సహజీవనం
========
దోమలతో చేస్తున్నాం
బొద్దింకలతో చేస్తున్నాం
బల్లులతో, నల్లులతో చేస్తున్నాం
పెనిమిటితో, పెండ్లాముతో చేస్తున్నాం
ఆఫ్టరాల్ కరోనాతో చేయలేమా :)
జిలేబి
ఉబోస
Postings by Zilebi- When its Hot its Really Cool ™ Copyright © 2008-2030. All rights reserved
"జిలేబి" గారు, ఈ కళ మీకు బాగా ప్రవేశం ఉన్నదే అనుకుంటాను 😉?
ReplyDelete"జిలేబి తయారు చేయడం ("పాకశాల" బ్లాగ్ June 19, 2020)
Deleteఇన్ని రోజులు గా వేస్తున్నాం వాటిని రుచి చూస్తున్నారు ఇప్పుడా/ ఇన్నాళ్ళకా / ఇన్నేళ్ళకా ఇట్లాంటి సందేహం వచ్చేది ? :)
ఛ ఛ ఛ
జి లే బి
మీరు వేసే వాటికి అలవాటు పడ్డాంలెండి. ఇవి ఏమన్నా “డిఫరెంట్” గా, “వెరైటీ” గా ఉంటాయేమోననీ 🙂 🙂 (తెలుగు సినిమా వాళ్ళ ఊతపదాల్లో చెప్పాలంటే)
Delete
Delete:) తినగ తినగ వేము తీయన :)
జిలేబి
రోజూ సమస్య పూరణ
ReplyDeleteమోజుల సహజీవనమున మురిసి విసురు మీ
క్రేజీ కందజిలేబుల
జూజూలు భుజించి గురుడు చొక్కె షుగరుతో .
ReplyDeleteచక్కగ చొక్కిరిగా మా
చక్కెర తియతీపికి యదె చాంగుభళారే
లక్కాకులకవివర్యా
నిక్కముగ కరోన వేళ నిమ్మళమిదియే
జిలేబి
ReplyDeleteజిలేబీ కాశీయాత్ర !
కోడూరి శేషఫణి వరు
డా! డంబముగ చని గడగడ వడివడి జిలే
బీ, డింగిల్లి కపర్దికి
గాడిద గ్రుడ్డుఁ గొనివచ్చెఁ గాశికిఁ జనియున్!
జిలేబి
ReplyDeleteకందోత్పల
భుజముల పైనిడుకొనుచు వ
నజ, గాడిద గ్రుడ్డుఁ దెచ్చె నఁట కాశికిఁ బో
యి! జనమ్ము మెచ్చగన్ చీ
నజతో సత్కారమట ఘనముగ జిలేబీ
జిలేబి
తెలిసే వాడుతున్నారో లేదో తెలియదు కాని అఖండయతులు తెగ వాడుతున్నారు!
Delete
Deleteఅఖండయతి అనగానేమి ?
జిలేబి
పిలిచి ప్రాణమ్ముఁ దీయ నీ విష్టపడవు.
Deleteపుణ్యవాక్కులు జెప్ప నీ వులికి పడితె.
కేశవుఁడు పిల్చె నన్న నీ కేమి లెక్క?
పొమ్మనుచు నిన్నుఁ దిట్ట నీ వోపలేవు.
ఖండాంతర జీవనుల క
Deleteఖండయతుల యూసులేల? కందాదులనున్
ఖండాఖండ విఖండన
భండన మొనరించు వేళ బహువిధ గతులన్ .
అఖండయతి 👇
ReplyDeletehttps://kandishankaraiah.blogspot.com/2011/08/blog-post.html?m=1
Deleteహమ్మయ్య !
ఈ క్లిష్టతలన్నీ తెలియకనే పద్యాలను కట్టేస్తున్నా నన్న మాట. సహజ కంద జిలేబి నన్న మాట :)
You see such a natural flow I mean :)
నారదా!
జిలేబి
గుండు సున్న
Delete
ReplyDeleteఅనుకొంటి సుమా! కాబో
లును రోగులె భాగ్యవంతులు కరోన కురో
గ నియోగమందినన్ క్షణ
మున మోక్షముగిట్టును తబముల చేయకనే
జనాలు వాయగొట్టకుంటే చాలును:)
జిలేబి
ReplyDeleteపరుగుల వచ్చు ఆంబులెన్సు గ్రీను కలరు
బాగోగుల చూచుకొనన్
వేగముగ పరుగుల నింట వేంచేసి భళా
రే గౌరవ మర్యాదలు !
రోగులు సంపన్నులే కరోనా వలనన్
జిలేబి
ReplyDeleteపట్టు సేల మడిప్పుల నా మయంగి పోనేండి :)
ఈ కరోన కాలములో సఖీ జిలేబి
కానుకగ నీయగ కొనంగ కంచి పట్టు
లేవు డబ్బులనుచు పొగు లెందు కమ్మ
చెలికి రవిక మాత్రము చాలు చీర యేల
జిలేబి
ReplyDeleteపట్టుసేల కొనిపెట్టలేక పోతున్నా నీ కరోనా కాలములో అని వగచు సఖి తో
కందోత్పల
కొనగా దస్కము లేదా?
విను! మాన ధనాఢ్యకున్ రవిక మాత్రము చా
లును చీర యేటికిన్ సఖి
మనుకిత పడకోయి కష్టమైన తరుణముల్!
జిలేబి
ReplyDeleteకానుక నీయ మానసము కాదుటె ముఖ్యము? పట్టుసేలయే
లా? నగువోతు నీపలుకు లవ్వియె చాలును నాకు నెచ్చెలీ!
కాన సళించకోయి సఖి! కష్టపు కాలమిదాయె కాదుటే?
మానధనాఢ్యకున్ రవిక మాత్రము చాలును చీర యేటికిన్?
జిలేబి
ReplyDeleteకొండను దూకుచు కోనల
నిండుగ పరుగుల దుముకుచు నిటునటు నా బ్ర
హ్మాండము బ్రద్దలు కొట్టుచు
మెండుగ తెలికడలి సరవి మించారె కదా
జిలేబి
ReplyDeleteఅరె బుచికి ఏమిటప్పా
సరి వాట్సాపున కతికె వసందుగ సుమ్మీ
పరికింపంగ మన ప్రకృతి
సిరి మన దేశమునకు భళి సెహభేషనగా
యాడుండాడో బుచికి :)
జిలేబి
ReplyDeleteబోడి సలహా యిదనకం
డీ! డింగరుని వలె నే గడిపినానచటన్
బేడీల్వేయగ టాలెంట్
తేడాపడిపోయెనయ్య తేకువ బోవన్
జిలేబి
ReplyDeleteపిట్టల్దొరలోయ్ ట్వీటర్స్!
చుట్టేస్తూంటారు పల్కుచు, జిలేబివలెన్
కట్టేస్తుంటారిటుకల
చట్టనుచు పొడిపొడి పదపు చమకులమరగా
జిలేబి
ReplyDeleteఇదె వీరతాళ్లు వేద్దా
మిదె యచ్చతెలుగునకున్ భళీ బుచికీకిన్
సదనపు కామింట్ కింగు ప
సదనము లీయ పిలిచిరి విశాల హృదయులై
జిలేబి
ReplyDeleteయూజీ నీవే కుండలి
నీజాగృతి కలిగినట్టి నిజమగు హరివోయ్
ఈ జగతిని తెలుగోళ్ళిం
తే! జాతి మునుపటినుండి యింతే నయ్యా!
జిలేబి
ReplyDeleteఅతియైపోయె సమస్యయె
గతి తెలియుట లేదదెట్లు కావింతును పూ
ర్తి! తరుణమిదియే సుమ్మీ
మతి లేనట్టి పవనజుని మానక గొల్తున్
జిలేబి
ReplyDeleteఅతివల్ పుట్టల కైపరుంగులిడిరక్కా ! నేను సైతమ్ము దు
ర్మతి లేనట్టి మరుత్సుతున్ గొలిచెదన్ మాంగల్యముం గోరుచున్,
గతిమారంగ కరోన పోవుటకు చక్కంగాను ప్రార్థింతు స
న్మతినీ యంగ జనాళి భీతి తొలగన్ మాలిన్యముల్ బోవగా!
జిలేబి
ReplyDeleteనేనో పంఖా నండీ
చానా తడవలు జిలేబి సాంబారును చూ
సానే రుచి రాజా! అభి
మానిని చేస్తుంట విరసమైన సరసముల్ :)
జిలేబి
ReplyDeleteగాంధి ఖానబ్దులు గఫారు; కలరు లోక
మాన్యులున్ను చాచానెహ్రు ;మవ్వమొందె
భగతు సింగు; రాజీవుడు;భరత నారి
ఇందిరమ్మ! రాజా కలరిందు లోన!
జిలేబి
ReplyDeleteచూచితి నిన్నని తెలుసును
వైచిత్రియు నీదని పరవశులై తూగం
గా చిన్ని వాడ నవ్వుల
తో చీకాకులను తృటిని ద్రోలెదవు కదా!
జిలేబి
“జిలేబి” గారు,
ReplyDeleteపొద్దునే పెట్టిన మీ “తింత్రిణీ ఫల .....” పోస్ట్ లో ఏ అరవ విడియో పెట్టేశారు. దాని మీద వ్యాఖ్యలు వరదలా వస్తుంటే “తాంబోలాలిచ్చేశాను” అన్న రీతిలో చూస్తున్నారా? సాయంత్రానికి గాంధీ మీద, ఫ్రాంటియర్ గాంధీ తదితరుల మీద పద్యం కట్టి ఈ టపా క్రింద పోస్ట్ చేసి కూర్చున్నారా? అన్యాయం సుమండీ.
