక ముంగట నిలబడి ఛందముతోడై
గేస్తుడొకడు పలికెనిటుల్
బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!


14

మోస్తరుగా ఛందమ్మున
మేస్తిరి యై తిప్పలబడి మేధిర పలికెన్
వస్తువు లేదింట తినన్
బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!


15

రాస్తారోకోలంటిమి
వస్తా డిక ముఖ్యమంత్రి వడియనుకొన తోల్
తీస్తానని పలికెనతడె
బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!


16

ముస్తాబాయెను సభయే
ఉస్తాదు బడేమియా కవులకై సరదా
రాస్తా కైపదమిడగా
"బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా"!


17

జాస్తిగ మాట్లాడకుడీ
సుస్తియు చేయక జిలేబి చురుకుగ వచ్చున్
శాస్తియిదేనని పలుకున్
"బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా"!


18

వస్తమ్ము నిండుకొనె నా
దస్తువలెన్ కలదు బుద్ధి! దమ్మిడి లేదోయ్
హస్తమ్మున కరుణించుము
బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!


19

దోస్తీ ప్రభాకరులతో
మస్తీ కవివరులతో సమానముగా నే
చూస్తా వేడుక ! మీరిక
బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!


20

కాస్తోకూస్తో తెలుసోయ్
విస్తారముగా తెలియదు విదురుల వలెనోయ్
తీస్తా తాటనొలుస్తా
బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!


21

జాస్తిగ సంభావన నా
కొస్తి యను కొనవలదోయి కూవారము నా
దోస్తీ! గుప్పిట బట్టెడు
బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!


22

వస్తవి పోతవి డబ్బుల్
కస్తీరపు మిత్రత కలకాలము మనదోయ్!
రాస్తా శతకము తప్పక
బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!


23

కోస్తా జిల్లా వాడనె
"దోస్తని నొకడు సినిమాని దోసిలి చేర్చెన్
రాస్తా పనగల్ పార్కయె
బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!"


24

కుస్తీల్బడి ఛందమ్మును
బస్తీ బామ్మ యొకతయె సభాస్థలి లోనన్
రాస్తూ నేర్చి పలికె పో
బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!


25

చస్తే రానిక! కొలువా?
చూస్తే వీధిబడి యయ్యె! సొబగగు ఛందం
బస్తిత్వము కోల్పోయెన్
బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా?


26

రాస్తా వెంబడి ప్రకటన!
"బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా"
చూస్తూపోయా గతుకులు
కాస్తా బౌరమ్ముపేట గడి కనిపించెన్!


27

రాస్తూ రాస్తూ పోతే
వస్తుందండి పదములు ప్రవాహముగ గుభా
ళిస్తో! ఉదాహరణయిదె
"బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా"


28

మస్తాన్వలి శిష్యుడతడు!
ముస్తాఫా మాలు బయట ముదిమియు మీరన్
ప్రస్తుతి చేయుచు నిలిచెన్
"బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా"


29

దోస్తానా మాదేనోయ్!
పుస్తకమును వేసెదనిక భుక్తిక తోడై
వస్తుంది! మకుటమిదియే
"బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా"


30

కాస్తైనా నేర్చుకొనుము
మేస్తిరిని కుమార!రార! మేధాజీవుల్
చూస్తున్నారు! కొమరుడనె
"బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా"


31

మోస్తున్న గ్రాంధికమ్మను
బస్తా దింపగ వెలుపల బడె జనుల పదాల్
మస్తగు తెలుగిదియె సుమా
"బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా"


32

రాస్తాను శతకమిక నే
వేస్తా పొత్తముగ రండి! వేదిక వేస్తా!
వాస్తవపు కవివరుల స్థితి!
"బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా"


33

బస్తీ పిల్లయె పలుకగ
"బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా"
చూస్తే నా గుండాగెన్
కాస్తైనా లేదు తెలుగు కన్నుల కప్పెన్!


34

వస్తా వృద్ధాశ్రమమున
కొస్తా! వ్రాస్తా కవితల కూర్పుగ మీపై!
పిస్తా బాదము లేలా!
బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!


