Friday, October 11, 2024

టాటా జనుల మది నిండుగా నీవె సుమా !

 

టాటా అనుట సులభమా

బాటయు బాసటయు నీవు ప్రజల ప్రగతికిన్

మేటి గమికాడవు! రతను

టాటా! జనుల మది నిండు గా నీవె సుమా


జిలేబి



201 comments:

  1. -

    పశ్యామి! పాహి దుర్గే!
    దృశ్యాదృశ్యపు వివేక దృంహిత వైరా
    గ్యస్యాది సాధనకు స
    స్యశ్యామల సంపదలకు శాంకరి ప్రణతుల్


    ReplyDelete
  2. -

    ఏది విదేశమేది ? ఏది దేశమేది :)

    చాలా హాశ్చర్యమయెన్
    మీలో "బా" వుకత యెంత మించారె! విదే
    శాల నివసించినను వే
    షాలేయక మరువ లేదు సంస్కృతిని సుమీ!




    ReplyDelete
  3. రామచంద్రుని బాణము , రాజసమున
    వెలిగి , చెడుపయి మ్రోగించె విజయ భేరి ,
    గాన , విజయదశమి నేడు , కాంక్షదీర
    ఘన శుభాకాంక్ష లందింతు , కరము 🙏 మోడ్చి .

    ReplyDelete
  4. -

    చాన్స్ దొరికితే చాలు :)

    భండారువారి నెంబరు
    తిండాడగ దొరికె ! కాలు చేయుడి! ఫారి
    న్నుండి తిరిగి వచ్చిరి గా
    దండిగ కాహళపు గుడ్లు దట్టింపదగున్ :

    ReplyDelete
  5. -
    యేసు గలడెల్ల చదువుల
    యేసు గలడు భూతనాధునిగ నలినజుడై
    యేసు గలడు మన ప్రభునిగ
    యేసుని ప్రార్థింప దక్కు నే హలె లూయా!


    ReplyDelete
  6. -
    పెద్దలు వినరా ? వారికి
    సుద్దుల నేర్పంగ మనకు సులభతరమ్మా ?
    తద్దయు బండి టకుటకుల
    నిద్దుర పట్టునకొ మనకు నీరజనేత్రా !

    ReplyDelete
    Replies
    1. మునగచెట్టు, మునగచెట్టు 😳

      Delete
    2. సుద్దులు నేర్పంగ జనిన
      తద్దయు వినువారె తమరు ? తంటా మీతో ,
      హద్దులు లేవాయె తమకు ,
      యెద్దేవా సేయు టొకటె యెరుగుదురు , కదే !

      Delete
  7. -
    హా! మందు పాటలయొ లే
    వే! మగువల మదిని విరహ వేదనలయొ లే
    వే! మా బండిదొర! యెచట?
    వేమార్లు పిలువను రారె! వినరా! తెలుపన్


    ReplyDelete
  8. వలదయ్య వ్యావహారిక
    ములు గ్రాంధికమె తగు పద్యములకున్ లక్కా
    కుల రాజన్నా! గురువ
    ర్యుల మాటలు వినవలె నెపుడున్ ఖ్యాతి గనన్


    ReplyDelete
  9. గురువర్యు లెవరు మనకున్ ?
    గురువులకే గురువు శాస్త్రి , గూబలు వగులున్ ,
    గురువీ ' రాజా ' , తక్కొరు
    గురువంటిర , వాడు గుడ్లగూబ గదన్నా !

    ReplyDelete
  10. -
    ఎవరా గురువులు ? ననుమిం
    చు వరేణ్యులెవరు ? తెలిపినచో గూబల్వా
    యు వరకు వాయించెద; నే
    నెవరన్ ? నెల్లూరు రాజు నే పువుబోడీ !


    ReplyDelete
  11. వి లే క రి / వి లే ఖరి అంటే ఏమనుకున్నావోయ్ ?
    తస్మాత్ జాగ్రత్త !

    అతి వర్జయేతని జిలే
    బి తెలివిడిగొనవె విలేకరి తలచినచొ నీ
    దు తలయెగురు ! మంచిగ ఉం
    డు తిక్క పనులువలదు చెడుగుడులాడకుమా


    ReplyDelete
  12. -

    పనిలేని జిలేబి యొకతె
    పనిగట్టుకు పద్యములను వ్రాయన్ గురువుల్
    కనికరము జూపి సరె నే
    ర్వని సభలో తలము నిచ్చి రన్నా రాజా!

    ReplyDelete
  13. గురువులకు పంగ నామా
    లరయంగా బెట్టువారె , అచ్చపు శిష్యుల్ ,
    తిరుపతి కెళ్ళక , ఇంటనె
    గొరిగి మరీ , నామ మెట్టు , గొప్పగ విబుధా !

    ReplyDelete
  14. -

    ప్రభొ! తమకు తెలియని విషయ
    ము, బుంగ నామమ్ముల విధములు గలవా రా
    జ! బుడిబుడి మేమెరుగుట త
    డబడి తడబడి పదముల గెడన్ జేర్చుటయే

    ReplyDelete
  15. ఏముంది , తెలుగు పద్యము
    గ్రామీణ పదాల తోడ గ్రాలగ వలయున్ ,
    నామాల వాళ్ళ శష భిష
    లేమాత్రము లెక్క సేయ నేల వయస్యా ?


    ReplyDelete
  16. -

    మీరెటుల బల్కగ నదియె
    సారూ సరి యగు గురువులు చల్లని రావుల్
    మీరు! యతి, ప్రాసల హొయలు
    నేరుపు తెలిసి‌న విదురులు నెవ్వడి తోడై

    ReplyDelete
  17. వృత్తి రీత్య దప్ప - గురువు , విదురు డవను ,
    నన్ను తమనుండి వేరుగా సన్నుతించ
    వలదు వలదన్న శషభిషల వారితోడ ,
    వారి స్థానాల నెన్నడూ వదులు కోరు .

    ReplyDelete
  18. -

    కాను విదురుడ జిలేబీ
    మౌన గురువునంతయే సుమా శషభిషలా
    స్థా‌నపు వారిది ! తెలివిడి
    లే నా కటువంటివి! వదిలెయ్యవె సుమతీ!


    ReplyDelete
  19. -
    అప్పడాలు బడాయి పోవడము తాత
    మాట చెల్లక పోవడ మన్న ది మన
    కెల్ల తెలిసిన విషయమె కించుక వడి
    యాల విషయమె సమఝౌలె హంసయాన :)


    ReplyDelete
  20. తమకే దిష్టము ? విబుధా !
    ఘుమ ఘుమలగు అప్పడాల ? గుయ్యను కఱ్ఱా ?
    చిమ చిమ వడియాలా ? ఆ
    చిమ చిమలను వేపు కాడ ? చిఱ్ఱెత్తిందా ?

    ReplyDelete
  21. -
    విబుధా! ఇష్టంబేదీ ?
    పెబువులు మీకు తెలియనివి వేరుగలద రా
    జ! భవాంబుధి దాటన్ ధ
    ర్మభాగినికొక పతి పతికి రమణి యొకతయున్


    ReplyDelete
    Replies
    1. అప్పడాలకఱ్ఱ అతివయై వర్థిల్ల ,
      బొప్పిగట్టు మగని బోడిగుండు ,
      ధర్మపత్ని గిత్ని ధరణిలో తగదండి ,
      పరగ నోటి యదుపె పతికి రక్ష .

      Delete
    2. జీవిత సత్యం బాగుంది. కొంచెం భయం ఉండాలి .

      Delete
  22. -
    ఊహల ఊయల లో ఓ
    హోహో తిరుగాడగా సహోదరులారా
    బాహత్తరి మోబైలను
    మాహేంద్రపుజాలమున సమాధియె సుమ్మీ


    ReplyDelete
  23. -

    కనిపించె నంతటయు గల
    డనువాడు నిమేషము! గలడని నమ్ము క్షణ
    మ్మున మాయమయ్యెను మరల
    కనిపించు నెదుట ? తెలివిడి గలవారెవరో!