ReplyDeleteమా యమ్మ యశోద కుమా
రా! యవనారీ! ముకుంద! రాధారమణా!
శ్రీ యదుకులనందన! నీ
వేయన్నియు కంబుధరుడ! వెన్నుడ! కృష్ణా!
జిలేబి
ReplyDeleteఅమరగ చిరునగవులతో
కమలాక్షుఁడు, విషముఁ గ్రోలెఁ గద శుభకరుఁడై
ప్రమథాధిపుడు జిలేబీ
సమవుజ్జీలిరువురున్ను సాధించుటలో
జిలేబి
ReplyDeleteనాడు నేడు రేపు నావల నీవల
లేదు భేదమరయ లెస్సగాను
నాక మందు గలను నమ్మిన వారికి
యెల్లె డల గలను మయికొలుపంగ!
జిలేబి
ReplyDeleteకలదు నాక మందు కానితల్లి పిరియ
మెరుగనయ్య రాజ మేల్మి తృప్తి
మరల మరల బడయ మానసమ్మెలమిని
సేద దీర భువిని చేరినాడ
జిలేబి
ReplyDeleteఅరయగ మహిళలు పేర్మిని
వరలక్ష్మీ వ్రతముఁ జేయవలె, పురుషు లిలన్
త్వరితము బుద్ధి బడసి రాన్
పరుగుల పరుగుల సతుల సపర్యల కొరకై
శుభాకాంక్షలతో
జిలేబి
ReplyDeleteవరలక్ష్మీ వ్రత మాచరింపవలె సద్భక్తిన్ దగం బూరుషుల్
పరమాన్నంబు భుజించి పత్నుల కెడన్ వైవశ్యులై సేవలన్
తరియింపంగ, సుఖమ్ములన్ బడయగా దర్పమ్ముతో తప్పకన్
పరిణేతల్ తమ కొల్వులో వెలుగగా ప్రాణేశ్వరిన్ వీడకన్
జిలేబి
ReplyDeleteఅమరగ చిరునగవులతో
కమలాక్షుఁడు, విషముఁ గ్రోలెఁ గద శుభకరుఁడై
ప్రమథాధిపుడు జిలేబీ
సమవుజ్జీలిరువురున్ను సాధించుటలో
జిలేబి
ReplyDeleteస్వాము లోర్లు కట్టాలె గోసాయి గోచి
మాకు మాత్రము కావాలె మహలు బెంజి
కార్లు, దక్కాలె భోగభాగ్యములు, స్వామి
వారి కరుణ మించారగ వర్షమగుచు :)
నేనన్లే :)
జిలేబి
ReplyDeleteఒక చేతిని మురళీ రవ
మొక కన్నున కరుణమీర ముద్దుల చూపుల్
త్రికరణ శుద్ధిగ నమ్మి వ్ర
జకిశోరా చేరి నాము సన్నుతి చేయన్!
జిలేబి
ReplyDeleteవిన్నకోట నరసింహారావు గారి సాహిత్య సేవ.
జిలేబి" గారు,
ఇదిగోనండి (నాకు నచ్చని) ఈ పాటకు పైన 29 July 2020 at 12:48 న మీ కామెంట్లో శర్మ గారిని మీరడిగిన "లిరిక్స్" / సాహిత్యం ... నాకు అర్ధమయినంత వరకు (ఈ మాత్రం దానికి శర్మ గారికెందుకు శ్రమ ఇవ్వడం అని నేనే చెయ్యి జేసుకున్నాను అన్నమాట 😎). నాకు స్పష్టంగా వినిపించనివి ఒకటి రెండు gaps గా (లేదా ప్రశ్నార్ధకంతో) వదిలేశాను, ఆసక్తి గలవారు విడియో విని అర్ధమయితే నింపుకోవచ్చు.
===============
"విందు చేసినారు వియ్యాల వారింట
విందు మాట చెబితే వింతగా తోచును ||విందు||(2
-------
(1). పప్పూ ఉడకలేదు , చారూ కాగలేదు
అరటికాయ కూర ఊసే అందలేదు ||విందు||
----------
ఏలాగు భోంచేతుమో ఈ విందు మేమేలాగు భోంచేతుమో
చాలా పెళ్ళిళ్ళాయె ఈలాటి విందు మేము ఏలాగు భోంచేతుమో
ఈ విందు మేమేలాగు భోంచేతుమో
------------
(2). వియ్యపురాలొచ్చి నెయ్య వడ్డించింది
ఎన్ని వేయకున్న (?) చెయ్యి తడవలేదు ||విందు||
(3). విస్తళ్ళు వేశారు, చారెడేసి వెడల్పు లేవండీ
హస్తంబు తడుపుటకు ఔరౌర చోటు లేదు ||ఏలాగు||
(4). అప్పడాల్ వడియాలు అసలే కన్ పడలేదు
గొప్పచూడబోతే చెప్పతరము కాదు ||విందు||
(5). కూరే వంకాయ కూర, దానిలోకి మార్చే(?) పచ్చడి లేదు
కలహంబులా ...(?)... ముట్టితిమి (?) ||ఏలాగు||
(6). ముక్కాబియ్యము వండిరి, దానిలోకి ముద్దపప్పే వేసిరి
చెప్పుకుంటే సిగ్గవుతుంది, చెయ్యగలిగే వీలు లేదు ||ఏలాగు||
(7). అప్పడాల్ వడియాలు అసలే కన్ పడలేదు
గొప్పచూడబోతే చెప్పతరము కాదు ||విందు||
(8). లడ్డూ జిలేబీలా, పాకములో వడ్డించెరంట(?)
వడ్డించే వదినె గారి వడ్డాణం జారిపోయె ||ఏలాగు||
-----------
ఏలాగు భోంచేతుమో ఈ విందు మేమేలాగు భోంచేతుమో
చాలా పెళ్ళిళ్ళాయె ఈలాటి విందు మేముఏలాగు భోంచేతుమో
ఈ విందు మేమేలాగు భోంచేతుమో
================
"
ఓహో, శర్మ గారి “కష్టేఫలి” బ్లాగులోని నా కామెంట్ ని ఇక్కడకు కూడా తెచ్చారా మీరు? మరింత మంది జనాలు చూస్తారనా?
Deleteమంచి పనే గానీ వీడియోలో నాకు స్పష్టంగా వినపడక నేను వదిలేసిన gaps ని పూరించడం గానీ, ఇతర దిద్దుబాట్లు గానీ మీతో సహా ఎవరైనా సమర్థులు చెయ్యగలిగితే బాగుంటుంది కదా?
"విందు చేసినారు వియ్యాల వారింట
Deleteవిందు మాట చెబితే వింతగా తోచును ||విందు||(2)
(1)పప్పూ ఉడకలేదు, చారూ కాగలేదు
అరటికాయ కూర ఊసే అందలేదు ||విందు||
----------
ఏలాగు భోంచేతుమూ ఈ విందు మేమేలాగు భోంచేతుమూ
చాలా పెళ్ళిళ్ళాయె ఈలాటి విందు మేమేలాగు
ఏలాగు భోంచేతుమూ
ఈ విందు మేమేలాగు భోంచేతుమూ
------------
(2) వియ్యపురాలొచ్చి నెయ్య వడ్డించింది
నెయ్యి వేయకుండా చెయ్యి తడవలేదు ||విందు||
(3)విస్తళ్ళు వేశారు, చారెడేసి వెడల్పు లేవండీ
హస్తంబు తడుపుటకు ఔరౌర చోటు లేదు ||ఏలాగు||
(4)అప్పడాల్ వడియాలు అసలే కన్పడలేదు
గొప్పచూడబోతే చెప్పతరము కాదు ||విందు||
(5)కూరే వంకాయ కూర, దానిలోకి మార్చే పచ్చడి లేదు
కలహంబులతో కారం గుచ్చెత్తిరీ ||ఏలాగు||
(6)ముక్కాబియ్యము వండిరి, దానిలోకి ముద్దపప్పే వేసిరి
చెప్పుకుంటే సిగ్గవుతుంది, చెయ్యగలిగే వీలు లేదు
||ఏలాగు||
(7)అప్పడాల్ వడియాలు అసలే కన్పడలేదు
గొప్పచూడబోతే చెప్పతరము కాదు ||విందు||
(8)లడ్డూ జిలేబీలా, పాకములో మడ్డి తేలిందట
వడ్డించే వదినె గారి వడ్డాణం జారిపోయె ||ఏలాగు||
-----------
ఏలాగు భోంచేతుమూ ఈ విందు మేమేలాగు భోంచేతుమూ
చాలా పెళ్ళిళ్ళాయె ఈలాటి విందు మేముఏలాగు భోంచేతుమూ
ఈ విందు మేమేలాగు భోంచేతుమూ.
Well done నీహారిక గారూ. చక్కగా పూరించారు. థాంక్సండి.
