Monday, October 5, 2020

రాగాల పల్లకిలో....

 


పూర్వ రాగము

    - నీలి రాగము

    - మంజిష్ఠరాగము

    - కుసుంభరాగము


హరిద్రారాగము

రీతి రాగము

అక్షీబరాగము

కషాయ రాగము

సకల రాగము

లాక్షా రాగము

కర్దమ రాగము

రోచనా రాగము

కంపిల్య రాగము


रागो द्वादशधा!

శృంగారమంజరికథ  

श्री भोज देव विरचिता

శుభోదయం

జిలేబి





209 comments:



  1. రావె శంకరాభరణము రమ్మనె త్వరి
    తముగ తేటగీతి ని వ్రాయ తరము గాను
    పొద్దు పొడిచె నదిగొ తూరుపు దెస తిమిర
    రిపునిఁ గాంచి వందన మిడిరి జనులెల్ల


    ఉభయకుశలోపరి
    శుభోదయం
    జిలేబి

    ReplyDelete
  2. ఆ, ఉభయకుశలోపరే. ఏమై పోయారు ఇన్ని రోజులూ? బ్లాగులోకం మీ గురించి బెంగ పెట్టుకుంది, స్తబ్దుగానూ ఉండింది.
    వెల్కం బ్యాక్.

    ReplyDelete
  3. జిలేబి గారు ... రాగాల పల్లకిలో వచ్చేసినందుకు మహదానందం 😊

    ReplyDelete


  4. నెనరస్య నెనరః !



    ఉభయకుశలోపరియె సు
    మ్మి! భయపడిరి జనులు మమ్ము మీరు వదిలి యిం
    ద్ర భవనమున కేగిరొ యని
    శుభముగ వచ్చిరి మరల వసుధకు జిలేబీ :)



    జిలేబి

    ReplyDelete
    Replies
    1. పాపము శమించు గాక, ఇంద్రసభ, వసుధకు తిరిగి రాక వగైరా నా మాటలు కావవి. అన్నీ మీరే అనేసుకుంటున్నారు.

      ఏమైనప్పటికీ "జిలేబి" గారు is back and all is well with the బ్లాగులోకం🤘.

      Delete
    2. వినరా ఆచార్య.. అమంగళం ప్రతిహతమౌగాక అని ఖూఢాను అందురే జనులెల్లరును..

      వైపరిత్యమగునో నేమో.. కించిదడబాటు తచ్చుయప్పులియేల్ హరిరామకృష్ణమాధవగోవిందరమణగరుడధ్వజకేశవపినాకపాణికౌముదికహస్తవరదాభయ

      Delete
    3. శ్రీధరా,
      అందురు అందురు.
      ఖూడా”, ఘోడా కాకపోయినా .... అది మరింత సొగసుగా ఉంటుంది 👌.

      Delete
    4. మళ్ళీ టపా కట్టేసిందనుకుని కొందరు దీవాళీ కూడా
      చేసుకుని ఉంటారు|:-)

      పాపీ చిరాయుహూ అని అప్పుడే పోతుందా - బ్లాగుల్లో ఇంకా ఎన్ని తంపులు పెట్టాలో!

      అన్ని గొడవలూ పూర్తయ్యి శాంతిస్థాపన జరిగే వరకు జిలేబి గుండ్రాయిలా ఇక్కదే ఉంటుంది.నాది హామీ!

      Delete


  5. లలిత గారికి నెనరులు !


    రాగాల పల్లకిని సర
    దాగా యెక్కి మరల వరదవలె జిలేబీ
    బేగమ్జి పద్యముల జ
    ల్సాగా వ్రాసేస్తు పొండి లలిత మధురమై :)



    జిలేబి



    ReplyDelete


  6. చాలా బాగుందండీ
    బాలూ పాటవలె పరుగు పరుగులిడుచు సు
    మ్మీ లలి తముగా మదిలో
    తేలుచు వినసొంపుగాను తేనియలూర‌న్ !



    జిలేబి

    ReplyDelete
  7. జిలేబీ గారు మాయమయిపోయి ద్వాదశ రాగాలు తీస్తున్నారన్నమాట ! కుశలమే కదా ?

    ReplyDelete


  8. నెనరుల్స్ నీహారిక గారికి

    మాయమయిపోయి మళ్లీ
    ఓయమ్మ జిలేబి బ్లాగు లోకమునకు కెం
    జాయపు రంగుల నద్దెడు
    ధ్యేయంబున తిరిగి వచ్చితిర? కుశలమ్మే ?



    జిలేబి

    ReplyDelete
  9. Replies

    1. बोनगिरि गारि कि नेनरुलु !


      जिलेबी

      Delete
  10. బ్లూమూను పగిది విసవిస
    భామామణి యేగుదెంచె, బ్లాగాకాశం
    బేమగునో? యుధ్దభయము?
    ధీమంతులు కొట్టుకొనుట తీవ్రంబగునా ?


    ReplyDelete
    Replies


    1. కొట్టుకొనరు! తిట్టుకొనరు
      బెట్టుగ నొకరి నొకరు సెగబెట్టుకొనుచు‌ బొ
      బ్బట్టుల జిలేబి తునకల
      లొట్టల వేసుకొని తిని కులుకుదురు రాజా :)



      జిలేబి

      Delete
  11. రాగాల పల్లకి లో బిజిలే అమ్మణ్
    రాలేదు ఏ వేళ ఏలనమ్మణ్
    నీ ఎపటి ఇరుక్కేన్ బిజిలే అమ్మణ్
    నీవు చెన్నాగిద్దిరెందు భావిసుత్తేనె

    ~శ్రీయః కాంతాయ కళ్యాణ నిధయే నిదయేర్దిన మంగళం నివాసాయ శ్రీనివాసాయ మంగళం

    ReplyDelete


  12. అయ్యరు జిలేబి మాటాడ గా జడవక,
    పిల్ల వాడయ్య చేతిని బెత్తము గని,
    మేఁక మృగరాజునుం గాంచి, మిడిసిపడెను
    కల చెదిరె మత్తు వీడెను కంది వర్య!


    జిలేబి

    ReplyDelete
  13. మాట మన్నించి కనపడినందుకు
    ధన్యవాదాలు.

    ================================
    రాగాల పల్లకిలో కోయిలమ్మ దీర్ఘతపస్సమాధికి చేరి నేటికి పన్నెండు రోజులు.
    పన్నెండురాగాల పై పయనించి కోయిల శివైక్యం చెందాలని ..........ఈ టపా ఉద్దేశంగా భావిస్తా...

    ReplyDelete
    Replies

    1. कष्टेफ़लि तात गारि कि नेनरुलु !



      जिलेबी

      Delete


    2. మాట మన్నించి వచ్చిరి మళ్లి ! ధన్య
      వాదములు మీకిదే జిలేబమ్మ! బాలు
      గారికి నివాళి యిద్దియొ? కాదు తాత
      గారు! వేరు విషయమిది కామసూత్ర !


      నారదా
      జిలేబి

      Delete


  14. కావాలండీ జావా
    కావలె ఆబ్జెక్టివు సి యు! గలరా ? కోడింగ్
    చేవయు గేమ్ సాఫ్ట్వేర్ కొర
    కై! వస్తే సర్టిఫికెటు కాస్తా డబ్బుల్ !


    జిలేబి

    ReplyDelete


  15. కావు మయ్య యనుచు వేడ గాచి తృటిని
    గజమునుం, జంపెను హరి చక్రమ్ముతోడ
    మొసలిని! శరణాగతి మోక్ష మునకు మేలు
    మార్గమమ్మ జిలేబి ప్రమాణ మిదియె


    జిలేబి

    ReplyDelete


  16. వ్రజనాథున్ కొనియాడు! గావు మన భావావేశుడై గాచెనా
    గజముం, జంపెను మాధవుండు ఘనచక్రమ్ముం బ్రయోగించియున్
    ప్రజవిన్ కుంభిని! పూసపాటి శరణారథ్యమ్మె మేలైనదై
    రుజుమార్గంబగు మోక్షగాములకు నారూఢమ్ముగా నేర్వగా!



    జిలేబి

    ReplyDelete


  17. చిక్కి పోయేరు జనులండి జివ్వు జివ్వు
    మనెడు పద్యపు వ్యాఖ్యలు మరి జిలేబి
    తున్కలుకనరాక జనుల దువ్వు వ్యాఖ్య
    లున్ భళారె లేకన్ డస్సులు పడి పోవ :)


    సెల్ఫు డబ్బా :)


    జిలేబి

    ReplyDelete


  18. నువు లేక అనాధలమ
    మ్మ! వునికి నీవే జిలేబి మాకెప్పటికిన్
    కవితలు లేకన్ డస్సితి
    మి! వడి వడినడకలు లేక మిట్టాడితిమే!


    సెల్ఫు డబ్బా ౨ :)

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. అవునవు,జిలేబిసారూ!
      నువులేక అనాధలంత, నువ్వూ నేనూ
      లవ లేశమైన జేయము
      కవిపండితు లింతమంది ఘనులందు హితా!🙏

      Delete
    2. అవునవు,జిలేబిసారూ!
      నువులేక అనాధలంత, నువ్వూ నేనూ
      లవ లేశమైన జేయము
      కవిపండితు లింతమంది ఘనులందు హితా!🙏

      Delete


  19. యుగ యుగాల భరతమాత యున్నతమగు
    పుత్రులమ్ము మేము భువిలో భూతదయను
    చాటి చెప్పిన వారము సర్వ జనుల
    హితము కోరిన జాతి మహిని జిలేబి!



