Thursday, October 29, 2020

ద్వంద్వం

 



అందం అందంగా వుందంటే
కారణం వికారం.

మంచి మంచిగా కనిపిస్తోందంటే
చెడేదో వున్నట్లు.

ఉండటం, లేకుండటం,
కష్టం, సుఖం,
పెద్ద, చిన్న,
పైన, క్రింద,
గోల, సంగీతం
ముందు, వెనుక
ఇరువైపులకు
ప్రతీకలు.

ద్వంద్వాలకతీతంగా
మౌని మాటలాడక
తన పని చేస్తూ పోతుంటాడు
నిష్కామంగా
ఓ పని అయిపోతే మరొక్కటి,
యెల్లప్పటికి నిలిచి పోయేలా.

లావొ జు.
దావొ దే జింగ్

Source-2

Under heaven all can see beauty as beauty only because there is ugliness.

All can know good as good only because there is evil.

Therefore having and not having arise together.

Difficult and easy complement each other.
Long and short contrast each other;
High and low rest upon each other;
Voice and sound harmonize each other;
Front and back follow one another.
Therefore the sage goes about doing nothing, teaching no-talking.
The ten thousand things rise and fall without cease,
Creating, yet not possessing,
Working, yet not taking credit.
Work is done, then forgotten.
Therefore it lasts forever.

స్వేచ్ఛానువాదం
జి లే బి‌.

202 comments:

  1. మనిషి చింతరాహిత్యంగా జన్మిస్తాడు.. కాని కాలానుగుణంగా చింత చివురులు తొడిగి మనసును కుచించుకునే విధంగా మార్చేస్తుంది. కనికరం కరిగి కన్నీటి ప్రవాహమై. ఏదో తెలియని వ్యథ అయోమయానికి గురి చేస్తు ఉంటుంది. బాధను చెప్పుకోనులేక దిగమింగనులేక ఆపసోపాలు.. రేపెలాగనే దిగాలుతోనో.. చిన్న చితక గొడవలతోనో.. అలకబూనినవారి అలక తీర్చటానికనో.. తెలిసి తెలియక చింతలో కూరుకుపోతుంటాడు.. బయట పడేలోగా జరిగే నష్టం జరిగిపోతుంటుంది.. సుఖదుఃఖాలలో ఏది శక్తివంతమైనదో అది ఎవరు పలానా అని సూటిగా చెప్పలేరు. ఆయా స్థితికి చేరుకునే దాక ఆయా స్థితి తీరుతెన్నులు తెలియరావు.. తీరా తెలిసినాక అందులోనుండి బయటపడే తాత్వికత అంత త్వరగా బోధ పడదు. ఏదేమైనా మనిషి బ్రతుకు ఇటు చింతకు అటు దిగులు నడుమ లోలకంలా ప్రతినిత్యం కదలాడుతూనే ఉంటుంది.

    ReplyDelete
  2. పాటీ!
    ఉచ్చం, నీచం
    తెలుపు,నలుపు
    వెలుతురు, చీకటి
    ఇలా ఒకటి ఉంటేనే రెండోది తెలిసేది :)

    ReplyDelete
  3. మేమంతా ఉన్నతులం
    భూమినిగల తక్కినోళ్ళు పోలరు మాతో
    ఈ మాది రహంకారులు
    ధీమంతులుకారు , వారు , తీరున నీచుల్ .

    రాయంచ అందచందము
    గాయని కోకిలకు లేదుగానీ, గళమం
    దాయమ తీయందనములు
    రాయంచకు రావు తాను రాయిడివడినన్ .

    కోకిల గళ మాధుర్యము
    కాకికి లే , దైన కాకి ఘనమాతృత్వం
    కోకిలకు రాదు , ఘనతల్
    లోకంబున వివిధగతులు , లోకువ తగునా ?

    ReplyDelete


  4. అమ్మకి ఎలాగు మొక్కిన
    నమ్ముడి ఆనందమే సనాతని కృప మీ
    కిమ్ముగ దక్కును రాజా
    నిమ్మది నిడు పండుగలు తనివిని యొసంగన్


    జిలేబి

    ReplyDelete


  5. తండ్రీ! వనమున వ్యాఘ్రము
    గాండ్రించెను! కుక్కపిల్ల గాడిద వోలెన్
    గుండ్రము గా తిరిగె తలని
    వేండ్రము తగులంగ చాల వేగము గానన్ !


    జిలేబి

    ReplyDelete


  6. బండ్రాళ్లావిడ గుండె మీద నిడి హాంఫట్టంచు కొట్టంగనా
    తండ్రా మాంత్రికు డప్పు డా పడతియే తట్టంచు లేవంగనే
    నోండ్రన్ బెట్టెను చీలిగాడు భళిరా యొప్పారు క్రోధమ్ముతో
    గాండ్రించెన్ శునకంబు గాడిద వలెన్ గర్వమ్ముతో బిట్టుగన్!



    జిలేబి

    ReplyDelete


  7. పనియే పరమాత్మ తెలుసు
    కొనవె చెలి కుదురుగ నడుచు కొనవె జిలేబీ
    విను నీచమటంచు పని భు
    విని నేదియు లేదు పడతి విదురుల పల్కౌ


    జిలేబి

    ReplyDelete


  8. మనమెంతోతోపయినను
    ననవసరపు విషయముల మన తలను దూర్చం
    గను సుదతీ తప్పదు వెత
    లనుమానములేదు సూవె లావణ్యవతీ :)



    జిలేబి

    ReplyDelete


  9. ఇది తపమే! భరతాగ్రజు
    ని దయవలన సాగుచుండె నిమ్మదితో‌ నె
    మ్మదిగా రాజన్న! మరె
    న్ని,దాసుని కయిగొని వ్రాయ నేర్పునతండో!


    జిలేబి

    ReplyDelete


  10. ఏలాగైననరే గెల
    వాలని ఆరాటమన్ని పక్షమ్ములకున్
    పాలక వర్గమ్మునకున్
    చాలమి తో గెలుపెవరికి సాధ్యంబగునో :)


    జిలేబి

    ReplyDelete


  11. అవియివి యన్నియు కలగల
    పు విషయముగ వ్రాసి తానె యుద్ధండునటం
    చు, విదురు డటంచు భళిరా
    కవితల్లజుఁ డనఁగ నొప్పు గణభంగమునన్!







    జిలేబి

    ReplyDelete


  12. కందా చంప్స్


    విలువైన పదములిడ చవి
    గల కవి వరుఁడంచుఁ గీర్తిఁ గనుఁ గాదె, గణ
    మ్ములు భంగమైనచో నత
    డిలలో పేరొందడే నుడివితి సఖి వినన్


    జిలేబి

    ReplyDelete


  13. నుదురు బెదురులే దాతని
    కి! దమ్ము గల విభుడు జానకి మగడు రండీ
    పదపడి కొలువగ నతడిని
    మృదుభాషియతండు మిము సమృద్ధిగ జూచున్!


    జిలేబి

    ReplyDelete
    Replies
    1. // “నుదురు బెదురులే దాతని
      కి! “ //

      నదురుబెదురు ... అనా మీ ఉద్దేశం?

      Delete


    2. కాపీ కొట్టడం కూడా సరిగా రాదా జిలేబి‌ అంటున్నారా :)

      Delete
    3. అదురూ బెదురూ లేదని ,
      ముదురని , మాకందరకును ముందే తెలియున్ ,
      విదురులు హింటిచ్చిరి , తమ
      చదురులు కొన్నైన మాకు చక్కగ దెలియున్ 🙏 .

      Delete


    4. ముదురును తెలిసిన మీరెల్లరు ఇంత ముదురులని తెలియలేదండీ :)



      నారదా
      జిలేబి.

      Delete


  14. రాముడిదే సంకల్పము
    మేము నిమిత్తులమయ ప్రణమిల్లెద మేమా
    రామునికే స్ఫూర్తి కొరకు
    సామాన్యులము హరిబాబు సాదరముగనౌ


    జిలేబి

    ReplyDelete


  15. ఇక్కడ పడియుంటిని నే
    నెక్కడకి వెడలితి రామ నెమ్మది నీయన్
    తక్కువ చేయకు యతనము
    మిక్కిలి చేసితి‌ విడువకుమీ నన్ను ప్రభో !


    జిలేబి

    ReplyDelete


  16. విబుధుల కంతా తెలుసం
    డి బట్ట బయలుగ జిలేబి ఢీకొట్టునటం
    చు బెదురు రవంత అంతే!
    "కబంద" మో తెరలబాఱె కైవేళ్ళ తొలిన్:)


    జిలేబి

    ReplyDelete
  17. సంగతదా ! సంతోషం🙏,
    రింగున తమతో తలబడలేడ ? గురూజీ ,
    తింగరను నాకు తెలియదె !
    హంగూ ఆర్బాటమేన అంతా విహితా !