Delete
Deleteకష్టేఫలి తాతగారి వర్షన్
విందు చేసినారు వియ్యాల వారింట
విందు మాట చెబితే వింతగా తోచును ||విందు||(2)
-------
(1). పప్పూ ఉడకలేదు , చారూ కాగలేదు
అరటికాయ కూర ఊసే అందలేదు ||విందు||
----------
ఏలాగు భోంచేతుమో ఈ విందు మేమేలాగు భోంచేతుమో
చాలా పెళ్ళిళ్ళాయె ఈలాటి విందు మేము ఏలాగు భోంచేతుమో
ఈ విందు మేమేలాగు భోంచేతుమో
------------
(2). వియ్యపురాలొచ్చి నెయ్య వడ్డించింది
నెయ్యి వేయ మన్న చెయ్యి తడవలేదు ||విందు||
(3). విస్తళ్ళు వేశారు, చారెడేసి వెడల్పు లేవండీ
హస్తంబు కదుపుటకు ఔరౌర చోటు లేదు ||ఏలాగు||
(4). అప్పడాల్ వడియాలు అసలే కన్ పడలేదు
గొప్పచూడబోతే చెప్పతరము కాదు ||విందు||
(5). కూరే వంకాయ కూర, దానితోపాటే పచ్చడి లేదు
కలహంబులా కారం గుచ్చెత్తీనారూ ||ఏలాగు||
(6). ముక్కాబియ్యము వండిరి, దానిలోకి ముద్దపప్పే వేసిరి
చెప్పుకుంటే సిగ్గవుతుంది, చెయ్యికడిగే వీలు లేదు ||ఏలాగు||
(7). అప్పడాల్ వడియాలు అసలే కన్ పడలేదు
గొప్పచూడబోతే చెప్పతరము కాదు ||విందు||
(8). లడ్డూ, జిలేబీలా పాకములో వడ్డించెరంట
వడ్డించే వదినె గారి వడ్డాణం జారిపోయె ||ఏలాగు||
-----------
ఏలాగు భోంచేతుమో ఈ విందు మేమేలాగు భోంచేతుమో
చాలా పెళ్ళిళ్ళాయె ఈలాటి విందు మేముఏలాగు భోంచేతుమో
ఈ విందు మేమేలాగు భోంచేతుమో
చిభాశ
Deleteవినరా వారి సవరణ
బాగుంది శర్మ గారు 👌👏.
ఆ విడియో మరోసారి విన్నాను. ఇప్పుడు నాకు అర్థమైన రీతిని బట్టి ఒకటి రెండు సవరణలు 👇.
=============
చాలా పెళ్ళిళ్ళాయె ఈలాటి విందు లేదు, ఏలాగూ భోంచేతుమూ
————
లడ్డూ ....... పాకములో మడ్డి తేలిందంట
...... వడ్డాణం ఊడిపోయె
——————
చాలా పెళ్ళిళ్ళాయె ఈలాటి విందు లేదు, ఏలాగూ భోంచేతుమూ
==========
🙏
వి.న.రా.
వివరణలూ సవరణలూ
Deleteచవియై భోజనముకంటె సారమయి యొకిం
త వినోదము గూర్చెను, ఇం
త విబుధు లున్నారనేటి తత్త్వము దెలిసెన్ .
Deleteకష్టేఫలి తాతగారి
సంస్కరింపబడిన ప్రతి.
————
"విందు చేసినారు వియ్యాల వారింట
విందు మాట చెబితే వింతగా తోచును ||విందు||(2
-------
(1). పప్పూ ఉడకలేదు , చారూ కాగలేదు
అరటికాయ కూర ఊసే అందలేదు ||విందు||
----------
ఏలాగు భోంచేతుమో ఈ విందు మేమేలాగు భోంచేతుమో
చాలా పెళ్ళిళ్ళాయె ఈలాటి విందు లేదు, ఏలాగూ భోంచేతుమూ
ఈ విందు మేమేలాగు భోంచేతుమో
------------
(2). వియ్యపురాలొచ్చి నెయ్య వడ్డించింది
నెయ్యి వేయ మన్న చెయ్యి తడవలేదు ||విందు||
(3). విస్తళ్ళు వేశారు, చారెడేసి వెడల్పు లేవండీ
హస్తంబు కదుపుటకు ఔరౌర చోటు లేదు ||ఏలాగు||
(4). అప్పడాల్ వడియాలు అసలే కన్ పడలేదు
గొప్పచూడబోతే చెప్పతరము కాదు ||విందు||
(5). కూరే వంకాయ కూర, దానితోపాటే పచ్చడి లేదు
కలహంబులా కారం గుచ్చెత్తీనారూ ||ఏలాగు||
(6). ముక్కాబియ్యము వండిరి, దానిలోకి ముద్దపప్పే వేసిరి
చెప్పుకుంటే సిగ్గవుతుంది, చెయ్యికడిగే వీలు లేదు ||ఏలాగు||
(7). అప్పడాల్ వడియాలు అసలే కన్ పడలేదు
గొప్పచూడబోతే చెప్పతరము కాదు ||విందు||
(8). లడ్డూ, జిలేబీలా పాకములో మడ్డి తేలిందంట
వడ్డించే వదినె గారి వడ్డాణం వడ్డాణం ఊడిపోయె||ఏలాగు||
-----------
ఏలాగు భోంచేతుమో ఈ విందు మేమేలాగు భోంచేతుమో
చాలా పెళ్ళిళ్ళాయె ఈలాటి విందులేదు ఏలాగు భోంచేతుమో
ఈ విందు మేమేలాగు భోంచేతుమో
చిభాశ
ReplyDeleteవీడటే పూతన విషము చన్నుల పాలు
పాళితో ద్రావిన బాలకుండు
వీడటే బలుబండి విర్రవీగుచు గాల
దురుసున దన్నిన దుండ గీడు
వీడటే సుడిగాలి విధమెల్ల దాదెల్సి
పట్టుక మెడ వైచి పార వైచె
వీడటే మొన వ్రేల వేగమై గొండెత్తి
జేజేల దొర ఠీవి చిదిమి వైచె
వీడు యమున కాళింగుని వెడల నడచె
వీడు దొంగిలె నింటింట వెన్నలెల్ల
వీడు కార్చిచ్చు కబళించి వేగ మ్రింగె
వీని మహిమలు వివరింప వింతలమ్మ
కృష్ణ విలాసము
వెన్నముద్ద గణపతి పెద్దకవి
ReplyDeleteఇతడటే నీటిలో నీదుచు బెళుకుచు
చదువుల దెచ్చిన సాహసుండు
ఇతడటే తరిగొండ యెత్తి వీపుననాని
పువ్వంబు పుట్టించు పుణ్యమూర్తి
ఇతడటే కొమ్మున నిలయెత్తి రక్కసు
దునిమి కింకలు వెట్టు దుండగీడ
ఇతడటే చెల్వపు టింపుతో గంభాన
వెడలికీలించిన వేషధారి
గబ్బిరాజులు చెలరేగ నుబ్బులణచె
నంపకోలను మున్నీట నాచినాడు
ఇతడు వ్రేతల కెల్లను నింటి మగడు
ఇతడు బుద్ధుడు కలికిని నెంచదగును
కృష్ణవిలాసము
వెన్నముద్ద గణపతి పెద్ద కవి
ReplyDeleteమంచి నూనియ దివ్వె క్రమముగ నమరె
సీత కరపద్మమున, వెల్గె శీతకరుఁడు
రాత్రి గగనమునన్ మధురమ్ము గా జి
లేబి పద్యమొకటి వ్రాసె లివ్వులీన!
జిలేబి
ReplyDeleteఆ ఖానుండు, జిహాదీ ,
తాఖీ దివ్వగ మరణము తప్పదు జనులా
రా ఖావదు తాననుచున్
రాఖీ కట్టిన కరములె ప్రాణముఁ దీసెన్
జిలేబి
ReplyDeleteఆ ఖానుండు జిహాది యై ప్రబలియౌరా మృత్యువే మీకనం
గా, ఖాంకుండదె తొప్పదోగు హరిమన్ ఖాండ్రించి తూటాలతో
తాఖీదివ్వగ దుష్టడై, జనులు విత్రాసమ్ముతో నొవ్వ నా
రాఖీ కట్టిన హస్తపద్మములయో ప్రాణంబుఁ దీసెన్ గదా!
జిలేబి
ReplyDeleteకందోత్పల
భువిని వెలిగె నా దివ్వె చ
నవు సీత కరాంబుజంబు నను, శీతకరుం
డు వెలింగెఁ గంటి వా సఖి
దివిని! నిశియె సొబగు లీనె దివ్యముగ సుమీ
జిలేబి
కందోత్పలమను నీఘన
ReplyDeleteకందుక క్రీడల నొకింత కలమాపి హితా !
నందసుతు కృష్ణు శ్రవణా
నందముగా వొగడరాద నగధరుని హరిన్ .
ReplyDeleteపొగుడుచు పొగుడుచు రాజ
న్న గడిచె జన్మలు విభుని మనసునెటులన్ చూ
రగొనుట యో తెలియక పో
యెగదా నరులకు నిజమిదియెసుమా కవిరాట్
జిలేబి
ReplyDeleteనిష్కృష్టముగా శాస్త్రము
దుష్కృతి వలదంచు పల్కె దుండి జిలేబీ
నిష్కృతి లేదెటులనకో
దుష్కృతము నఁ బుణ్య మబ్బు దుర్మార్గునకున్?
జిలేబి
ReplyDeleteకందోత్పల
వనితా! పాపమ్మదె గ్ర
క్కన దుష్కృత మాచరించు కడు దుష్టున క
బ్బు, నితాంత పుణ్యముల్ మం
చిని పెంచు జనాళి కబ్బు చింతవలదికన్
జిలేబి
ReplyDeleteదంభోక్తులు వలదండీ!
సంభారమ్ముల విఘనము సరి మన కంతే!
జంభారికి చెందినదా
రంభాభోగమ్ముఁ గోరరాదు కవీంద్రా!
జిలేబి
ReplyDeleteదంభాల్పల్కకు నవ్విపోదురుసుమా తావేలు వేయంగ నా
యంభారిన్చరణమ్ములూనగను ఛాయాభృత్తు లైపోదుమే?
సంభారమ్ముల విందులే సరియగున్! సంభోగ భాగ్యమ్ములా
రంభాభోగముఁ గోరెదేల కవిచంద్రా యర్హతల్ గాంచవే!
జిలేబి
ReplyDeleteSpy goes north Korean movie
https://youtu.be/TMJJ-toQtaI
జిలేబి
ReplyDeleteచావడమొకటె మనుజులకు
జీవితమోయ్ బతుకుబండి చీకూచింతోయ్
దేవిడి లోగల విభుడే
నీ వునికికి మూలమోయి నీరజనేత్రా !
