Sunday, June 14, 2020

శ్యామలీయ కందోత్పలములు


శ్యామలీయ కందోత్పలములు

వికసిత మానసమున నెల
తుక! తత్పరుడాయె స్నేహితుడు దామ్మ! జిలే
బి కుశాగ్రబుద్ధి తో నే
య కందపద్యము గురువుల యాశయు తీరన్!


అలవోకగ సాగ పద
మ్ములు సత్పుర వాసి! వ్రాయుము పసందుగ శ్యా
మల రాయు కోరిరే నీ
కలవాటైనట్టి విద్దె కందమ్మె కదా!



చినుకులవలె కురియుచు సో
మున నుత్పల మాల పాదము వినూత్నపు రీ
తిని కంద మందు తా నొల
క నిబిడమై సొబగులీన కలమున్ గొనుమా


కలకల లాడవలెన్ మిల
మిల నుత్పతితంబు గా నిమిడి నున్ననగా
నిల కాంతులీనగావలె
జిలేబి! యర్పించుకొనవె చీర్సుల తోడై!

***



తత్పరుడాయె స్నేహితుడు దామ్మ! జిలేబి కుశాగ్రబుద్ధితో
సత్పుర వాసి, వ్రాయుము పసందుగ శ్యామల రాయు కోరిరే
నుత్పల మాల పాదము వినూత్నపు రీతిని కంద మందు తా
నుత్పతితంబు గా నిమిడి నున్ననగా నిల కాంతులీనగా



ఫ్యాక్టరీ పద్యాలు :)


జిలేబి


51 comments:

  1. కరోనా మహమ్మారి నియంత్రణ విషయంలో దేశం ఇతర దేశాల కన్న మెరుగు అని మోదీ చెప్పినది మాత్రం వాస్తవమే, కానీ ప్రజల నిర్లక్ష్యం గురించి కుండబద్దలు కొట్టడం వరకు బాగానే ఉంది గానీ గతంలో లాక్ డౌన్ ఎందుకు ఫెయిలైందో ఈసారి ఏం చేయబోతున్నారో నిర్మాణాత్మకమైన జవాబు చెప్పాల్సిన తన బాధ్యతని ప్రధాని గారు ఎందుకు విస్మరించారు?

    పరిస్థితి ఇంత సంక్లిష్టం గనకనే నేను వేదం యొక్క శక్తిని ఉపయోగించుదామని అనుకున్నాను.నేను నా పోష్టులో ఉదహరించిన సన్నివేశాలు నా స్వకపోల కల్పితాలు కావు.అయినా హిందువుల నుంచి మొదటి రోజుల్లో వచ్చిన స్పందన చూసి చాలా నిరుత్సాహం అనిపించింది.ఒక మిత్రుడయితే "నా యీడు బ్రాహ్మణులే నవ్వుకుంటున్నారు, యజ్ఞాలతో కరోనాని ఆపడం గురించీ వర్షాలను చెదరగొట్టటం గురించి చెప్తుంటే.." అని వెక్కిరించారు.అది చదివి మరీ నీరసించి పోయాను.

    అవసరమైనప్పుడు ఉపయోగించుకుని ప్రయోజనం పొంది,"ఇది వేదం యొక్క శక్తి!" అని చెప్పుకోవడం మాని వూరికే సొల్లు రాయడం, లైకులూ షేర్లూ లెక్కేసుకుని మురిసిపోవడం నాకు నచ్చలేదు.అందుకే బ్లాగింగూ షేరింగూ మానేస్తున్నాని చెప్పాను.అయితే, తర్వాత సానుకూలంగా స్పందించిన మిత్రుల వల్ల హుషారు తెచ్చుకుని చాగంటి వెంకట గారిని అధికారికమైన లెక్కలు చెప్పమని అడిగాను.ఆయన నన్నే ఒక నగరం పేరూ వివరాలూ చెప్పమన్నారు. నేను రాజమండ్రిని ఎంచుకున్నాను తొలి ప్రయోగానికి - "వేదంలా ఘోషించే గోదావరి, అమరధామంలా శోభిల్లే రాజమహేంద్రి..." పాట గుర్తొచ్చింది!నగరం వివరాలు ఇచ్చాను.