    జిలేబి

    ReplyDelete
    Replies
    1. టర్ టర్ ల శెరిట మండి
      యుగ్ యుగ్ ల శెరిట మండి
      కడ్మ టోకి షాగ వాయి భారతీయుడా.. విన్నిపెగ్ విస్కాన్సిన్ స్టాన్‌ఫార్డ్ ఆక్స్‌ఫర్డ్ ఇస్ని ఇమ్ అగ్లౌ, ఫ్రియులి వెనేజి గుయిలి, త్రీయస్తే, బుకారెస్ట్

      Delete


  20. హారర్ కాదు జిలేబీ
    గారూ హారిబులు చిత్రకథ !యేకోశా
    నా రంజింపని హీరో
    హీరోయిన్ ఫ్లాపు షో వహియు రాదండీ !


    జిలేబి

    ReplyDelete


  21. నాదు టపా లోనే యి
    చ్చా దప్పళమైన లింకు చక్కని ఆర్కైవ్!
    మోదమ్మునిచ్చు కథ అను
    వాదమని అనుకొనలేరు వడి చదవండీ !


    జిలేబి

    ReplyDelete


  22. జోగుచూ జోగుచూ :)


    కుదురుగ నిలువక తాకెన్
    నిదురించెడి వేళ శిరము నేలం, గూలెన్
    పదిలముగా జేబున యు
    న్న దళసరి మొబైలు పగిలె నాయద్దమ్మున్


    జిలేబి

    ReplyDelete


  23. పూసపాటి వారికి మత్తేభములంటే ఇంత మక్కువా ? వరుసగా మత్తేభాల్ వచ్చి మీద పడితే ?



    చదరంగమ్మున పావులన్ కదిపి, వాక్చాతుర్యమున్ జూపి కో
    విదులన్ గెల్చి, నిశాంతమందు కవితావేశమ్ము కద్దంచు బల్,
    సదనమ్మందున వ్రాసి పద్యముల నే సంపూర్తిగా కండ్లపై
    నిదురం దోఁగెడి వేళ, శీర్ష మహహా నేలం బడెన్ దైవమా!



    గుడ్ నైట్ :)
    జిలేబి

    ReplyDelete


  24. కుంతి! పాండు రాజు సతి ! సుగుణపు రాశి!
    దాని సుతు లైదుగురు గూడి రా నెలఁతను
    పొలతి పేరు ద్రౌపది! చేరె భూపతులను
    వ్యాసుడు రచియించెను కథ భారతమ్ము



    జిలేబి

    ReplyDelete


  25. కందోత్పల


    అరె పొడుపుకథను విప్పుము
    గురు! "దాని కుమారు లైదుగురు దానినిఁ గూ
    డిరి పెద్ద లౌననన్" కుం
    తి రీతిగా తల్లియగు, సతి ద్రుపదు సుతయున్


    జిలేబి

    ReplyDelete


  26. దానిని నీటి యందు గని దానిని కొట్టెను ! తెచ్చె భిక్షగా
    దానిని శబ్దవేది, యమ దానిని పంచుకొనండనంగనే
    దాని కుమారు లైదుగురు దానినిఁ గూడిరి పెద్ద లౌననన్
    దానిని గాంచి రా జనులు! దానిని మెచ్చిరి భారతమ్మిదే



    జిలేబి

    ReplyDelete


  27. కందాట :(



    అవును! సరియే మతము మా
    ర్చు వాఁడె మంత్రి యగును! తనరుచు నే‌ పార్టీ
    ని విడువడు పనికి రాదను
    చు! వానికి పదవి యె వంచ శోభస్కరమై!



    జిలేబి

    ReplyDelete


  28. మతమన నేమి ? భావమె సుమా! తమ దైనది లేని వారలే
    సతతము గెల్తురౌ నెపుడు! చక్కగ దానిని పక్కబెట్టగా
    పతనము చెందడాతడు; సభాసదు లెల్ల గణించు రీతిగా
    మతమును మార్చువాఁడె యగు మంత్రిగ నేఁడు ప్రజాళి మెచ్చఁగన్!


    జిలేబి

    ReplyDelete


  29. బ్రహ్మచారి వెంకోబు మావయ్య, యగడు
    కాకికిన్ హంసయే సతిగా లభించె
    నీకు దక్కదా మనవడ నీరజాక్షి ?
    యత్నమును చేయు వామనయన లభించు !


    జిలేబి

    ReplyDelete


  30. ప్రశ్న జవాబు కందోత్పల !


    "గనుమా ! కావుమనెడు హా
    సను కాకికి రాజహంస సతిగా లభియిం
    చెను!"; "చిత్రమెట్లగున్ సఖి
    సినిమా కథలోన కోపు చిక్కదు వెదుకన్"


    జిలేబి

    ReplyDelete


  31. వాకబు చేసి నాను గుడి వాడను వాడొక బిచ్చ గాడటా
    తాకగ వాడి నా సుడి సుతారముగా మహరాజుగాన నే
    కాకికి రాజహంస సతిగా లభియించెను; చిత్రమెట్లగున్
    కోకను చాపి చంద్రముఖి కూర్మిని చూపదె భాగ్యలక్ష్మి రాన్



    జిలేబి

    ReplyDelete
    Replies
    1. వారాయి నాన్ ఉనై తేటి.. నాణ్ దా ఛెత్రకుకై.. కలకలకలకలకల...

      Delete

    2. नायना श्रैधरा

      चेत्रकु अनगा नेमि ?


      जिलेबी

      Delete
    3. ಬಿಜಿಲೇ ಅಮ್ಮಣ್ ಅದಾ.. ಏಮಿ ಲೇದೂ ಮಾ..! ಚಂದ್ರಮುಖಿ ಅನ್ನಾರು ಕದಾ ಮೀರು.. ಅಲಾ ದಾನಿ ತಮಿಳ್ ವರ್ಷನ್ ಛೇತ್ರಮುಗೈ ಉಂಟೇ ಅಲಾ ವ್ರಾಸಿತಿ..!

      ಅನಟ್ಲು ನೆನ್ನ ಹೆಸರ ಶ್ರೀಧರ್, ಶ್ರೈಧರ್ ಇಲ್ಲಾ

      Delete
  32. ఏమిటి, “జిలేబి” గారు మా గుడివాడ జనాలనేదో అంటున్నారు? 😡

    ReplyDelete
    Replies


    1. विनरा वारु

      अब्बे एदो यति प्रासल तंटा अंतेनंडी

      :)

      जिलेबी

      Delete
    2. अदेप्पुडो एण्टीओडू यमगोला लोने पाडिनारू कदेटि वियन्नाराचार्या, इपुडु बिजिले अम्मण गारू एमण्टिरी?

      Delete
  33. శ్రీధరా,

    “ನೆನ್ನ ಹೆಸರ” కాదు, ನನ್ನ ಹೆಸರು అనాలి.

    కన్నడంలో సరిగ్గా వ్రాయకపోతే “కన్నడ చళువళి” ఉద్యమ నాయకుడు వాతాళ్ నాగరాజ్ కన్నెర్ర చెయ్యవచ్చు, జాగ్రత్త ☝️🙂.

    ReplyDelete
    Replies
    1. ಸೋಲ್ಪ್ ಅಡ್ಜಸ್ಟ್ ಮಾಡಿ ವಿಯನ್ನಾರಾಚಾರ್ಯ.. ಸರೇಸರಿ..

      Delete

  34. దత్తపది

    అల కల వల నెల అన్యార్థంలో రామాయణ సందర్భం

    కలకంఠి ధరణి జయు నా
    వల! శివుని ధనుస్సు విరిచి వరుడీవల క
    న్నులు కలిసెవెన్నెల విరిసె
    నలువైపులతెల్లదనము నడుమనలపులున్


    జిలేబి

    ReplyDelete


  35. కాపూ కరణము నావా
    డే! పోరా మగడ కొట్టుడిక తప్పదు, రా
    వే, పోవే అంటేనూ
    కైపట్టున పడి బతుకుము కాలమ్మారెన్


    జిలేబి

    ReplyDelete


  36. ముందర దూసుకు వచ్చెను
    పంది, పటుక్కునఁ గొఱికెను భామిని మోవిన్
    కందువ వేళ జిలేబీ
    సందుకొన భయము పరుగున సదనము చేరెన్


    జిలేబి

    ReplyDelete


  37. కందోత్పల


    మునుగడ హటాత్తుగా దా
    రిని పంది! పటుక్కునం గొఱికెఁ బంకజలో
    చన మోవి గ్రక్కునన్ భయ
    మున కందువ వేళ వాజమున పరుగులిడెన్



    జిలేబి

    ReplyDelete


  38. ధైర్యవంతుడతడు దస్యుని వెనువెంట
    మొలనుఁ గత్తి దూసి పొడిచె, సతిని
    గాచె! తృటిని తప్పె ఘాతము! పరికించి
    నట్టి జనులు మెచ్చి నారు మగని!


    కథ కంచికి :)


    జిలేబి

    ReplyDelete


  39. కలలో దస్యుడు మీద దూకె! తృటిలో ఘాతమ్ము తప్పింపగా
    మొలలోఁ గత్తిని దూసి ఱేఁడు పొడిచెన్; మోదంబునన్ దత్సతిన్
    భళిగాచెన్! పతి సేవ గాంచి మురిసెన్ ప్రాణేశ! చుంబించె ని
    ట్టలమై! స్వప్నము వీడె! తూగె కెడ జట్కాబండిలో జాయయే


    హమ్మయ్య! కత ఐపోయింది !