జిలేబి
ReplyDeleteఅమృత మథనపు వేళ భళారె విషము
బయటపడగాను ద్రావ నస్వప్నులెల్ల
నజునిఁ గోరె; శివుఁడు హలాహలముఁ గ్రోల
ముందుపడుచు నిలిపె కంఠమున జిలేబి
అజుడు - శివుడు - ఆంధ్రభారతి ఉవాచ
జిలేబి
ReplyDeleteకందోత్పల
అహ! వీరు గిల్లుకొన కర
రుహ, "బ్రహ్మనుఁ జీరె శంకరుఁడు పానము సే
య హలాహలమ్మునున్" తహ
తహలాడి సమస్య వచ్చె తక్షణము సుమా
జిలేబి
ReplyDeleteకీర్తి అనే చిగురాకుబోడి తో రమేశుడి ప్రణయ విచారము :)
పెండ్లి యాడగాను రమేశ! పెద్దలెల్ల
మంకు పట్టి కుదరదని మాటి మాటి
కి తడ కట్టిరి పరుగులంకించుకొనుము
పారిపోవలెఁ గీర్తినిఁ గోరుకొనిన!
జిలేబి
ReplyDeleteకందోత్పల
కడగండ్లకు పరుగులిడక
వడి, కాలికి బుద్ధి సెప్పవలె, గ్రక్కున ధీ
రుఁడు గీర్తిఁ గోరినన్, తడ
బడక నిలువవలెనటంచు పరిపూర్ణముగా
జిలేబి
ReplyDeleteతూలకు నిమ్మళమ్ము విడి తొందర దేల భయమ్మదేలరా?
చాలిక సోదరా! వలదు సాధ్యము కానిది లేదదేలరా
కాలికి బుద్ధి సెప్పవలె గ్రక్కున ధీరుఁడు? గీర్తిఁ గోరినన్
చాలదు దానికై వలయు చాతురి పెంచుకొనంగ మేలగున్!
జిలేబి
ReplyDeleteఅక్కకు రాన్ కోపము స
మ్మక్కగ మారె సమరమ్ము మదిలో మొదలై
నిక్కముగ ప్రకృతి మారగ
చుక్కలు నిప్పులను మంచు సూర్యుఁడు గురిసెన్
జిలేబి
ReplyDeleteకందోత్పల
కనులెర్రబడెను చూచె ల
లన చుక్కలు నిప్పురవ్వలను సూర్యుఁడు మం
చును గ్రుమ్మరించెడిన్ విధ
మనుభవ మాయె తృటిని భళి మగనికి కవిరాట్!
జిలేబి
ReplyDeleteఅక్కకు వచ్చె కోపము చివాలున లేచెను కత్తి పట్టె తా
నెక్కెను గుర్రమున్ చనెను నేరుగ దుర్మతులెల్లరిన్ తృటిన్
గ్రక్కున ఖండఖండములు గానరికెన్ గగనమ్ము మారెనా
చుక్కలు నిప్పురవ్వలను సూర్యుఁడు మంచును గ్రుమ్మరించెడిన్!
జిలేబి
ReplyDeleteశిశుపాలుని మాటగా
ఈ కరుడుగట్టిన మనిషి,
యీ కపటపు వేషధారి యీ దుష్టుడు యీ
లేకితనమ్ముల వాడీ
శ్రీకృష్ణుఁడు, దైవమగునె శిష్ట జనులకున్?
శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలతో
శిశుపాలుడేమి పుణ్యము చేసుకొనెనో
శ్రీకృష్ణుని గాధలున్నంత వరకు అతని పేరు కూడా
మారుమోగు :)
జిలేబి
శిశుపాలుడావహించెన
Deleteపశుపాలుని కృష్ణు దిట్ట పండితవర్యా!
దిశ మీదిగాదు గురుడిది
విశదము గాలే దతడికి వివరించిననూ .
ReplyDeleteజన్మాష్టమి నాడు ఇంతగా స్వామి వారిని తిట్టింప జేస్తే ఎలాగండీ కంది వారు?
శిశుపాలుని మాటగా
ఈ కార్మేఘపు వాడు, దొంగ ,పతితుండీ దుష్టుడీ కేడడున్
బాకాలూదుచు నీతులన్ బలుకు, జంబాల్గొట్టుడీ కొండెడున్
కోకల్బట్టుచు లాగు కన్నియలనీ కూళుండు నిందార్హుడీ
శ్రీకృష్ణుం డపరాధి దైవమగునే శిష్టాత్ములౌవారికిన్?
నేనలే
జిలేబి
చూడని వారెవరు మదన
ReplyDeleteచూడామణి సొగసు , చూచి చూరలుగొనుచున్
వేడని వారెవరు హితా !
నేడా పరమాత్మ కృష్ణుని జననము గదా !
సారూ ! మీకూ , పెద్దలు నరసింహరావుగారికీ కృష్ణ జన్మాష్టమి పర్వదిన శుభాకాంక్షలు .
ధన్యవాదాలు, మాస్టారూ. మీకు కూడా కృష్ణాష్టమి శుభాకాంక్షలు.
Deleteనా ఈ కామెంట్ మీ బ్లాగులో కూడా పెట్టాను.
ReplyDeleteరవి గ్రుంకెన్, నడిరేయిని
చవిచూడంగనరె సొగసు శశి పైకెగసెన్
కవితల నల్లుచు రాయడు
పువుబోడి జత మదిమది నివుడగా నెగసెన్
జిలేబి
ReplyDeleteకందోత్పల
అదిగో అయోధ్య గాంచితి
నదె స్వప్నమునందుఁ గాంచినది వాస్తవమై
ముదమందఁ జేసె రాముం
డదే కొలువు తీరె నిడుగడల దాటి సుమా
జిలేబి
ఇటీవల వ్రాస్తున్న పద్యాలు బాగున్నాయి. విచిత్ర పద ప్రయోగాలు తగ్గిపోయాయి 🐁🐇🐝
Delete
Deleteశ్రీమాన్ అనుపల్లవి బుచికీ అనబడు వారికి
చదువుతున్నారు, పద్యమో గిద్యమో బాగుందో లేదో , అదే పదివేల వరహాల మూట
నెనరుల్స్ :)
జిలేబి
ReplyDeleteకందోత్పల
స్వప్నమ్ము లెల్ల చెలి య
స్స్వప్నుల దీవెనలగుట నిశాంతంబున నా
స్వప్నమునకనబడగ నిధి
స్వప్నములోఁ గన్నదెల్ల వాస్తవమయ్యెన్!
ఎంత ఆశయో :)
జిలేబి
ReplyDeleteకందోత్పల
అదిగో వెంకన్న గుడి ని
నద! స్వప్నమునందుఁ గాంచినది వాస్తవమై
ముదమందఁ జేసె రావ
మ్మ దరి యనుచు వేల్పు బిలిచె మందిరమునకే!
జిలేబి
ReplyDeleteస్వప్నము గాంచితిన్ విభుని సన్నిధి చేరగ కౌగిలించిర
స్వప్నులు నన్ను ముద్దిడుచు స్వామియు చేర్చుకొనంగ నక్కునన్
స్వప్నమునందుఁ గాంచినది వాస్తవమై ముదమందఁ జేసె, రా
స్వప్నము లే ఋతంబయిన సౌఖ్యము నిత్యము సత్యమౌగదా!
జిలేబి
ReplyDeleteగసిపోసుకొనుచు డొగరె న
రసికుండని పేడినొక్క రమణి, నుతించెన్,
వెస బావా యని కెలవున
కుసుంభపు వెలుముల ముద్దుగులుకగ నతడే !
జిలేబి
ReplyDeleteకందాచంప్స్
ప్రకటము చేయ పసిడి కా
నుక, రసికుఁ డటంచు మెచ్చె నొక రామ నపుం
సకుఁ గంతుకేళిలోన్ వెస
చకితమగుచు, గిచ్చి గిచ్చి సరసపు వేళన్!
జిలేబి
ReplyDeleteవెసవెస ముద్దులాడను నివేశము చూపుచు ,పూవుబోడి, రా
వె సకియ! తెచ్చినానిదె కవేలపు కన్నుల దాన యంచు వే
సి సవరణింప మండముల సిగ్గుల దొంతరి యై నిఖార్సుగా
రసికుఁ డటంచు మెచ్చె నొక రామ నపుంసకుఁ గంతుకేళిలోన్!
జిలేబి
ReplyDeleteరా రమ్మంటోంది బాజారు :)
ఎందుకు ఎలా రోజుకు రోజు పైపైకి పోతోందో ఎవరికెరుక :)
వారెన్ఫఫె ఇండికేటర్ దరిదపు ౬౫ శాతములో వున్నది.
ఇంకా వయ్యారములు బోవ మరెంత సత్తువ వుందో :)
రసపట్టున తర్కమదే
ల సఖియ చెంతకు జిలేబి లా రావే ప్రే
యసి చేసెదమిక త్వరితము
పసందుగా రాసకేళి వయ్యారముగా
జిలేబి
ReplyDeleteవార్ని!బఫెటిండికేటరు ప్రాపు చూపు
వంపు! పైకి మరింతగ పైకి చేరి
షేరు బాజారెగసెగెసె చీకు చింత
లేక చోద్యమిదేమి భలే జిలేబి !
జిలేబి
కరోనాలో రెండో తరంగం (సెకండ్ వేవ్) లాగే బజారులో కూడాను. ఇలా పైకి తీసుకెళ్లి మళ్లీ ఏ 33వేల దగ్గరకో తీసుకొస్తుంది చూడండి.