    వాటిని చూసి చాగంటి వెంకట్ గారు చెప్పిన అంచనా లెక్కలు ఇవి:
    Based on the area, population, and other factors,
    Materials per location:
    1. Ghee. (Minimum 10 to 15 kg)
    2. Herbs like Giloyi, Saffron etc. (10 kg)
    3. Food like Bellam, cooked rice etc. (4 kg)
    4. Precious Metals. (about 50 grams).
    5. Samidhalu (wood sticks about 20 kg)

    The material costs come out to be around Rs. 10,000 to 12,000 per day per location (At least 3 locations are required in the Months of October to February). Remember it is per day per location.

    Apart from material costs, we have to pay the Ritviks (3 per location) and other workers (if any). Also, we require a place with Yajna Kunda where the Ritviks can perform the Yajna.

    Every day the Yajna should be shown live through skype or zoom for donors and organizers. Therefore, we require volunteers for organizing the event properly.

    Every day the ash in the Yajna Kunda must be removed and mixed in the Godavari River without fail. After that the Yajna Kunda must be cleaned and reset properly. Therefore, we require a Ritvik who does this work without fail.

    We can do it daily or alternate day depending on the funding. This process should be done for about 45 continuous days or 90 alternate days.

    Remember that if we start during Oct to March we have to do it in 3 locations. Whereas if we do it now it is limited to only one location. Also we have to pay for the premises until someone gives us for 45 days. Put it around Rs. 10 lakhs and then decide.

    మనం పది లక్షలు ఆయనకి ఇవ్వగలం అనిపిస్తే అక్కవుంట్ క్రియేట్ చెయ్యడం సాధ్యపడుతుంది.మనలాంటి మధ్యతరగతి జీవుల్లో మొత్తం సమకూర్చగలిగిన వాళ్ళు చాలా తక్కువ మనది ఉంటారు.I cannot provide myself all the amount. If I had it I never involve others.

    అయితే, రాజమండ్రి కరోనా నుంచి విముక్తం అయితే ప్రయోజనం పొందే స్థానికులైన elite class తలుచుకుంటే వాళ్ళ స్థాయికి ఇది చాలా తక్కువ మొత్తం.ఆయుర్వేదము ఏ జబ్బు ఐన తగ్గిస్తుంది అని చెప్పగలము. కాని ముందు రోగి లక్షణము పరీక్ష చేసి, ఆ తరువాత మందు ఇచ్చి, ఆ తరువాత పధ్యం చెప్పి, ఆ తరువాత ఆ రోగి పాటిస్తే అప్పుడు గుణం చూపించడం మొదలౌతుంది. అలాగే మన ప్రయత్నం కూడా వుండాలి.

    మిత్రులు ఆలోచించుకుని మీ అంతట మీరు గానీ ఇతరులతో కలిసి గానీ ఎంత ఇవ్వడానికి సంసిద్ధమో చెప్పండి.మనం పది లక్షలు సమకూర్చగలం అనే నమ్మకం వచ్చాకనే ఆయన ఎక్కవుంట్ క్రియేట్ చేస్తారు. రాజమండ్రి నగరం మనం చేసిన యజ్ఞం వల్ల కరోనా నుంచి బయటపడితే కరోనాను ఎదుర్కోవటానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధుల్ని ఇందుకోసం వినియోగించమని రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగవచ్చును. వ్యవసాయాలూ ఉద్యోగాలూ వ్యాపారాలూ ఏమీ చెయ్యకుండా నెలల తరబడి వ్యక్తులు, కుటుంబాలు,గ్రామాలు,నగరాలు,రాష్ట్రాలు దేశం అనే అన్ని స్థాయిల్లో రికామీగా కూర్చోవడం వల్ల దేశానికి పెరుగుతున్న అప్పును గురించి ఆలోచించండి!