    జిలేబి

    ReplyDelete
  40. మరొక ప్రముఖ ఆర్టిస్టు అస్తమయం.
    శోభా నాయుడి గారి ఆత్మకు సద్గతి ప్రాప్తిరస్తు 🙏.

    ReplyDelete


  41. బాలా! జిలేబి విను! పా
    పాల వలన నెల్ల జనులు పతితు లగుదురే
    మేలగు గోవిందాయని
    కైలాటము చేసి పుణ్యకర్మలు సలుపన్

    జిలేబి

    ReplyDelete

  42. కైలాటమ్మున పుణ్యకర్మలను నిష్కామమ్ముతో సల్పుమా!
    బాలా!తప్పదు సూవె కర్మఫలమౌ! ప్రార్థించు శేషాద్రి వా
    సా! లావింతయు లేదు కావు మనుచున్! సౌశీల్యతన్ పొందు! పా
    పాలే కారణ మెల్లవారికి గుణభ్రష్టత్వముం బొందఁగన్




    జిలేబి

    ReplyDelete


  43. ఇచ్చిన కంద పాదమెక్కడే జిలేబి‌?
    (కష్టమ్ములు దీరెననుచు కన్నీరిడిరే)



    అనఘా! కవివర! చోద్యము
    గ నున్నదే ? యెవ్వరష్టకష్టమ్ములు దీ
    రెననుచుఁ గన్నీ రిడి, రే
    గిన మది కలతలను మరిచి కినుక విడిచిరో?


    శుభోదయం
    జిలేబి

    ReplyDelete


  44. విలేకరి బాలకృష్ణ గారికి‌ అంకితం :)


    కందోత్పల - పాదము కష్టము లెల్లఁ దీరెనని కంటను నీ
    రిడి యేడ్చి రెల్లరున్


    "వడి దాటె కరోన మురువ
    నడ! 'కష్టము లెల్లఁ దీరెనని కంటను నీ
    రిడి యేడ్చి రెల్లరున్!' " భళి
    సడించెను విలేకరి ! తన శైలిని సుదతీ!



    జిలేబి

    ReplyDelete


  45. తండ్రి చోరుడాయె తనయుడాతడిని మిం
    చెను! జిలేబి కొరకు చెంగు మనుచు
    దూకి గోల చేసి దొరికిన వారిపై
    గన్ను నెక్కుపెట్టెఁ గన్నకొడుకు!



    జిలేబి

    ReplyDelete


  46. ఛిన్నాభిన్నము చేసె చట్టుమనుచున్ శీర్షమ్మునే వేగమై
    మున్నాభాయి విచిత్ర మైన ద్రుహుడౌ మూఢత్వశృంగమ్మురో
    రన్నన్నా విను చిన్నపాటి కథయౌ! రాపాడు దార్ఢ్యమ్ముతో
    గన్నున్ గైకొని యెక్కుపెట్టె సుతుఁడే కన్నట్టి యా తండ్రిపై!


    జిలేబి

    ReplyDelete


  47. చదువులను నేర్వ బుచికీ
    సదనమ్మును వీడె చేయ సద్వినియోగ
    మ్మదె సమయమును జిలేబీ
    కుదుటపడగ మది కరోన గొడవలు మానన్ :)


    జిలేబి

    ReplyDelete


  48. వాడు దేశములు తిరిగె బాగు గాను
    సంపదను కూడబెట్టె బసాలు చేయ
    ఖర్చు నీళ్లవలెను జేబు ఖాళి యయ్యె
    చిట్టి! వలసఁ గుబేరుఁడు గట్టె లమ్మె!


    జిలేబి

    ReplyDelete


  49. కందోత్పల యయయో !


    వ్యయమా సతిదయొ నసమ
    న్వయ! సౌరులు దప్పి చిట్టివలసన్ ధనదుం
    డయొ కట్టె లమ్మె! రామ
    య్య!యొకింత విను మయొ! కథ యయయొ కాదయ్యో!


    జిలేబి

    ReplyDelete


  50. చెలికత్తెవకొ అలెక్సా!
    కలికాలమున పరిచారికవకో పిజ్జా
    భళి బర్గరు పాస్తాలన్
    కులుకుచు తేవమ్మ తినుటకు జిలేబీలా!


    జిలేబి

    ReplyDelete
  51. అలెక్సా.. వాట్ ఇజ్ దీ టైమ్ నౌ
    అలేక్సా: నన్ను అడగటం దేనికి.. ఇంట్లో గదికో గడియారం ఉందని స్మార్ట్ హోం యాప్ లో పెట్టి నన్ను అడగటం లో నీ ఉద్దేశ్యం ఏమిటి?

    ఓకే గూగూల్.. ఈ పాట ను ఎక్కడో విన్నట్టు ఉంది.. ఏ సినిమా లోది..?
    అసిస్టంట్: సినిమా చూడవు.. కాని పాట కావల్సి వచ్చిందా.. ఐనా ఎపుడో విన్నానంటున్నావు.. అపుడు నేను లేనుగా.. ఆర్కివ్ లో వెతుకుతా ఓ పదికాలాల పాటు వేచి ఉండు.

    సిరి.. వీటి వల్ల కాదు గాని మనసు తేలిక పరిచే విషయాలు చెప్పవా
    సిరి: నాకు అర్థం కాదు.. మీ మనషులు మధ్య సానిహిత్యం నానాట సన్నగిల్లుతోంది.. మనసు కి ఆహ్లాద పరిచే విషయాలు అంతర్జాలిక లో కన్నా మీ ఇంటి కుటుంబ సభ్యుల నడుమ ఉంటాయి.. మేము మషిన్ లర్నింగ్ లో ఏ పదో శాతం అల్గారిథం తో కాస్త, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ తో మరి కొంత మెరుగ్గా పనిచేస్తాం.. మీ ఫజ్జి లాజిక్ కి సాటి లేదుగా.. మీ కంట్రోల్ యునిట్ తో పోల్చితే ఈ సిలికాన్ చిప్స్ ఏ పాటి..!

    ReplyDelete


  52. ఈ మధ్య వరసగా
    మొలను కత్తి దూయటం,
    గన్నుతో ఢామ్మని కాల్ చేయటం
    చెప్పు దీసి కొట్టటం వచ్చేసేయి.

    రేపేమి వచ్చును ? :)



    మొలను కత్తి దూసి ముందుకు దుముకగ
    చెప్పుఁ దీసి కొట్టెఁ జెల్లి, యపుడు
    గన్ను నెక్కు పెట్టి ఘాట్టిగ నెదురింప
    చెంపశుద్ధిచేసె చెంగు మనుచు :)

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. అబ్బే, ఫిల్మీ చంపుళ్ళ విషయంలో మీరు uptodate గా లేరు, “జిలేబి” గారు.

      పైన మీరు చెప్పినవే పాత పద్ధతులు. పాత సినిమాల్లో హత్య చెయ్యడం అంటే చిన్న కత్తితో పొత్తికడుపులో పొడిచినట్లు, లేదా గన్ తో ఛాతీపై కాల్చినట్లు చూపించి, అక్కడతో వదిలేసేవారు, సాగదీసేవారు కాదు. హత్య జరిగిందని వీక్షకులకు అర్థం అయిపోయేది.

      ఇప్పుడు రకరకాలుగా చంపడం చూపిస్తున్నారు - వారి ఊతపదాలైన “వెరైటీ” కోసమో, “డిఫరెంట్” గా కనబడడం కోసమో, హీరో గారిని “ఎలివేట్” చెయ్యడం కోసమో తెలియదు గానీ - పరమ కిరాతకంగానూ, చిత్రవిచిత్ర ఆయుధాలతోనూ చూపిస్తున్నారు. ఎంత హింసాత్మకంగా చూపిస్తే అంత గొప్ప, హీరోయిజం అని సినిమా వారి అభిప్రాయమేమో మరి?? మచ్చుకు “V” అనే తెలుగు సినిమా చూడండి. అంతటి రోత కలిగించే చంపుడు మార్గాలు నేను ఇదివరలో చూడలేదు.

      అప్-డేట్ అవ్వండి “జిలేబి” గారూ, అప్-డేట్ అవ్వండి.

      Delete


    2. దేశంలో పిజ్జాలూ అలెక్సులూ తెలియని వాళ్లు ఉన్నప్పుడు ఈ మాత్రం చంపు దంపుడులు చాల దంటారా :) వీ టైపు చంపుళ్లు చేస్తే సినిమా అట్టర్ ఫ్లాపు అవదూ ? నాని పాపం విలన్ గా యిరుక్కున్నాడు ప్చ్ :) లవ్లీ లవ్లీ సాంగ్స్ యెక్కడ పోయే ? గెడ్డాలు పించేసి వాడేనా వీడు‌ అని పించేలా బెదిరించేస్తుంటేనూ :)



      జిలేబి

      Delete
    3. “V” సినిమా చూసిన తరువాత నా వరకు నటుడిగా నానీ పట్ల ఉన్న సదభిప్రాయం తుడిచిపెట్టుకుపోయింది. అలాగే దర్శకుడు మోహనకృష్ణ మీద కూడా.

      Delete


  53. కందోత్పల


    అనుకొనుమా నువ్వేమై
    నను, చెప్పును దీసి కొట్టినది చెల్లి తటా
    లున నన్న మెచ్చఁ, గన్ గై
    కొని వాడిని కాల్చి వేసె గోతి జిలేబీ!


    జిలేబి

    ReplyDelete


  54. సెబాసో జిలేబి :)


    అప్పుడు వీధియందు నడయాడెడు వేళ రయమ్ముతోడు కై
    జొప్పుచు ధూర్తుడొక్కడు కుచోపరి చేలను తాక వాడిగా
    కొప్పును పట్టి లాగి భళి క్రుమ్ముచు దుష్టుని భద్రకాళియై
    చెప్పును దీసి కొట్టినది చెల్లి తటాలున నన్న మెచ్చఁగన్!