35

చూస్తారా శాస్రీజీ!
వాస్తవమగు పాదమును సవాలుగ వేయన్
వస్తుంది జిలేబి వరద!
బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!


36

తోస్తారా వలదనుచున్!
బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!
కాస్తా కరుణించండీ!
పస్తులు పడుచుండ్రి మా నివాసములోనన్!


37

రాస్తానండీ విడువక
బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా
నా స్తవనీయపు సదనము
కాస్తా హ్యాంగై నిలువగ, కంద జిలేబిన్ :)


38

ప్రస్తుతము పోవలెను నే,
చేస్తా రంటన్ రికార్డు చేరగ నిపుడే
ప్రస్తావింతు సమస్యగ
బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా! :)


39

హస్తాభినయమ్ములతో
వాస్తవమగు తన స్థితి తెలుపన్ యత్నించెన్
విస్తరి విడియాకులతో
"బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా"!


40

గస్తీల్తిరుగుచు రాత్రుల
మస్తు వెతికివెతికి పద్య మాలలు గా గు
చ్చేస్తున్న శాస్త్రి వరుడనె
"బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా"!


41

జాస్తి నటేశరమేశుడు!
ప్రస్తుతమున షేరులమ్ము వ్యాపారి పదాల్
వేస్తారా అంటె పలికె
"బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా"!


42

మస్తిష్కమ్ము‌న సరదా
తోస్తే వేయాలి పద్య తోరణముల్ రా
ణిస్తా కైపద మిస్తా
"బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా"!


43

వస్తా నే సైఫాబా
దొస్తా! ఆకాశవాణి ధోరణిలో ర
ప్పిస్తా చురుకుదనమ్మిక
బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!


44

వస్తూ వుంటే దారిని
మస్తాన్సాయెబు బొరువులు మదిదోచగ నా
మస్తిష్కపు కైపదమయె
బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!


45

వేస్తేనో యుమ్మీ డై
జిస్తివ్! అప్లమ్ముగాను చిప్లమ్మదియే!
చూస్తేను దిల్ బహారే!
బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!


46

చూస్తా నే పూరణలె
న్నొస్తాయో కవులవద్ద నుండి సదనమం
దిస్తా సమస్య యిదియే
బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!


47

వేస్తా గాలముగా కురి
పిస్తా పద్యముల నేడు విస్తృతముగ నే
నిస్తా గ్రామ్యపు పాదము
బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!


48

మస్తకమువంచి నిలువ త
థాస్తని దీవించి పదపు తావికి జోడై
వస్తాననె పలుకుపడతి!
బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!


49

తోస్తున్నది నే రాస్తా!
చూస్తా నెన్ని విధముల ప్రచురతముగా నా
కొస్తాయో కందముగా
బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!


50

విస్తారమ్ముగ యాభై!
ప్రస్తుతమునకిదియె నాఖ రై నిలిపెద!నే
వస్తా కూటికి పోవలె
బస్తెడు పేలాల వేల! వలదోయి సుమా !


51

మస్తాన్సాహెబు కొమరుని
కాస్తిగ ఛందమ్ము నేర్పగా ఘనుడాయెన్
వస్తూ దారెంట పలికె
బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!


52

పుస్తెల నమ్మగ తల్లియె
కిస్తుల నాంగ్లమ్ము చదివి కింకట బడుచున్
పస్తుల తాళక పలికెన్
బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!


53

చస్తూ బతికెననుదినము
పస్తాయించి వివరముగ పాతకతలనే
ప్రస్తావింపగ పలికెన్
బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!


54

లస్తకము బట్టి బాణము
వేస్తో పలికెనతడచట వేగము వలదం
టే స్తవముచేయుడీ సయి
బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!


55

వస్తానవధానిగ నే
నొస్తా తప్పక పిలిచిరి నోరారంగన్
చేస్తా సాహసమింకన్
బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!


56

దస్తావేజుని రాస్కో
కుస్తీల్జేసైన నేర్చి కొండాట్టముగా
వస్తానవధానిగనే!
బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!


57

మస్తైన దాంధ్ర భాష ప్ర
శస్తము! తేటతెనుగాయె చందము! సఖుడా
దస్తగిరికి నేర్చానోయ్
బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!