    ReplyDelete
  2. చాగంటి వెంకట్ గారు చెప్పిన ఒక ముఖ్యమైన విషయం మరోసారి చెప్తున్నాను. మారే వాతావరణం దృష్ట్యా సెప్టెంబెర్ లోపు పూర్తయితే మంచిది. అక్టోబర్ వస్తే ఒకే రోజు మూడు చోట్ల చెయ్యాల్సి వస్తుంది.ఖర్చు కూడా పెరుగుతుంది.

    అయితే సీజన్లు లెక్క ప్రకారం కాక ముందు వెనకలు అయ్యే అవకాశాన్ని బట్టి ఆగష్టు 10న మొదలుపెట్టి సెప్టెంబెరు 24న పూర్తయ్యేటట్టు ప్లాన్ చేస్తే అన్నీ సవ్యంగా జరిగినట్టు ఉంటుందని నా లెక్క.

    దానికి జులై నెల పూర్తయ్యేసరికి డబ్బు మొత్తం ఆయనకి చేరాలి. బ్యాంకుకి వెళ్ళి పెద్ద మొత్తం ఒకేసారి ట్రాన్స్ఫర్ చెయ్యటం సమస్య కాబట్టి పేమెంట్స్ చాలా ముందునుంచే మొదలు పెట్టాలి.

    ReplyDelete
  3. మిత్రులు హరిబాబు గారు,
    మీరు చాలా సుదీర్ఘమైన వ్యాఖ్యలను వ్రాస్తారు అలవాటుగా. నిజానికి మీరు ఆ వ్యాఖ్యల విషయాలను మీ బ్లాగులో నేరుగా టపాలుగా వేయటం‌ సముచితంగా ఉంటుంది. అందువలన మీకు అదనపు సౌలభ్యం‌ కూడా కలుగుతుంది - ప్రతిస్పందనను మీరు తగినవిధంగా నియంత్రించే అవకాశం కారణంగా. ఈ‌బ్లాగులాగే అనేక బ్లాగుల్లో‌ టపాలకు సంబంధం‌లేని వ్యాఖ్యల గురించి ఏమీ పట్టింపు లెకుండా ఉంది కాని నిజానికి మీ‌సుదీర్ఘవ్యాఖ్యలలో ముప్పాతికమువ్వీసం అస్థానపతితాలే. మీకు నాసలహా నచ్చవచ్చు నచ్చకపోవచ్చు - నాకనిపించింది చెప్పాను.

    ReplyDelete
    Replies
    1. నా బ్లాగులో ఇదివరకే ఒక పోష్టు పెట్టానండీ!నేనొక మంచి కార్యక్రమం తలపెట్టాను,నా ఒక్కడి వల్ల అయ్యేది కాదు గాబట్టి సాటి హిందువుల్ని సాయం అడిగాలనుకునను.ఆ కార్య్క్రమానికి మరింత ప్రచారం కోసం ఇక్కడ వేశాను.నా బ్లాగు గానీ నా బ్లాగు దగ్గరి కామెంట్లు గానీ అన్ని యాగ్రిగేటర్లలోనూ రావు కాబట్టి వరూధిని బ్లాగు దగ్గిర వేశాను.

      ఇందులో మీకు పుడుతున్న నెప్పి యేంటో అర్ధం కావడం లేదు నాకు?మోడరేషన్ ఉండి కూడా ఇక్కడ కనిపించింది అంటే బ్లాగు యజమానికి అభ్యంతరం లేదని తెలుస్తున్నది.రెండవ కామెంటు కూడా ప్రచురించడం బ్లాగు యజమాని సంతోషంగా ప్రచురించినట్టు తెలుస్తున్నది.మరలాంటప్పుడు కందకు లేని దురద కత్తిపీటకా అన్నట్టు సందర్శకులైన మీకు అభ్యంతరం ఏమిటి?