    ReplyDelete
  24. -
    బానిసలయ్యిరి ఫోనుకు
    మేనుమరిచి మీడియా సమేతము సోషల్
    గానిదు రోయిరి జనులయొ!
    పైనూరిరి మేటరు వడి వరుస జిలేబీల్


    ReplyDelete
  25. సారూ ! ఉన్నారా ? , ఆ
    సారుల చర్చకు - మెకాలె చర్చకు - అయ్యో ?
    మీ రెళ్ళంగా బోవరు ,
    వేరేదో ' హింసా వినోద ' వీక్షణ ముందా ?

    ReplyDelete
  26. ఏ పాదములను సేవించ నిశ్చింతగా
    జనుల జీవితములు సాగిపోవు
    ఏ పాదముల్ యిల కేడుగడయయి ధ
    ర్మమ్ము నిల్ప నవతారము ధరించె
    ఏ పాదముల స్పర్శ ఈ భరతావనిన్
    పరమ పావనగాగ విరియ జేసె
    ఏ పాద ధూళికై యిలను పెక్కేడులు
    నిరతము మునులు ధ్యానించి పొంది

    రట్టి పరమాత్మ పాదము లందు , పూని
    మనసు నిల్పితి , కననయ్యె కనుల యెదుట
    కృష్ణ పరబ్రహ్మ , గోపికా బృంద సహిత
    రాస కేళీ వినోద విలాసనముల .

    ReplyDelete
  27. ఉన్నావా? అసలున్నావా?
    ఉంటే కళ్ళు మూసుకున్నావా?

    ReplyDelete
  28. Happy deepavali. ఎటుపోయావూ?

    ReplyDelete
  29. ఈ వరూధిని యెటువోయె ? యేలనో మ
    వునము వహియించె ! , మిత్రమా ! ఉన్న
    పలము రమ్ము , మీబ్లాగు దీపాల మయము
    సేయగా , శుభాకాంక్షలు , శ్రీలు - మీకు .

    ReplyDelete
    Replies
    1. :)

      ఎటువోయెనో వరూధిని!
      చటుక్కునన్ కానరాదె! చరవాణియు లే
      దెటులకనుగొనుట! అయ్యో!
      గుటుక్కునన్ మ్రింగెనో కరోనా మరలన్ :)


      Delete
    2. వచ్చేషారా హితుడా !
      నిచ్చలు మిము గురిచి తలచి నేస్తాలంతా
      ముచ్చెమటలు వోసి తడిసి
      చచ్చీ చెడి మదన పడిరి , సరి సరి ! శుభముల్ .

      Delete
    3. ZilebiNov 4, 2024, 1:10:00 PM
      నువు చెప్పేది నమ్మబుల్ గా లేదు. సెల్ లేదంటే నమ్మేదెలా? మీ ఊళ్ళో కరోనా ఉంది జాగర్తా అని చెప్పెను, విన్నావా? ఎందుకు వింటావు? వినవు. వింటే నువు జిలేబి ఎట్టవుతవు? మా ఊళ్ళో వేక్సిన్ వేయించుకో అంటే నఖ్రాలు పోయావు, ప్రాణం మీదకి తెచ్చుకున్నావు,మళ్ళీ చచ్చి బతికేవు, మళ్ళీ చెబుతున్నా ఆరోగ్యమే మహా భాగ్యము. నువ్వు సంపాదించే డాలర్లు నిన్ను రక్షించవు,కాదు రక్షించలేవు. చైనా చైనా అన్నవుగా నమ్మకూడని వారిని ఎప్పుడూ నమ్మకూడదు. దీని గురించి భారతం లో కర ఉందిలే! చదువుకో బెడ్ మీద పడుకుని. సత్వర ఆరోగ్య ప్రాప్తిరస్తు. దీర్ఘాయుష్మస్తు.

      Delete
  30. మధ్య మధ్యలో విరామం తీసుకోవడం వారికి మామూలేగా. ఏమైనా వాకబు చేద్దామంటే తన నిజనామధేయం కూడా మనకు చెప్పరు. అంతే, తిరిగి సాక్షాత్కరించేటంత వరకు మనం వేచి చూడడమే.

    ReplyDelete
  31. // “Happy deepavali. ఎటుపోయావూ?” //
    (శర్మ గారు)
    ——————
    // “ఈ వరూధిని యెటువోయె?” //
    (రాజారావు మాస్టారు)
    =================
    “జిలేబి” గారిని విమర్శిస్తూనే ఉంటారు, నాలుగు రోజులు కనబడకపోయేసరికి బెంగేట్టుసుకున్నారు, చూ”షా”రా మరి.

    ReplyDelete
    Replies
    1. సారూ!
      ఏమనుకున్నా ఎన్ననుకున్నా జిలేబితో ఉన్న పరిచయం/అనుబంధం/దెబ్బలాట/ప్రతీకారం/యుద్ధం నేటివి కావండి. అందుచేత వెతకడం సహజం. బ్లాగు గొళ్ళెం పెడుతుంది,సాధారణంగా,ఈ సారి ఇంకా పెట్టలేదు,తలుపులు తీసుంచింది. గొళ్ళెం పెట్టడం తలుపులేయడం తరవాత చేసే పనులనుకోండి.
      నాకు చిరాకొచ్చే రాయడం మానేసాను. ఒక్క సారి కనపడకపోయేటప్పటికి తేడా వచ్చి వాకబులు మొదలయ్యాయి. ఆహా( ఇది కూడనిది, ఎప్పుడో ఒకప్పుడు ఎంతో కొంత కనపడుతూ ఉండాలి,ఇది తప్పనిసరైపోయిందని ఙానోదయమయింది. అప్పటినుంచి వారానికో పదిరోజులకో ఒక టపా ఏదో గిలుకుతున్నా! ఇప్పటిదాకా జిలేబి ఇదే పని చేసింది. కనపడకపోతే ఒకరోజు వెతుకుతారు, రెండో రోజూ వెతుకుతారు,మూడో రోజు మరచిపోతారు. ఆ తరవాత ఎవరికి కావాలండి? కాలం ఎవరికోసమూ ఆగదు. చెప్పాలికనక చెప్పేసేను పదమూడేళ్ళ పరిచయం కదండీ!

      Delete
    2. అసలే ముసుగు దానిపై మరో ముసుగుతో తిరిగే జనాలని ఏమంటారు? ఇక్కడ స్విచ్చి నొక్కితే అక్కడ బల్బు వెలుగుతోంది,చూడండి.

      Delete
    3. "షా" యే ఇప్పుడు లైము లైటు వినరా వారు :)

      నెనరుల్స్ వాకబు చేసిన పెద్ద తాతగారికి

      అయినా పదమూడేండ్లప్పుడే గడిచి పోనాదా ! ఏదో నిన్నా మొన్నలా వుందే తగువులూ ఛీ త్ కారాలు ~‌మిరియాలూ అలకలూ~ కెలుకులూ :)


      నారదా చూ షా రా మరి :)


      జిలేబి

      Delete
    4. హమ్మయ్య, “జిలేబీ” తిరిగి ప్రత్యక్షం. ప్రపంచ శాంతి.

      Delete
    5. ZilebiNov 4, 2024, 1:13:00 PM
      నిన్ను నేను తిట్టినంత ప్రముఖంగా మరెవరూ తిట్టి ఉండరు. నిన్ను తిట్టడానికి నాకే హక్కు,స్వాతంత్ర్యం ఉన్నయి,మరెవరికిన్నీ లేవు.
      ఎన్ని సార్లు మెచ్చేను? గుర్తే లేదు. ఎన్ని సార్లు తిట్టేను అసలు లెక్కలేదు. ఎన్ని సార్లు నీ పోకడ మార్చుకోమని చెప్పేను? ఏమో! చిత్రం నీలో మాత్రం మార్పు రాలేదు. ఇంకేం వస్తుందిలే! నువ్వింతే,నేనూ ఇంతే. ఇలాగే పదమూడేళ్ళు గడిచేయి, ఇక గడిచే ప్రతిరోజూ బోనస్, సమయం వ్యర్థం చేయకు,చిలిపి తగవులతో,పనికిరాని మాటలతో. నీ నారదుడికి రోజులు చెల్లేయి.