Delete
ReplyDeleteకర్రపెత్తనమే మాది గట్టి గాంచె
నాటి బీయెస్సెనలులోన నరసరాయ
మాటలాడి విషయముల మంత్రమెల్ల
తెలుసు కొనివారికే వేటు తీటుతాము :)
జిలేబి
ReplyDeleteఖాతరు చేయని జనులకు
నేతృత్వమెలాగు చేయ నేర్తుమటంచున్
మోతాదుకు మించి యరరె
స్వాతంత్ర్యము వచ్చి యేడ్వసాగిరి నేతల్
జిలేబి
ReplyDeleteఅరె భారతమాతయె బా
గరి! వచ్చె స్వతంత్రమంచుఁ గడు వంతను బొం
దిరి నేత లెల్లరున్ చి
ప్ప రిక్క వెట్టుకొనిచూడ భండారమ్మే!
జిలేబి
ReplyDeleteఖచ్చితమైన గాంధి యనుకాంక్షయె పిక్కటిలంగ ధీరులై
తెచ్చిరి యొత్తిడిన్ జనులు తేకువ తోడు! బ్రిటీషువారలో
యిచ్చిరి రెండు ముక్కలు సయింపక! దేశమసవ్యమై కదా
వచ్చె స్వతంత్రమంచుఁ గడు వంతను బొందిరి నేత లెల్లరున్!
జిలేబి
ReplyDeleteఅరకొరగా మాట్లాడకు!
మరణమును జయించువాఁడె మర్త్యుం డన్నన్,
తరిమెదరు నిన్ను జనులే
పరిణితి గనవే తెలివిడి వలయు జిలేబీ !
జిలేబి
ReplyDeleteకందా చంప్స్
కడగండ్లను దాటుచు ము
న్నడి మరణమునున్ జయించిననె మర్త్యుఁ డనం
బడు నెవ్విధిన్ గనన్ త్వర
పడక మొగపిఱికి జయించు పగటు జిలేబీ
జిలేబి
ReplyDeleteమరణమునున్ జయించిననె మర్త్యుఁ డనంబడు నెవ్విధిన్? గనన్,
గురువులు, ముక్తికోరికయు కూర్పుగ మానుష జన్మమున్ లభిం
ప,రవణ మై మనోజ్ఞముగ పట్టుగ ధ్యానము చేయగా మరిం
త రగులు గాంచి సాధనపు ధన్యత గాంచి బృహత్తు ధ్యేయమై!
ReplyDeleteఅతివలు లలితా! వ్రాయవ
లె తమదగు విధముల కైత లెల్లను వినుమా
వ్రతమాచరించి వడి భా
రతినిఁ గొలిచి కావ్యములను వ్రాయఁగ నొప్పున్!
జిలేబి
ReplyDeleteరారండోయ్ రారండోయ్ రీ టైర్డయ్యలారా అమ్మలారా! పిల్ల లారా! పాపలారా ప్రౌఢులారా ! ఎల్లరున్ రారండోయ్ !
జతరండీ! జమగట్టుడీ స్థలమునన్! సత్రంబిదే జోరుగా
ను తదాత్వమ్మున నేర్వ శీఘ్రమిచటన్ నూత్నంపు చందమ్ములీ
న త్రిలింగంబున కైతలెల్ల! త్వరగా నభ్యాసమున్ సల్పి భా
రతి పూజన్ ఘటియించి వ్రాయఁగఁ దగున్ రమ్యంపుఁ గావ్యమ్ములన్!
జిలేబి
ReplyDeleteఆరు నెల్ల సావాసముంటే వాళ్లు వీరవుతారట :)
ఈ మధ్య మన వచన వ్యాఖ్యాతలు కూడా గ్రాంధికములోకి దిగిపోయేరు పజ్జాల్ని చదివి చదివి అర సున్న ఒకటే తక్కువ :)
ఉద్యోగంలో జేరిన కొత్తలో శలవు చీటీ.... :)
జిలేబి
ఆ వాక్యం గ్రాంధికం అంటారా మీరు?
Deleteఅసలు ఆ వాక్యంలో తమకు అంత వింతగా ఏం తోచిందో?
This comment has been removed by the author.
Delete
ReplyDeleteతాతాగారి వౌచింగు :)
అన్నీ యిష్టంబేమో
పన్నీరును చల్లి భళి లబక్కున ఓ రా
జన్నా మ్రింగు జిలేబీ
మిన్నగ గలదంచు స్వీటుమీటనుచు సుమీ :)
జిలేబి
This comment has been removed by the author.
Delete
ReplyDeleteచిత్ర జగతి సోకులు :) టీవీవాళ్ల న్యూసు కవరేజి :) మన ఇండియన్ ఎక్స్ప్రెస్ బాలకృష్ణ గారే సరియో కాదో చెప్పాలె :)
అసువులం బాసె నర్జునుం డందఱేడ్వ
చిత్ర సీమ దుఃఖమునొందె చింతిలగ జి
లేబు లెల్లరు కాల్వలై లెస్స కంటి
నీరు పారె వరద పొంగి నింగి కెగసె!
జిలేబి
ReplyDeleteప్రముఖుడు! మహా నటుండు గ
నుమ! అసు వులఁ బాసె నర్జు నుఁ డనంత విషా
దము నొంద నందఱున్ చే
రి మునిగి రా దుఃఖసాగరిని జనులకటా !
జిలేబి
ReplyDeleteఆ నటుడి మరణం వెనుక ఎవరి హస్తముంది ?
రసికత జొప్పు నాట్యముల రాధన మందు జిలేబులెల్లరిన్
ముసిముసి నవ్వులన్ భళి ప్రమోదము నొందగ చేసె నాతడే!
మిసిమిసి లాడు యవ్వనపు మేటినటుండు గృహమ్ములోనరే
యసువులఁ బాసె నర్జునుఁ డనంత విషాదము నొంద నందఱున్!
జిలేబి
బామ్మా! కుశలమేనా?
ReplyDelete
ReplyDeleteమూల ఉన్నదాన్ని కష్టపడి తీస్తే హై వాల్యూ :)
అక్క డెక్కడో గనులలోన కనుల కన
బడక యుండె త్రవ్వి వెలుగు బరచి చూడ
రత్నములుగ మారెను ఱాళ్ళు ప్రజలు మెచ్చ
గాను మనుజుల లెంత నిగ్గడియొ కాదె
జిలేబి
ReplyDeleteకందోత్పల
నిగనిగ లాడుచు కన్నుల
వగ, రత్నము లెయ్యె ఱాళ్ళు భళిరా యని మె
చ్చఁగ లోకులెల్లరున్ మూ
లగపడి యున్న గనిని జనులరె త్రవ్వంగాన్
జిలేబి
ReplyDeleteనూత్నపు కైపు లంతయు మనోజ్ఞమగున్ పరమార్థమిద్దియే!
ప్రత్నపు త్రవ్వకమ్ముల నిరంతర మైన కృషిన్, ప్రయాసతో
యత్నము చేసి త్రవ్వి గని యందున చూడ కనుల్ జిగేల్మనన్
రత్నము లెయ్యె ఱాళ్ళు భళిరా యని మెచ్చఁగ లోకులెల్లరున్!
జిలేబి
ReplyDeleteపోరాడవలె కరోనా
తో రైతులు పంట వేయ తుంగత తోడై
ధారాళముగ సుదతి కే
దారము లేకున్న సుఖము దక్కునె భావిన్
జిలేబి
ReplyDeleteషేరు బజారు పైకెగయు సిత్రము ముప్పును చూపె దాపులో
ఓ రయితన్న ! నీ చలువ యోమటి గుప్పెడు మాకు సర్వదా!
పోరెదమీ కరోననిక; బువ్వకు దైవము నీవె మాకు! కే
దారము లేక సర్వ జనతా భవితవ్యము శూన్యమే సుమా
జిలేబి
“జిలేబి” గారు,
ReplyDeleteమీరు తరచుగా “కందా ఛంప్స్” అంటుంటారు కదా. అంటే అర్థం ఏమిటండీ ? chump (plural : chumps) అన్న పదానికి అర్థం నాకు తెలుసనుకోండి, అయినా ఒకసారి ఆన్-లైన్ లో వెదికితే ఈ క్రింది అర్థం చూపించింది (నాకు తెలిసిన అర్థమూ అదే లెండి).
కాబట్టి మీరు ఏ అర్థంలో వాడుతున్నారో కాస్త చెప్పి పుణ్యం కట్టుకోరాదూ? థాంక్స్.
——————-
chump
noun
plural noun: chumps
1.
INFORMAL
a foolish or easily deceived person.
"I was left feeling a bit of a chump"
——————
పొటాటో కి చిప్స్ లాగా.. కంద కి చంప్స్ ఏమో రావు గారు.. జోక్స్ అపార్ట్.. బిజిలే అమ్మణ్ గారు సింగాపుర్ లో ఉన్నా శొళ్ళింగనళ్ళూరు లో ఉన్నా ఆటవిడుపో.. లేక మరేదో.. తెనుగు పద్యాల క్విన్ విక్టోరియా గా.. వ్యాఖ్య కు ప్రతి ఉత్తరం సైతం ఇంచు మించు అదే అనిపించే పద్యముతో జవాబులిచ్చు వారిగా.. బీజిలే అమ్మణ్ బీలేజి.. జిలేబకావలి.. జియాంగిరి.. ఇలా రాస్తూ రాస్తు అసల్ నా పేరేమిటి చెప్మా గా ప్రాశస్థ్యం చెందిన వారని బ్లాగ్, బ్లాగంత లడ్డై, మైసూరు పాకై, బసుందై, సొందేషై, కారపూసై కూస్తుంటారు..