      జిలేబీ కంద పద్యాల్ని గింద పద్యాలని పదే పదే వెక్కిరిస్తూ కూడా మీరు సత్సంస్కారవంతులేనని మీ గురించి గొప్పగా భావిస్తున్నట్టున్నారు - గురివింద కబుర్లు చెప్పకండి!

      ఇక్కడ కూడా మీ కామెంటు మొదలవ్వడమే "మీరు చాలా సుదీర్ఘమైన వ్యాఖ్యలను వ్రాస్తారు" అని మొదలైంది - ఏమిటి మీ ఉద్దేశం?ఒక విషయం గురించి చెప్పాలంటే అది ఎదటివాళ్ళకి అర్ధం కావడం కోసం విడమరిచి చెప్పాల్సి వస్తుంది.మనం చెప్పేది మన ఎదురుగా ఉన్న ఒకే ఒక వ్యక్తికి అయితే అతని స్థాయిని బట్టి రెండు వాక్యాల్లోనే చెప్పెయ్యొచ్చును.కానీ నా బ్లాగు దగ్గిరకి వచ్చే వివిధ స్థాయిల వాళ్ళు అందరికీ అర్ధం కావాలంటే కొంత ఎక్కువగానే చెప్పాలి - తప్పదు!నా పోష్టులూ కామెంట్లూ పొడుగైతే మీకు వచ్చిన నష్టం ఏమిటి?నేను చెప్పాల్సిన విషయాన్ని బట్టి పొడుగూ పొట్టీ ఉంటుంది - చదవగలిగితే చదవండి,బోరు కొడితే చదవడం ఆపెయ్యండి.చదవకపోతే తంతానని అనలేదు కదా నేను!

      అదే మీరు రాస్తున్న కీర్తనల్ని తీసుకోండి - అవి ఎందుకు రాస్తున్నారు.భక్తి కోసమే అయితే ఒక్కసారి కళ్ళు మూసుకుని రాముడి రూపాన్ని వూహించుకుని "రామా!" అనుకుంటే చాలదా?మరి అన్ని కీర్తనలు దేనికి రాస్తున్నారు?అసలు మీరు రాయాల్సిన పనేమిటి?అన్నమాచార్యులు రాశారు!త్యాగరాజస్వామి రాశారు - మళ్ళీ మీ సుత్తి దేనికి?

      అసలు నా రెండు కామెంట్లు చదివారా? నాకు ఉబోసలు ఇచ్చి నాతో తిట్లు తినే దురదలో ఎకాయెకిన కామెంటు వేసేశారా!

      నేనొక మంచి కార్యక్రమం తలపెట్టాను,నా ఒక్కడి వల్ల అయ్యేది కాదు గాబట్టి సాటి హిందువుల్ని సాయం అడిగాను.మీరూ హిందువులే కదా,సాయం చెయ్యాలనిపిస్తే చెయ్యాలి,చెయ్యలేకపోతే వూరుకోవాలి.ఈ వెక్కిరింతల ఉబోసల కుళ్ళుమోతు కామెంట్లు ఏంటి?

      Delete
    2. హరిబాబు గారు,
      ధన్యవాదాలు.

      Delete


  4. రుచికరమై చౌకైన త
    రచు దొరికెడు కూరలె మన ప్రాయి జిలేబీ
    వచియించిరి శ్రీధరనిత
    కు చక్క గా తాతగారు గుబ్బెత వినవే


    జిలేబి

    ReplyDelete


  5. కులుకుల్ చెలినడకలుగా
    పలువిధముల నాట్యమాడె వయసు పరువమై
    పిలిచె మదనుడి విరుల శర
    ములు గురియ నధరపు శిఖరమునకై నెగడై !