    ReplyDelete


  18. అంతే అంతే నండీ !
    కొంత సమస్య మరికొంత గూడుపుఠాణీ
    చెంతయు చేరుచు చేయగ
    వింతగ భయపడుదు రండి విదురులు సుమ్మీ :)



    జిలేబి

    ReplyDelete
    Replies
    1. భయమా ! కాదనుకుంటా ,
      నయమారగ మనవడన్న నయగార మెదో
      రయమున మదిలో దొలిచి , వి
      షయములు మరుగుపరుచంగ జనుననిపించున్ .

      Delete
    2. భయమా ! కాదనుకుంటా ,
      నయమారగ మనవడన్న నయగార మెదో
      రయమున మదిలో దొలిచి , వి
      షయములు మరుగుపరుచంగ జనుననిపించున్ .

      Delete


  19. జీపీయెస్ వారికి అంకితం

    తాత ప్రొఫెసరాయె సుమా
    భౌతికశాస్త్రమ్ముఁ జదివి, వ్రాసెను కవితల్
    రాతిరి వేళ తొలుదొలుత
    నౌత సదనమున ప్రభాకరార్యులు వారౌ !

    "ఇషాని ఉవాచ"
    తాతగారి మనవరాలున్ను
    జగణమే :)

    జిలేబి

    ReplyDelete


  20. కందోత్పల జీపీయెస్ వారికి అంకితం


    ప్రముఖులు ప్రొఫెసరయిరి బృం
    దిమ, భౌతికశాస్త్రముం జదివి, పద్యకవి
    త్వము వ్రాసె మేలుగన్ సద
    నమున, ప్రభాకరులు వారి నామము రమణీ!



    జిలేబి

    ReplyDelete


  21. తెలుపుము సరియో కాదో?
    "పలుకరు గద నిజము న్యాయవాదులు ధూర్తుల్"
    తెలిపితి సరికాదండీ!
    కెలికెదరు నిజమును వారు కెవ్వుమన జనుల్!


    జిలేబి

    ReplyDelete


  22. కందచంపకము


    అరరే ప్రవర్తనయె కం
    డుర! పలు కరు సత్య మెన్నఁడును బాడిఁ దలం
    పరు న్యాయవాదులే పరి
    పరి విధముల కోర్టుకీడ్చి వాతలిడుదురే!


    జిలేబి

    ReplyDelete


  23. పాత చింతకాయ పచ్చడి పథ్యమ
    గును జిలేబి తాత గువ్వకొనెడు
    బ్లాగు లోన చెప్పె వరలెడు గోంగూర
    యున్ను మేలు కాని యునికి పడదు


    గోంగూర
    జిలేబి

    ReplyDelete


  24. వెల్లుల్లిలేని వంటయు
    చళ్లను కారమ్ము లేని చట్నియు వినరా
    ముళ్లొంకాయపులుసు నా
    వొళ్లంత జిలేబి లేని ఫుడ్డొక ఫుడ్డో :)


    జిలేబి

    ReplyDelete
    Replies
    1. భాషండీ "జిలేబి" గారూ, భాష.
      "చెళ్ళను" అని వ్రాయాలి కదా.

      Delete

    2. ఓ ' , ' పెట్టేసుకోండి :)

      వెల్లుల్లిలేని వంటయు
      చళ్లను, కారమ్ము లేని చట్నియు వినరా
      ముళ్లొంకాయపులుసు నా
      వొళ్లంత జిలేబి లేని ఫుడ్డొక ఫుడ్డో :)

      Delete
    3. తల బాదుకున్న దెలియదు ,
      వెలయగ ' చళ్ళను ' పదంబు , వివరింపంగా
      దెలిసిన వారెవరైనను
      దెలిపిన కైమోడ్తు 🙏 బుధులతెలివికి విహితా !

      Delete


    4. ఎవరూ పుట్టించక పదాలెలా పుడతాయి ?


      మాకో తాడేయండి సూక్షి లా ఇది మరో పదమన్న మాట :)

      రాబోవు కాలంలో ఆంధ్ర భారతి లో ఈ పదాన్ని చేర్చి కొచ్చెను మార్కు పెట్టి వుంచెదరు. అప్పుడు భాష్యకారులు‌ వచ్చి ఆ పదమునకు ఉత్పత్తి అర్థము తో సహా ఓ వేయి పేజీల బృహత్ జిలేబీయం‌ కూడా రాసి పడేయుదురు ~:



      జిలేబి

      Delete
    5. మెచ్చి వీరతాళ్ళు ఇచ్చుట పరిపాటి
      గిచ్చి వేయుమనుట రచ్చగాదె
      ఇంతకు పద మర్థ మేమొ తెలుపరాదె
      సంతసింతు కందసత్కవీశ !

      Delete


  25. బామ్మా నీ గొప్పే గొ
    ప్పమ్మా! నిలవుండనిదిక పథ్యంబగు? చె
    ప్పమ్మా బుర్రెట్టి జిలే
    బమ్మా ! గోంగూర చింతపచ్చడి యగునే ?


    జిలేబి

    ReplyDelete


  26. ఎగిరెగిరి దంచిన భళా
    యెగరక దంచినను కూలి యేమో యొకటే
    తగినట్టి వంక దొరకని
    జగడాలమ్మి సరి డొంక చాలదనెనుగా !

    ***

    పనివాడు పందిరేయం
    గను పిచికలు వచ్చి చక్కగా పడ గొట్టెన్
    తను కొండనాలికకు మం
    దును వేయగ వున్న నాల్క తూచ్ పోయెనుగా


    ReplyDelete


  27. జగడాలమ్మి! జిలేబి వ
    లె గడుసు పేరాయె సూవె లెస్సగ యమ్మో
    జగణపు రమణీ పదముల
    ను గడగడా గుచ్చితివి వినూత్నంబయెగా


    జిలేబి

    ReplyDelete


  28. నిజము నిజమ్ము జిలేబీ
    నిజమని సాక్ష్యమ్ము నిత్తు నీకు వెస వెసన్
    ప్రజలను విడువక చళ్లని
    గజగజ వణికింపజేయు కరుణకుమారీ !


    జిలేబి

    ReplyDelete


  29. కందము కాదండీ అవి
    ఛందస్సాఫ్ట్వేరు నుండి జారిన ఫేక్ట్రీ
    కందువ రాజన్నా, మా
    కందపు పద్యమ్ములన నిఖార్సుగ మీదే :)



    జిలేబి

    ReplyDelete


  30. మిత్రమా! శకారా! పల్కుమీ సదనము
    కోరె రామాయణమ్మున కొన్ని మంచి
    విషయములనంగ భళి పల్కె వింత గాను
    "ఋష్యమూకమ్మునకు వాలి యేగి దాఁగె"



    జిలేబి

    ReplyDelete


  31. కందచంపకము


    "అనఘా!" శకార డనె, "మున
    మున, భయ పడి ఋష్యమూకమున వాలియె దాఁ
    గెను ప్రాణరక్షకై , రా
    ముని సాయమ్ము దహరుడగు మూర్ఖుని నడచెన్"



    జిలేబి

    ReplyDelete


  32. అయినను నాకు సరే నీ
    వె యిమ్ము రా అల్లరోడ వేచితి రారా
    పయికొనుము కొంటె గాడా
    మయి, సైతాను నినుగాంచి మ్రాన్పడె గదరా


    జిలేబి

    ReplyDelete


  33. ఇంతకీ ఈ క్రీడా విశేషము పేరేమిటండి ?

    ఖాతరు చేయకన్ తిరుగు కామితమైన విశాలనేత్రులై
    చేతిని చేయి వేసుకొని చెంగట చేరుచు రింగు రింగులన్
    భీతియు లేక సుంతయు ప్రవీణుల వోలె తిరమ్ము గా సఖుల్
    సేతవు లేని క్రీడల విశేషము చక్కగ చూచెదమ్మిదే!



    జిలేబి

    ReplyDelete


  34. కాకతి వంశ గౌరవము కారణ జన్మము నేలె దేశమున్
    భీకర మౌ సమీకమను విశ్వసహమ్మున వైరులెల్లరిన్
    తేకువ చూపి గూల్చెను కుదేలను తీరుగ ముందు నిల్చి తా
    నై కరవాలమున్ ఝుళుపు నైజము రుద్రమ దేవినాయమై!



    రుద్రమదేవి సినిమా చూపించేసారివ్వాళ కంది వారు :)


    జిలేబి
    జిలేబి

    ReplyDelete
  35. మైలవరపు వారి అద్బుతోత్పలము - న్యస్తాక్షరి


    ఉత్పలమాలలో రుద్రమాంబ పౌరుషాన్ని వర్ణించండి.

    1వ పాదం 1వ అక్షరం ‘కా’

    2వ పాదం 7వ అక్షరం ‘క’

    3వ పాదం 13వ అక్షరం ‘తీ’

    4వ పాదం 19వ అక్షరం ‘య’


    కారణజన్మురాలు మన కాకతి రుద్రమ కాళికాంబయే,
    ధీరగుణాఢ్య,లోకమున స్త్రీ యన బుట్టిన వీరభద్రుడే!
    క్రూరుల యాదవాన్వయుల గూల్చిన తీరు తదీయశౌర్యగం..
    భీరతకానవాలు., రణభీకరరూపిణి, శ్లాఘనీయయే!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
    ***

    జీపీయెస్ వారు,

    నిన్నటి మైలవరపు వారి అద్భుతోత్పలమునకు జిలేబీయపు కందోత్పలములు , అంకితము మీకు, మీ ద్వారా వారికున్ను!