58

గస్తీలు తిరుగు వేళని
తీస్తా చురకత్తి నింక తేటతెనుగలో
రాస్తా రావిడి చేస్తో!
బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!


59

ఆస్తుల నమ్ముకొనిరి మా
కాస్తిగ ఛందమ్ము వదిలి ! కాసుల్లేవోయ్
ప్రస్తుతి చేస్తోరాస్తా
బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!


60

మోస్తాను నాటి కవివరు
లాస్తిని ఛందమును నా తలపుల జిలేబీ
గా! స్తాంబాళము చాపితి!
బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!


61

ప్రస్తావనగ నరడ మ్రో
గిస్తా! రాసెద జిలేబి గిద్యాల్ వలె పే
రుస్తో పదముల త్వరితము
బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!


62

రుస్తుంబాగు సమీపము
విస్తారమ్ముగ విదురులు పెనకువ కాగన్
దోస్తులతో పలికితి నే
బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!


63

బస్తీలోఅమెజాన్ చను
విస్తే నెక్కంగ చంక విడువక పోటీ
చేస్తో పలికెను సుమ్మీ
బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!


64

కాస్తా జాగ్రత్త సుమా
బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా
వస్తానింటికి యనుచున్
తీస్తారిక ప్రాణముల్ ! మతియెబోవు సఖీ!


65

పస్తుల తాళగ లేనోయ్!
వస్తా నవధానమునకు వలదనకు సుమా!
కాస్తోకూస్తో తెలుసోయ్!
బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!


66

రాస్తో కలగన్నా నే
వస్తున్న ఫ్లయిటుని జగను బాబొచ్చె వెసన్
లేస్తో చెబితి నతనితో
బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!


67

పాస్తా తిన్నానొకపుడు!
మస్తుగ పిజ్జాల తింటి మరియొకపుడు నా
ఆస్తులు బోయె! తినుటకై
బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!


68

వస్తోంది జిలేబియదే
వస్తోంది వరద వలె తను పదముల దుమికిం
చేస్తుంది పలుకునింకన్
బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!


69

హస్తిగిరి మహాత్మ్యపు ప్రా
శస్తత తెలిపెద కొలువుని ఛందముతోడై
రాస్తో శతకమ్మునికన్
బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!


70

హస్తగతంబాయెన్ వ్య
త్యస్తము కాకయె పదముల తళుకుల్ కవిరాట్
రాస్తానిక పూరణగా
బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!


71

ఆస్తాని కందివరులది!
వస్తా వేస్తా పదముల బాలకుమారా!
దోస్తుల కైవారించెద!
బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!


72

కస్తురిపట్టియలు గుభా
ళిస్తో పదముల కలుపుచు లెస్సగ నిదిగో
రాస్తా మాకందముగా!
బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!


73

ఇస్తాద్గీ తోడుగ నే
వ్రాస్తున్నాను నడిరేయి వాలుగ దాటెన్
కాస్తే మిగులు శతమునకు
బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!


74

ప్రస్తుతము మూడు గంటలు!
వాస్తవ ముగ నిదురబోవు వారికి మేలౌ
జాస్తిగ రాస్తా విడువక
బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!


75

అస్తు! జిలేబీయమిదియె
మస్తిష్క కుహరములెల్ల మాడెను వేడిన్
కాస్త కునుకుపాటుగ నా
బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!


76

వస్తూండగా జిలేబియె
రాస్తా లో కనబడి మరి ప్రముఖులడుగగా
విస్తులు బోవగ పలికెను
బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!


77

రాస్తూ రాస్తూ నిదురొ
చ్చేస్తే గమనించలేదు ! శీఘ్రమ్ముగ రా
సేస్తాను పూసపాటిగ
బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!


78

సుస్తీ చేయంగ జబ
ర్దస్తీ చూపుచు జిలేబి ధాటిగ పలికెన్
కాస్తా కషాయమున్ సయి
బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!


79

రాస్తా మాలిక నిండుగ
చూస్తా కామింట్లనెల్ల చోద్యము గానన్
వేస్తా కందంబొక్కటి!
బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!