    జిలేబి

    ReplyDelete


  55. నిలువెత్తెడు గజమాలను
    కలకంఠి! కళింగ! వేయగా నే తాళం
    గలనా! నీహారిక! క
    న్నులకలికీ బహుకరింప నొప్పు విభునికే :)


    వాహ్ వాహ్
    జిలేబీయము

    ReplyDelete


  56. రాముడు మానవుడు గదా
    సామాన్యులకు తెలియంగ సరళము గా శ్రీ
    రాముని తత్త్వమ్ము తెలుపు
    డీ! మా వినతి గమనించుడీ శ్రీ శ్యామా !


    జోజో
    జిలేబి

    ReplyDelete


  57. మామా శకార! రా ర
    మ్మా మమ్ముల కావగా సమస్యకు చెప్పం
    గా మాకు పరిష్కృతినిదె!
    "భీముఁడు రావణుని సుతను పెండిలియాడెన్"


    శకార నీవే దిక్కు :)


    జిలేబి

    ReplyDelete


  58. కందోత్పల

    కలగంటిని ! సరి జేసి కు
    రుల, భీముఁడు రావణాసురుని బిడ్డను బెం
    డిలియాడెఁ బ్రీతిమై! కల
    తొలగెను చక్కటి సమస్య తోచె జిలేబీ !


    జిలేబి

    ReplyDelete


  59. గ్రామము నందు రావణుని గాధను జూచితి నాటకమ్ముగా!
    భీమును చిత్రమొక్కటి రవీంద్ర థియేటరు లోన చూచి వి
    శ్రామము జేయ సంలయము! స్వప్నము సమ్మిళతమ్ము! బాపురే
    భీముఁడు రావణాసురుని బిడ్డను బెండిలియాడెఁ బ్రీతిమై!

    ReplyDelete


  60. నిను చూడక నేనుండగ
    లన యే హరివిల్లు బూయ! లలనా కదలా
    డిన చిరుగాలి చరణపు శృ
    తిని వినిపించె సఖియా మది తొణికెనమ్మీ


    జిలేబీయము :)

    ReplyDelete


  61. అప్పా రామప్పా విన
    వప్పా నేనొప్ప పుట్ట నప్పా మరలా
    చప్పున మోక్షము గావలె
    నప్పా నను గైకొను విడువకనప్పప్పా!


    అప్పజిలేబీయము :)

    జిలేబి

    ReplyDelete


  62. మూడు రకమ్ములు వృద్ధుల
    యో! డమడమలాడెడా వయోడిండిమలున్
    బాడబులై జ్ఞానంపు ని
    రాడంబరులున్ తపోవర ధురంధరులు‌న్!


    జిలేబి

    ReplyDelete


  63. జాయాపతులొకరినొకరు
    హాయిగ ప్రేమించు కొని విహారములకు ప్ర
    హ్వాయముల నిచ్చుకొనుచు ని
    రాయాసపు జీవితమున రాధనము గొనన్!


    జిలేబి

    ReplyDelete


  64. కందగర్భమణిగణనికరము

    ఇందులోని ఛందము-

    ప్రతిపాదమునకు 4 నగణములు ఒక సగణము
    యతి 9 వ అక్షరము



    కలికి యొకతె యలక ములలి బలమున్
    బలె నలిక తలము పయిఁగడలుకొనన్
    గలకల నగియెడు కనుగవతళుకుల్
    తళతళ మెఱయఁగఁదను బలుకుటయున్



    ఈ పద్యంలో కందపద్యం ఇమిడి ఉన్నది

    ఆ కందపద్యము -



    కలికి యొకతె యలక ములలి
    బలమున్ బలె నలిక తలము పయిఁగడలుకొనన్
    గలకల నగియెడు కనుగవ
    తళుకుల్ తళతళ మెఱయఁగఁదను బలుకుటయున్


    From
    http://chitrakavitaprapancham.blogspot.com/2020/10/blog-post_20.html

    చిత్రకవితా ప్రపంచము బ్లాగులోనుండి
    కోతికి చిక్కిన పూమాల :)

    జిలేబి

    ReplyDelete


  65. దూసెద కరవాలమ్మును
    కోసెద శిగపట్టి నరికి; కొరికి కసబిసా
    కూసెద, వచనకవిత్వము
    వ్రాసిన కవివరుని శృంగభంగ మొనర్తున్!


    వచన కవిత్వము మాదన్న వార్ని వేసెద వేటోయ్
    రండి పోట్లాడదాం‌ శంకరాభరణం వేదికగా :)


    నారదా!
    జిలేబి

    ReplyDelete


  66. కందోత్పల

    యూ నో వాణి మా దేవి సుమీ:)



    ముదము వచనమనగ మ్రుద
    మ్రుద! వ్రాసిన సత్కవీశ్వరునిఁ బట్టి యొన
    ర్చెద శృంగభంగమున్! శా
    రద మా దొరసానియగు; సొరగదు వచనమోయ్!


    జిలేబి

    ReplyDelete


  67. దోసిలి యొగ్గి వేడుకొని దుక్కి పదామృత సేవనమ్ముతో
    వాసిగ వ్రాయ శోభిలును భారతి సాచివిలోకితమ్ముగా
    పూసిన పల్కుపువ్వు! మసిపూయుచు పద్యము చౌకబారుగా
    వ్రాసిన సత్కవీశ్వరునిఁ బట్టి యొనర్చెద శృంగభంగమున్!


    జిలేబి

    ReplyDelete


  68. ఔర! చంద్రశేఖరుని మహానగరమి
    దియె సుమీ! వర్షములు ప్రతి దినము కురిసి
    వాగులున్ చెరువులు నిండి వర్ధిలెనిట
    పులులు మేకలు నొకరేవు జలముఁ ద్రాగు!


    అంతా మమేకై పోయింది !

    జిలేబి

    ReplyDelete


  69. తొలివలపు తొందరలు ఉసి
    గొలిపే తెమ్మెరలు పలికి కురిసెడు విరివా
    నలు నీ ఆలాపనల సి
    గలోన పూవులిడనా మృగాక్షి జిలేబీ



    జిలేబి

    ReplyDelete


  70. బాలామంత్రమిదిగొ! కా
    వాలోయ్ ఫీజు విరివిగ ప్రవచనమునకు ! మా
    రేలా లేరీ జనులు బ
    కాళా బాతాయిది ? చెలికాడ! రవి! వినన్


    జిలేబి

    ReplyDelete


  71. హమ్మయ్య!


    కలికాలమ్మున సామరస్యమునుకున్ కారుణ్యమున్ చూపెడీ
    బలమైనట్టి పెనంగనట్టి వెఱగై భాసిల్లు క్షేత్రంబిదే!
    కలయో వైష్ణవ మాయయో తెలియదౌ! కల్యాణ తీర్థమ్ములో
    పులులున్ మేకలు నొక్క రేవున జలమ్ముం ద్రాగు వీక్షింపుమా


    జిలేబి

    ReplyDelete


  72. ఒక సత్కార్యమ్మును చే
    య కలుగు సంకల్పము సఖియ పురాకృతమై
    న కడిమి! మరింత పుణ్యఫ
    ల కర్మ యది కార్య రూపలబ్ధిని గానన్ !


    జిలేబి

    జిలేబి

    ReplyDelete


  73. సర్వంబ్రహ్మమయమ్ము కాని స్థలమున్ స్థాపింప వీలౌనకో?
    నిర్వాణమ్మును సత్యశోధనను మున్నెవ్వారు సాధించిరో
    గర్వంబున్ గొని? బుద్ధి జీవులకు ధిక్కారమ్ములేలన్ సుమా!
    సర్వజ్ఞత్వము గూగు లందఁగలదే శాస్త్రీ విచారించినన్?



    జిలేబి

    ReplyDelete


  74. శివపూజకు చివురించిన
    కవనంపు సిరిసిరిమువ్వ కాంతుల చిందిం
    చి వరించి రావె పయనిం
    చవె నెట్టి తలపుల నావ జ్వలిత కిరణమై


    జిలేబి

    ReplyDelete


  75. ఒక పద్యములోనే నాలుగు పద్యములు !