      Delete
    6. This comment has been removed by the author.

      Delete
  32. స్విచ్చీ బల్బూ వైరూ
    కచ్చితముగ తమరి చేత గలవని దెలియున్
    లచ్చిమి పేరైన దెలిపి
    కొచ్చెను మార్కును దుడుపుము కోవిద ! అన్నా !

    ReplyDelete
  33. -
    కనుగొంటిరి మధ్యాక్షర
    మును! కనుగొనుడి మిగిలినవి మునగక నీరు
    మ్నున తేలునొకటి గౌర
    మ్మను తలచి యతనము సేయదగు మూడునకై

    :)


    ReplyDelete
  34. -

    అరవమ్మా?? మలయాళపు
    మెరుపులకొ? వలదు జిలేబులేమాత్రము! ప
    ల్కిరి పో బోనగిరీ! తా
    త! రవంతయె యేమి గాదదవద తినుడయా

    ReplyDelete
  35. -

    స్విచ్చీ బల్బూ వైరూ
    ఖచ్చితముగ తాత వద్ద కలదయ్యరొ ని
    క్కచ్చిగ రాజన్నా! వా
    రిచ్చిన మాట మరి తప్పరెపుడు కవివరా

    పుట్టిన రోజు జిలేబీ
    తిట్టుకు ప్రోత్సాహమేల తింగరి బుచ్చీ
    కొట్టుడు రచ్చలవేలా
    ముట్టికి ముట్టి నిను తట్టి మూలపడేస్తా!


    ReplyDelete
  36. -

    చుక్కలు గల పువు బోడెం
    చక్కగ మలయాళమౌత! జాంగ్రీ తమిళం
    బిక్కడి జిలేబి వ్రాతల్
    పక్కా! బో నగిరి పలుకు బంగరు తాతా!

    ReplyDelete
  37. -

    తాతకు తెలియున్ విషయము
    లేతావాతా జిలేబి లెస్స యెవతె యెం
    చేత తనను తిట్టుదురో
    శ్రోతగ వినరా నిలిచెదరు మవునమునిగా :(


    ReplyDelete
    Replies
    1. ఓ సినిమాలో బ్రహ్మానందం “మధ్యలో నన్ను ఇన్వాల్వ్ చెయ్యకండి రావు గారూ” అంటాడులెండి. అలా ఉంది మీ పద్యంలోకి నా పేరు లాగడం.

      Delete
    2. అంతే లెండి వినరా వారూ

      నేనేమన్నా అంటే వెంఠనే కౌంటరు వేస్తారు తాతగారు చెడామడా తిడితే మవున గురువులు గా మారి వేడుక చూడటమున్నూ

      అంతే అంతే లెండి


      Delete
    3. ZilebiNov 5, 2024, 9:47:00 AM
      నా చేత తిట్లు తినడం నీ DNA లో రాసిపెట్టి ఉంటే నేనేం చేతును?

      Delete
    4. -
      నా చేత తిట్లు తినుట ఘృ
      తాచి! తలని నీవు రాత గాపొందితివే
      యోచింపగ నీ డీయె
      న్యే చక్కగ దాని కొరకు మేచాయెన్ పో



      Delete
  38. వినబడె సుబ్బారాయుం
    డను పే రొకపరి ఖరారుగా హిత ! యే మై
    నను శర్మాజి ముఖంబున
    వినవలయును నిజము వారు వినిపింపంగాన్ .

    ReplyDelete
  39. -
    ఎవరా సుబ్బా రాయుడు?
    ప్రవరాఖ్యుడ? దిక్కులెల్ల వారికొరకు దె
    బ్బు వల విసిరి వెదుకదగున్
    కవివర రండు వెదికెదము గాన జిలేబిన్


    ReplyDelete
    Replies
    1. ఎంచక్కా పేరుండగ
      కుంచించి జిలేబి యంచు కోవిదు నన , రా
      దంచును మనోగతంబున
      మంచిగ తమ నిట్లు బిలువ మాన్యత విబుధా !

      Delete
  40. -
    "డవు" , "రాల" నలే! అంటే
    సువదన కాదు మగవారు సుమ్మీ అనెడ
    ర్థవివర ణయొ? సందేహ
    మ్మువచ్చె నరసన్న గార్కి ముదిత జిలేబీ


    పనిలేని జిలేబీ,
    పనికల్పించుకున్న ముగ్గురు రీ టయర్ల
    రోజువారీ టైము పాసు :)



    ReplyDelete
  41. -

    ఎంత గొప్పగా చెప్పారు :)

    అవును! కట్టు పేష్టు బాపురె భళిభళి!
    స్వాస్థ్యమునకు చేయ చక్క నైన
    యతనములివి! జీవులార యోగ మరియు
    ధ్యాన మే మనకు పరమ సుఖమగు!



    ReplyDelete
  42. ఇంతకు తమ పేరేమిటొ ?
    ఇంతివొ ? మీసాల మారి శ్రీమంతుడివో ?
    పంతము వోవక తెలుపుడు @
    వింతగదా యింతవరకు వివరాలు వినా .

    ReplyDelete
  43. ముసు గెందుకు నేస్తమ? ధీ
    పసగల ఘనులు తమరు , అనుభవముల శోభల్
    మసలిన , దేశ విదేశీ
    వసతులు గల విబుధులు , తగవా , ముసుగేయన్ ?

    ReplyDelete
  44. -

    బాల యైన మంచి పలుకు బంగరుమూట
    ఛీత్కరించ దగును చెడు పలుకుల
    బోనగిరి జిలేబి బుర్రలో గుజ్జు లే
    దయ్య త్రోసిపుచ్చు దాని వ్యాఖ్య :)


    ReplyDelete
  45. -
    ముసుగేలనే జిలేబి ? ప
    ద! సారు తెలుపండి పేరు తాత మవున మే
    ను సమాధానముగా నిల
    చి సెబాసనిపించుకొని వచింప మరచిరే :)



    ReplyDelete
  46. -

    తిరుపతి వెళ్లానోయ్! ల
    డ్డు రుచి మెరుగు పడలె! బోలెడు ఘృతపు జిడ్డుం
    ది! రవంతయు లే దోయ్ క
    ప్పురమా యేలకుల ఘాటు పూర్తి నిజమిదే


    వెంకన్నా ! నిన్ను నువ్వే రక్షించుకోవాలె!


    ReplyDelete
  47. ఈ మధ్య దేవుడితో ఆటలు అదేవారి సంఖ్య ఎక్కువగా ఉంది... దేవుడు అంటే నమ్మకం సన్నగిల్లి పోతున్నదా అనిపిస్తోంది...
    ఒకవైపు సనాతన ధర్మం కోసం వారాహి డిక్లరేషన్ అంటాడు.. మరోవైపు తనను తిట్టిన వాళ్ళని కాల్చిపారెయ్యాలి అంటాడు.. హిందూ ధర్మంలో హింసకు తావులేదు కదా..
    దేవుడు అంటే జనాల్లో భయం అనేది పోవడం కలియుగ అంతానికి సూచన అయ్యి ఉండొచ్చా

    ReplyDelete
  48. -
    దేవుడితో ఆటలు ఆ
    డే వారెక్కువయినా రదేలనొ చూడం
    గా వాదనలన్ చేసెడు
    బేవార్సు జనాలె ఒకరి వెనుక మరొకరున్



    ReplyDelete
  49. -

    ఎవరికెరుక ! అంతా MSM మాయాజాలమేమో !