    అమరగ నా గజపతి ధా
    మము కారణజన్మురాలు మన కాకతి రు
    ద్రమ, కాళికాంబయే, నడి
    చె మహిని పగవాండ్లను చరిచె నడచె నౌరా!


    అనఘా! దునిమెను రక్షణ
    మున ధీరగుణాఢ్య,లోకమున స్త్రీయన బు
    ట్టిన వీరభద్రుడే, కలి
    పెను రాజ్యమ్ముల, నిలుపుచు పెఱల క్షణములో

    సతతము రక్షణకై సం
    యుత! క్రూరుల యాదవాన్వయుల గూల్చిన తీ
    రు తదీయ శౌర్యగంభీ
    రత రుద్రమదేవి ముద్ర రాజ్ఞిగ నిలలో

    సణుగుట, భయమ్ము, సమరాం
    గణ భీరత కానవాలు, రణభీకరరూ
    పిణి, శ్లాఘనీయయే దిన
    మణి తీక్ష్ణతకు పొడ! రుద్రమ నిశానియదే!



    జిలేబి

    ReplyDelete


  36. లకలక లక! మోదంబా
    గకరా, ముని మానసంబు గడు రంజిలె మే
    నకఁ గాంచినంతనే చెం
    త కణకణమనంగ వేడి తాండవ మాడన్!


    జిలేబి

    ReplyDelete


  37. గోముగ చెంత చేరి మునిగోటిని దాకుచు ముద్దుచేయనౌ
    రా, ముని మానసంబు గడు రంజిలె మేనకఁ గాంచినంతనే
    నీమము తప్పె నాతడిది నిష్ణుడు చిక్కెను మోహమందురా
    కామము పెచ్చు రేగె మది గమ్యము తప్పగ ధూకుడాయెగా!



    జిలేబి

    ReplyDelete


  38. నీమము నిష్టయు తప్పెను
    కామమ్మదె తూట్లుపొడిచె గమ్యము మారెన్
    గోముగ దరిచేరుచు నౌ
    రా, ముని యెద మేనకఁ గని రంజిల్లెఁ గడున్!


    జిలేబి

    ReplyDelete


  39. ఎంచు కుంటేను మంచమెంతేను కంత
    లేను! జంతిక చక్కిలాన్ని భళి యెక్కి
    రించినట్లు! తనది పాలికిచ్చి తాను
    కూలి కెళ్ళినట్లు, జిలేబి కువలయాక్షి,
    చేత కాని మొగుడరరె చెప్ప గాను
    వినడు, కొట్టగానిక వెక్కి వెక్కి యేడ్చు!


    జిలేబి

    ReplyDelete


  40. వాడు మొండివాడయె బలవంతుడాయె
    రాజు కన్నను! ఊరుకున్నట్టి వాణ్ణి
    చేయ జాలదూరేమియు! చీకు లేక
    ఊరుకున్నంత గా మరి ‌ ఉత్తమమ్ము,
    బోడి గుండంత గా సౌఖ్యము భువిని మరి
    వేరు లేదు! కచ్చను నిప్పు వేయ, కాయి
    తమ్ము పడను కచేరిలో తప్ప దోయి
    నష్టము జిలేబి మాట వినవె శుభాంగి!


    జిలేబి

    ReplyDelete


  41. సౌండెపుడూ లేదండీ !
    బండారమ్మాన్లయనని పల్కిరి ప్రముఖుల్
    కొండాట్టపు రమణి నిజము
    చెండాడుటయు నిజము మరి చేడియె మాయా!

    జిలేబి

    ReplyDelete


  42. చూడ గా మనుజులలోన శూన్యత కన
    బడె కరోన భయమ్మదె ప్రతిఫలించె
    ఔర! యేమిటీ విష్ణుమాయ!నగరమున
    దీపములు వెల్గె నన్నియు దీప్తి లేదు!


    దివ్వెలసిరి పటాసు
    ఢమాల్ ఢమాల్
    శుభాకాంక్షలతో

    దీపాలు వెలుగ వలె నీ
    శాపమగు కరోన తొలగి, చక్కగ మెరుగై
    వ్యాపారములు, పరమపద
    సోపానపు బతుకు బండి సొబగుగ దాటన్!

    జిలేబి

    ReplyDelete


  43. కందోత్పలము


    అయయో కరోన! పోయెను
    నయ! దీపములెల్ల వెల్గినవి దీప్తియె సుం
    తయుఁ గానరాదిటన్ మన
    భయములెపుడు తొలగునో నిభాయించుకొనన్!


    జిలేబి

    ReplyDelete


  44. శాపము చీనిదేశపు పిశాచి కరోన జనాళి నంతయున్
    వీపున వేటువేసి పెనవేసెను; ప్రాణభయమ్ము కోవర
    మ్మై పను లెన్నియో నిలిచె మైవడి మేవడి కానదేలనో!
    దీపములెల్ల వెల్గినవి దీప్తియె సుంతయుఁ గానరాదిటన్



    జిలేబి

    ReplyDelete


  45. చేతకానమ్మకి వినవె చేష్టలెక్కు
    వేను!చెల్లని రూపాయి వీకు చూడు
    గీతలెక్కువాయె జిలేబి! గీరి చూడ
    చెల్లు రూపాయి తన వూరి చెంతయేను
    చెల్లి వుండేది! పూబోడి, చేత కాని
    బోడి రోసము చూడవే పుడమి దాటె!


    జిలేబి

    ReplyDelete


  46. నిరసన గళమును తెలిపిరి
    వరుసగ పండిన తలలు సవాలు విసురుచున్
    తరచు కనిపించెడు వసుం
    ధర అక్షరజాలమింక దాగునకొ సఖీ :)



    జిలేబి

    ReplyDelete


  47. కన్నెత్తి జూడకున్నను
    పన్నెత్తియు మాటలాడు వారలెవరు లే
    కున్నను మధుర ఫలమ్ముల
    నెన్నైన విడువక నిత్తు నిదె కందువగా!


    జిలేబి

    ReplyDelete


  48. మేడీజి జిలేబి యనెడు
    పీడీయెఫ్పొత్తమునిక వెనువెంటనె డౌ
    న్లోడొనరిచి బంగ్లా భా
    షా డిండిమ సంఘటింప సాధించండీ !


    జిలేబి

    ReplyDelete


  49. "డిఫికల్ట్లీ మేడ్ టెల్గూ
    ప్రొఫీషియన్సీ" జిలేబి పూబోడిదటా
    ముఫతున దొరకునటా చది
    వి ఫెడేల్మని నేర్చుకొనుచు విదురులు కండీ :)


    జిలేబి

    ReplyDelete


  50. దస్సేక్ ఢెడ్ మాత్తే వా
    ళస్సేక్ ఛీ తూఁ పణన్ తవాసూజ్దేక్రీ
    చుస్సిక్కన్నాయెచికో
    కస్స‌న యేచికొ జిలేబి కాడన్ మీచన్


    రాబోవు కాలములో
    భాష్యకారులు బుర్ర బరబర
    గోకుకుందురుగాక!

    ఆశీస్సులతో

    జిలేబి

    ReplyDelete


  51. భాషా హింసా డిండిమ
    యే షోకగు బిరుదు నీకు యెంకటలచ్చీ
    శోషించితి వీవు తెనుగు
    భాషాయోషను విడువక బామ్మ ! జిలేబీ !


    జిలేబి

    ReplyDelete


  52. వినరా వారి మెచ్చుకోలుకు :)

    ఇంతకీ విన్నకోలు అనగా నేమో :)


    తన ధర్మము విడువక చె
    ట్టు నమ్రతను చూపెనని చటుక్కున తెలిపా
    రు నెనరులు మీకిదె జిలే
    బి నచ్చె చెప్పిన విధమ్ము విధిని తెలిపెగా!


    జిలేబి

    ReplyDelete


  53. ఏబై దశకమ్ములలో
    ప్రాబల్యమునొందినట్టి భాషా గైడుల్
    బాబయ్య! ఈజి డిఫికల్ట్
    గా బారులు తీరెను పిలకాయల కొరకై


    జిలేబి

    ReplyDelete


  54. నేను గరీబును రాజ
    న్నా! నుడివెద బామ్మ చూడగా అమ్మోరే
    కోణంగి కొంటెదనమున
    తానెవ రోయెవరికెరుక తల్లి కిలాడీ !


    జిలేబి

    ReplyDelete


  55. కనబడని నిన్ను లేదని కల్పనయని
    చెప్పి నాను నారాయణ! చేరి నావు
    చట్టనుచు నన్ను వెంటనే చంపగాను
    నేను చేసిన తప్పేమి నేరమేమి
    నన్ను దయమాలి చంపుట న్యాయమగునె!