    జిలేబి

    ReplyDelete


  6. అస్సాములో జిలేబీ
    తస్సాదియ్యా వసించి తరియించిరకో
    పస్సా పదముల, నేర్చెన్
    లెస్సదనపు మాటలను ‌భళి భళి యనంగన్ :)


    జిలేబి

    ReplyDelete
    Replies
    1. అస్సాము ఆసామీలు రషోగొల్లా & షోమోష ఆరగిస్తారు కానీ జిలేబీ తిందురా?

      అహోం బ్రహ్మపుత్రశ్రీ
      తేయాకుతోట టైము జోనః
      తలకాయ కామాఖ్య ప్రసాదస్య
      బోడోదపి గరీయసి

      Delete


    2. జైగొము గారు

      మిష్ఠి దొయ్ వదిలేసారు :)


      జిలేబి

      Delete
    3. భూత్‌జోలోకియ మరిచిపోయారు జై గారు. దాని స్కావిల్ హీట్ యూనిట్లు ౧౦,౪౧,౪౨౭. మిష్ఠి దోయి, సోందేష్ వంగ అనుకుంటా బిజిలే అమ్మణ్ ఐనా గాని అసామియ లో ఉండ వచ్చునేమో మరి.బోహాగ్ బిహు నృత్యం, తేయాకు తోటకు టైమ్ జోన్ అక్కడి చుపెచాలితి.

      Delete
    4. ప్రాగ్జ్యోతిషపురి వైభవాలు బాబూ మోషాయిలకే ఎరుక

      Delete
  7. మేనత్త కొడుకూ మొగుడేనా అన్నట్లు “మిష్టి దొయ్” కూడా ఒక స్వీటేనా .... పెరుగులో పంచదార కలుపుకుని తిన్నట్లు ఉంటుంది నా మటుకు 😁😁?
    (jk 🙂)

    ReplyDelete
    Replies
    1. అక్క మొగుని కంటే మేనత్త కొడుకే నయ్యం jk;)

      Delete
    2. మిరలా అంటారు గాని ఆచార్య.. వంగ రాజ్యాన ఆ మిష్ఠి దొయ్, మరాఠ రాజ్యమున శ్రీఖండ్ కవలలే కాబోలు.. అదేమో పెరుగులో పంచదార.. ఇదేమో పెరుగులో బెల్లం.. మరి ముఖ్యంగా ఆ మరాఠ వారి మరొక వేరియేషన్ ఆమ్రఖండ్.. మామిడి పండు రసాన్ని పెరుగులో కలిపి మొక్కజొన్న రొట్టెలతో ఆరగిస్తారుట.. తినలేమ్ మహాశయా.. ఆ తీపికి నోరు మొత్తేస్తది. మా చెల్లెల్లి అత్తారిల్లు తెలంగాణ మహారాష్ట్ర బార్డర్ లో ఉంటుంది.. అది సంగతి..!

      Delete
    3. శ్రీఖండ్ కూడా నాకు మొహం మొత్తుతుంది.
      అయితే మీరెప్పుడైనా వేసవికాలంలో మీ చెల్లెలి గారింటికి చుట్టపుచూపుగా వెడితే ..... ఆమ్రఖండ్ తో విందుభోజనం అన్నమాట 🙂? Enjoy 🙂.

      Delete
    4. ఔనాచార్య.. ఈ సమ్మర్ లాక్డౌనార్పణం..!

      Delete


  8. ఒకరి మధ్య మరొక బాలునకును మేలు
    గూర్చగా చదువున వారు కొట్టుకొనుచు
    తగవులం బెట్టువారు పాధ్యాయు లనఁగ
    తప్పు లేదు స్పర్ధ వలయు ధరణి లోన!


    జిలేబి

    ReplyDelete


  9. తగునా వీరికి జుట్టుపట్టుకొని నిర్ధారింపగా తప్పులన్?
    పగవారోయని పించు వారిని గనన్ పట్టింపులన్ జూడగా
    జగదానందము గూర్చు స్పర్ధనరరే సాధింప విద్యార్థులే
    తగవుల్ బెట్టెడివారలే కద యుపాధ్యాయుల్ విచారించినన్!