80

సీస్తా సమయములో ఓ
మోస్తరుగ కునుకును తీసి మోడీ బ్రాజిల్
నేస్తపు గాధల చదివా!
బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!


81

ఇస్తావా వస్తూ ము
ద్దిస్తావా నా జిలేబి దిల్ మే కుచ్ కుచ్
కీస్తాహై! చెప్పెను ఊ!
బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!


82

వస్తా! వెళ్లొస్తా ! మ
ళ్లొస్తా! కతలన్ని చెబ్త లొల్లిగ మీకై
దోస్తానా నాదే యిక
బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!


83

అస్తిత్వమిది జిలేబిది
రాస్తూ పోవడమె తెలుసు రాపిడి తో మా
నేస్తుందనుకొన వలదోయ్
బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!


84

వేస్తామోయ్ కామింటుగ
వేస్తామోయ్ కందముల గుభిల్లనగ ప్రవే
శిస్తాము శతకకర్తగ!
బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!


85

ఆస్తరణని వేయండీ!
వస్తున్నాను దరిదాపు వస్తున్నా కా
వస్తోందిదె త్వరితముగా
బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!


86

ఆస్తరము పైపరుండి స
మస్తము నాకుతెలుసను ప్రమదననుకోనోయ్
విస్తారపు కష్టేఫలి
బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!


87

పస్తంబైన కొలువిది స
మస్త మెరిగిన కవివరు సమాహారముగా
రాస్తా తప్పక శతముగ
బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!


88

పస్తులు కద్దు! జిలేబీ
వాస్తవమిదె కవివరుల సభలెపుడు తవణిం
చేస్తో కన్బడెనోయీ?
బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!


89

చేస్తా జొప్పించేస్తా
వాస్తవముల నెల్ల వ్రాసి వరవడి నే తె
ప్పిస్తా జర్నలిజమ్మున
బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!


90

వస్తాయి పరుగిడుచు చా
దస్తాలను వీడగాను దండిగ పదముల్
రాస్తా ధాటిగ ధీటుగ!
బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!


91

రాస్తో కలర్డు న్యూసుల
మేస్తూ సెన్సేషనలిజమే మేటరనన్
కాస్తా గడిస్త దస్కము
బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!


92

మేస్తిరి మాకందివరులు
దోస్తానాతో గరిపిన ధోరణి గా నే
రాస్తా విస్తారముగా
బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!


93

పస్తుల పేలా లమ్మే
జాస్తిగ పట్టిందకో గజగజయనుచు వ
చ్చేస్తో వేసేస్తోందోయ్
బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!


94

పస్తుల పేలా లమ్మికి
ప్రస్తుతమువలయును జ్యూసు! వడివడిగా తె
చ్చేస్తో నోర్మూయించుడి!
బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!


95

బస్తకము గొన్న వారల
మస్తిష్కపు చిన్నతనము మనకేలా! ఓ
టేస్తామిక భాజ్పాకే
బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!


96

కస్తి పడకు బుచికీ రా
సేస్తున్నారు జనులనుచు! చేరువ కమ్మా
వాస్తవమునకు! జిలేబిన్
బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!


97

గస్తాల్బట్టుచు నేర్చితి
కాస్తై‌నా చేయవలెను గా ధర్మము ! నే
వ్రాస్తా దమ్ముగ రండోయ్
బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!


98

గుస్తర్దపు సదనమిదియె
ప్రస్తుత యత్నమును చేయ వరవడి నే చే
రుస్తూ వ్రాయను వ్రాయను
బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!


99

గోస్తనమిది కందివరుల
కై స్తవమిదియే జిలేబి కైవారముగా
చేస్తున్న వందనమిదియె
బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!


100

వేస్తిని కందము వందని
చేస్తిని యతనమును నేను చేవయు గూడన్
మస్తిష్కపు వేగమితిగ
బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!


101

వేస్తా వందకొకటి కలి
పేస్తో కందము జిలేబి పేరిట! సరదా
గా స్తంభాకారాధిగ
బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!