    జిలేబి

    ReplyDelete


  56. కందచంపకము


    భగభగ మని నిప్పు కణిక
    ధగ! నను దయమాలి చంపఁ దగునా తగవా
    పగఁ బూని మిత్రమా నే
    ను గురువుగ కొలిచితికద నిను విడువక సదా!



    జిలేబి

    ReplyDelete


  57. మిన్నగ పెంచితి గడ్డము
    నన్నెవరిక గుర్తుగాన నవఘళ మగునం
    చెన్నంగా దీది నరేం
    ద్రన్నా యను పిలుపును విని యడలితి నయ్యో

    నమో మాటగా పూరణ
    జిలేబి

    ReplyDelete


  58. మొన్నటి విందరగకమును
    పన్నా యను పిలుపును విని యడలితి నయ్యో
    చెన్నుగ యమద్వితీయపు
    టన్నమునకు బిలిచె భగిని టంచనుగ కదా!



    జిలేబి

    ReplyDelete


  59. ఏమి వడ్డించునో ఈ‌మారు !


    మునుపటి యేడువలెను గ్ర
    క్కన " అన్న" యటంచుఁ బిల్వఁగనె యయ్యొ భయం
    బును బొంది పాఱితిన్ క్షణ
    మున హస్తపుటన్నపు స్మరము గుఱుతు రాగా!


    జిలేబి

    ReplyDelete


  60. శ్రీధర వాళ్లెవరికి మీ
    దౌ ధరణిన్ చెన్ను భాష "తప్పితవరి" నే
    ర్పే ధర్మము చేయకుడీ
    సాధించి మరి తవరికె యెసరు పెట్టెదరోయ్ :)


    నారదా
    జిలేబి

    ReplyDelete


  61. హస్త భూషణ మిది జిలేబమ్మ దండి
    భగ్గు మను సుమండీ మ్యాచు బాక్సు మరియు
    అగ్గిపుల్ల వలెను సుర్రుమంచు చేయి
    కాల్చు శ్రీధర వినరా నిఖార్సు మాట!


    జిలేబి

    ReplyDelete
    Replies
    1. నిప్పు కణిక చివుక్కు మనుచు నీటినే ఆవిరి గావింపగ.. ఆ నీరే నిప్పు నివురు బాపే ఆయుధమై చల్లార్చగ.. ఔఔ అమ్మణ్..

      Delete


    2. నిప్పు కణిక చివుకుమనుచు
      చప్పున నీటిని జిలేబి చల్ ఆవిరిగా
      గప్పున గావించు భళీ
      యొప్పెడు విధముగ నదె కురియును చల్లార్చన్!


      జిలేబి

      Delete


  62. కెపకెప వేజకు అత్రా
    యిపకు తమార్! వ్యాండొకోని యీ నీలోగచ్
    చపకుచపక్ భూరోభట్
    టపటప ధన్ ధన్ చిటపట ఢంఢంఢడ తుస్!



    జిలేబి

    ReplyDelete
    Replies
    1. ఎవరిపై కన్నం అంత ఇది పకు మీది! తార్కికం కాదు ఇదీ నీలాకాశం జిగటగ రాయంత గోధూళిలా చప్పుడు చేస్తు చినుకులు గట్టి గట్టి చిటపట చినుకులు ఢంఢం ఢంకారం తుస్ ఆయే

      ట్రూ ట్రాన్స్ లేషన్

      Delete


  63. కంద చంపకము


    మెటమార్ఫ్! కత్తా కన్నా
    నట! టపటప ధన్ ధనాధన ఢఢంఢఢ చి
    ట్పట బుస్సు తుస్సు తుస్ కూణ్
    గుట!కాయి కసంచ ఛేళి గుటు కమ్మర్ కట్!




    జిలేబి

    ReplyDelete


  64. అటులనటులనే బిజిలే
    జి! టకుటకుమటంచు వ్రాయు చిన్నమ్మా ! మా
    కిటుకుల భాషను నేర్పను
    ఘటికుల కిక "తప్పితవరి" కంద జిలేబీ :)



    జిలేబి

    ReplyDelete


  65. తా వలచినది రంభయొ తా మునిగిన
    దేను గంగయొ! లలితమ్మ దేని మెచ్చి
    చూచునో చిత్ర మదియేను సూత్ర మిదె జి
    లేబి తెలివిడి గనవమ్మ లెస్స గాను!


    జిలేబి

    ReplyDelete


  66. మామూలు అగ్గి పుల్లా?
    మామి జపానగ్గిపుల్ల ! మాటినకుంటే
    సామీ భగ్గుమను జిలే
    బీ!ముప్పికతప్పదు గజిబిజి తప్పదయా!

    జిలేబి

    ReplyDelete


  67. ఎంత గొప్ప అగ్గి పెట్టిని పుల్లైన
    నొక్క మారు మాత్రమోయి వెల్గు
    జర్మనీ యయినను జప్పాను పుల్లైన
    నూ జిలేబి తాత నుడివినారు


    జిలేబి

    ReplyDelete


  68. బతికితే బాలు వలె నీవు బతుక వలె జి
    లేబి నేర్చుకొనవె వారి లివ్వు మనెడు
    భాష భావమ్ముల పలుకు పటిమ, సరస
    మైన సంభాషణల తీరు మైగొలుపగ!


    జిలేబి

    ReplyDelete


  69. అమ్మ లేని అయ్య ఆ అయ్య లేని అ
    మ్మయు జిలేబి లేదు మహిని; రెండు
    గా కనపడు నొకటె గాన నొకటె రెండు
    రెండిమిడెను లేని రెండు లోన!


    జిలేబి

    ReplyDelete


  70. అటుతిరిగినన్ జిలేబీ
    యెటుతిరిగినను హరియే సయితుడు నెలతుకా
    స్ఫుటమైన సత్యమిదియే
    చటుక్కున విడువక నతని సన్నిధి గనుమా!



    జిలేబి

    ReplyDelete


  71. అమ్మ లేని అయ్య ఆ అయ్య లేని అ
    మ్మయు జిలేబి గలదె మహిని? రెండు
    గా కనపడునది యొకటెగా? కుదురునకొ
    శంకరుండు వలదు శాంతి వలయు?


    జిలేబి

    ReplyDelete


  72. ఇలలో నొకటైనది లే
    వులె! శంకరుఁ డేల మాకిపుడు శాంతియె కా
    వలె నెవ్విధిన్ గనన్ కో
    మలాంగి కుదరనిది! ద్వైత మద్వైతమిదే!


    జిలేబి

    ReplyDelete


  73. దిగ్దంతివై వెలిగెదవు
    వాగ్దేవీ పూజఁ జేయ, వర్ధిల్లు సిరుల్
    వాగ్దేవి యత్త సాయము
    వాగ్దేవిని విడువకోయి పడతి జిలేబీ !



    జిలేబి

    ReplyDelete


  74. ఒకే ఫేమలీ ఆల్ ఇన్‌ ఆల్ కంట్రోల్ :)

    One family show / biz :)

    వాగ్దేవీపతి వ్రాత కర్మఫలమై పాండిత్యమెంతేని యా
    వాగ్దేవీపదపూజఁ జేసినపుడే వర్ధిల్లుగా, సంపదల్
    వాగ్దేవీపతి తల్లి లక్ష్మి కృపగా వర్ధిల్లుగా శ్రేయముల్
    వాగ్దేవీపతి తండ్రి శ్రీకరుని సావాసమ్ముతో గూడుగా!



    జిలేబి

    ReplyDelete


  75. అలవాట్లంత సుళువుగా
    జిలేబిని విడుచుననుట విచిత్రమె కష్టే
    ఫలి గారండీ ! నారదు
    ల లక్షణము నిండుగా గల సిత కదండీ!


    జిలేబి

    ReplyDelete


  76. శృతిమించి రాగమున పడు
    ట! తెలుప వలె దీని కథ తటాలున తాత
    య్య! తెలుగు వారి ములుగు సా
    మెతలకు జాతీయములకు మించారగనన్!


    జిలేబి

    ReplyDelete


  77. జాల్రా :)



    సఖి! కవీశ్వరులకిదేను సమయమాయె!
    రాత్రి తొమ్మిది! బ్లాగ్విహారమ్ము లలర
    యాకసమునందుఁ దోఁచె శశాంకశతము
    శంకరాభరణ మనెడు సైరిభమున


    జిలేబి

    ReplyDelete


  78. ఔర! శని ప్రభావము! సా
    ఫ్ట్వేరేపునకే గ్రహములు వెంగళమాడన్
    హేరాళమ్ముగ! మార్చితి
    వారిని క్రొంగొత్త సంస్థ పనిచేయునికన్!