    జిలేబి

    ReplyDelete


  10. కంద గీతి


    ఠవణింపగ స్పర్ధయె పా
    టవమెల్ల పెనుపు గొన చవటల మార్చుచు ‌వి
    ప్లవములకు తగవులం బె
    ట్టువా రుపాధ్యాయు లనఁగ టొంకు గలుగునే?



    జిలేబి

    ReplyDelete


  11. తావు దొరికె ఓ తాతా
    య్యా! వెంపాటారి దయ్యమై నిను విడువన్
    కై వాటమ్ముగ వరుసగ
    నే వేస్తానిక కమింట్ల నే శ్రీధరుడన్ :)


    జిలేబి

    ReplyDelete


  12. సీ యూ సూన్ చిత్రమ్మును
    ఖాయమ్ముగ చూడదగును కంద జిలేబీ
    ప్రాయంపు కుర్ర కారుల
    హేయంపుబతుకుల తీరు హేల కనబడు‌న్


    జిలేబి

    ReplyDelete


  13. నే రాసిందేనా యిది ?
    నా రాతే నా యనుకొని నా!సందేహ
    మ్మై రాసిన దానిని మ
    ళ్లీ రంజు గ చదువుకున్న! లివ్వెను సుమ్మీ :)


    జిలేబి

    ReplyDelete


  14. దెయ్యంబొక్కటి బ్లాగుల
    వయ్యారములొలుక చుట్టి వచ్చు ! జిలేబీ
    హయ్యారే పేరంటా !
    కుయ్యో మొర్రో యటంచు కువ్వాడు నటా :)



    జిలేబి

    ReplyDelete
    Replies
    1. ఔను బిజిలే అమ్మణ్.. అది వేరే ఏది కాదు. రాజస్థాన్ ఆల్వార్ జిల్లలో అతిపురాతనమైన భాన్‌గఢ్ కోట. అందులో యువరాణి రత్నావతి దేవి: అరుంధతి, సింఘియ: పశుపతి. ఇపటికి కూడా ఆ కోటలోకి సందర్శకులు సాయంత్రం ఏడు గంటలు దాటి ఉండకూడదని సాక్షాతు ఏ యసై వారు బోర్డ్ పెట్టటం గమనార్హం.. ఏడు గంటలు దాటినాక ఆ కోట నుండి ఏవేవో భీకరమైన అరుపులు కేకలు వినిపిస్తాయని అక్కడి లోకుల ఉవాచ.. సరిస్క అభయారణ్యమునానుకుని ఉంటుంది ఈ లొకేషన్..!

      Delete


  15. చైనా, కాంగ్రెస్సుల్లొక
    టై నేడీ దేశమునకటా కుమ్మిరిగా
    యేనాటికైన బీజే
    పీ నే నమ్మండి ప్రగతి వెల్లివిరియగా !


    పాత్రా ఉవాచ
    జిలేబి

    ReplyDelete


  16. ఏనాటికైనను దిటవు
    గా నిలిచెడు పద్యముల ప్రకర్షణ తోడై
    మానసమందు ప్రజల స
    న్మానమ్మును బొందని కవి మాన్యుండగునా?



    జిలేబి

    ReplyDelete


  17. న్యూనత లేని భావనలు, నూతన మైన ప్రయత్నముల్, భళీ
    వీనుల కింపుగొల్పెడు కవిత్వము, ధాత్రిని మేలు కొల్పుచున్
    మానస మందు పద్యములు మన్నిక గానిలు వంగ, నౌర స
    న్మా నముఁ బొం దకున్న, కవి మాన్యుఁ డటంచు గణింతురా ప్రజల్?