స్వస్తి
పేలా లవంగక శతకము
శివంగి జిలేబి :)

46 comments:

  1. పేలాల లవంగక శతకకర్త

    జిలేబి



    బధాయీ హో బధాయీ

    డోల్ బజావో

    మిఠాయీ భాంటో

    జలూస్ నికాలో

    జై బోలో జిలేబీ కీ!,జై బోలో జిలేబీ కీ!!,జై బోలో జిలేబీ కీ!!!

    ReplyDelete
    Replies


    1. అబ్బే మరీ మొగమాట పెట్టేస్తున్నారండీ :)

      ఏదీ ఆ "గోల్డు" హ్యాండ్తో ఓ నాల్గు బిరుదులు పడేద్దురూ పద్మ విభూషణ్ కి పప్పులుడకతాయేమో చూద్దును :)


      ప్లీజ్ :)

      చీర్స్
      జిలేబి

      Delete
    2. కంద చక్రవర్తిని జిలేబి

      Delete
    3. This comment has been removed by the author.

      Delete
    4. ఇక్కడేదో బస్తా మే సవాల్ లాగా ఉందే!?
      రెక్కలిరిచే నూటొక్క బస్తాల వస్తాద్ తో కుస్తీల్ మనకేల?
      పక్కకొచ్చినందుకు తొక్క తీసి బొక్కలిరిసి తిక్క కుదర్చక ముందే
      చక్కా చదూకుని ఎంచక్కా ఓ పక్కకు పొతే పోలా !!

      (వహ్వా వహ్వా ... ఏం పాజిటివ్ థింకింగ్ :)

      కుమ్మితిరి మాతాశ్రీ - పండితులొప్పుకోకున్నా (ofcourse, we know that you give them a big hoot - since you're a pandit yourself, in your clone way) మాలాంటి పామరులకు కేకో కేక ...
      ఏమా సరళి, పద రవళి ... కధాకళీ ఆడించారు మీ పాళీ తో ... శత 'బాస్' ...
      माताजी को जवाब नहीं| ...

      కుమ్మేయుట మీ జన్మహక్కనీ చాటండీ ...
      నిరంకుశంబుగ నిర్భయముగ /కర్కశముగ/ మీ చాటువులే ప్రకటించండీ ...
      :) జెఫ్/జేక్

      Delete

  2. ఏం చేసుకుంటారు అన్ని పేలాలు? లాజహోమానికా? "జిలేబి" గారింట్లో ఏదైనా పెళ్ళి జరగబోతోందా?

    ReplyDelete
    Replies


    1. ఏదో సరదా అంతే!
      కాదేదీ కందపు బిగి కౌగిలి చేరన్
      వాదము చేయదని తెలుప
      సోదాహరణపు జిలేబి , సుజనా రాయా :)


      జిలేబి

      Delete
  3. నూటొక్క కంద పద్యాల్
    ధాటిగ చెప్పంగ గలుగు తవరి శతక మీ
    పాటికి గాలికి వోయెను
    ఏటికి పేలాల గోల హితమతి ! తగునా ?

    ReplyDelete


  4. పేలాలూ పోతాయీ
    గాలికి కామింట్లు కూడ! కందపు సొబగుల్
    సేలల పేర్చుచు మార్చుచు
    డోలా నందమ్ముబొందెడు సుదతుల నషా :)


    నారదా!
    జిలేబి

    ReplyDelete
    Replies
    1. చాదస్తపు మొగుడు చెబితె
      వాదిస్తడు గాని వినడు , వద్దీ గోలల్ ,
      రోదనము వీడి యేదేన్
      మోదపు మాధుర్య రచన బూనుడు విహితా !

      Delete


    2. చాదస్తపుటోడని రా
      జా దారిని విడిచి మగని జారుకొనుట మా
      కేదో సరిగా దోచదు !
      ఏదో మెదలెట్టినామదే పోనిస్తా :)


      నారాయణ :)


      జిలేబి

      Delete


  5. మోస్తున్న గ్రాంధికమ్మను
    బస్తా దింపగ వెలుపల బడె జనుల పదాల్
    మస్తగు తెలుగిదియె సుమా
    "బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా"

    జిలేబి

    ReplyDelete
  6. పళ్ళ మీద గార పోవడానికి ENO చిట్కా అని
    ఈ రోజు "కష్టేఫలి" శర్మ గారు తన బ్లాగులో చెప్పారు. అనుకోకుండా ఇవాళే (28-11-2019) "ఆంధ్రజ్యోతి" (హైదరాబాద్) డెయిలీలోని "నవ్య" పేజీలో (నెం.5) ఈ అంశం మీద "అవగాహన" అంటూ ఒక చిన్న పేరా వచ్చింది -- నిమ్మకాయ, ఉప్పు వగైరాల చిట్కాలు. క్రీంది లింకులో చూడచ్చు.