    విన్నకోట పెద్దన
    కావ్యాలంకార చూడామణిలోని
    సరసిజ వృత్తం పద్యంలోనే నాలుగు పద్యాలు ఉన్నాయి గమనిద్దాం-

    శ్రీవిశ్వేశక్ష్మావరు సేవాశ్రితులు వొగడుదురు సిరివరులగుటకై
    ధీవిద్యా సంభావితదేవున్ ధృతియతు హిత జనదివదినకరున్
    శ్రీవర్ణింతున్ భావనజీవున్ జితరిపుశశికుశిఖరి మృగపతిన్
    భావోదంచద్భావితభావున్ బ్రతిదినసముదిత బహుతర విభవున్
    (కావ్యాలంకార చూడామణి - 6-54)

    ఇది ఒక గమ్మత్తైన వృత్తం ఇందులో రెండు కంపద్యాలున్నాయి
    మొదటిది మొదటి రెండు పాదాలను చదివిన ఒక కందపద్యమవుతుంది
    మూడు నాలుగు పాదాలు చదివిన రెండవ కందపద్యమవుతుంది
    దీనిలోని మరో గమ్మత్తేమిటంటే
    ఈ పద్యంలో రెండు కంద పద్యాలేకాదు
    ఒక నవాక్షర వృత్తం, ఒక మణిగణనికరం ఉన్నాయి.
    మొత్తం నాలుగు పద్యాలను ఇందులో ఇమిడ్చాడు విన్నకోట పెద్దనగారు

    మొదటి కందము-

    శ్రీవిశ్వేశక్ష్మావరు - సేవాశ్రితులు వొగడుదురు సిరివరులగుటకై
    ధీవిద్యా సంభావిత - దేవున్ ధృతియతు హిత జనదివదినకరున్

    శ్రీవిశ్వేశక్ష్మావరు
    సేవాశ్రితులు వొగడుదురు సిరివరులగుటకై
    ధీవిద్యా సంభావిత
    దేవున్ ధృతియతు హిత జనదివదినకరున్

    రెండవ కందము-

    శ్రీవర్ణింతున్ భావన - జీవున్ జితరిపుశశికుశిఖరి మృగపతిన్
    భావోదంచద్భావిత - భావున్ బ్రతిదినసముదిత బహుతర విభవున్

    శ్రీవర్ణింతున్ భావన
    జీవున్ జితరిపుశశికుశిఖరి మృగపతిన్
    భావోదంచద్భావిత
    భావున్ బ్రతిదినసముదిత బహుతర విభవున్


    శ్రీవిశ్వేశక్ష్మావరు సేవాశ్రితులు వొగడుదురు సిరివరులగుటకై
    ధీవిద్యా సంభావితదేవున్ ధృతియతు హిత జనదివదినకరున్
    శ్రీవర్ణింతున్ భావనజీవున్ జితరిపుశశికుశిఖరి మృగపతిన్
    భావోదంచద్భావితభావున్ బ్రతిదినసముదిత బహుతర విభవున్

    ఈ పద్యంలో మొదటి తొమ్మిది అక్షరాలను
    నాలుగు పాదాలలో నుండి తీసి ప్రక్కన వ్రాస్తే
    నవాక్షర వృత్తమవుతుంది.

    పద్యంలో తొమ్మిది అక్షరాలను ప్రతిపాదంనుండి
    తీయగా మిగిలిన పాదాలను ప్రక్కన వ్రాసి చూస్తే
    అది మణిగణనికరమవుతుంది.

    శ్రీవిశ్వేశక్ష్మావరు సేవాశ్రితులు వొగడుదురు సిరివరులగుటకై
    ధీవిద్యా సంభావితదేవున్ ధృతియతు హిత జనదివదినకరున్
    శ్రీవర్ణింతున్ భావనజీవున్ జితరిపుశశికుశిఖరి మృగపతిన్
    భావోదంచద్భావితభావున్ బ్రతిదినసముదిత బహుతర విభవున్

    నవాక్షరవృత్తం-

    శ్రీవిశ్వేశక్ష్మావరు సేవా
    ధీవిద్యా సంభావితదేవున్
    శ్రీవర్ణింతున్ భావనజీవున్
    భావోదంచద్భావితభావున్

    మణిగణనికరము-

    శ్రితులు వొగడుదురు సిరివరులగుటకై
    ధృతియతు హిత జనదివదినకరున్
    జితరిపుశశికుశిఖరి మృగపతిన్
    బ్రతిదినసముదిత బహుతర విభవున్


    Source-


    http://chitrakavitaprapancham.blogspot.com/2020/10/blog-post_22.html

    చిత్రకవితా ప్రపంచం

    కోతి చేతికి చిక్కిన పూమాల :(


    జిలేబి

    ReplyDelete


  76. సరియైన సరసిజ


    శ్రీవిశ్వేశక్ష్మావరు సేవాశ్రితులు వొగడుదురు సిరివరగుటకై
    ధీవిద్యా సంభావితదేవున్ ధృతియతు హితజన దివస దినకరున్
    శ్రీవర్ణింతున్ భావనజీవున్ జితరిపుశశికుల శిఖరి మృగపతిన్
    భావోదంచద్భావితభావున్ బ్రతిదినసముదిత బహుతర విభవున్


    Source- కావ్యాలంకార చూడామణి


    https://archive.org/details/kavyalankarachud020721mbp/page/n79/mode/2up

    ReplyDelete


  77. అమ్మణ్ణీ ఆడినదే
    సుమ్మీ ఆటా! జిలేబి చుట్టినదే ఓ
    లమ్మో పాటా! శ్రీధర!
    కమ్మని దమ్మణ్ణి చేతి గరిటని వంటా :)


    జిలేబి

    ReplyDelete


  78. వినరా వారికిన్ను ఏ వైపూ మూవ్ కాని సేఠు బ్యాంకు స్టాకుకున్నూ అంకితం :)


    నాకంతటి సీనేదం
    డీ కంద జిలేబి గారు? ఢీకొన లేనం
    డీ కావ్యాలంకారము,
    వ్యాకరణములన్ ! రిటైర్డు బ్యాంకరునంతే :)



    జిలేబి

    ReplyDelete


  79. చూపించండీ అయ్యరు
    మీ పీకను నొక్కగాను మించారెడు వం
    టా పైన చేర్చు తంటా
    సాపాటుకు గంటుపడగ చక్కబడు సుమీ :)



    జిలేబి

    ReplyDelete


  80. గరిట తిరగేసిన జిలే
    బి రివ్వున! గరిటను తిప్పు విన్నాణము లే
    దు రవంతైనను! ఆ అ
    య్యరు గారిదె కిచను డ్యూటి యావత్తుగనన్ :)



    జిలేబి

    ReplyDelete


  81. రక్కీసా! బల్ రక్కసి !
    పక్కా వాకుడను మొక్క! భైషజమిది యెం
    చక్కంగ కంటి జబ్బున
    కిక్కడ యుపయోగపడు నొకింత జిలేబీ


    జిలేబి

    ReplyDelete


  82. నాగార్జునా యేంటిది 60+ లో ... సదా యౌవనం :)

    ReplyDelete

  83. మాద్రి రాధ కైక ఆరుద్ర
    దత్తపది అన్యార్థంలో దుర్గా స్తుతి

    నమోస్తుతే !



    హేమాద్రి పుత్రి హేమల
    తే! మా యేకైక భగవతివి నీవే న
    మ్మా! మా ఆరాధనమా
    లామణి! ఆ రుద్రమంగళా! గౌరి! నమో!



    జిలేబి

    ReplyDelete


  84. జింగిలి మింగిలి భాషం
    డంగట లేదండి స్క్రిప్టు దానికి డాండాం !
    చెంగున దొరికిన దాంట్లో
    టంగున వ్రాస్తాము మేము టకటక వినరా !

    జిలేబి

    ReplyDelete


  85. ఆశ నడిపించు మానవు
    డా శక్తి ని జేర్చి పదపడగ నేర్పును సు
    మ్మీ! శీఘ్రముగ కరోనా
    నాశనమై తిరుగవలె జనాళి పనులకున్


    జిలేబి

    ReplyDelete


  86. స్తుతి బాగుందండీ సం
    స్తుతి సంకీర్తన లలితకు శాంకరి కిన్ స
    న్నుతము తిరము పది దినముల
    కు తపమ్మును చేయుచు‌ పలుకుజెలికి రాజా!



    జిలేబి

    ReplyDelete
    Replies
    1. మెచ్చుకోలుకు ప్రతిగ యేమిచ్చుకోను ?
      కరముకుళిత వందన క్రియాంకమ్ము తప్ప ,
      భువనమోహనుసతిని శాంభవిని గొల్చు
      శుభసమయ శుభకరఘన సంస్తుతులు జేసి .

      Delete


    2. వచ్చిరి మేలగు పద్యము
      నిచ్చిరి దీనికి పయిన యునికి కలదేమీ ?
      మెచ్చిరి మీదైన తెరగు
      లచ్చిమి మీకొసగు శుభములను రాజన్నా !


      జిలేబి

      Delete


  87. ఫరవా యిల్లే శ్రీధర!
    చరిత్రలోమరుగుపడెను సంగతులెన్నో!
    మరియొక్కటి పోవంగా
    బరువేమైన నిక కుంటు వడునా తంబీ :)


    జిలేబి

    ReplyDelete


  88. సరియగు జిలేబి ప్రభువు వసతిని తెలుపు
    సాయి భగవంతుఁ డనుట, యసత్యమె కద
    లేదనుట! గల డాతడు లెస్స గాను
    సృష్టి యందు వెలుగగుచు సృజన తెలిపి



    జిలేబి

    ReplyDelete


  89. కందోత్పల ఓ శతకమయ్యిందా ?



    అనుమానించు జనులు మ
    న్నును, సాయిని, దైవమంచనుట సత్యము గా
    దని యండ్రు; సజ్జనుల్ దే
    వుని రూపమ్ముగ తలంచి పూజింతురయా!



    జిలేబి

    ReplyDelete


  90. చక్కటి చిక్కటి అల్లిక
    లెక్కు పొగడదండ వలె జిలేబి భళి భళీ
    మక్కువ మీరగ నచ్చెను
    మిక్కుటముగ మీ కమింటు మీకిదె నెనరుల్!



    జిలేబి

    ReplyDelete


  91. ఈ కాలపు దుందుభి యౌ
    రా కరొనాయనెడు చీని రాకాసి సుమీ !
    యేకంగా దేశమ్ముల
    మూకుమ్మడిగాను తాకె ముద్దుగుడుచుచున్ :)


    జిలేబి

    ReplyDelete


  92. ఇది సినిమాను గురించా !
    పదండి సినిమాల చూసి వత్సరములయెన్
    వదిలితి చాన్నాళపుడే
    కుదరదిపుడు చూడగాను కొత్తగ బిడ్డా!