Deleteగుడ్డిలో మెల్ల.. మీ ఛంప్స్ డిఫినిషన్ యాజ్ పర్ ఇంగ్లిష్ ఇజ్ యాజ్ డిఫైన్డ్ అబవ్.. ఏ ప్రాక్టికల్లి ఇన్టిమిడేటెడ్ ఇన్సేన్ యాండ్ నెయివ్ పర్సన్ కెన్ బి రిగార్డెడ్ యాస్ ఛంప్స్.. ఇహ విషయానికి వస్తే నాకు తెలిసి.. ఈమే గారి పద్యాలకు సంబంధికులనే పదం వాడుతారని అనుమానం.. కనుక.. కందము.., చంపకమాల.. రెంటిని జిగట పాకం లో మైదా ఉబ్బుడు నేతి వేపుడు వంటకం లో కలగాపులగం చేసినట్లు.. కందము ప్లస్ చంపకమాల ఇజీక్వల్టు చంపకందం అనుకుంటా.. తప్పైతే చంప కంద గలదేమో.. మణ్ణికుణుం బిజిలే అమ్మణ్.. ఇది సంగతి ఆచార్య
కందోత్పల లాగానే
Deleteకందాచంప్సన్నమాట , గర్భకవిత్వమ్ ,
కందము చంపకమాలలొ
సంధించుట , సార్కు తెల్ద ? చతురులు గాకన్ !
నాలో ఏమీ చతురత లేకపోవడమే చతురత. రాజారావు మాస్టారూ. వివర్ంచినందుకు ధన్యవాదాలు. అదేదో ఆంగ్ల పదం అయ్యుంటుందనే ధ్యాసలోనే ఉన్నాను గానీ “జిలేబి” గారి పదవిన్యాసాల వైపు నా దృష్టి పోలేదు. మీ వివరణ చూసిన తరువాత chump ఆంగ్ల పదానికి అర్థంలో చెప్పినట్లు I was left feeling a bit of a chump 😞.
ReplyDeleteవీడు నిజంగా chump లాగానే ఉన్నాడు అని నా గురించి ముందరే అనేసుకున్నారో ఏమో గానీ “జిలేబి” గారు తన వైపు నుండి వివరించే ప్రయత్నం ఏమీ చేసినట్లు లేదు చూశారా? వారి లీలలు ఎన్నెన్నో!
శ్రీధర్ భూక్యా గారు,
ReplyDelete“జిలేబి” గారు ఆ పదానికి తన ముద్దుపేరు పెట్టుకున్నట్లున్నారు. అయినా కూడా ఈ పదమేమిటో మీరు బాగానే గ్రహించేసారే! అంటే పద్యవిద్యలో మీకు కూడా ప్రవేశం ఉన్నట్లన్నమాట?
వివరించినందుకు ధన్యవాదాలు.
ReplyDeleteచతురత లేకుండట నా
చతురత రాజన్న! మీదు ఛందస్సేమ
న్న తెలిసిన వాడినా? నా
కు తెలిసిన విధమున ప్రశ్న కూసింత సుమీ :)
జిలేబి
ReplyDeleteరావె! బెల్లపు పాకము రామునికని
నవమి పూజలె మేలు; వినాయకునకు
చవితి జోతలు ; అష్టమి చక్క గాను
కన్నయకు తెలుసుకొనవె కలువకంటి!
జిలేబి
ReplyDeleteకందా చంప్స్!
సకి! శ్రీరామునకే రా
ధిక! నవమియె శ్రేష్ఠమౌ తిథి! వినాయక పూ
జకు, వీడు మష్టమిన్ ప
ట్టుకొని చవితిని విడువకు చటుక్కున నతడిన్!
జిలేబి
ReplyDeleteభవముగ కౌసలేయునకు, పార్థివి కిన్ కర పీడనమ్ము చే
యవలయు నెప్పుడీ చవితి, యన్న! విశేషము దేనికోకదా?
భవకుడ! నల్లవేల్పునకొ? ప్రశ్నల కెల్ల జవాబు పన్నిగా,
నవమియె శ్రేష్ఠమౌ తిథి; వినాయక పూజకు; వీడు మష్టమిన్!
వినాయగనే వినై తీర్పవనే
https://youtu.be/FRanoudR1ss
శుభాకాంక్షలతో
జిలేబి
ReplyDeleteషాపాటు :)
బహుషా నీకిది తెలుషా !
వహవహ జనులకు పషందు పబ్బములె షుమీ
షహనా భవంతు! షుచిగా
బహదూరు గణేషునికి షెబాషనవె షఖీ :)
జిలేబి
చూ’షారా’ మరి, “ష” ఫాషన్ మీకు కూడా తగులుకుంది 🙂.
Deleteమీకందరకు కూడా గణే ‘ష్’ చతుర్థి ‘షు’భాకాంక్షలు.
మణషోఖ మడుఖళశం
Deleteపగఘీలళే వఱ్ఖే అడి ణిట్యసుండాఱం
ఇహిహీ.. వెవ్వెవ్వే..
మఱఛిణ మమటోఖట్
మఱీ మఱీ ఫిళ్ఛీండి
ఒఖ టీయాణి ఫఱిటాఫమై
ణీఱాఝణం యాయిటి యాయిట్ నాయింఠీణ్
ఈఖఈఖళ్.. హిహి హిహి.. (డోకు)
బిస్బాస్.. సరాణియా
నిన్జూడక్ నేనుండ్లేన్
ఈ జన్మల కాకుంటే ఆ జన్మల
ఇగో సామి.. ఈ జన్మంత ఇచ్చిండు భగవంతుడ్..
అట్లాంటిది.. ఇచినపూడు సూడకుండ ఉన్యావ్.. గిప్పూడే సుడకుంటే మరో జన్మ లో సూస్తా వున్న బారాకాఫి ఏంటీ.. (గ్యారంటి కి బారాకాఫి)
ReplyDeleteశ్రీ వెంకట రాజారావు లక్కాకుల
వినాయక చవితి శుభాకాంక్షలు
**************************
కొలిచిన వారికి కొండంత వేలుపై
సద్బుధ్ధి నిచ్చు ప్రసన్న మూర్తి
పిలిచిన దిగివచ్చి విఘ్నాలు తొలగించి
కార్యసిధ్ధి నొసగు కార్య మూర్తి
ఆకులలుములు దెచ్చి యర్చించినా మెచ్చి
ఘన కటాక్షములిచ్చు కరుణ మూర్తి
కుడుములే నైవేద్య మిడినను తృప్తుడై
మనసార దీవించు మహిత మూర్తి
మూడు గుంజీలు దీసినా మోదమంది
నెమ్మి కోరిన వరములు గ్రుమ్మరించు
భక్త సులభుండు సకల సంపద ప్రదాత
శ్రీ గణేశుడు మన కిచ్చు సిధ్ధి , బుధ్ధి .
ReplyDeleteమీసాల మగవాడు :)
దాని మగనిపై మక్కువ
మీనాక్షికి, మీసమెంతొ మేలుగ నొప్పెన్
వానికి యనుచు మురిసి య
ద్దానికి హత్తించు నూనె తనరారంగన్ !
జిలేబి
Delete*వానికి ననుచు
ReplyDeleteమీనాక్షి పెండ్లి చూపుల నాటి ముచ్చట్లు :)
యానామందున దక్కె భర్త యని సాయంత్రమ్ము దీవించిరా
మీనాక్షిం గని, మేలు మేలనిరహో మీసంబులన్ గల్గినన్
దానింద్రిప్పుట నైజమే యనుచు విస్తారంబుగా ద్రిప్పగా
దానిన్ చక్కగ వాడు దువ్వి క్షణమందారేడు మార్లున్ భళీ !
జిలేబి
ReplyDeleteమోచేతిమీసము అదృష్ట సూచకమట
ఆనుచు మోచేతిపయిన
మీనాక్షికి, మీసమెంతొ మేలుగ నొప్పెన్!
చానకు పరువంపు వయసు
వానికి మోజాయె దాని పై పెండ్లాడెన్!
జిలేబి
ReplyDeleteప్చ్ :) ఏం చేద్దాం :)
అరె! విన్నకోట యని మన
నరసన్నయు బంధువులను నమ్మకమున హాయ్
చిరునామావారినడుగ
నరరే నాన్బ్రాహ్మినులనఘా యనిరి గదా :)
జిలేబి
జిలేబి గారు, మీరు మాలిక సమ్మరీ వ్రాస్తున్నారా ఏమిటి?
Delete😒 :(
Deleteమొదట్లో విన్నకోట అనగానే మావాళ్ళే అనుకున్నానండీ...విన్నకోటవారు మా బంధువుల్లో ఉన్నారు మరి !
Deleteఇదిగొ ! ' విన్నకోట ' ఇంటిపేరిటివారు
Deleteమాదు బంధుజాలమందు గలరు ,
మటను చికెను చేప మాత్రమె తిందురు
మనము మనము బంధుజనము గామ ?
అది ఒక ఊరి పేరు కదా (కృష్ణా జిల్లాలో). కాబట్టి ఆ ఊరి మూలాలు ఉన్న పలు కులాలు ఆ పేరునే ఇంటిపేరుగా పెట్టుకోవడం ఆనవాయితీయే కదా.
Deleteఇక అవన్నీ తినకపోయినా మనం మనం ఒకటి కాకపోతామా పరిచయం పరంగా 🙂?
మీది సిక్కోలు నాగున్నాదోలమ్మోలమ్మోలమ్మో నిహారిక గారు.
Deleteజిలేబి గారు, మీరు మాలిక సమ్మరీ వ్రాస్తున్నారా ఏమిటి?
ReplyDeleteAny doubt ?