    "దంతాలపై గార పోవాలంటే" (ఆంధ్రజ్యోతి డెయిలీ 28-11-2019 పేజ్.5)

    ReplyDelete
    Replies

    1. I am a Complan Boy
      I am a ENO Thaatha :)


      నారదా!

      జిలేబి

      Delete


  7. కెలుక జిలేబియె
    దులిపిరి శ్యామల
    రాయలు షట్పద వృత్తపు రీ
    తిన్ సంక్లిష్టము
    గాను తెలుపుచున్
    సులభమనంగ మనకు పడదోయ్ :)


    నారదా!
    జిలేబి

    ReplyDelete


  8. ఎప్పటికో ఫెళ్ళనుచున్
    నిప్పు మరల గ్రక్కునణగి నిలచిన కుఠియే
    తప్పక! కావున కవిరాట్
    నిప్పులకొండ యనఁదగును నీహారాద్రిన్


    జిలేబి

    ReplyDelete


  9. బాహాటమ్ముగ మంచుకొండయె సుమీ బంధాకి పూర్వమ్ము జ్వా
    లాహారమ్ముగ వెల్గె; మ్రగ్గెనిపుడే లావాయె; చల్లారగన్
    హాహాలమ్మిక నోషధుల్ వెలసె నాహార్యమ్ముగా దానిపై ;
    నీహారాద్రిని నిప్పుకొండ యని వర్ణింపంగ నొప్పున్ గృతిన్


    జిలేబి

    ReplyDelete


  10. తప్పుల నొప్పని మిత్రుం
    డొప్పుకొనక నెగిరెగిరి పడునతండే పే
    రొప్పదు హేమాద్రియనుచు
    నిప్పులకొండ యనఁదగును నీహారాద్రిన్


    జిలేబి

    ReplyDelete

  11. సులభమైన వాటిని కాంప్లికేటు చేయగ గందర గోళము రాక మరేమి వచ్చును :)


    ట్వింకిల్ ట్వింకిల్
    లిట్టిల్ స్టార్ హౌ
    యై వండర్ వాట్ యువ్వార్ అప్
    అబవ్ ది వాల్డ్ సో
    హై లైక్ యే డై
    మండిందస్కై శరషట్పద!



    జిలేబి

    ReplyDelete
    Replies
    1. పద్యాన్నో / గద్యాన్ళో విరిచి ఆరు చిన్న చిన్న లైన్లలో పెడితే శరషట్పద అవుతుందా "జిలేబి" గారూ?

      తెలియక అడుగుతున్నాను సుమండీ, నిజంగానే.

      Delete

    2. పండితులేదంటే అదే సరి అనుకుని దానికి‌ కౌంటరు చాలెంజు వేయకుండా మీలాంటి వారు ఉన్నంత దాకా అవదు.

      సత్తే పే సత్తా అంటూ ఎదురొడ్డితేనే అవుతది :)


      నారదాయ నమః


      జిలేబి

      Delete
    3. నేను పండితుడు కాదుగా 😃🙏.

      Delete

    4. వార్లను గోకితే నే మేటరు మరింత దక్కును :) కాబట్టి కౌంటరు వేసిన గోకాలె :)



      జిలేబి

      Delete
  12. పండితులంతే సారూ
    ఖండింతరు పద్య గద్య పదములు , తమకున్
    మండిన లోపల , మనకే
    లండీ ఆ గోల ? నరస రాయా ! ప్రణతుల్ .

    ReplyDelete
    Replies


    1. శరషట్పదవృత్తగర్భ కందపు కవిరాట్ రాజన్న వారు జయ హో!