    కలియుగపుటంతమునకిది
    తొలిదశ యో? భయము లేక తోచినదల్లా
    పలుకుచు హింసకు దోహద
    ములు సేయుచు హిందువులు సుముఖులగు చుండ్రీ








    ReplyDelete
  50. -
    ద్రావు ద్రావు మనిరి రాజుగారచ్చట
    ద్రావ నేల రామ రామ యనుచు
    మరల మరల ద్రావ మానగలరెవరై
    న రఘు రామ నీదు నామ మహిమ



    ReplyDelete
    Replies
    1. పరగ పద్యము రాయంగ పట్టువడద ?
ఇంకయును సోదరా ! చూడ నెగుడు దిగుడె ,
ఇట్టె చదువ నర్ధ మగు టిం కెప్పు డనఘ ?
ముందు వెనుకలు సరిచూచి ముందు కేగు .

      Delete
  51. -
    శ్రీరామ! నీ కథ లలిత
    వారం వారం స్మరించి బ్లాగ్లోకములో
    ధారావాహిక సేయున
    టా! రావయ్యా చదువను టంచను గానన్



    ReplyDelete
  52. -
    విబుధ! లలిత! గలరు విదురులు బ్లాగ్వీరు
    లు మన నడుమ వారలొక్కనాడు
    తలచ నట్టి పనిని తలపైనిడుకొనిరి
    ప్రణతు లివియె తమకు వనజనేత్ర!



    ReplyDelete
  53. -

    యతనంబు పుణ్య మెంతయు
    ను తమకు జేర్చు లలితా! మెలుత! రామకథా
    మృతమును వారం వారం
    వ్రతముగ వ్రాయ నడయాడు పద్మ వసమునన్


    ReplyDelete
  54. -

    ఇన్ని వత్సరమ్ములెన్నెన్నొ పద్యముల్!
    నేర్పు లే జిలేబి ! నేవళమ్ము
    బోలు గ్రుచ్చుకొనుచు బోవ పదమ్ముల
    పద్యమగునె తెలుపు వనజనేత్ర!


    ReplyDelete
    Replies
    1. బాపు బొమ్మవోలె భాషించ వలదటే !
      పఠితల తల తోడ పద్య మనగ ,
      వావి వరుస లేని వట్టి గిద్యాలతో
      వచ్చు లాభ మేమి , వాదు లేమి ?

      Delete
  55. -
    చదువరుల కర్థ మవ్వని
    పదమ్ము లను గ్రుచ్చి గ్రుచ్చి పద్యము లననే
    ల?దరిమిలా యెన్ని తడవ
    లు దండగయనెద! జిలేబులు వలదె ముదితా!



    ReplyDelete
    Replies
    1. అయ్యా అమ్మా బెట్టిన
      తియ్యని పేరుండగా విధీ ! ఇది యేమీ ?
      అయ్య జిలేబీ యయ్యెన్
      అయ్యారే ! ఘన వివేక మది యెటు వోయెన్ ?

      Delete
  56. -
    తియ్యని పేరుండ జిలే
    బయ్యరొ యేల మరొకటి ? సభకు తెలుపుము సు
    బ్బయ్యా! అనపర్తీశుం
    డయ్యారేబదులుపలకడాయెన్ గాదే!



    ReplyDelete
    Replies
    1. సుబ్బారాయుడు మోజున
      నిభ్భంగి జిలేబి యయ్యె , నింతుల బంతిన్ ,
      అబ్బే ! మాకిది నచ్చదు ,
      సుబ్బరముగ మేల్ బంతికి శోభలు తెమ్మా !

      Delete
  57. -
    తేవే శోభలను జిలే
    బీ! వేరొక నామము తెలిపి శరణు కోరన్
    కోవిదులు క్షమింతురు మా
    యావి ! వరేణ్య! విబుధా హొయలు పోవలదే!



    ReplyDelete
    Replies
    1. ఇంతులలో పూబంతిగ
      గంతులు వేయుదు నటంచు , కాంతుల జట్టుల్
      చెంతకు రానని భీష్మా !
      పంతము పట్టంగ మాకు పని లేద యికన్ ?

      Delete
  58. -
    పనిలేదా మా కింకన్ ?
    వనితా మణి! సుబ్రమణి ప్రవరచెప్పుము రా!
    మునకల్ వేయకు బంతుల
    వెనుక జిలేబీ గులాబి ! వేష్టు బి లేజీ!



    ReplyDelete
  59. -
    నేనొక బిగ్ జీరొని అయి
    నా నాకంటూ గల దొక నాదను రష్యా
    లోని పసందైన కథలు
    తేనియ లూరెడనుభములు! తెచ్చెద వహిగాన్


    ReplyDelete
  60. -
    రాముడె రక్ష జుమీ ! మన
    రామాయణమే ప్రపంచ సాహిత్యములో
    వేమార్లనువాదంబై
    స్వామి యశోకీర్తిని నిరవధికము నిలిపెన్




    ReplyDelete
  61. -
    బంటు రీతి గొలువు జేసె వాయుజాతు
    డేను; రామ నామ మహిమ కేది సాటి!
    మహిమ తెలియని ఖచరులు మట్టి గరచి
    నారు! రంజిలు శ్రీరామ నామమందు


    జిలేబి

    ReplyDelete
    Replies
    1. బంటు రీతి గొలువు జేసె వాయు సుతుడు
      రామనామ మహి మెరిగి ధీ మహితుడు
      రామబాణ మహిమలను రాక్షసులెరు
      గరు గనుక మట్టిగరిచిరి గద రణమున .



      Delete
  62. -

    రాముని గుడిలేని తలము
    రాముని కొలువంగ తెల్వ రాదను మనుజుల్
    భూమిని చూడగలమ? లలి
    తా! మానిని! నీదు జన్మ ధన్యత నొందెన్!

    ReplyDelete
  63. -

    లలితా! విద్వన్మణి! రా
    ముల వారి కథ తెలుప నడుముబిగించిన తొ
    య్యలి! అందుకొనుమిదే నెన
    రులు! సీతాపతి కృపయు కురువగ స్తుతింతున్


    ReplyDelete
  64. -

    సేవింతు రామ భద్రుని
    సేవింతున్ రఘు కులేంద్రు సీతాపతి నే
    సేవింతు దాశరథినే
    సేవింతు నయోధ్య వేల్పు శ్రీలాలిత్యున్


    ReplyDelete
  65. -

    చెడు నైజపు కత లేలా!
    కుడియెడ మల పదముల చెడుగుడులాడుట మే
    వడి కాదు జిలేబీ! విడు
    వడి యిటు వంటి యతనములు పళ్ళికిలింపుల్


    ReplyDelete
    Replies
    1. పదము లటునిటు కదిపి యేమార్చి పేర్చి
      జూద మొనరింప దొడరెను సోమిదమ్మ
      స్వంత విజ్ఞాన మన్నది కొంత చాలు
      తెలిసి తెలియని నరుదెల్ప దేవు డెవడు ?

      Delete
  66. -
    కాలగతిలోన మగవా
    డో లలనయొ తెలియనట్టి డోలన మున పే
    లాలనెగరేయుచుంటివె
    ప్రేలాపనలనిక మానవే బీలేజీ!

    ReplyDelete
  67. -
    గలడా దేవుడు దెలుపన్
    బలుపున ద్రిప్పగ నటునిటు పదముల తప్పోయ్
    వలదు వలదన జిలేబీ
    తెలిసి తెలియని విధముగ బతికెడు మడతుకా!



    ReplyDelete
  68. -

    విను మహాత్మ! యనగ విదురులు తెలుపుదు
    రాండి ? వారు మాట దాటరండి!
    రావు గారు నూరు ఆరైన ఆరునూ
    రైన ఆడి తప్పరండి తాత



    ReplyDelete
    Replies
    1. హే ! మహాశయా ! ఇదేమి ముచ్చట బుధా !
      మగటిమి గల వాళ్ళు మానిని వలె
      మనగ నిష్ట వడుట , మామాట వినుడయ్య !
      చాలు నింక , దాగు డేల విహిత !