    జిలేబి

    ReplyDelete


  79. తప్పుల మన్నించుమయా
    చప్పున మమ్ముల విడువకు జానకి రమణా
    గొప్పలకు పోవు చుంటిమి
    తుప్పల వెంబడి మరిమరి దొరలుచు రామా


    జిలేబి

    ReplyDelete


  80. కాలమొక యింద్ర జాలము
    వాలము బట్టి మనుజుల చివాలున ద్రిప్పున్
    చాలమి వలదోయి నరుడ
    మేలగు రాముని భజింప మేవడికాడా!


    జిలేబి

    ReplyDelete


  81. పలువిధములగు తెఱగు బొ
    మ్మల చేయంగను జిలేబి మధురమ్ముగ, మా
    పు, లటుక్కున సడి సేయక
    యెలుకలు తమ కలుఁగులోని కేనుఁగు నీడ్చెన్!


    జిలేబి

    ReplyDelete


  82. ఇందులో రెండు అసంభావితాలున్నాయి. ఏమిటవి ? :)


    చిలుకలు, సింహముల్, కరులు చెన్నుగ చక్కెర బొమ్మలాయె నా
    వెలుతురు బోవ గుట్టుగ ప్రవేశము చేయుచు కూక లేకనా
    యెలుకలు మత్తవారణము నీడ్చెఁ గనుండు కలుంగులోనికిన్,
    పిలిచె జిలేబి యయ్యరును భీతిని చెందుచు వంటయింటిలోన్!



    జిలేబి

    ReplyDelete
    Replies
    1. // "అసంభావితాలు" // ????? అనగానేమో??

      సరే, నేను గమనించిన రెండు అసంభవాలు :-
      (1). ఎలుకలు మదపుటేనుగుని కలుగులోనికి ఈడ్చుట.
      (2). వంటింట్లో "జిలేబి" గారు :) :)
      😀

      Delete

    2. వినరా వారూ

      మీరు తెలుగువారేనా ? అసంభావితాలు అన్న పదం తెలీక పోవడమేమిటండీ !!!!!!



      జిలేబి

      Delete
    3. నాకే కాదు, "ఆంధ్రభారతి" వారు కూడా అటువంటి పదమేమీ లేదు పొమ్మన్నారు, "జిలేబి"గారు :(
      ======================
      ఆంధ్రభారతి
      నిఘంటుశోధన
      "అసంభావితము: అడిగిన వాటికి నిఘంటు శోధనలో ఫలితములు లభించలేదు."
      ======================

      Delete


  83. చాల ముదము తోడా బ
    త్తేలను ముద్దాడి కాంత తీయఁగఁ బలికెన్,
    "ఆలి! మగడా! జిలేబి ని
    లా లిప్త సమయములోన లావొనరింతున్!"


    జిలేబి

    ReplyDelete


  84. అనఘా! "చూడండీ!" గో
    సున! తేలును ముద్దులాడి సుదతీమణి బ
    ల్కెను తీయతీయఁగన్, "మా
    కనుకట్టిదె వచ్చె మీ నగరమున రండీ!"


    జిలేబి

    ReplyDelete


  85. రామా! మీ శ్యాముడు మీ
    నామ జపమ్ము విడిచేను నావెన్కపడే
    యేమి అసంభావితములి
    వో మీ కేమైన యెరుక యొకపరి తెలుపన్ :)



    రామ రామ
    జిలేబి

    ReplyDelete


  86. తాయారమ్మ! విదురులన
    కోయి!"విదుల" నవలె తెలుసు కొనవమ్మ జిలే
    బీయమ్మా ! శ్రీ శ్యామల
    రాయలు "విదులు" సరికాదు వ్రాయుట విదురుల్ :)


    ఇదేదో కొత్తగా వుందే :) బావుంది "విదులు", కో- విదులు :)


    జిలేబి

    ReplyDelete
    Replies
    1. ' కోతి చేతికి చిక్కిన కొత్తబోండ '
      మనియ ? కోవిదులంటే , తమర్థ మౌర !
      ఇంతటి ఘటికులను విదుల్ పంతమాడ
      జూతురా ? జిలేబి యనంగ సూప రంతె .

      Delete


    2. అయ్యయ్యో ములగచెట్టు ఇంత చిన్నగా వుందేమి :)

      సూప రంతె యనుచు చుక్కలలోనికి
      నెట్టి నారు నన్ను నేర్పుగాను
      రాజ ! విదులు మీరె రాధనమును జేర్చి
      నారు మదియు తూగె నయ్య జోరు


      నెనరుల్స్ :)

      జిలేబి

      Delete
    3. ఇప్పుడేంది ? బుధుడ! గప్పుడే యెరుక మీ
      గొప్పదనము నాకు కూర్మిగలుగ ,
      చుప్పనాతి కోతు లప్పుడప్పుడు రేగి
      వాగు వాగుడు వినువారలేరి ?

      Delete


  87. ఇంతటి తో చర్చకు తెర!
    సుంతయు నే నొప్పనింక శుంఠల్లారా
    జంతికలు జిలేబీలూ
    యింతటి తో స్వస్తి మీ కమింట్లికు బైబై :)


    ఇచ్చట కామింట్లకు టపా అద్దెకివ్వబడును :)

    జిలేబి

    ReplyDelete


  88. పెరటి లోని ఆకు పేర్మియెవరికెరు
    కా జిలేబి ? మందు కాని ఆకు
    లేని దెక్కడా! భళీ పునర్వవ! ఔష
    ధ మహిమయు గలిగినదమ్మ వినవె!


    జిలేబి

    ReplyDelete


  89. సిల్లీ డవుట్ల నడిగెడు
    పిల్లోడిని మాత్రమే కవివరా యేదో
    మెల్లగ కొంత తెలుగు నా
    వల్లయినంత తెలుసు కొనవలెనను కొంటిన్ :)



    జిలేబి

    ReplyDelete


  90. మస్తిష్కము పొదలించును
    పుస్తక పఠనమ్ము, పాపమును గల్గించున్,
    విస్తారముగ తలంపులు,
    మస్తిష్కమ్మును తొలుచగ మరిమరి సుదతీ!



    జిలేబి

    ReplyDelete


  91. అరకొర యర్థము లేక త
    నరు పుస్తకముల్ పఠించిననె పొందెద రె
    ల్లరు పాపభారమున్ చి
    ల్లరమల్లర తలపులెల్ల లావై బోవన్!



    జిలేబి

    ReplyDelete


  92. రామాయ స్వస్తి ! చతురుడ
    వై మానవ రావణాయ స్వస్తి యనదగున్!
    త్వామనురజామి యనవ
    య్యా మానకు వందనమ్ములనుట నెవరికిన్

    జిలేబి

    ReplyDelete

  93. కందా చంప్స్ :)

    విలవిల లాడి విదులు చతి
    కిలబడి రర్థము తెలియక! గిద్యమ్ములతో
    డలకల కొలికి జిలేబియె
    తలగడతోఁ గొట్టినంతఁ దలయే పగిలెన్!


    ***

    విలవిల లాడిరరరె తవి
    కల తల గడతోడఁ గొట్టఁగనె దైవమ! హా!
    తల బ్రద్ధలయ్యెనే, చతి
    కిలబడి విదులర్థమును వెతికి వెతికి సుమా!


    ***

    నలుగురు నవ్వేరవ్వా!
    నలుగురు నవ్వేరు వినవె నా కడ కొంగున్
    కొలిచిన పెనిమిటిని ఫెడేల్
    తలగడతోఁ గొట్టినంతఁ దలయే పగిలెన్


    జిలేబి

    ReplyDelete
    Replies
    1. విదులు విలవిలా , మరి కో
      విదులు చతికిలా , జిలేబి వీరవిహారం ,
      చదురులుగల తమ వెనుకన్
      పదపడి నేనూ గమింపవలసినదేగా .

      Delete
    2. విదురులకే విధులు నేర్పించెడి
      విధాతామణులు వినువీధిలో విహరిస్తూ
      విదియనాడు విధానాలు విధించుచుండిరి
      విధి విపరీతము, హతవిధీ!

      Delete


    3. స్వల్ప అడ్జస్ట్ మాడి కంద పద్యము
      జై గొట్టెద ముక్కలకున్
      జైగొట్టిపలుకులకున్ :)


      విదురుల కే విధుల గరుపు
      విధాతలు జిలేబులయిరి వినువీధిని యీ
      విదియ, విధానముల తెలిపి
      విధి విపరీతము, హతవిధి యిది జై గొట్టోయ్!



      జిలేబి

      Delete


  94. కందమ్మకేను ముందుగ
    వందారనవలెను రాజ వారూ ! ఉన్నా
    డందురు గా వాడికి మీ
    వందన మిడిన మిడకున్న పట్టింపుల్లేవ్!


    జిలేబి

    ReplyDelete


  95. పిచ్చి గోల చేయ ప్రియమైన భక్తులు
    తప్పు కొనిరి గ్రూపు దాటి చనిరి
    వాత్సపందు వేయ వ్యాఖ్యల గురువుల
    పైన భళి రుసబుస లాడగాను !