      శరషట్పద from కంద పద్య :)


      పండితులంతే
      సారూ ఖండిం
      తరు పద్య గద్య పదములు , తమ
      కున్, మండిన లో
      పల , మనకేలం
      డీ ఆ గోల ? నరస రాయా!



      జిలేబి

      Delete


    2. వరుస నమస్కా
      రములను బెట్టిరి
      కనుగొని నందులకా? అట్లా
      రాసిన దానికి
      మిమ్ముల మీరే
      సెహభేషని చరుచు కొనిరకో :)


      జిలేబి

      Delete
    3. లేదండి ! అంత తెలివిడి
      లేదండీ నాకు , తామెరిగిన విషయమే ,
      ఏదో వచ్చీ రానివి
      సాదా సీదాగ జెప్ప జాలుదు నండీ .

      Delete

    4. వామ్మో! ఒన్స్ అగైన్ :)



      లేదండి ! అంత
      తెలివిడి లేదం
      డీ నాకు , తామెరిగిన విషయ
      మే ,ఏదో వ
      చ్చీ రానివి సా
      దాసీదా జెప్ప జాలుదున్!


      జిలేబి

      Delete


  13. అడ్డడ్డే!మారె ప్రభుత!
    యెడ్డంటేతెడ్డటంచు యెన్కబడుచు నా
    రెడ్డిని తెగడాలెసుమా
    వడ్డించెడివాఁడు శత్రువా? తిననొప్పున్


    జిలేబి

    ReplyDelete


  14. చెడ్డియతండు వేసి తన చెంతకు వచ్చిన నాటి కుంకయే
    యడ్డరి గాను వచ్చెను ప్రయత్నము చేయుచు ముఖ్యమంత్రిగా
    రడ్డుని నేల! విందునకు రమ్మని పిల్చెను పోయెదన్ సుమా
    వడ్డనఁ జేయువాఁడు పగవాడె తినందగు నిర్భయమ్ముగన్!


    జిలేబి

    ReplyDelete


  15. ఆకాశవాణికి పంపినది :) (చదువబడెనట!)



    రెడ్డియనంగ భీతియొ కరేకర వేయుచు కొట్టు నంచు? నీ
    గడ్డము బట్టి వేడెను! పుకారుల నమ్మకు! రమ్ము నాయనా!
    వడ్డనఁ జేయువాఁడు పగవాఁడె తినందగు నిర్భయమ్ముగన్,
    చెడ్డతనమ్ము చూపరు విజేతలు పబ్బపు విందువేళలన్!


    జిలేబి

    ReplyDelete


  16. రెడ్డి జగన్మోహనుడరె
    చెడ్డీ లన్వేసి తిరిగె చెంతగదా! రా
    బిడ్డా! మనవాడె సుమా
    వడ్డించెడివాఁడు; శత్రువా? తిననొప్పున్


    జిలేబి

    ReplyDelete


  17. శరషట్పదము


    రెడ్డి జగన్మో
    హనుడరె చెడ్డీ
    లన్వేసి తిరిగె చెంతగదా!
    వడ్డించెడి వాఁ
    డు శత్రువా? తిన
    నొప్పున్ రమ్మా రారమ్మా!


    జిలేబి

    ReplyDelete


  18. విడ్డూరముగా వుందే!
    వడ్డించెడివాఁడు శత్రువా? తిననొప్పున్
    లడ్డులు బ్రహ్మాండముగా
    పడ్డవి రుచికరముగా సెబాసు జిలేబీ!

    జిలేబి

    ReplyDelete


  19. కంది వారి మనో భావము గా

    అనుదినము సమస్యలను వేసి పూరణ
    లెల్ల చదివి చూడ లెస్సగాను
    నిలచె మదిని నొక్క నిక్కపు తలపోత
    చూడఁ జూడ రుచుల జాడ యొకటె


    జిలేబి

    ReplyDelete
    Replies
    1. చూడ చూడ రుచుల జాడ వేరను మాట
      నిజము , పూరణా లనేవి వీడి ,
      మంచి ఖండికలను మలచి పద్యరచన
      చేసి చూడు , హృది ప్రభాస మగును .