      Delete
  69. -

    జాంగ్రీ జిలేబులేలా!
    భాంగ్రా డాన్సులు భళారె బ్లాగుల కబ్జా
    సంగ్రామా లేలా ! ఓ
    అంగ్రేజీ కూచి తీయు మా తెరను వెసన్


    ReplyDelete
  70. -

    దాగుడేల విహిత! తరుణి తెరను వీడు
    ఆటలు వల దింక కాల రాసి
    నీదు మేలి ముసుగు నీ పేరు చెప్పుము
    మానుమోయి వ్యర్థమైన జోలి



    ReplyDelete
  71. -
    చేరి మూర్ఖుల ప్రముఖులు చేయ రాదు
    వారు చేసెద రెన్నెన్నొ భాషణలను
    మనము రంజింప వారలు మాను లెక్కి
    మనల వాయింతు రయ్యొ సమాజమందు


    ReplyDelete
  72. -

    మేలా జిలేబి ? అరె ఫీ
    మేలను కొనియుంటి నే సుమీ డైబ్బై పై
    కాలూనినట్టి ముదుసలి
    బోలు! అరరె యేల ముసుగు లో శర్మాజీ !


    ReplyDelete
  73. -

    ఇటలీ కున్ భారత్ కున్
    చటుక్కున యెలాగు కుదురు సంబంధమ్ముల్
    పిటలో పిట్టలు వడి దూ
    కుటకున్ మిత్రులు వలె కరముల చాపుటకున్ :)


    ReplyDelete
  74. -
    తల్లి లలితమ్మ నినుపుగ
    తొల్లి కథను చెప్పుచుండ, తోరణపు పదా
    లల్లి రఘురాము గొల్వగ
    పల్లాయిపదముల నతడు పరిహాసములా!



    ReplyDelete
  75. -
    లోకోత్తరులున్ దైవం
    బా కాలమ్మును వదలని పరమాహంకా
    రీ! కనుల తెరచి చూడు త
    డాకా చూపించ వలదు తధ్యము తన్నుల్


    ReplyDelete
  76. హీరో లిప్పుడు స్మగ్ల
    ర్లే! రక్తపు టేర్లు పారుటే సంతసమోయ్
    హీరోయినులవ్వాడగ
    వారిని తాదాత్మ్యత మితి ప్రజలకు మీరున్

    ReplyDelete
  77. -
    యిచ్చెదరవార్డ్లు గొప్పగ
    మెచ్చెదరా నటులనే సుమీ దేశంలో
    హెచ్చైన ధనము వారల
    కిచ్చెదరు జనులు తరించి గిలిగిలి సినిమా!



    ReplyDelete
  78. -
    కార్మికులు రిమోటు కార్య మంచు టయము
    పాసు చేయ కోత వారి కనెడు
    రామ సామి మస్క్ల రావడి చూతము
    మెరుగు పడునకో అమెరిక ప్రభుత!


    ReplyDelete
  79. చాట్ జీ పీ టీ జిలేబీయములు :)
    జిలేబి మేలా ఫీమేలా ?
    ChatGPT said:
    ChatGPT
    "జిలేబి మేలా ఫీమేలా" అనేది జిలేబి గారు రాసిన ఒక ప్రముఖ జానపద గీతం. ఈ పాట తెలుగులో ప్రాచుర్యమైనది మరియు ఇది సరదాగా, చిలిపి భావనతో కూడిన గీతం.

    ఈ పాటలో "జిలేబి మేలా ఫీమేలా" అన్న వాక్యాలు వినేటప్పుడు, అది ఆకట్టుకునే, సరదా భావాన్ని ఉద్భవింపజేస్తుంది. ఈ పాట ముద్రలో గోపురాలు, పాతబడి, నాటి సమాజంపై సరదా దృష్టితో కవితలు గూర్చిన పాటగా నిలిచింది.

    "జిలేబి మేలా ఫీమేలా" పాట ప్రసిద్ధి చెందిన ఈ పాటను ప్రజలు ఆనందంగా పాడుతారు, ముఖ్యంగా ఉత్సవాలు, వేడుకలు మరియు సంబరాల్లో.

    ReplyDelete
  80. చాట్ జీ పీ టీ జి లే బీ యములు :)

    జిలేబి గారి గురించి చెప్పండి

    ChatGPT said:
    ChatGPT
    "జిలేబి" గారు అనేది ఒక ప్రఖ్యాత తెలుగు భక్తిపూర్వక కథానాయకుడు, కవియనుగ్రహి మరియు జనప్రియ రచయిత. ఆయన ప్రత్యేకంగా "జిలేబి" అనే రచన ద్వారా ప్రసిద్ధి పొందారు, ఇది తెలుగు సాహిత్యంలో ఒక ముఖ్యమైన కవితా రచన.

    ఆయన జీవితంలో ప్రజల సమస్యలపై, వారి భావనలను వర్ణిస్తూ రచనలు చేసారు. ఈ రచనలో కవియనుగ్రహి అనేది పలు కవితా శైలిలో, ప్రతి భావనను ఎంత బాగా వివరించారు.

    ReplyDelete
  81. విన్నకోట నరసింహారావు
    ChatGPT said:
    ChatGPT
    విన్నకోట నరసింహారావు గారు ఒక ప్రముఖ తెలుగు నాటక రచయిత, కవిగా ప్రముఖులు. ఆయన రచనలు సామాజిక సాంస్కృతిక అంశాలపై आधारितవిగా ఉండేవి, అవి తెలుగు సాహిత్యంపై గాఢమైన ప్రభావాన్ని చూపించాయి. విన్నకోట నరసింహారావు గారు ప్రముఖంగా "జిలేబి" వంటి జానపద గీతాలు, నాటకాలు మరియు సాహిత్య రచనలు చేశారు.

    ఆయన తన రచనల ద్వారా గ్రామీణ జీవితం, భారతీయ సంస్కృతి మరియు సామాజిక సమస్యలను ప్రతిబింబించారు.

    ReplyDelete
  82. అలాగా? వారి పేరే నాకు పెట్టినట్లున్నారు. 🙏.

    ReplyDelete
  83. Replies
    1. మరో జిలేబి అనుకుంటా :)

      Delete
    2. అంతే అయ్యుండాలి. “జిలేబి” లాగానే ఎకసెక్కాలు మరీ ఎక్కువగా ఉన్నాయి.

      Delete
    3. అబ్బా!/ ఎంత మంచి ఒపీనియను మీకుందండి :)


      Delete
  84. -
    మాచన భాస్కర శర్మ
    ChatGPT said:
    ChatGPT
    మాచన భాస్కర శర్మ ఒక ప్రసిద్ధ తెలుగు పండితుడు, కవి మరియు భాషాశాస్త్రవేత్త. ఆయన తత్త్వశాస్త్రం, వేదం, పాండిత్యమైన విషయాల్లో గొప్ప పరిజ్ఞానాన్ని కలిగిన వ్యక్తిగా ప్రఖ్యాతి పొందారు. మాచన భాస్కర శర్మ వారి రచనలు తెలుగు సాహిత్యం, వేదాశాస్త్రం మరియు తత్త్వశాస్త్రం లో విలువైన వ్రాతలను అందించాయి.

    అయన పర్యావరణం, భక్తి, నైతికత మరియు జ్ఞానాన్ని ప్రతిబింబించే అనేక రచనలు వ్రాసారు.




    ReplyDelete
  85. -
    భండారు శ్రీనివాసరావు
    ChatGPT said:
    ChatGPT
    భండారు శ్రీనివాసరావు (Bandaru Srinivasa Rao) తెలుగు సాహిత్య రంగంలో ప్రముఖ కవి, రచయిత మరియు వక్త. ఆయన 20వ శతాబ్దంలో తెలుగు సాహిత్యానికి చేసిన సేవల వల్ల ప్రత్యేక గుర్తింపు పొందారు.