    జిలేబి

    ReplyDelete


  96. సబ్ కా మాలిక్ ఏక్ హై
    ఈశ్వర్ అల్లా తేరేనామ్

    ప్రేమ తత్త్వ మైన పేర్మిగా యేశుపై
    క్రైస్తవులకె కద్దు, రామభక్తి
    కలదు హిందువులకు, కలదు నమ్మిక ముస్లి
    ములకయా ప్రవక్త మొహ్మదన్న!


    జిలేబి

    ReplyDelete


  97. ముదమారగ హిందువులు వ
    రద! రాముని భక్తు లెవ్వరన; క్రైస్తవులే
    కద యెంచి చూచినన్ ప్రభు
    ని దారిని నడచెడు వారు నిర్ధారణగా!


    జిలేబి

    ReplyDelete


  98. నీమము గా నమాజున వినిర్మల మయ్యెడు వారు ముస్లిముల్!
    క్షేమము జేర్చు వారు మన కెందరికో ప్రియ మైన వారలే
    రాముని భక్తు లెవ్వరన; క్రైస్తవులే కద యెంచి చూచినన్
    మోమున ప్రేమ రక్షకుని ముద్రగ జీససు క్రీస్తు భక్తులౌ!


    జిలేబి

    ReplyDelete


  99. ఒంటరి గా నా దండా
    లంటూ దుష్టుల కెడన్ సఖా పోమాకోయ్!
    కంటకు డై దొక్కి యతడు
    మింటికి నెగరేయు నిన్ను మేవడికాడా!


    జిలేబి

    ReplyDelete


  100. ఇది నేర్వ లేదరరరే
    యది నేర్వగ కుదురలేదటంచు నెపుడు నె
    మ్మది లేకనటునిటు తిరుగు
    చు దారి తప్పుచు నను విడి సొమ్మగిలితివో!


    జిలేబి

    ReplyDelete


  101. ఎప్పుడూ ఏడ్పుగొట్టు మొగాలేనా ! కొంత చిరునవ్వు మోముతో మిత్రమా అంటూ ఎప్పుడు వస్తారో ఈ భక్తాగ్రేసరులు :)


    ఎరుగనెరుగనేదియు నే
    నెరుగన నుచు సొమ్మసిలుచు నెమ్మది లేకన్
    పరుగుపరుగుల విభుని చెం
    త రయ్యనుచు వెడలి కంటతడిపెట్టుదునే!


    జిలేబి

    ReplyDelete
    Replies
    1. ఎవరినో లక్ష్యంగా చేసుకుని ఇటువంటి పద్యాలు వ్రాసి విసుర్లు విసరడం మీకు శోభనివ్వదు కదా, "జిలేబి"గారు?

      Delete


    2. అబ్బే! అట్లాటిదంతా ఏమీ లేదండీ ! కౌంటర్ పాయింట్ వ్యూస్ అంతే వినరా వారు‌.


      జిలేబి

      Delete
    3. భక్తులై , మీరు వారికి భజనచేయు
      నవసరమునాడు , నగుమోము నవధరించి ,
      మిత్రమాయంచు వత్తురు , మీరలకట !
      అట్లుగాక సెటైర్లు వేయగ పొసగున ?

      Delete


    4. విభుని ఆలోలము గా ఆ మాట నాది కాదండోయ్


      జిలేబి

      Delete


  102. బ్రహ్మ ఎప్పుడూ నిద్ర పోయినట్లు లేదు.
    విష్ణువు నిద్ర వీడకుండా వుండిందీ లేదు.
    శివుడేమో అర్ధనారి యయ్యె!

    ఏమిటీ మాయయో!


    గోల! శివుని గృహమెచటే?
    బేలా! విష్ణువు పరుండు పేర్మిగ నెచటే?
    లోలా! సత్యపురమ్మున?
    కైలాసమున; నహిపైన; కంజుఁడు పండెన్;


    జిలేబి

    ReplyDelete


  103. హమ్మయ్య!


    బాలా చెప్పవె యర్ధనారి వలె యొప్పారెన్ త్రినేత్రుండెటన్?
    మూలాధారముగా జనార్దనుడు కన్మోడ్పందు పండెన్ సదా?
    శీలా! సత్యపు రమ్ము నందెవడు సృష్టించెన్ సదా చెప్పవే!
    కైలాసమ్మున; శేషతల్పమున సౌఖ్యంబందె; వాణీశుఁడే



    జిలేబి

    ReplyDelete


  104. తాను వలచినది రంభ! యి
    దే నా నమ్మకము దేవ దేవా నీపై
    మానావమానములు నీ
    దే నా వేల్పుగ నిలచితి వీవే రామా!


    జిలేబి

    ReplyDelete


  105. శునకమ్ము తోడు బైడెను
    చినవాడై ఆటలాడ చిక్కి మడత గాం
    చెనటా కాలు! భళీ ట్రం
    పునే గెలిచినాడు కుక్క వూపెంతయగున్ !


    జిలేబి

    ReplyDelete


  106. వినినంతనె వేగుపడుచు
    గునగున తప్పనవలదయ గురువుల మాటా!
    అనఘా! గన తన తండ్రికి
    తనయుఁడె తన తమ్ముఁడయ్యెఁ దప్పెట్టులగున్



    జిలేబి

    ReplyDelete


  107. మునిమాపాయెను కెవ్వు కెవ్వు మని యా మూలన్ కుటీరమ్ములో
    వినిపించెన్ పసిపాప కేక!అదిగో పిన్నమ్మకున్ తండ్రికిన్
    తనయుండే తన తమ్ముఁడయ్యె ననఁగాఁ దప్పౌన ?యొప్పే యగున్
    తనివారంగను ముద్దులాడ వెడలెన్ దాసీకుమారున్ కెడన్


    జిలేబి

    ReplyDelete
  108. నేను బ్లాగులలోకి రాకముందు హిందూద్వేషులు రెచ్చిపోయి హిందువుల పట్ల బూతులు కూడా వాడేస్తుంటే హిందువులు బిక్కచచ్చిపోయి వెనక్కి తగ్గే దృశ్యం కనబడుతూ వుండేది.

    నేను బ్లాగులలోకి వచ్చిన దగ్గిర్నుంచీ హిందూద్వేషులు బిక్కచచ్చిపోయి వెనక్కి తగ్గే దృశ్యం కనబడుతూ వున్నది.

    బహుశా అందువల్ల ఈర్ష్యకి గురై భరద్వాజ ఉరఫ్ మలక్ పేట రౌడీ లాంటివారు నన్ను యాగ్రిగేటర్ల నుంచి తొలగించారు కాబోలు!

    ReplyDelete
    Replies


    1. శూరాగ్రణియగు సింహము ఆకలిచే డస్సినను,ముదిమిచే జిక్కినను, కష్ట స్థితిబొందినను, కాంతి విహీనమైనను, ప్రాణములు పోవుచున్నను,మదించి ఏనుగు కుంభస్థలము చీల్చి అందలి మాంసము భుజించునే కాని, ఎండుగడ్డి మేయునా?

      జిలేబి

      Delete


  109. ఎట్టెట్టి పుణ్యముల మరి
    గట్టిగ చేసెనకొ? పుట్టుకాయెన్ కైపె
    క్కిట్టించు కైపు గా నదె
    కొట్టొచ్చిన కారణము ప్రకోపమునకయా :


    జిలేబి

    ReplyDelete


  110. ముగిసె ప్రచారములు ! రవం
    తగ శాంతి ప్రశాంతి దొరికె తన్నుకొనడముల్
    సిగ కోసుకోవడములు త
    రిగె కొండల రావుగారు రింఛోళి దరిన్


    జిలేబి

    ReplyDelete


  111. పప్పీ బెహనా పప్పుకి
    యొప్పెను పేరు భళి భళి సయోధ్యగ సుమ్మీ
    గప్పున పెట్టేయ్ పద్యం
    బొప్పెడు రీతి విదుల తల బొప్పియు గట్టన్


    జిలేబి

    ReplyDelete


  112. కోరలు గోళ్లూ లేకుం
    టే రక్తపు నోటి మెకము రెల్లును తినదం
    డీ! రాజిల్లును తనువును
    పూరిగ బాసి వినుడి పరిపూర్ణత యిదియే!