      Delete


  20. సాధన చేసి పాడనదె చక్కగ జాడయొకండె మిత్రమా
    బోధన చేసి చూడనదె బుద్ధుల జాడ యొకండె మిత్రమా
    శోధనఁ జేయుచున్ రుచులఁ జూడఁగ జాడ యొకండె మిత్రమా
    రాధన మెల్ల మానసపు రావడి గారడి నందివర్ధనా!


    జిలేబి

    ReplyDelete
  21. నీతులు :-
    ఈ క్రింది లింక్ లో "లెజెండ్స్" అన్న వార్తలో ఉన్న ఫొటోలో కోటు వేసుకునున్న గాయకుడు ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం గారిని చూడండి.

    తను నిర్వహించే "పాడుతా తీయగా" టీవీ కార్యక్రమంలో పాల్గొనే ఆడపిల్లలు లంగా ఓణీ / సాంప్రదాయ దుస్తుల్లోనే, మగపిల్లలు కూడా సాంప్రదాయ దుస్తుల్లోనే రావాలని నిబంధన విధించాడు. అదే షోలల్లో తాను మాత్రం ఎక్కువ సార్లు కోటు / షర్ట్ & పాంట్ ధరించే కనిపిస్తాడు. నిన్నటికి నిన్న హైదరాబాద్ లో చిత్ర, ఏసుదాసు గార్లతో కలిసి పెద్ద స్టేడియంలో చేసిన "లెజెండ్స్" పాటల కార్యక్రమంలోనూ కోటు వేసుకుని వచ్చాడు, ఫొటోలో గమనించండి. ఏసుదాసు గారు మాత్రం చక్కగా తమ ప్రాంతపు సాంప్రదాయ వస్త్రధారణలో ఉన్నారు.

    ఎదుటివారికీ చెప్పేటందుకే నీతులు ఉన్నాయి.

    గాయకుడు బాలు X సాంప్రదాయ వస్త్రధారణ

    ReplyDelete


  22. అదిగో చూడుము గ్రహణము
    ఇదిగో కనిపించె భువిని యిక్కట్లు జిలే
    బి!దరిమి లా గ్రహములె సూ
    వె దీని కంతటికి తలము వెంకట లచ్చీ :)


    జిలేబి

    ReplyDelete


  23. ఆరు గ్రహమ్ములు నొకగది
    లో రావడి చేయగా కలుసుకొను నిరవై
    యారు డిసెంబరు నెలలో
    నా రాశి ధనుస్సుని గ్రహణపుటమవసిలో!

    అమావాస్య! ఆపై గ్రహణము‌ ఆపై కట్టగట్టుకొని‌ ఆరు గ్రహాలు ఒకే గదిలో. అదిన్నూ ధనుర్రాశిలో. ఓర్నాయనో! ఓయమ్మో మా శర్మ గారింకా టపా రాయలేదేంటి ?



    జిలేబి

    ReplyDelete


  24. బండి రావు గారు పాటల పల్లకి
    నెక్కి కారయోకె నేర్పు గాను
    వ్రాయ చూడ సొబగు పాటలు వఱ్ఱోడి
    కుండలోనఁ జొచ్చెఁ గొండ గనుఁడు

    జిలేబి

    ReplyDelete


  25. గండర గండడైన చెలి కాడు సుమా కురువింద మొక్కటిన్
    నిండుగ కుండ లోన నిడి నివ్వెర పోవు విధమ్ము గుబ్బలిన్
    చెండుగ చూపె బింబముగ చేతిని తాకెడు దూర మందు నీ
    కుండను గొండ సొచ్చె నిదిగో కనులారఁగఁ జూచి నమ్ముమా!

    జిలేబి

    ReplyDelete


  26. కాపిశాయనంపు ఘాటుని పల్కులన్
    కుండలోనఁ జొచ్చెఁ గొండ గనుఁడు
    రండి రండి యనుచు రావడి చేయుచు
    దారిని బడి దొరలె తాగుబోతు


    జిలేబి

    ReplyDelete


  27. ఏమి పేలునో


    గ్రహము లారు చేరు గృహము ధనుస్సుని
    నమవసి దినము గ్రహణపు సమయ మి
    రువది యారుని! తలరుల వేళయగునొకొ?
    కుండలోనఁ జొచ్చెఁ గొండ గనుఁడు


    జిలేబి

    ReplyDelete