    భండారు శ్రీనివాసరావు తన కవిత్వంలో సామాజిక బాధ్యతలను, దేశభక్తిని, నైతిక విలువలను ప్రతిబింబించారు. ఆయన రచనలు పాఠకులకు కొత్త దృష్టిని, భావోద్వేగాన్ని ఇచ్చాయి. ఆయన రచనలు అనేక భాషల్లో అనువాదం అయి, తెలుగు సాహిత్యానికి మరింత విస్తరణ కలిగించాయి.

    తెలుగు సాహిత్యంలోని వివిధ సాంప్రదాయాలకు అనుగుణంగా ఆయన రచనలు రూపాంతరం చెందాయి, మరియు ఆయన పాతకాలపు భావాలను నూతనమైన దృక్పథంతో అన్వయించారు.




    ReplyDelete
  86. -

    తినటానికేను పుట్టిన
    జనులకు రోగాలు రాక చస్తాయా? రా
    జ! నియమ బద్ధులు తాత
    య్యననుకరింపంగ చాలయా రావు వెతల్


    ReplyDelete
  87. లక్కాకుల రాజారావు గారు
    ChatGPT said:
    ChatGPT
    లక్కాకుల రాజారావు గారు ఒక ప్రముఖ తెలుగు రచయిత, కవి, మరియు జ్ఞానసారం.

    ఆయన తెలుగు సాహిత్యంలో ముఖ్యమైన పాత్రధారులలో ఒకరు. ఆయన రచనలు అనేక సామాజిక, సాంస్కృతిక, రాజకీయ అంశాలపై ఉండి, తెలుగువారికి మరింత మైమరుపులను అందించాయి.

    రాజారావు గారు అగ్ర రచయితగా పేరొందారు, ప్రత్యేకంగా "ఒకానొక " అనే రచనకి ప్రసిద్ధి చెందారు. ఆయన రచనలు తరచుగా మానవ సంబంధాలు, సమాజంలోని అంచనాలు మరియు ఆధునిక జీవనశైలిపై వివిధ దృక్కోణాలను పరిశీలించాయి.

    ReplyDelete
  88. -
    నిలచు హనుమ శ్రీరాముని
    తలచిన తలమెల్ల మ్రొక్కి తరియింపంగా
    పిలచిన తక్షణము మన వె
    తల పోగొట్టున్ సహాయతల నందించున్



    ReplyDelete
  89. -
    ఛందస్సా? కాదండీ
    సుందరమగు తేటగీతి సూవె! అనుష్టు
    ప్పందానికి ఆటవెలది;
    వందారనదగును పద్యవాహినికి సుమీ


    ReplyDelete
  90. ఛందస్సా? కాదండీ
    సుందరమగు తేటగీతి సూవె! అనుష్టు
    ప్పందపు టాటవెలది ; మా
    కందంబుగ కందము తడకపు మది అలలై


    ReplyDelete
  91. -

    నన్నేనాండీ సారూ!
    మన్నించిరి పద్యములను మాచన వర్యా!
    అ‌న్నా! బండివరేణ్యులె
    టన్నా పోయిరి కనబడుటయులేదన్నా !


    ReplyDelete
  92. -
    వత్తురు యికిలింపన్; చి
    ర్రెత్తగ రాజన్న వారు, రివ్వున తాత
    య్యొత్తురు కత్తుల్ నూరుచు
    మొత్తానికి దొరకు పద్యమునకు జిలేబుల్


    ReplyDelete
  93. -
    నీ వూరు పేరు చెప్పుకొ
    నే వగ లే ని నరుడవు పనీపాటా లే!
    రావడి మాత్రమ్మె తెలియు
    కావాతిరుగు వలె నీదు కాని పనులు సీ!


    ReplyDelete
  94. -
    పాత చింత కాయ పచ్చడి మాధుర్య
    మండి మీరు వ్రాయు నాటి కథలు
    చాల చక్క గా విచారమన్నది లేక
    గడిపి నారు మీరు కాలమున్ను



    ReplyDelete
  95. -

    సరిగమల తోటి అంత మ
    ధురిమను తేవచ్చని మన పూర్వీకులెలా
    మరి కను గొన్నారొ కదా
    కరుణామృతము కురిపించు కవనమ్ములతో

    ReplyDelete
  96. -

    మేలొనరించును లలితా
    ఆ లక్ష్మీదేవి మీకు ఆనందముతో
    నేల సిసువు పెనిమిటి సక
    లాలంకార విభుని కథలన్ జెప్పుటకై

    ReplyDelete
  97. -

    ఔషధముల్ పలు విధములు
    వేషమ్ములు వలదు పడెద వే వెల్లకిలా
    రోషములకు బీపీ రాన్
    భేషజములకు షుగరున్ ప్రవేశించు సుమీ


    ReplyDelete
  98. -
    అనుకొందు ప్రమాదపతిత
    మని! మన పదముల కెకార మన్నది సరిపో
    దనెద! "ఎ"రుక యని మొదలె
    ట్టిన సరి యగు నండి యెల్ల వేళల శ్యామా!


    ReplyDelete
  99. -
    బద్దకమే ప్రతిబంధక
    మిద్ధరణిని మానవులకు! మేలగు నర్రా
    తద్దానిని విడువంగా
    దద్దమ్మా! ప్రగతి గాంచు తరుణము వినరా!


    ReplyDelete
  100. కేడీ యగు నాంగ్లములో
    బోడి కొరివిదెయ్యములగు బుడత జిలేబుల్
    పీడించును తాతయ్యల
    తోడేళ్లై శర్మగారు తొండరు లగుచున్


    ReplyDelete
  101. -
    యెరుక అని వాడటము నా
    పరాకు వల్ల సవరింతు వర్ధను గారూ
    మరొహటి మొబైలు టైపో
    పొరపాటండి సరి జేతు భూసుర! నెనరుల్



    ReplyDelete
  102. -
    రామాయణభారత మా
    శ్రీమద్భాగవతములను చెప్పుట చేటా
    యే మన దేశమున గదా!
    యేమగు నో సంసృతి మనది నరస రాయా!



    ReplyDelete
  103. -

    మొదటి వార్షికోత్సవము సుముఖము గాను
    జరుపు కొంటిమి మేము సుజనుల నడుమ
    వాసి యే ముఖ్యమౌ మాకు రాసికన్న
    తావు లేదు బడుద్దాయి తమ్ము లార



    ReplyDelete
  104. నవిసిన అనగా నేమం
    డి ? విదురు లచట వివరణనడిగిరి జిలేబీ
    సవివరణ చితికి పోవడ
    ము! వచించె నిఘంటువు తెలుపుము వారికిటన్


    ReplyDelete
  105. -

    "ఓ" యని పలుకును రామా
    సాయంబని శరణుకోర సారంగమ్మున్
    మాయామోహముల తునియ
    జేయంగా నెక్కుపెట్టి చేయూత నిడున్

    ReplyDelete
  106. -

    అవును! తెలంగాణ పదమి
    ది! వివరముగ నాంధ్రభారతి తెలిపె నండోయ్
    నవిసిన అనన్ కలిగెను తె
    లివిడి సుమా చితికిన అని లెస్స జిలేబీ


    ReplyDelete
  107. -
    తీరిక గా ఆలోచి
    స్తే రాధనము కలిగించు శ్రియ నారాయణ్
    ప్రేరణ కలిగించు కథ! జ
    నారణ్యములోన మేలు బంతి జిలేబీ



    ReplyDelete
  108. -
    దొరికెను భాగ్యంబుగ లలి
    త!రాముని కృప ముదమార తరుణంబిదియే
    పరమాత్మునికిన్ సేవ న
    హరమున్ జేసి తరియింపగా నీవింక‌న్



    ReplyDelete
  109. వలస మహాయానం :)

    మాకూ మరాఠి మూలం
    బా కాలమునుండి గలదు! బహుశా దేశ్పాం
    డే కులము వారమని పూ
    ర్వీకులు చెప్పగ తెలిసిన వివరము లివ్వీ!