ReplyDeleteయముడై శని వచ్చేశా
డు! మనసతని కందుకే మరుగుపడెను జిలే
బి! మనీషి యతడు సిద్ధిని
సమదర్శిగ తనదు రీతి సందర్శించెన్
జిలేబి
ReplyDeleteనిశ్చల మై భళి సమయమ
నిశ్చల మైనట్టి ఆశ నీడను దాగెన్
పశ్చాత్తాపమదేల పు
నశ్చరణ వలదిక పాత నదె మరువుమికన్
జిలేబి
ReplyDeleteఅయ్యయో ! ఎల్ కేజీ లో సీటు రాకుంటే ఎలా :)
భార్యకున్ గర్భమయ్యెను; భర్త యేడ్చె
నోరి నాయనో స్కూలులో "నో" యనంగ
నేమ గును నా గతి యనుచు నెత్తి పైన
గుడ్డ వేసుకుని మదిని కుమిలిపోయె
జిలేబి
ReplyDeleteకందోత్పల
పడి దొరలుచు నేడ్చెనయ! వి
నడు! భార్యకు గర్భమాయెనని భర్త కడుం
గడుఁ బొందె దుఃఖమున్ వ
చ్చెడు బుడ తడి బడి గురించి చింతించెనయా !
జిలేబి
ReplyDeleteకల లో ఓ క్షణంలో అన్నీ ఫ్లాష్ లా కనబడె
తూర్యము లెల్ల మ్రోగె భళి ధూకళి ఝంకళి తో ముహుర్తమం
దార్యుడు పెండ్లియాడె తనరారగ శోభన మాయె! శీఘ్రమై
భార్యకు గర్భమాయెనని భర్త కడుంగడుఁ బొందె దుఃఖమున్
ధైర్యము చాల లే బడిని తానిక సంతతి నెట్లు చేర్చుటో!
జిలేబి
ReplyDeleteఅరయగ పనిబెట్టిరి మా
నరసన్నయె భారత కథనమ్మున చెలరే
గిరి దిక్కు తెలియక జనులు
కురుపతికే లేని తపన గురులకు గలిగెన్ !
జిలేబి
Privy Council అభిప్రాయం వచ్చేసిందండీ 👏
Delete
Deleteసంతోషం వినరా వారు మొన్న మీరు కామెంటెట్టినప్పుడు తాతగార్ని చూడమని చెప్దామ ్నుకుని మళ్లీ ూరుకున్నాను మీకు నచ్చినందుకు సంతోషం :)
జిలేబి
ఓహో, ఇది బ్లాగుపెద్దావిడ కామెంట్ కు అనుకరణా? You are like this only 🙂.
Delete
ReplyDeleteనాటకమొకటి మధ్యన నాలుగైదు
నిమిషముల వ్యవధానము; నిమ్మళమ్ము
గాన పాత్రధారులు మాట కలిపి రపుడు
రావణుఁడు నస్య మిమ్మని రాము నడిగె
జిలేబి
ReplyDeleteలాస్యాయొక్కతె నాట్యమాడి నిలిపెన్ లావైన కాయంపు వా
డాస్యోటన్ తన కొప్పుపైన తురిమెన్ డ్రామా జిలేబీయమే!
హాస్యమ్మాయె ప్రధానమైన కథ ! బాహాటమ్ముగా మధ్యలో
నస్యం బిమ్మని రావణుం డడిగె విన్నాణంబుగా రామునిన్!
జిలేబి
చివరికి నశ్యండబ్బా
ReplyDeleteకవరింగుసమస్యలయ్యె కంగ్రాట్స్ హితా !
పవరేమాయెను గురుడికి
చివరాఖరు కాశ్రమమ్ము చేరెన మహితా !
ReplyDeleteకవులలో వైషమ్యాలని ఇప్పుడే ఓ టపా చదివి వస్తున్నానండీ :)
నారదా
వింటున్నారా :)
జిలేబి
ReplyDeleteపిట్ట కథల చేర్చు విన్నాణమేనాటి
దో కదా జిలేబి ! తొంగలించు
గాధ నొకటి చేర్చు కానన మందు త్ర్యం
బకునిఁ గొల్చిరి హరి వాయుసుతులు !
జిలేబి
ReplyDeleteఅకటా! విస్తృత మైన గాధలవి యేరాళమ్ము! జోడింపుగా
ప్రకటింపంగ జిలేబి పిట్టకథ తా ప్రార్థించి వ్రాసెన్ భళా
వికటింపంగ విధాత రాతగనరే వీరత్వమేగూడ త్ర్యం
బకునిం గొల్చిరి కృష్ణ భీములు గడున్ భక్తిన్ బ్రదర్శించుచున్
జిలేబి
ReplyDeleteదత్తపది -170
పేపర్ - బుక్ - పెన్ - ఇంక్
పై పదాలను ప్రయోగిస్తూ భారతార్థంలో
మీకు నచ్చిన ఛందంలో పద్యం వ్రాయండి.
జరాసంధుని వధ
చట్టున మునుపే పర్రున
గుట్టుగ శాదమును చీల్చి కూల్చుట నేర్పెన్
కొట్టుచు గబుక్కు పెన్గొని
పట్టుచు విదళింప నింకె బార్హద్రథుడే!
జిలేబి
ReplyDeleteపనిలేని సింహములచట
పనిగట్టుకుని కెలికెనరె భారతమునహో
తనివారెను చర్చలు భళి
మన విదురుల బ్లాగులోన మహిని జిలేబీ :)
నారదా!
జిలేబి
ఇది మాత్రం పని కాదా? 😡
Deleteఅంద రరగొర చదువరుల్
Deleteకొందరు గొప్పకు చనెదరు కోవిదులగుటన్
ఇందున తెలిసినదేమన
గందరగోళమ్మె గాని కనము జవాబుల్ .
Deleteలవెరారా గారూ
తాత గారి బ్లాగులో వేయాల్సింది ఇక్కడ వేసేరేమిటీ :)
జిలేబి
తాతకుతగ్గమనుమడని,
Deleteపాతహితుండని,విశేషప్రతిభావంతుం,
డాతతవిబుధుండని,బుధ
వ్రాతమ్మునకున్ సరైన వాతిడుననుచున్ .
మునిమాపువేళయైనది
ReplyDeleteకనుమూయుక చేయగలుగుకార్యంబేదీ?
పనియాపాడా? తోచదు🤔,
తినితొంగుని పొద్దుబుచ్చుతీరులె, హితుడా !
తిక్కనకున్ వేమనకున్
ReplyDeleteమ్రొక్కెద గురజాడ గిడుగు మొనగాళ్ళకు, నా
చక్కని తెనుగుకు మీగడ
చిక్కని రుచులద్ది సేవ జేసినవార్కిన్ .
జనబాహుళ్యపు నుడులకు
ఘన హిత మొహరించి నట్టి ఘనుడా ! గిడుగూ!
అనయము మిము స్మరియింతుము
ఘనముగ , నీసంప్రదాయఘనులు వడంకన్ .
ReplyDeleteపూమొల్కలార! కామిం
ట్లే మాకుత్సాహమిచ్చు టేబ్లట్లండోయ్
మా మాదిరి రాసెడు వా
రీ మాలికలోన లేరు ప్రేముడి గనుడీ :)
జిలేబి
ReplyDeleteపిల్ల కోతులే బుడతలు వీరి పనిని
చూడుడీ యేమి చేసిరి చూడుడయ్య!
జలములో నూనె చుక్కల జాడఁ గన,ము
దిత జిలేబి యాక్రోశించె దిమ్మ తిరుగ!
జిలేబి
ReplyDeleteకలిపిరి నీళ్ల లోన పది గ్లాసుల తైలము నొక్క పాత్రలో
పిలిచి జిలేబి మేడమును "వింతయిదేమన పాఠశాల పి
ల్లలిక సయిన్సు ఫేరున భళారె ప్రదర్శన చేయ చిత్రమౌ
జలమునఁ దైలబిందువుల జాడఁ గనంగ నసాధ్యమే కదా"
పలికిరి హెడ్డుమాస్టరు ప్రభాకర శాస్త్రి ముదమ్ము తోడుతన్ !
జిలేబి
ReplyDeleteధ్యానము చేయుము నరుడా
యేనాడే మగునొ నెవరి కెరుకా నరుడా
జ్ఞానము, కర్మయు భక్తియు,
నీ నమ్మకమేను తోడు నీడగు నరుడా
జిలేబి
అతిగా ఆథ్యాత్మికతను
ReplyDeleteజతగాధ్యానాన్నికర్మఙ్ఙానాదులనూ
నుతభక్తిపూరితముగా
సతతముముసుగేసుకొన్న సార్లను నమ్మన్ .
ReplyDeleteనమ్మక మే రాజన్నా
నిమ్మళమును జేర్చు మనుజునికి సత్యమిదే
తెమ్మర గాలిని భళి అప
నమ్మక ముగ చూచెడు మది నరులకు వలదోయ్
జిలేబి
నమ్మకమునుద్రోహముతో
Deleteఇమ్ముగదోచుబుధులుండు యిలయిది,వారిన్
నమ్మడముకాదు కుమ్ముడె,
తిమ్మన్నలులేరునేడు,తీతురుతాటల్ .
ReplyDeleteఎవరికి తెలియవులెండీ
కవిత్వపు జిలేబి ట్రిక్కు కామింట్లున్నూ
మవురిని వాయించి పరుగి
డు వరుసగ మరి యితరుల చెడుగుడుల చూచున్
జిలేబి
ReplyDeleteతెలిగించుకుని చదువ నే
ర్చె లబ్జు గా విదురుడచట శ్రీధరనిత వ్యా
ఖ్యల తోరణమును పదవే
జిలేబి నీవున్ను నేర్వు శీఘ్రముగ సుమీ :)
జిలేబి
అబ్బబ్బబే మీసెప్ థీరి నాపేరు π మీ పదప్ర యోగము
Deleteనెవరు బి పోరూ ఎవరు ఆపతారు.. బిజిలే అమ్మణ్.. :)
ReplyDeleteజంగ్లీ లనుకున్నావా ?
మంగ్లీలను కొంటివా ? తమాషా కాదే !