    జిలేబి

    ReplyDelete


  18. నలుగురి తో కలిసి బతుక
    వలెనని జీవించు చుంటి పరమాత్ముడె నా
    కిలలో స్నేహితు డై కను
    కొలికిని నను గాచి చూచుకొనుచుండె సఖా !


    జిలేబి

    ReplyDelete


  19. ఏదీ సఖ మనచే తిని
    లేదోయీ జీవితపు భలేవింత యిదే
    కాదోయీ వినరా విన
    రా దోస్తు జిలేబి బామ్మ రాసిందోయీ



    జిలేబి

    ReplyDelete


  20. తరతరాలకు తరగని తమకు తాము
    గాను నాలుమగలుగ ప్రగాఢ మైన
    బంధము నెలకొల్పుకొనుచు పంచ దార
    చిల్కలవలె పిల్లలను పెంచిరి జిలేబి


    జిలేబి

    ReplyDelete


  21. కినుక వహించనదేలా
    మన తెనుగును కించపరచి ? మరిమరి పద్య
    మ్మునుఁ బాతిపెట్టు వారల
    కు నతుల్ తెలుపంగలేను కొంతయు సుమ్మీ



    జిలేబి

    ReplyDelete


  22. కందోత్పల


    పలుకంగ లేనికన్ గల
    గల! పద్యముఁ బాతిపెట్టఁగలవారి పదం
    బుల కేను మ్రొక్కెదన్? నా
    వలన కుదరదయ!" జిలేబి పలికెను సభలో!



    జిలేబో సితారో :)


    జిలేబి

    ReplyDelete


  23. అరయగ జిలేబి వలదా
    పరతంత్రులు; దీనజనుల పాలి సురతరుల్
    గురుతరముగ నా మంచిని
    నిరతము చేయంగ నెంచు నిర్మల హృదయుల్!


    జిలేబి

    ReplyDelete


  24. తిరమై బానిస లన్న భావనయె బంధింపంగ కల్మాషులై
    పరతంత్రుల్ చరియింత్రు; దీనజన కల్పక్ష్మాజ సాదృశ్యులై
    వరమై మోహన దాసు గాంధివలె వాక్స్వాతంత్ర్యమున్ కోరి ని
    బ్బరికమ్మున్, దృఢమైన నమ్మకముతో స్వాతంత్ర్యులే చేర్తురౌ!


    జిలేబి

    ReplyDelete


  25. నైతిక విలువల వలదని
    ఖాతరు చేయక నిజముల, కవ్వింపులె వ్యా
    ఖ్యాతలకు మేలనుకొనుచు
    నూతనమగు రీతి చెప్పు న్యూసు జిలేబీ


    జిలేబి

    ReplyDelete


  26. మొక్క భయపెట్టెను సుమా
    చక్కగ కొరియరు కవర్ల చాటున చేరెన్
    మిక్కుటముగా నమెరికా
    టక్కరి చీనీయుల టమటమయకొ సుదతీ


    జిలేబి

    ReplyDelete
    Replies
    1. ఎవరికైనా పార్సెల్ వస్తే వెంటనే తీసేసుకుని దాచేసుకుంటారా ? అమెరికాకి పచ్చడి పంపాలన్నా కష్టం. మొత్తం బ్యాగులు చెక్ చేసి ఎయిర్పోర్టులోనే చెత్తబుట్టలో వేసేస్తారు. ఆ నక్క న్యూస్ లన్నీ ఏరుకొచ్చి చైనా మీదపడి ఏడవడం తప్ప ఒరిగేది ఏమీ లేదు.

      Delete
  27. ఎవరికైనా పార్సెల్ వస్తే వెంటనే తీసేసుకుని దాచేసుకుంటారా ? అమెరికాకి పచ్చడి పంపాలన్నా కష్టం. మొత్తం బ్యాగులు చెక్ చేసి ఎయిర్పోర్టులోనే చెత్తబుట్టలో వేసేస్తారు. ఆ నక్క న్యూస్ లన్నీ ఏరుకొచ్చి చైనా మీదపడి ఏడవడం తప్ప ఒరిగేది ఏమీ లేదు.