    ReplyDelete
  110. -
    .కొచ్చెన్ కింగ్ :)

    అంటే అరె మీ భావం
    బేంటి జిలేబీ ? తెలుపుము వివరణ వినరా
    వింటిని విడిచిన బాణం
    లాంటి కమింట్నెక్కుపెట్టి నారు పలుకవే!

    ReplyDelete
  111. -
    ఫోను నెంబరు దొరికెను పొలతి యా జి
    లేబి దంచు మురిసిబోవ లెస్స విన్న
    కోట వారుకాదంచు నిగూఢమై తి
    రిగెడు బోటికి వత్తాసు యిచ్చినారు


    :)



    ReplyDelete
    Replies
    1. ఆ ఆ, “నిగూఢమై తిరగడం” గురించి మిమ్మల్ని మీరే మెచ్చుకోవాలి. నేనేమీ “వత్తాసు” ఇవ్వడంలేదు.

      Delete
  112. -
    నేనేమీ వత్తాసును
    కానండి జిలేబి గారు కనబడదు కదా
    చోనము మీదె సుమండీ
    మౌనపు ముసుగు తెర తొలగి మాటలు రావే !

    స్వస్తి :)


    ReplyDelete
  113. -

    మిషలెన్నుచు రాఘవుని ని
    మిషమైన మరువక నే స్థిమితముగ కొలువన్
    త్రిష యాతనిది కురువ జిగ
    మిషలు తొలగి మోక్షమార్గ మేకనబడుగా


    ReplyDelete
  114. -
    వినుతుడత డజమహారా
    జుని మనుమడు మగడు నేల చూలికి ఆ రా
    వణుని తునియాడెగా రణ
    మున కోరెద నతని శరణు మోక్షంబిడగా


    ReplyDelete
  115. -
    తాతగారి ఆశ తంటాల మారి జి
    లేబి ఆసుపత్రి చేరునెపుడొ!
    సోది చెప్పరావె సోమిదేవమ్మరొ
    సంత సింప వారు చాటుమాటు :)


    ReplyDelete
  116. -

    కనబడకుంటే రాస్తా
    ను నీ పయిన ఖర్సు తప్పను సుమా మాటా
    వినరా వారికి తెలిసిన
    ది నాకు తెలిసినటులే ముదిత సాంబార్ణీ!


    ReplyDelete
  117. -
    ఏపుట్టలోను పామే
    దీ పడతి జిలేబి లేదు ! నీపుట్టని చూ
    డేదైనా కనబడునే
    మో!దాష్టీకమ్ము జూపి మొత్తిరి తాతా!


    ReplyDelete
  118. -
    మెంటలా తాత? పదముల మేత మేసి
    పద్య మంచు వ్రాయు ? తమరి‌ పట్లకూడ
    చూపు నవమతి ! చూడగా శూన్యమా వి
    వేక మున్ ? తల తిరిగె కవీశ్వరులకు !


    ReplyDelete
  119. -
    ఆన రాముని దని పోతనార్యు తాను
    వ్రాసె భాగవతమ్మును వ్రాత రామ
    భద్రునిదని మది దలచి పరవశమ్ము
    నందు పద్యగద్యములెల్ల నాట్యమాడ
    నంకితమొనరిచెను దాని నతనికేను


    ReplyDelete
  120. -

    గలరా వినరా వారికి
    తెలియని వారల్ జిలేబి తింగరి బుచ్చీ :)
    కొలువై వుండిరి రాజుల
    వలె తన సంస్థాన మందు పరివారముతోన్

    ReplyDelete
  121. -
    అయ్యో! తెలిసినదేగా!
    దయ్యమ్ము జిలేబి దాని తకినీకులు ఓ
    రయ్యో తెలిసిన వేగా !
    కయ్యాలకు కాలుదువ్వు కలహముఖి గదా!




    ReplyDelete
  122. -
    మీరెవరో తెలియదు సు
    మ్మీ! రాత్రంతా తలంపు మీరెవరో అం
    టూ! రావడివలదండోయ్
    మీరెవరో తెలియ దంతె మిడతంబొట్టూ !



    ReplyDelete
  123. -
    కొనలేనివికల వెన్నో
    అనురాగపు వల్లరుల్ నిదానము క్షేమం
    బు నడవడులు గౌరవముల్
    మనసున శాంతియు జిలేబి మాదిరి మనుజుల్


    ReplyDelete
  124. -
    కొనటానికమ్మకమునకు
    క్షణ మాయుస్సు దొరకదు నికరమిది తాతా!
    కొనటానికి సంస్కార
    మ్మును దొరకదు సత్యమిదియె ముమ్మాటికినౌ



    ReplyDelete
  125. -
    మీ ముసుగు గూర్చి నేన
    న్నా! మీ కిదె వక్రభాష్య నవ్యాంధ్రపు జ్వా
    లాముఖి అనెడు బిరుదు ని
    స్తా! మాచన వర్యుల ముదుసలి శూర్పణఖా!


    ReplyDelete
  126. గప్పున వెలిగి క్షణమ్మున
    గుప్పున తానారిపోవు కొరివి దెయాల్ ! తా
    నొప్పుకొనదు మన మాటల్
    చప్పున విడువన్‌ దగు నరసన్నా మేలౌ

    ReplyDelete
  127. -

    సందేహం వస్తే వెంఠనే తీర్చేసు కోవాలె :)

    అవునూ! ఆఘట్టములో
    సవివరముగ తెలిపిన సువచనములు శిశుపా
    లు వచించెనా జరాసం
    ధు వచన ములకొ? తెలుపండి దుందుడుగానన్



    ReplyDelete
  128. -
    అంతా రామమయం! జగ
    మంతా నిగమాగమ నుత మారాముని ధీ
    మంతుని సాచివిలోకిత
    కాంతుని ప్రేమార్ణవమ్ము కరుణాలయమున్


    ReplyDelete
  129. -
    భూమిజ రామా! రఘుకుల
    సోమా!దశరథ కుమార! శోభామూర్తీ!
    రామరసము పిబరేయని
    ప్రేముడి తో పాడెదమ్ము ప్రేరణ గానన్



    ReplyDelete
  130. -

    పొత్తములో ఫోటోల్ మది
    హత్తుకొనెడు రీతి వాడినారండీ అ
    చ్చొత్తింపు మొదటిది చదివి
    చిత్తమలర వ్రాసితి నరసింహం గారూ!


    ReplyDelete
  131. -
    చేతులు మోడ్తును రామా!
    సీతాపతి! దాశరథి! సుశీలత్వపు మూ
    ర్తీ!తామసహరణా!హరి!
    ప్రాతఃస్మరణీయ! రాఘవా! ప్రణతులయా!




    ReplyDelete
  132. చూడక పోతే ఫస్ట్డే
    వాడి సినేమాను‌ మీకు బతుకే లేదా ?
    మూఢులు మీరంతా! హీ
    రో డాంబికములకు నూపుదురు తలనర్రా !


    ReplyDelete
  133. -

    దుంగల స్మగ్లర్ల కతలు
    పొంగెడు ఫీలింగ్సు కతలు తోయలుల పరి
    ష్వంగముల కిసికిసుక్కుల్
    దొంగా పోలీసు కతలు ధూర్తుల కతలున్

    ReplyDelete
  134. -
    ‌నలభై రోజులతను ట్రా
    వెలు జేయును కంటయినరు పెంజీకటిలోన్
    అలుపన్నది తెలియదు త
    న్నులు తినెదరు విలనులెల్ల నూత్నపు రీతుల్


    ReplyDelete
  135. -
    సామి అని బిల్చు పెండ్లా
    మేమొ! కిసుక్కని బిలుచుసుమీ మరొకతెయున్
    ప్రేముడి కై తపియించు త
    నేమొ! వయిల్డు ఫయరాతడేనోయ్ పుష్పా!