టాంగ్లా నగరపు హిందూ
బంగ్లాదేశీయు లెల్ల భర్గుని భక్తుల్
జిలేబి
ReplyDeleteజంగ్లీలా? సరి కాదు! ఛాందసులకో? ఛా! కాదు అల్లామియా
బంగ్లాదేశ మహమ్మదీయు లవురా భక్తాగ్రణుల్! శూలికిన్,
మంగ్లీయమ్ముగ నాడు మ్రొక్కిరి సుమా, మారెన్ మతమ్మే సఖా!
యుంగ్లీ చూపకు వారి పైన వినుమా యుంజాను వర్యుల్ సుమా!
జిలేబి
ReplyDeleteబొమ్మన హళ్లి జిలేబీ
అమ్మమ్మో తిరుగుతోంది గా రోడ్లెంటా
యెమ్మా స్పీడు ఫియట్లో
తమ్ముడు పత్తా తెలిసిన తాతకు చెప్మా :)
జిలేబి
ReplyDeleteఎన్నైన పనికి రారే
యెన్నిక కానట్టివారె, యేలుదురు ప్రజన్
మన్నిక గలవా రె సుమా
దన్నుగ నిలిచి కడ గండ్ల దాటి జిలేబీ
జిలేబి
ReplyDeleteకందోత్పల
అనుకున్నను చేయగలరె
పని యెన్నిక కానివారె? ప్రజ నేలుదు రీ
జనతంత్ర భూమిలో మే
ల్మినిబడయగ నెన్నికల గెలిచిన ప్రముఖులే
జిలేబి
ReplyDeleteతిన్నగ మేలు చేయుటకు తీరగు మార్గము లేని పెద్దలా
యెన్నిక కానివారె; ప్రజ నేలుదు రీ జనతంత్ర భూమిలో
దన్నుగ సేవచేసెడు విధానము నేర్చు కుశాగ్ర బుద్ధులే
మన్నిక జేర్చగా వలయు మంచిని పెంచు ప్రధానులే సుమా
జిలేబి
ReplyDelete"రాజన్నా! మీరో ఆ
శాజీవి సుమా జిలేబి చా! చెబ్తుందాం
డీ జాడ ? పొస గదండీ
నైజము కాదండి " తాత నచ్చిక సుమ్మీ :)
జిలేబి
తాత కనుదెరిస్తే మన
Deleteపాతకథలు దెలియగలవు పండితవర్యా!
ఏతావత్ మనమంతా
ఓతరహాస్నేహితులమె ఓరిమిపడతాం .
Deleteరాజన్న వారు,
తాత కను దెరచిన వారం వారం కథలు చెప్పటం అనే ఆలోచనే అద్భుతం అని చెప్పాలా? లేక, ఆ ఆలోచనని ఇంత అందంగా రాసిన కందం అద్భుతం అని చెప్పాలా? ఏంటో..ఏమీ తెలియట్లేదు.:)
జిలేబి
జిలేబి కావాలి కథ చెప్పవా, బామ్మా!!!
Delete
Deleteతాతగార్ని అడిగితే కతలు దండిగా వచ్చును :)
ఈ సలహా చూసారా?
వేసె లరారా జిలేబి వేడుక గా మీ
పై? సై యంటే గుప్పిట
మూసిన కతలు వెలితీసి మూలము చెబ్తా:)
జిలేబి
ReplyDeleteఅభిమానుల రకముల తా
త భిన్న భిన్నముగ తెలిపి తర్కించిరిగా
సభికులనలరించుటలో
విభువు కదా తాతగారు వేడ్కగ నౌరా ! :)
జిలేబి
ReplyDeleteమొదటి పదానికి చివర
న్ను, దాని నే ముందుగా జొనుపరెండవ దా
ని దరిని క్రొత్త పదమ్ములు
పదపడి వచ్చె నరసన్న వారి చలువగా :)
జిలేబి
థాంక్యూ, థాంక్యూ.
Delete
ReplyDeleteకంఖాణి యెగిరె కలలో
పుంఖము తో గుండె కాయ పొడిచిన చవి! ఆ
పంఖా ఆగెను! చెవిలో
శంఖధ్వానము వినఁబడె శ్వానము మొఱుఁగన్!
జిలేబి
ReplyDeleteకంఖాణిన్ కల లోన గాంచితిని నాకంబందు; చట్టంచునా
పంఖాఆగెను!గుండెకాయ లబడబ్బాగెన్నిదాఘమ్ముతో
శంఖధ్వానము విన్పడెన్ పృథులమై శ్వానంబు బిట్టార్వఁగన్
లంఖించెన్ వెస ముక్కు గోకి యొక గోలాంగూలమే పైన రా!
జిలేబి
ReplyDeleteనిజమా కల్పన కన్నను
సుజనా చిత్రంబయినది సూదిమొనన గీ
చి జనులు సరదా పడతా
రు!జాగురూకత వలయు చురుకుగా సింహా!
జిలేబి
ReplyDeleteఇటలీ సరకంటేను ఫి
యటు కారంటేను బామ్మ యావపడు సుమా
గుటకల భళి మ్రింగును గా
చటుక్కునట గాన దాని చమకుల సుమ్మీ
జిలేబి
ReplyDeleteఈ సలహా చూసారా?
వేసె లరారా జిలేబి వేడుక గా మీ
పై? సై యంటే గుప్పిట
మూసిన కతలు వెలితీసి మూలము చెబ్తా:)
గుప్పిట యేమి కతలున్నాయో బోనగిరి గారు
అడగండి :)
జిలేబి
ReplyDeleteగొల్లపూడిని కాలేను కోతలేయ
లేను! ప్రముఖ వ్యక్తిగ పేరు లెస్స బామ్మ
కోరుకొనుచుండు! ఫియటును కూడ అమ్మి
పేరు కొట్టుకోవలెనని పెనుగులాడు :)
జిలేబి
హెచ్చరిక
ReplyDeleteభారతావని కడు అన్లాక్ ౪ సడలింత సెప్టెంబర్
ఎరుగరేల జనులెల్లరును కోవిడ్ సడలింపిది గాదని
కొరోనా వైరస్ ముప్పు ఇకను ఉన్నదని మరవ జాలకుమా
ఖణేళ్ ఖణేళ్ ఖల్డు ఖల్డు సురుక్ సురుక్ ఖర్ ఖర్ ధ్వనుల తోడ
జిహ్వా రుచిని నాసిక ఘ్రాణమును విడిచి నంతరమునే ఝాము
లేకుండగ "ర్యాట్" స్వాబ్ కొఱకు ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి
తగు జాగ్రతలు పాటీస్తూనే హోమ్ ఐసోలేషన్ సెల్ఫ్ క్వారంటైను
జేసుకొని తమనే తాము కాపాడు కొనుట జీవులకు పరిపాటి
జాగ్రతతో మసలుకుంటే ౮౦ శాతం ఆరోగ్యం..!
డబ్ల్యూహెచో, మోహ్ఫవ్ సైట్స్ సౌజన్యముతో
~శ్రీ
ReplyDeleteగురుఛండాలపు యోగ
మ్ము రుజువు షీలా పటేలు ఓషో లను జూ
డ, రసికత జాడ కనబడు
సరియైనది జోడి గాదె సరసమ్ములకున్
జిలేబి
ReplyDeleteటైము జోన్లదె చూడ తటాలు తోచె
బామ్మ వూరు బోనగిరికి ఫారెనువలె
తాత నడిగిరి దేమిటో తత్వమంచు
బదులు రాలె వారి కెడను వారిజాక్షి !
జిలేబి
పులస చేప వంట తాతగారు [శర్మ గారు] వివరింపగ
ReplyDeleteతవరు వివరణ జూసి జుగుప్సాకరముగాయనిపించేనని
తానే స్వయముగా చింత షిగుర్ షికాయ శిగుర్ పచ్చడి దెచ్చిరి
నానువెజు వ్యాకందురే ఆనాడే బిజిలే అమ్మణ్
నేడదే పద్యములో కంది వారి సమోస పూరణ్
నందు చేపను పాలలో వేసి వంట జేసుకోవచ్చునాయని యడగ
కరోన నలుమూలల విస్తరించినను పనీరే శరణు నేటి కాలమున
~ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి~
~శ్రీయశ త్రిగుణేభ్య యశో వర్ధతేయితి స్వస్తి~
ReplyDeleteచింత చిగురు పులుసు చేవ చూడు జిలేబి
వంట చేయు విధము బాగు గాను
నేర్చు కొనుము తాత నేర్పగా వివరము
లన్ని చేర్చి రుచి భళారె యనగ
జిలేబి
ReplyDeleteమత్స్యము మంచిది సుమ్మీ
మత్స్యండిని గైకొనుమయ మధురంబదియే!
వాత్స్యుడ వినుమా తప్పక
మత్స్యక్షీరమ్ము మంచి మందు కవులకున్ !
జిలేబి
ReplyDeleteకవుల వెర్రికి పైత్యానికి మందు :)
వాత్స్యౌశ్రేష్టుని కామసూత్రమును నింపారంగ వల్లించెనా
వాత్స్యుండాతడు! సంప్రదించగ భళీ పల్కెన్ కదా వెర్రికై
మత్స్యండిన్, సరి యింద్రభేజమును సామర్థ్యంబుగా చేర్చుచున్
మత్స్యక్షీరముఁ బిల్లికొమ్ముఁ గలుపన్ మందౌఁ గవీంద్రాళికిన్!
నారదా
బేగనే బారో !
జిలేబి
ReplyDeleteచింత చిగురు పప్పు షీకాయ ఘుమఘుమ
తాత గారి గరిట తాండవమ్ము
చేయు విధము దాని చెప్పు కైపు భళారె
విశ్వదాభి రమణి వినవె భామ
జిలేబి