    జిలేబి

    ReplyDelete


  113. తవరేమి చెప్పిరో మా
    కు వలవిసుర ముక్కొకటియు కూసింతయు బు
    ర్రవరకు చన లేదాయే
    కవయిత్రీ మట్టిబుర్ర కందె జిలేబీ :)


    జిలేబి

    ReplyDelete


  114. పెళ్ళి చేసుకొనరు సాఫ్టు వేరు వాళ్ల
    ను రమణులు డాక్టరులరె పనుపడుట కుద
    రదు కదండి ! మానిటరు విరామమొందు
    టెపుడు వారిజలను చూచుటెపుడు వారు :)


    జిలేబి

    ReplyDelete


  115. మాడర్న్ డేస్ కంకణలోభి పథికుడు :)


    కంకణలోభి పథికుడికి
    టెంకణ మిడుచు భళి మార్కెటింగ్ కుర్రోడా
    ఢంకా మ్రోగించి క్రెడి
    ట్టింక దెపుడనంగనే తృటినిపడె గోతిన్ :)



    జిలేబి




    ReplyDelete


  116. తాత ఉవాచ :)


    శ్రీ భాస్కరార్యుల పలుకు!
    సౌభాగ్యమిదె! తెలుసుకొను సరసి జిలేబీ :)
    యే భాషనైన పిలవాం
    డ్రా భామలు నేర్చుకొనెద రమ్మా త్వరగా


    జిలేబి

    ReplyDelete


  117. వినికిడి సరిలేదండీ
    కనుక లిరిక్సు దయచేసి కాస్తా పెట్టం
    డి! నుతులివే మీ కండీ
    పనుపడుచు చదివెదనండి కవనమ్మండీ :)


    జిలేబి

    ReplyDelete


  118. ఊరందరిదిన్నూ నొక
    దారైన ఉలిపిరికట్టె దారి మరొహటీ !
    హేరాళమ్మగు తెలివిడి
    వారల దండీ జిలేబి పద్యములవలే :)


    జిలేబి

    ReplyDelete


  119. ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్ !


    ఏకత్రాటిని తెచ్చుట
    నా కర్తవ్యమ్ము; జన వినాశనమె కదా
    మీ కోరిక ? కానివ్వను
    మీ కార్యకలాపములను మీ దుష్కృతులన్


    జిలేబి

    ReplyDelete


  120. ఏకత్రాటిని తెచ్చి దేశమునికన్ శ్రేష్ఠంబు గాచేయుటే
    నా కర్తవ్య మెఱుంగఁ, జెప్పెదఁ బ్రజా నాశమ్మె సంక్షోభమే
    మీ కౌటిల్యపు బుద్ధి ! త్రుంచెదనిదే మీ దుష్కృతిన్; దుష్టులా
    రా! కానివ్వను మీ ప్రణాలికల నా రావమ్మిదే వృద్ధికై!



    జిలేబి

    ReplyDelete


  121. రాయి యైననేమి విభుని ప్రాభవమ్ము
    లేని స్థలమేది నుతులివె లెస్స గాను
    నాదు దైవము నాదుగాన! గలడాత
    డిచట రుబ్బురోలున టబ్బు డిబ్బులోన


    జిలేబి


    ReplyDelete


  122. సింధుకన్య చూడ చీపురాయె మదిని
    తట్టి నట్టి పొడ చిదాత్మ గాదె!
    విష్ణు చక్ర మాయె వింతయైన జిలేబి
    రాజు గారి పద్య రాజమందు


    జిలేబి

    ReplyDelete


  123. రాజకీయులన్న హైదరాబాదీయు
    లకు చిరాకు కలిగె లాగి పెట్టి
    కొట్ట వలెననెడు ప్రకోపమ్ము కలిగెను
    చెప్పు లోని రాయి చెవిని హోరు


    జిలేబి

    ReplyDelete


  124. ఎవరండీ చెప్పిరిలా
    శివపూజను జేయకున్న శ్రీహరి యలుగున్?
    తవరిటువంటి ప్రచారము
    ల వలదు చేయ కవి శంకరార్య పలికితిన్



    జిలేబి

    ***
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    'తవరు' వ్యావహారికం. - కంది వారి రెవ్యూ

    ReplyDelete
    Replies
    1. అద్భుతము , ప్రశస్తము , మనోహరమను పలు
      విధపు గ్రేడింగులు గలవు విహిత ! , మీకు
      నరయ 'బాగున్న' దనెడుదేన ? యొసగుటలు !
      చూడు పైకమిచ్చి , పిదప గ్రేడు బెరుగు .

      Delete


    2. బాబోయ్ మీకు కోపం వచ్చేసింది :)

      Delete


  125. భవసాగరమ్మిదియె వన
    జ! వరలుచు సుఖమ్ముగాను జన్మదినమహో
    త్సవము శ్మ శానము నఁ దగున్
    జవసత్వములింకగా సుజన కుదరదుగా !


    జిలేబి

    ReplyDelete


  126. తరిగెడు యౌవనమాయె వి
    నుర జన్మదినోత్సవమ్మును శ్మశానమునం
    జరుపంగ యుక్తమౌ త
    ప్పు రవంతయులేదు మునసబు కుమారుండా!


    జిలేబి

    ReplyDelete


  127. ము‌న్ముట్టగా కరోనా
    కన్మొగిచె తృటిని భళారె గాంచెను కలయున్
    తన్మాత్రములొరుగనికన్
    జన్మదినమహోత్సవము శ్మశానమునఁ దగున్!


    జిలేబి

    ReplyDelete


  128. ప్రజలను చైతన్యపరచు
    ట,జనుల చిచ్ఛక్తి పొందుట నిరంతరమై
    న, జిగిలి ప్రక్రియగా మన
    కు జిలేబి వలయును తెలుసుకొనవే సుదతీ!



    జిలేబి

    ReplyDelete


  129. చైతన్యవంతు లేతా
    వాత హితుడ చదువురాని వారలె సుమ్మీ
    గోతులు తీయుట భళిభళి
    కోతలు కోయుట చదివిన కోవిదులదె పో


    జిలేబి

    ReplyDelete


  130. గడ్డు కాలమొస్తుందర్ర కాచు కొనుడి
    ఏడు నుండర్ర మరి పది హేడవ దిన
    మీ డిసెంబరు వరకు సుమీ వినండి
    కనుక జాగ్రత్త పడవలె కాస్త మీరు!


    జిలేబి

    ReplyDelete


  131. కడుపు నిండినోళ్లకు సూవె కష్టము తెలి
    యదు! బడుగు వర్గములకు చైతన్యము భళి
    జీవితావసరము లక్సరీ యనుకొన
    కండి పల్లె ప్రపంచపు కార్యదర్శి!



    జిలేబి

    ReplyDelete


  132. అనఘా! పోగొట్టెనయా
    దినకరుఁ డుదయించి, దెసలఁ దిమిరము, నింపెన్
    కనుల మిరిమిట్లు గొల్పుచు
    వినువీధిని వెలుతురున్ పవిత్రత తోడై

    భార్య ఏడుస్తూ కూర్చున్న భర్తకు కాఫీ యిచ్చెను :)
    ఈ వాక్యములో ఏడుస్తున్నదెవరు ?

    జిలేబి

    ReplyDelete


  133. కందా చంప్స్ :)


    అనఘా ప్రకాశమున్ క్ర
    న్నన దినకరుఁ డుద్భవించి నలుదిక్కుల నిం
    పెను, చిమ్మచీఁకటిన్ ద్రో
    లి నూతనత్వమును నింపి లెస్సగ సుదతీ!


    జిలేబి

    ReplyDelete


  134. సెటిలర్సంటున్నారే
    చటుక్కున తెలుగు ప్రజల విచక్షణ లేదే!
    కుటిలత్వపుటాలోచన
    లు టక్కుబాజి చెడు బుద్ధులున్ను జిలేబీ


    జిలేబి

    ReplyDelete
    Replies
    1. ఆ ఆడ షట్లర్ సిల్వర్ మెడల్ గెలవగానే సెటిలరా అంటూ ఆవిడ కులం కొరకు వెదుకులాటలో దద్దరిల్లిన గూగుల్. సదరు కొచ్చను ఇంకా సెటిల్ అయిందో లేదో?

      Delete
    2. స్టూవర్ట్ పురమున మరియును
      కావలి దగ్గరను కూడ ఘనసెటిల ర్లం
      తా వసియించుట విందును ,
      ఏవంవిథ కథల? , కావివేమాత్రంబున్ ( ? )

      Delete


  135. రాముడొకడే స్థిరమటం
    చా మానవుడుండె! నడుమ ఛా! సెటిలర్సం
    టూ మారాజులు పల్కగ
    నామోషీకలిగెను విను మమ్మ జిలేబీ


    జిలేబి

    ReplyDelete


  136. తలతోక లేని కామిం
    టులతో మా తల తినకు పుటుక్కున సెటిల
    ర్సుల గోడూ కడగండ్లివి
    జిలేబి నీకేమి తెలుసె చెకుమికి రాయీ :)


    జిలేబి

    ReplyDelete


  137. స్కూల్ మేట్స్ ఇరవై సంవత్సరాల తరువాయి మీటింగ్ :)


    బహుశా యిరువది పైబడి
    న హాయనములు గడిచెనొ తనను గాంచి సుమీ !
    మహదానందము గాంచెను
    సహదేవుఁడు, సీతనుఁ గని సంతోషించెన్!



    జిలేబి

    ReplyDelete


  138. సహదేవుండు ధరాత్మజన్ గని కడున్ సంతోషమున్ బొందె,రా
    ధ,హయగ్రీవుని చిన్న నాటి కబురుల్ దాష్టీకముల్, ముచ్చటల్
    ప్రహరీ గోడల దూకి మ్రుచ్చుతనముల్! రాదాయె కాలమ్మికన్!
    మహదానందము నొందె స్నేహితులనా మధ్యాహ్న వేళన్ గనన్


    జిలేబి

    ReplyDelete


  139. ముసలోళ్లైపోయిరి మీ
    రు సుమీ నాకన్న నొప్పు కొనెదెను సామీ
    కిసుకుల చేసెడు వారల
    ము సంభ్రమములు మనకెపుడు ముద్దులిడుగదా!