    జిలేబి

    ReplyDelete


  93. శుభలేఖ రాసుకున్నా
    ప్రభాత వేళ అది నీకు పంపితి నెపుడో
    విభలు విరిసె బుగ్గలలో
    న భామినీ నీలవేణి నవ్వుల లోనన్!


    జిలేబి

    ReplyDelete


  94. నేటి భారతం!

    వారెవ్వా ! ప్రశ్నలు ! లే
    దే రవ్వంతయు సమస్య తెరిపినిడంగా
    తీరగు జవాబులరరే
    భారత రణరంగమందుఁ బార్థుం డోడెన్!



    జిలేబి

    ReplyDelete


  95. నేటి భారతం


    ఆరని మంటలాయె! సమయానికి లేవుపరిష్కృతుల్ సదా
    తీరని కాంక్షలాయె మది తీరుగ నెమ్మది గానదే సఖీ
    వేరుకు బట్టె చీడయు ప్రవిష్టుడు కూలెను శక్తి హీనుడై
    భారత యుద్ధరంగమునఁ బార్థుఁడు పొందెఁ బరాజయమ్మయో!



    జిలేబి

    ReplyDelete


  96. ధర్మం చెయ్ బాబు ! కాణీ ధర్మం చెయ్ బాబు :)



    వినరా విన్నపమిద్ది సు
    జనా! మన ప్రభుత్వ రంగ సంస్థల పైనన్
    కనికరమును ప్రోత్సాహ
    మ్మునుచూపుడు! మీకు పుణ్యము కలుగు నయ్యా!



    జిలేబి

    ReplyDelete


  97. మిసమిస లాడు జిలేబి వ
    రుసగ పదములనరరె కుదురుగ కూర్చంగన్
    పొసగుచు నాటవెలఁది నుదు
    ట సూర్య బింబమమరె మకుటపు కందంబై!



    జిలేబి

    ReplyDelete


  98. కందచంపకము


    మునిమాపువేళ ధుని తట
    మున వెలఁదికి ఫాలభాగమున వేవెలుఁ గొ
    ప్పెను దివ్యకాంతులన్, చు
    వ్వన తాకగ దొంతరల పవనమున్ కురులన్!


    జిలేబి

    ReplyDelete


  99. కవి తలచుకుంటే జరగని దేమైనా వుందా :) ఎన్ జాయ్


    చెలువము మీర చంద్రముఖి చెంగట చేరుచు ముద్దుచేయగా
    తలపుల తెల్ప జాణయు వధానియె సూర్యుని కోరగా వర
    మ్ము, లవటి గాను కాంతుల ప్రమోదము తోడుగ చేర్చగానరే
    వెలఁదికి ఫాలభాగమున వేవెలుఁ గొప్పెను దివ్యకాంతులన్


    జిలేబి

    ReplyDelete


  100. సుడిలోన దూకి యెదురీ
    ది డిగనురుకుల మునకే పదిలముగ సుఖమోయ్
    వడి దూకుటకు ముహూర్తపు
    గడియలివె జిలేబి పెండ్లి కై వేచెనదే :)


    జిలేబి

    ReplyDelete


  101. బాహుబలుల పై బ్లూ చిప్పు ల పై వెటకారమా ?



    వెటకారమా జిలేబీ
    పటుత్వపు ప్రభుత్వరంగ బాహుబలులపై?
    దిటవుగ నిలచిన సంస్థల
    వి టప్పున వలదని తోసి వేయకు వాటిన్



    జిలేబి

    ReplyDelete
    Replies
    1. బ్లూచిప్పల మమకారం
      ఆలూ చిప్పుల వ్యవహారం
      మార్కెట్టుల వెటకారం
      టీ డిప్పుల పటకారం

      Delete
    2. తమకు తాముగా కారం పూసుకుంటే "మమ" కారం
      పొడి కారం తడసి మోపెడైతే వెటకారం
      అల్ట్రా వైయోలెట్ రేస్ సిలికాన్ సబ్‌స్ట్రేట్ ను తాకితే బ్లూ చిప్
      బంగాళ దుంపలను సన్నగ కోసి కారమేసి ఉప్పేసి నైట్రోజెన్ గ్యాస్ పంపి సీల్ చేస్తే ఆలు చిప్స్
      ద్రవ్యోల్బణాన్ని ఎగుడు దిగుడు సూచికలతో ఇన్వెస్టర్లకు ముచెమటలోసారి ముప్పుతిప్పలు మరోసారి ఆనందాతిరేకాలు హర్షధ్వానాలతో ముంచెత్తితే అపుడది నిఫ్టి సెన్సెక్స్ సెన్సేషన్
      డిప్ టీ వ్యాక్స్ కప్ లో పోసుకుని సిప్ చేస్తు తాగితే మైనపు ఛాయల పెషల్ శాయి..

      Delete


  102. రారండోయ్ రారండోయ్ సిన్మా చూద్దారి


    డౌజోన్సగ్గో గోవిం
    దా! జారుడు బండ పైన దబ్బున నిఫ్టీ
    తేజోమయమై దొరలెడు
    బాజారు గతిని జిలేబి పద చూద్దామోయ్ :)


    జిలేబి

    ReplyDelete


  103. దురాశ:)


    దారి తీయు జిలేబి సదా దురాశ
    దుఃఖమునకు బజారున దొరలు రేట్లు
    చూడ గానవకాశము శూన్యమయ్యె
    ననుచు లాభము పోయెగా ననుచు చింతి
    లంగ పైన క్రిందా మాయ లావుగాంచు :)


    జిలేబి

    ReplyDelete


  104. నప్పు సూవె విశ్వ నాథ రామాయణ
    కల్పవృక్ష మునకు ఘనత, గలదె
    నీదు నాదు పద్య నీరాజనములకు
    లేమ, కైపదముల లెక్కకున్ను ?


    జిలేబి

    ReplyDelete


  105. నోరారంగను పద్యముల్ చదువగా నొప్పేయు చూడంగ నౌ
    రా! రామాయణ కల్పవృక్షమునకున్ ప్రఖ్యాతి యేమున్నదో?
    రారా నా వచ నమ్ములోనధికమై రాణింపజేతున్ జనుల్
    హేరాళమ్ముగ నీకథన్ చదువగా హే రామ! సీతాపతే!


    జిలేబి

    ReplyDelete


  106. కావలెను ముక్తి ప్రభు! ఇ
    స్తావా? భక్తి యిదిగో ప్రసాదాలివిగో
    రావయ్య రామ కావం
    గా వరముల నీయుమయ్య ఘనముగ శ్యామా!



    జిలేబి

    ReplyDelete


  107. హరిబాబు గారి కామిం
    ట్ల రువ్వలు జిలేబి తాళుట కుదురనకొ ! భీ
    కర, కరకర బుస పంచద
    శ రాక్షసుల తాటవొలుచు సౌమ్యుడితండే :)


    జిలేబి

    ReplyDelete


  108. ఒక రోజు గొల్లు ఘల్లు మ
    రొక దినమోయి డవుజోన్సు రొప్పుచు రాకే
    టకటక కమింట్ల వేయం
    గ కందపు రమణి జిలేబి కావుమనకికన్ :)



    జిలేబి

    ReplyDelete


  109. కాలము మారెను బిడ్డా
    సేలల భీతహరిణములు చెంగున భళి సిం
    హాలాయె జీన్సు మారెను
    స్త్రీలకు ప్రణమిల్ల ధనము శ్రేయము గల్గున్!



    జిలేబి

    ReplyDelete


  110. కందోత్పల

    వసుధను వశవీడె మహా
    నస! స్త్రీలకు మ్రొక్కినన్ ధనము శ్రేయము గ
    ల్గి సుఖింతు రెల్లరున్ మా
    నసమున సంకోచమేల నసనస లేలా !


    మహా, నస :)


    జిలేబి

    ReplyDelete


  111. కందాటవెలది


    సుదతి విను! మట్టిఁ బోసె మ
    రఁది, మామ మురిసెను, నారు రయ్యన పోసెన్
    కుదురుగ రమణి జిలేబి ! ప
    ది దినముల సమయములోన దిగె పంటయె పో!


    జిలేబి

    ReplyDelete


  112. కందోత్పల


    మయి తనివారంగనరె దొ
    రయు మట్టినిఁ బోసె నా మరఁది మామయు న
    త్తయుఁ గాంచి మెచ్చఁగన్ భా
    ర్యయె నారును నాటె పంట రయ్యన వచ్చెన్


    జిలేబి

    ReplyDelete


  113. త్రాగుడు మొదలెట్టాకం
    డీ గుట్టుగ తాగెదరకొ? డిగనురుకక రె
    డ్డీ గట్లా వీకెండుల
    కై గడియారమును చూచి కైకట్టుదురో?



    జిలేబి

    ReplyDelete


  114. ఓ రిలయెన్సూ దూకితి
    వే రయ్యన క్రిందకు యిక వెళ్లద వీవెం
    తా? రా రహస్యము తెలపు
    తారాజువ్వా జిలేబి తన్నుకు పోతా :)


    జిలేబి

    ReplyDelete


  115. నీ నడక కరోనా మే
    లై నిలదొక్కుకొనెనకొ భళా తాతకు చె
    ప్మా! నీడను చూచి భయము
    తో నడకల కూడ చేయ తోసెనట సుమీ :)


    నారదా వింటున్నావా :)


    జిలేబి

    ReplyDelete


  116. స్ఫూర్తి శ్యామల రాయల వారి‌ బ్లాగ్కామింటు



    నేటి మగువల మదిదోచి నెమ్మి జేర్చు
    హేలొవీను పండగలేను హేల హేల
    నతివ లెల్లరు రోసెద రట్లతదియ
    మారె కాలము వినవె బామ్మా జిలేబి!