    ReplyDelete


  28. మందు లేదండి వేక్సిను మనకు రాదు
    మూ.ము . గుడ్డ నిజము సత్యము బహు దూర
    మాయె బోనగిరి ! మనిషి మనుగడకిక
    ముప్పు తప్పదు నిర్ణయము ప్రకృతి దయ!


    జిలేబి

    ReplyDelete
    Replies
    1. అప్పుడే రేపటికి వెళ్లి పోయారా?

      Delete
    2. బ్లాగ్ లో సెటింగ్స్ > > ఫార్మాటింగ్ >> టైమ్ జోన్ లో ఐఎస్‌టీ(జీఎమ్‌టీ+౦౫౩౦) గా సెట్ చేసుకుంటే సరియైన టైమ్‌స్టాంప్ రాగలదు. బై డీఫాల్ట్ గా అమెరిక పసిఫిక్ టైమ్ జోన్ సెట్ అయి వుంటాయి..

      Delete
    3. మీరు మరీనండి. అది సింగపూర్ టైం జోన్.

      Delete
    4. అది కొరియన్ టైమండి బోనగిరి గారు.. బిజిలే అమ్మణ్ గారు ఆం. ప్ర. నుండి టియన్ నుండి కేటికే దాటి ఎస్‌జీపీ చేరి.. అనక.. లాక్ డౌన్ వలన బహుశ మరల ఇండియలో అడుగిడి ఉంటారని. అనుకుంటున్న.. సిహి కనసుగళు..!

      Delete


  29. అప్పుడే రేపయెనకొ? ప్రభాత సమయ
    మునకు జేజేలు పలుక సుముఖులయిరకొ
    చూడ సమయమ్ము కాలమ్ము చుక్కలమ్మి
    తీరు మనచేతిని కలదే తివిరి తీయ :)



    జిలేబి

    ReplyDelete


  30. అమెరికా అతి తెలియనిదా జిలేబి ?
    కొంత మందికి రోగము కొత్త కాదు
    చీని భాయి తెలివివల్ల చిక్కు వచ్చె
    చేసె నిరుదే‌శములు కలిసి పరిశోధ
    నలను దేశము లెల్లను నష్టమొంద


    జిలేబి

    ReplyDelete


  31. తెలుగు వాళ్లు తలచుకున్న తీయ లేర
    మంచి చిత్రములను? కాని మచ్చు కైన
    తీయ రాయె! తీసిన సుదతీ జిలేబి
    రావవి థియేటరులకు ఖరారు గాను !


    జిలేబి

    ReplyDelete


  32. ఇది సత్యంబిదె సత్యము
    సదనపు నరసన్న పలుకు చందంబాయెన్
    విదురుల మాట పనస తొన
    కదా జిలేబి, పలుకులవి ఖాజూ కత్లీ :)



    జిలేబి

    ReplyDelete


  33. వ్యతిరేకత బాగా ఉం
    ది తిరముగా జనులయందది, కనబడదు తీ
    వ్రత, లేదు మార్చి నేతల
    నితరుల నిలుప నవసరము, నిక్కమిదె సుమీ :)


    జిలేబి

    ReplyDelete


  34. సిన సేపను పెద సేపయు
    సిన మాయనరె పెనుమాయ సిత్రము గా మ్రిం
    గు‌ను వేదమిదియె వేదం
    బనుమానమ్ము వలదోయి బామ్మ జిలేబీ :)


    జిలేబి

    ReplyDelete


  35. మమతల మధురిమలు జిలే
    బి, మరింతగ పొంగినట్టి బిగి కల్గిన సా
    రము కల్గిన పదముల గీ
    తము మిక్కిలి చక్కనిది సుదతి వినవమ్మా :)


    జిలేబి

    ReplyDelete