    జిలేబి

    ReplyDelete


  140. వదలడు ధైర్యము కడగం
    డ్లు దిట్టతనమును సడలుకొలుప జోదు భళా
    కుదురుగ నగ్ని నెగయు దా
    ని దెసను తల క్రిందు చేయ నేమి జిలేబీ!


    జిలేబి

    ReplyDelete
    Replies



    1. కష్టేఫలి
      "తప్పు సవరించాను జిలేబీ గారు :-)
      ==================== సరిగ్గా రాసిన పద్యం ========
      వదలడు ధైర్యము కడగం
      డ్లు దిట్టతనమును సడలుకొలుప జోదు భళా
      కుదురుగ జుట్టిన జిలేబి దా
      ని దెసను ఎటు పక్కకు తిప్పిన జిలేబీ!"


      డీజీ గారి పేరడీ :)

      ఢీ!

      జిలేబి

      Delete


    2. తప్పుగా సవరించిన తప్పుకు సవరణ :)


      వదలడు ధైర్యము కడగం
      డ్లు దిట్టతనమును సడలుకొలుప జోదు భళా
      కుదురగు జిలేబి భళి దా
      ని దెస నిటునటు నెటు ద్రిప్పనేమి చెనటియే!



      జిలేబి
      గుండుసున్న :)

      Delete


  141. తమ మూలాలున్న స్థలము
    లు మక్కువను చేర్చును జనులుత్తేజముతో
    డు మమేకముగానై మో
    దమునొందెదరు నిజమిదె కదా పువుబోడీ :)


    జిలేబి

    ReplyDelete


  142. లోకులు పలుకాకులు శ్యా
    మా! కుదరదు వాదనలు సుమా వారి కెడన్
    మీకేలరాజకీయపు
    చాకిరి గోలలు సుజన విచారము లేలా :)


    జిలేబి

    ReplyDelete


  143. భవతరణమునకు నామ జ
    ప విధానమ్మె సరియైన పద్ధతి నరులా
    ర విదుల మాటవినుడి మీ
    రవిరళముగ జపము చేయ రారండి ధృతిన్


    జిలేబి

    ReplyDelete
    Replies
    1. తరణోపాయము దెలియమి
      నిరతం బిటు కీచులాడు నేమ వివశులై
      బొరలు విబుధు లికనైనను
      శిరసా జపతప విధుల వసింతురు గాతన్ .

      Delete


  144. తమ 'సోమా' మాధుర్యమ
    య! మాధురీ దీక్షితుల వయారమయా! బా
    లము సెగలను గ్రక్కె కవి
    త్వము పర వళ్లుదుముకుచు వతంసితమాయెన్!


    జిలేబి

    ReplyDelete


  145. శీకృష్ణాయ నమః ! భళి
    శ్రీకృష్ణాయనమ! శ్రీహరీ! గోపాలా
    నీకృప యే యాధారము
    గా కృంతన చేసెదమిక కర్మఫలములన్!


    జిలేబి

    ReplyDelete


  146. సంతసమ్మాయె మదిలోన శతము పైన
    దొరికె లంకెబిందెలటంచు; దుఃఖపడెను
    కొట్టు కొనిబోవ పోలీసు కుటిల మైన
    బుద్ధి చూపి; గోవిందా ప్రభుత్వమాయె!


    జిలేబి

    ReplyDelete


  147. కందా చంప్స్ !

    జిగిదేరె సంతసమ్ము చె
    లగె దొరికెను లంకెబిందెలని; దుఃఖపడెన్
    మిగులన్ దరిద్రుఁడేను తొ
    లగబాఱగ కలయు చతికిలబడి జిలేబీ


    జిలేబి

    ReplyDelete


  148. తప్పుల చూపెదరా ఓ
    యప్పా డీజీ! జిలేబి యవ్వారంగా
    దాప్పా! విడువదు జాగ్ర
    త్రప్పా బాహాటముగ సతాయించునికన్ :)



    జిలేబి

    ReplyDelete


  149. తనవాడన్నదెవరు దు
    ష్టునకు జిలేబి హతమార్చు సూటిగ నతడిన్
    కనికరము చూప డగ్నియు
    తన దేవతయే యటంచు తాకగ సిసుడిన్


    జిలేబి

    ReplyDelete


  150. సోమవారము నాడరే సోమరసము
    మధురిమలు పొంగ ఝల్లని మదియు తేల
    గాను జైగొట్టుదురు గాక కవిత లెల్ల
    వెల్లి విరియగా బ్లాగుల వీధిలోన!


    జిలేబి

    ReplyDelete
    Replies
    1. Special Weakdays:
      #demonday #twistday #weirdnessday #thrustday #fryday #shatterday #shunday

      Delete


  151. బొక్కల వెతికెడు సామీ
    చక్కగ వ్రాయంగనెవరు శ్యామల రాయా
    మక్కువ మీరగ చెప్పిన
    మిక్కిలి వి‌న్నాణమునకు మీకివె ప్రణతుల్


    జిలేబి

    ReplyDelete
  152. శ్యామల రాయ నామస్మరణాదన్యోపాయం నహి పశ్యామో భవతరణే 🙂

    ReplyDelete


  153. అకటా కకావికలయిరి
    ప్రకటము గా మా గురువులు బందు ప్రభావ
    మ్ము కనబడెనీ దినమ్మున
    టకటక పద్యమ్ము లిచట టైంపాసాయెన్ :)


    బా (పూబొ) మ్మ

    తా (తతా) త :)


    జిలేబి

    ReplyDelete


  154. తాడే పామై కరుచును
    టేడా మేడా అయిన ఫెడేల్మనును జిలే
    బీ డమ డమా టపాసువ
    లే! ఢీ కొనుటేల వగచుటేలా రాయా :)


    జిలేబి

    ReplyDelete
  155. Replies
    1. కుదరవు గొప్పందనములు
      పదపడి తా తాడినెక్క , పైనెక్కునొకం ,
      డిది దెలిసి మసలుకొనుటయె
      విదులకు మరియాద యరయ , విహితా! యెపుడున్ .

      Delete


  156. సత్య మిదె సత్యము సరసిజాక్షి మదిని
    భక్తియనెడు కవ్వముతోడు బాగు చిలుకు
    రాము డే దైవ మనుచు శరణమతడను
    కాముకులగు యోగులకె మోక్షంబు దక్కు!


    జిలేబి

    ReplyDelete


  157. అహం కాలోస్మి !

    జరా ఇన్ వెస్ట్ కరో టైమ్ ఈశ్వర్ పర్ :)
    టైం ఈజ్ మనీ మనీ ఈజ్ ఎనర్జీ

    రాముడె నాకు‌ దైవమని వ్రాయుచు పద్యములెల్ల వేళలన్
    శ్యాముడె నాకు వేల్పనుచు సాచివిలోకితమైన దృష్టికై
    నీమము నెమ్మి బత్తియు వినిర్మలమై పరమాత్మ పై సదా
    కాముకులైన యోగులకె కాక పరంబు లభించు నేరికిన్?


    జిలేబి

    ReplyDelete


  158. ఎవరికివారే పిచ్చో
    ళ్లు! వినరు నా మాటలను కలుషితపు బతుకా
    యె! విభుని లోకము తెలుసుకొ
    నవె పిచ్చాస్పత్రి! మన మనసు ప్రతికృతియై!


    జిలేబి

    ReplyDelete


  159. "ఎగస్పార్టీ" వారి ఆరోపణలు :)

    సత్యమిదియె కంద జిలేబి సదనమందు
    వాసి లేని పద్యమ్ముల వ్రాసి వ్రాసి
    బాసఁ జెఱచు; పండితులకె వందనములు
    వీటిని భరించిరే దారి వేరు లేక!



    జిలేబి

    ReplyDelete


  160. అనఘా! తరమండి వెసన్
    గన బాసకుఁ గీడుఁ జేయఁగల పండితులన్ ;
    గని మ్రొక్కఁగాఁ దగున్ బ
    త్తిని చేర్చి మన సదనపు బుధిలురకు సుదతీ!



    జిలేబి

    బుధిలుడు - పండితుడని ఆంధ్రభారతి ఉవాచ.

    బధిరుడు - చెవిటి వాడని ఆంధ్రభారతి ఉవాచ.


    స్పెల్లింగ్ మిస్టేక్ అయ్యుంటే వాయగొట్టి వుండేవారేమో :)



    జిలేబి

    ReplyDelete


  161. నీ నామమె నామమయా
    నా నామము వెన్నపూసినట్టి కృపాణం
    బై నన్ను గోతి లో తో
    సేనయ్య! విడువక నిన్ను సేవింతునయా!


    జిలేబి

    ReplyDelete