    జిలేబి

    ReplyDelete


  117. హెలొవీను చేష్ట లనెడు వె
    తల నతివలు మెచ్చ రట్లతదియన్ మగవా
    రల పండుగందు రే ఓ
    జిలేబి కాలమ్ము మారె జీన్సులమరగా!



    జిలేబి

    ReplyDelete
    Replies
    1. “మగవారల పండుగ” అంటారేమిటి, జిలేబి” గారూ 😡?

      అట్లతద్ది గురించి శ్యామలరావు గారు చెప్పినది నిజం. మన పండగలు, వాటి విశిష్టత గురించి తెలుసుకునే ప్రయత్నమైనా చెయ్యరు గానీ పాశ్చాత్యుల సంబరాలు మాత్రం బాగా నచ్చుతాయి ఈ తరం వారికి - క్ర్రైస్తవేతరులకు కూడా.

      క్రిస్టియన్ల All Saints’ Day (Nov 01) కు ముందరి రోజును Halloween (Oct 31) పండగగా చేసుకుంటారని Encyclopaedia Britannica చెబుతోంది (క్రింది లింక్ చూడండి 👇). మరి భారతీయులకేమిటి సంబంధం ? ఏమిటి అంటే ఇటీవలే దీన్ని మన దేశానికి తీసుకొచ్చి పెట్టింది కార్పొ”రెట్ట” వ్యాపారులు .... ధారాళంగా వ్యాపారం చేసుకుని తమ డబ్బు సంపాదనను ఇబ్బడిముబ్బడిగా పెంచుకోవడం కోసం ఏమీ సంబంధం లేని దేశాల ప్రజలకు కూడా వేలంవెర్రి ఎక్కించారు ఒక పధకం ప్రకారం. ఆ వ్యాపారమాయలో పడి కొట్టుకుపోతున్నారు జనాలు. వ్యాపారాలకు లాభం చేకూర్చేలా ప్రతిదీ ఒక event లాగా సెలబ్రేట్ చేసుకోవడమనే పిచ్చి బాగా ఎక్కింది / ముదిరింది. షాపింగులు, పార్టీలు ఉంటే చాలు. ఇంక తెల్లవారు ఝామున లేచి అట్లతద్ది చేసుకోవడం లాంటివి ఏం నచ్చుతాయి? వ్యాపారుల సాంస్కృతిక ఆక్రమణ ఒకసారి మొదలైందంటే ఆగడం కష్టం, దాని వలన సాంప్రదాయ పద్ధతులు ఆనవాళ్ళు లేకుండా పోతున్నాయి.

      https://www.britannica.com/topic/Halloween

      Delete


  118. తమతమ అలవాట్లకు పొస
    గు మాదిరి జిలేబి బువ్వ గొనవలె సుమ్మీ
    క్షమత వలయు నితరుల కబ
    ళముగై కొనుకైపు పట్ల లావణ్యవతీ !



    జిలేబి

    ReplyDelete


  119. అమరదనుకొనకు కవులె
    ల్ల మనకు గురువులె కద మరల మరల నా వృ
    త్తమువలె చెప్పెదరిక విష
    యము పునరావృత్తముగ చయమున జిలేబీ !



    జిలేబి
    గుండు సున్న :)

    ReplyDelete

  120. కందా చంప్స్ :)

    ఇల పూచిన పువ్వులు కొ
    మ్మలకు కవులు! వారలెల్ల మనకున్ గురుదే
    వులె పూజ్యులే కదా కో
    మల మృదుపల్లవపు బాస మ్రానుగనమరన్


    చైంచిక్
    జాల్రా
    జిలేబి

    ReplyDelete


  121. ఎంత శ్రవణానందమో కదా!


    జవరాలొకతె జిలేబి త
    నివారగా పాడగా పనిని వదిలి భళా
    రె వరుసగా జత గలుపుచు
    శ్రవణానందముగ ఖరము రాగముఁ దీసెన్!


    జిలేబి

    ReplyDelete
    Replies
    1. ఖరరాగమనోల్లసనా
      వరపండితులున్నచోట వలదు చరించన్
      అరమరలెరుగక తందురు
      గరగర వా రెనుక కాళ్ళ ఖరములు గనకన్ .

      Delete


    2. ఖరముల తో యేగితి నా
      డు రయ్యనగ పద్యముల్ కడుంగడు వేగం
      బురుకగ! జిలేబి వలదే
      నరకమ్మది విడువవమ్మ నమ్మవె సుదతీ :)

      Delete
    3. ఖరములతో వేగితి నా
      డరయక , వేగిరమ బుధ్ధియరుదెంచెను , సు
      స్థిరమతినై వీడితి ,నా
      కరములు కంటిన బురద వికావికయయ్యెన్ .

      Delete


  122. అవిరామంబుగ శంకరాభరణమందాశ్చర్యమున్ గొల్పుచున్
    కవనంబందుకొనన్ జిలేబి విధిగా కందమ్ము మాకందమై,
    జవరా లొక్కతె పాటనందుకొనగా శ్రావ్యమ్ముగా జోడిగా
    శ్రవణానందముగా ఖరమ్ము సభలో రాగమ్ముఁ దీసెన్ సఖా!


    జిలేబీయము

    ReplyDelete


  123. First ever international virtual satavadhanam by Medasani Mohan


    Live on going

    https://youtu.be/hU_J36pVN8k


    జిలేబి

    ReplyDelete


  124. పత్తర్ఘట్టికి బలె ఓ
    అత్తా మారిన మనుజులు మారెదరకొ ? నీ
    గిత్తెద్దుల పరుగులనరె
    వృత్తమ్ము వలె తిరిగెడు ప్రవృత్తి విడువలే ?


    జిలేబి

    ReplyDelete


  125. అనుభవముల దొంతర నా
    యునికి కిది నిదర్శనము వయోవృద్ధుని పా
    వనవేదిక అద్భుతమీ
    వనమ్ము చదువరుల ఐపి వ్రాలును వడిలో :)



    నారదా!

    జిలేబి

    ReplyDelete


  126. మీరిపుడు పాడరే మన
    శ్రీ రాముని కీర్తనలను చిత్తమలర సిం
    గారించి ధరణిజకు నుప
    చారమ్ముల చేసి బత్తి చాటుకొనంగన్

    ReplyDelete


  127. పరిహాసమ్మా జై గొ
    ట్టి రామదాసుని పయిని ? ఘటికుడననుచు వీ
    గిరొ విర్ర ?చెంప పెట్టుడు
    సరి మీ కిదె వేగిరమ్ము సవరించుకొనన్

    ReplyDelete


  128. వీధు లన్నియు శుభ్రము వింత గాదు
    శుచిని పాటింతురు జనులు శోభలమర
    తాతగారి ఫోటోలివి తరచి చూడు
    పల్లె లో "నొక" వీధి ప్రభలు జిలేబి !


    జిలేబి

    ReplyDelete


  129. గాడీ చల్తీ హై సాబ్
    బాడబుడ ఢకేల్న నాకవసరము లేదం
    డీ!డాబగు దృశ్యమ్ముల్
    నేడాయెను రాతలున్ను నెమ్మిని చూపన్!


    జిలేబి

    ReplyDelete


  130. టైగరభీభీ జిందా
    హై! గర్మా గరముగాను హైలెస్సా లె
    స్సా! గాఢీ చల్తీ హై
    బాగానే ఫిర్తి హై సెబాసొ జిలేబీ :)


    జిలేబి

    ReplyDelete


  131. మూకీ యైనను పల్కెడు
    టాకీ యైనను మనకు పటమగుపడవలెన్
    మాకందముగా టేక్ కేర్
    శ్రీకష్టేఫలి విదుర మరింతగ మిమ్మున్


    జిలేబి

    ReplyDelete
    Replies
    1. विदुर निती, नारद सूक्ति, कृष्ण युक्ति कभी कतराये नहीं

      Delete


  132. తప్పులు పడిపోతున్నా
    యప్పా ! మరుపొచ్చెను రిటయరు కావలె నే
    నప్పా బ్లాగుల్లోనుం
    డిప్పటి కైననిక వడివడి డిగనురుకకన్!

    జిలేబి

    ReplyDelete


  133. అరవై కే ముస లియనుచు
    మరీ భయమకో తవరికి ? మరి దిష్టియు మీ
    కు రయముగ తగులునని రా
    మ రామ దిగులకొ తెలుపుడి మాన్యుడ విదురా!


    నారదీయము :)

    జిలేబి

    ReplyDelete


  134. నా పుట్టిన రోజు హితుని
    టాపగు హుందాయిలో పటాటోపపు ఫో
    టో పట్టుగ తీసితి వడి
    గా పెట్టితి బ్లాగులోన కామింట్లిడగా!



    జిలేబి

    ReplyDelete


  135. వచ్చేస్తోందండోయ్ నా
    కొచ్చేసె మతిమరుపేను గుర్తుకు రాకన్
    వచ్చెను కష్టాల్ విధిగా
    తెచ్చెను నష్టాల్ సమస్య తీవ్రంబాయెన్


    జిలేబి

    ReplyDelete


  136. బూజుల్బట్టె వ్యవస్థయె
    వాజమ్మల వలె జనాళి వ్యవహారమ్ముల్
    మేజోళ్లను విసిరెనతడు
    గాజులు గల్లనఁగ, నరుఁడు గాండివ మెత్తెన్!





    జిలేబి

    ReplyDelete


  137. వ్యధపెట్టు వ్యవస్థ యొక వ
    నధి! గాజులు గల్లుగల్లనఁగ గాండివమె
    త్తె ధనంజయుండనిన్ చే
    రి ధర్మము ధరణిని నిలువరింప జిలేబీ !


    జిలేబి

    ReplyDelete


  138. మన పూర్వీకుల వివరా
    లనఘా తెలియంగ దేలు లావణ్యవతీ
    మన మదియు గాలి లో వం
    దనమ్ములను చేయ నాతృతపడు జిలేబీ!


    జిలేబి

    ReplyDelete


  139. మమ్మేలు రాముడా నిను
    నమ్మిన వారలము నీదు నామమ్మె సదా
    యిమ్ముగ జపమ్ము చేయుచు
    నెమ్మి మరువక గొలిచితిమి నిను దాశరథీ !


    జిలేబి

    ReplyDelete


  140. మీ వంటి పెద్దల కృప యె
    తావిని జేర్చు బతుకున ప్రధానముగా తా
    తా! వందనమ్ము లివియే
    ఓ విదురా నెనరులయ్యరో శర్మాజీ !


    చైంచిక్
    జాల్రా
    జిలేబి

    ReplyDelete


  141. కామింటడమే మన విన
    రా మాత్యుల తెలుగుతల్లి రాధనమొందం
    గా మరిమరి చేసెడు సే
    వై మన్నిక గాంచెను భళి బ్లాగ్లోకములో!


    జిలేబి

    ReplyDelete
    Replies
    1. కామెంట్లు కొంచెం ఎక్కువవుతున్నాయా? తెలుగుతల్లికి నా "ఆరాధన సాధన" ఇదేనండి 🙏.

      Delete


  142. తెలుగు తల్లికి నాప్రణతి! భళి మేలు
    గాను నారాధనయిదె కవనము వోలె
    సాధనయొదె జిలేబి వసార యయ్యె
    మాలికయె మాకు వినవమ్మ మాన్యురాల!


    జిలేబి

    ReplyDelete
  143. వ్యాఖ్య రాయువారు పాండిత్యతాప్రభా
    భాసురవిభవులు మహా సుమతులు
    రచన సేయువారు రాజిత నవనవో
    న్మేష శాలినీ ప్రణీత మతులు 🙏 .

    ReplyDelete
  144. వ్యాఖ్య రాయువారు పాండిత్యతాప్రభా
    భాసురవిభవులు మహా సుమతులు
    రచన సేయువారు రాజిత నవనవో
    న్మేష శాలినీ ప్రణీత మతులు 🙏 .

    ReplyDelete


  145. కామెంట్లు కొంచె మెక్కువ
    గా మీ కనిపించెనా? నిఖార్సైనది సు
    మ్మీ మా వ్యాఖ్యల బలిమియు
    మేమిచ్చెడు ప్రోద్బలమ్ము మీదు జిలేబుల్ :)


    ఫ్రై డే :)
    జిలేబి

    ReplyDelete
    Replies
    1. గీ దినం ఏం ఫ్రై జేసిండ్రు బిజిలే అమ్మణ్..
      కందములను దెచ్చి అక్షర చంపక మాలగా చుడితిరా
      ఇది నేనెపుడు చేసేదేగా అబ్బాయా అంటారా
      తేనే పట్టు లా తేట గీతి తో పద ప్రవాహానికి ఆనకట్ట వేస్తిరా
      ఇది అందరిఖి తెలిసిందే కదా అబ్బాయి అందురా..
      హెపి షెటల్ దాయి బిజిలే అమ్మణ్ స్పోర్తి వికెంద్

      ~
      శ్రీధర
      ధర శ్రీ
      హర్ష వర్ధన్
      ధరణి హర్షిత శ్రీహరి

      Delete


  146. వారిరువురొకరినొక రవాకులన్ చ
    వాకులన్ తిట్టుకొనుచు గప్పాలు కొట్టు
    కొనుచు వేదము లన్నిటి కొమ్ములరగ
    దీసి పందిరేయుదురు ప్రతిదినమౌర!


    రెండు కోతుల కిచకిచలు:)

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. ఆ.వె। వారిమధ్యకెవరు దూరిన నవ్వారి
      పరువుగూడ పోవు వారిరువురు
      నగ్గిరవ్వ లగుట నటులేగి మంటల
      కగ్గమగుట యుచిత కార్యమగునె

      Delete


  147. రబ్బరు బొమ్మగ రోబో
    గుబ్బెత తో మదనకేళి క్లోన్డ్ జన రేషన్
    పబ్బాల్గడుపుకొనేస్తూ
    మబ్బుల్లో దేలెదమ్ము మా ప్రగతి యిదే!


    జిలేబి

    ReplyDelete


  148. మనుజుడ! యేసును నమ్ముము!
    మనుగడకు వలయు మనికియు మహితహితముగా
    కనికరము రక్ష కుండు గొ
    నెను, ప్రాణమ్ములను వాడు నేర్పుగ గాచెన్!


    ఆమెన్
    జిలేబి

    ReplyDelete


  149. కందోత్పల

    బెదురుచు హరిణియె కావలి
    కద రక్షకుఁడంచుఁ జేరఁగనె ప్రాణము దీ
    సె దయావిదూరుఁడై మా
    రె దేశమున ధర్మమెల్ల రెవటలు నలిగెన్!


    జిలేబి

    ReplyDelete


  150. రారా నా రోబో నీ
    వేరా సరసమ్ములకిదె వేళాయెను! రా
    నేరాదు జరామరణము
    లేరాళమ్మగు ప్రియమ్ము లెస్సగ నీపై


    జిలేబి

    ReplyDelete


  151. ఆధారపడితిమి ప్రకృతి
    పై ధారగ కురియ దయయు, పైపెచ్చు సదా
    స్వాధీనములో కలమ
    మ్మా ధాత్రిని నమ్మి మేము మము కరుణింపన్!

    జిలేబి

    ReplyDelete


  152. శ్రీరామా ఈ మాంసం
    బౌరా యెంతరుచియో ! సెబాసోయనరా
    మారాముజేసె పో బా
    జారున ముక్కల జరుపుచు జైగొట్టి సుమీ :)



    జిలేబి

    ReplyDelete


  153. హోమమ్మిదిగో షెర్లా
    క్స్హోమమ్మదిగో తలమ్ము కోవిదుల టపా
    యే మాచన వఝ్ఝుల బ్లా
    గే! మాత జిలేబి చూడు గేమ్ బోర్డదిగో !


    జిలేబి

    ReplyDelete


  154. రామ రామ జనాళి వినదే :)


    ఇది కందపద్య మేనా ?
    గుదిగుచ్చె పదముల వరుసకు గణములనుచున్
    సదనములో చెత్తను తా
    నదనము గా చేర్చె రామ నా గోడిది రా!


    నారదీయము
    జిలేబి

    ReplyDelete
    Replies
    1. ఇది కందపద్య మేనా ?
      సదయా ! డౌటేల ? అన్ని సరిపోయెగదే !
      ముదమొలుకలేదు , సరి ! ఆ
      ముదమును కాస్తంత రాయి మోదము గల్గున్ .

      Delete
    2. ఇది కందపద్య మేనా ?
      సదయా ! డౌటేల ? అన్ని సరిపోయెగదే !
      ముదమొలుకలేదు , సరి ! ఆ
      ముదమును కాస్తంత రాయి మోదము గల్గున్ .

      Delete

    3. అదిరెను రిటార్టు రాజా
      కుదురను తిక్క నయవారు కుదుటబడుదురం
      డి దిగులు మరిచి నిదురపో
      వుదురిక శతకమ్ము మనము పూరింతుమికన్ :)


      నారదా
      జిలేబి


      జిలేబి

      Delete
    4. ఆదిత్యుం డిటురాకమున్నె , నదిలో నభ్యంగనస్నాన సం
      ధ్యాదుల్ జేసి , విధిప్రకారమున , భక్త్యారాధనాచేతసా
      మోదాసక్తి , జలాభిషేకములతో పూజింతు విశ్వేశ ! రా
      రాదా నర్మదబాణలింగ ! ననుజేరన్ సత్యధర్మేశ్వరా !

      Delete


  155. పంపితి వారికి పద్యము
    నంపితి వేయరె జిలేబి నా మాటినరే !
    సొంపగు శతకములెవ్వీ ?
    గుంపుగ దింపిరి వరుసగ కుకవిత్వములన్ :)


    జిలేబి

    ReplyDelete


  156. దుక్కిని దున్నిన దెవరో
    చక్కగ నారమ్ము చేర్చి ససిపండింపన్
    మిక్కిలి నలత యెవరిదో
    మెక్కితి వయ్యరు జొనుపగ మెతుకుల వాయిన్!

    టెక్కీ వై పద్యముల చ
    టుక్కు‌న నల్లుచు నిటులనటుల తిరిగితివెం
    చక్కా నీకేమి తెలుసు
    నక్కా కష్టేఫలుల తనకలి జిలేబీ !


    జిలేబి

    ReplyDelete


  157. ఇది కూడా నాకంతగ
    మదినిండగ లేని పద్యమాయె జిలేబీ
    పద పొద్దుట తీసేస్తా
    సొద కామింటిది కను నలుసు ములు పదములో! :)


    నారదా

    జిలేబి

    ReplyDelete


  158. భద్రంబైనది వినుమా !
    ఛిద్రంబవనీకు మదిని జియ్యకు సరియౌ
    తద్రూపపు యోగమ్మున
    నిద్రాసక్తుండవైన నీకు జయమ్మౌ!



    జిలేబి

    ReplyDelete