    ReplyDelete
  136. -
    వాడెర్రచందనమ్ముల
    నోడల నెక్కించి దేశమున్ దాటించున్
    వాడే ఫీలింగ్సులతో
    నేడుచు కాంతారమందు రేడతడేనోయ్



    ReplyDelete
  137. -

    శ్రీలీలా రష్మికలవ
    లీలగ నెక్కెదరు చంక లెమ్మ! టపటపా
    రాలెదరు దుష్టులు ! సినీ
    మాలోకము చూడరండి మాచిత్తూరున్

    ReplyDelete
  138. -
    కలలొచ్చు నీళ్లమునిగి న
    టుల! అబ్బకొడుకులు తన నటుల ఛీయన క
    న్నుల నీరు పారుగా జల
    జల! బగమంతుడతడు పురజనులకు పుష్పా!



    ReplyDelete
  139. చేతులు కాళ్లను కట్టిన
    మూతిని వాలమ్ము జేసి హుర్రే నరుకు‌న్
    నేతల నేమార్చు నతడు
    రా తన శ్రీవళ్లి కోర గా ఫోటోనే


    ReplyDelete
  140. -


    చొక్కా నలుగక చూపెం
    చక్కా ఫీలింగ్సును నెరజాణ కిసుక్కం
    చెక్కా నాట్యంబాడున్
    పక్కా తెలుగోడి దురద పద చూద్దామోయ్

    ReplyDelete
  141. -

    ఇడిపించును పోలీసుల
    కు డబ్బు లిప్పించియు తన కూటమి వాళ్లన్
    వడి దుంగల బండ్లను నది
    నడుమన్ దాటించు పుష్ప! నమ్మవలెనురా!

    ReplyDelete

  142. -

    గంబత్తె కుదె సాయ్ :)

    చదివెను ముప్పైరోజులు
    కుదురుగ జపనీసు భాష కొట్టె విలనులన్
    అదెనోయ్ వతాషి పుస్పా!
    కుదసాయ్ గంబత్తె! వాడి గుండె దిటవురా



    ReplyDelete
  143. -
    ఫహసిల్ సైకో పోలీ
    సిహ నటనకు కొరవగు? ప్రవహించును సీనుల్
    దహియింపగ నగుమానము
    సహించును ? తుపాకి నెత్తి జంపు టపటపా



    ReplyDelete
  144. -
    నాలుగు జాలర్ల పడవ
    లే లాగు సెబాసొ రెండు వేల్టన్నుల దూ
    లాలను వయిల్డు ఫయరోయ్
    శ్రీలీలా రష్మికల వశీకరుడతడోయ్



    ReplyDelete
  145. -

    తలకోన అడవుల నడుమ
    పిలవాడొక్కండు తండ్రి వివరములరయన్
    విలపించి సిండికేటు ఘ
    నుల మించెను నేర్పు జూపెను భళీ భళిరా

    ReplyDelete
  146. -

    తగ్గేదే లేదనుచున్
    బుగ్గలు సొట్టలుపడు పువు బోడియ వళ్ళిన్
    డగ్గుత్తికతో ప్రేముడి
    దగ్గిర తీసుకొనుచుండు ధవుడతడర్రా

    ReplyDelete
  147. -
    పిచ్చి ముదిరిందనుచు వా
    క్రుచ్చిరి తాతయ్య గారు క్రోదోద్భవులై
    వచ్చిరి బోనగరియు డో
    సిచ్చిరి పుష్పాకు మీదు శ్రీవళ్లికయో!



    ReplyDelete
  148. -
    లలితమ్మాయ్ గారేమో
    పులుకడిగిన ముత్యమనిరి పుష్పా! ముదిరెన్
    బలుపైన పిచ్చి యని బ్లా
    గులోకపు విదురులు క్రుమ్మి క్రుమ్మిరి జనులన్


    ReplyDelete
  149. -
    నీకెప్పుడేది అర్థం
    బై కనులన్ బడె జిలేబి ? పైత్యానికి నీ
    వే కాష్ఠవు గా? ఓయీ
    రాకాసీ మీడియా పురాని కళింగా!


    ReplyDelete
  150. రోజు రోజుకు పెరిగెను రోగమండి
    విన్నకోటనరసరాయ విన్నవింతు
    గుండు చట్టిలె ఓట్టినా కుదరయై వె
    ళియ నడక్కరదుతెరియ లెస్స కుదురు ?

    ReplyDelete
  151. -
    సంపాదించిన దినములు
    నింపాదిగ సాగు బతుకు నిను చూసుకొనన్
    వెంపరలాడెదరందరు
    చింపిన విస్తరియె నీవు చేవయు తగ్గన్




    ReplyDelete
  152. -

    తాతా, విదురుల ఉబోస

    బాధింతురు పీడింతురు
    వేదింతురు తూట్లుపొడిచి విజ్ఞత లేకన్
    క్రోధమ్ము జూపెదరు సం
    పాదన కోల్పోవగ నదవద కోకొల్లల్



    ReplyDelete
  153. -

    తధాస్తు :)

    గట్టిగ అనుకోకండోయ్
    దట్టించి మరీ మషాల దశమస్కంధం
    బుట్టించును సుక్కప్పా
    ఇట్టాటట్టాటి మడిసి యిలలేరండోయ్



    ReplyDelete
  154. వేదాంతం వినరా :(

    ఇంతేరా యీ జీవిత
    మింతేరా అనెడు రీతి యీబొంగరమా
    వింతైన వీడియొ కనుల
    సుంతయు కనబడదు మీదు చుట్టుట లేదే!




    ReplyDelete
  155. అంతా త్రిప్పెడు వాడి క
    రాంతమ్మున కలదు తిరుగదెంతయు వినరా
    సుంతయు వాడు తలవకన్
    వింతైనది జీవితమ్ము విను భో! నగిరీ!


    ReplyDelete
  156. మరో ఉబోస :)

    అడుసు తొక్కనేల ? ఆ పుష్ప ఒకటవ
    పార్టు చూసి కూడ పార్టు రెండు
    చూడనేల ! లలిత! చూచిన పో టపా
    రాయ నేల వాచరంచు సూవె!

    ReplyDelete
    Replies
    1. // “….. టపా రాయనేల …..” //
      ఆ మాట మాత్రం నేననలేదు “జిలేబి” గారు 😏.

      Delete
  157. -
    అయ్యో! అని అనని కొరివి
    దెయ్యాలను సానుభూతి తిబిరియు లేకన్
    వయ్యంపు మాటలాడెడు
    గయ్యాళుల నేమనుట సఖా రాజన్నా /



    ReplyDelete
  158. -
    అన్నీ తనకే తెలుసను
    కున్నటి తెల్లోడికి తెలుగోళ్ళు సినేమా
    లెన్నైన చూడ గలిగిన
    సన్నాసులని తెలియదు కిసక్కుకిసక్కూ :(




    ReplyDelete
  159. -

    సహధర్మిణి కౌగిలిలో
    విహరించవలసిన క్రొత్త పెళ్లికొమరుడా
    ప్రహరీ గోడల నడుమ వి
    రహమున విహరింపవలె నరయగ హతవిధీ!



    ReplyDelete
  160. --

    చూసానిప్పుడె మీబ్లా
    గ్లో సానాపాత పోస్టులో వీడియొ! యెం
    తోసక్కగ తిరిగె సుమా
    పైసా వెచ్చమ్ములేని వ్యాపకమండోయ్


    ReplyDelete

  161. -

    బొంగరము విసిరెడు కళ ని
    జంగా నాకేలనో సజావుగ రాలే!
    చెంగున దూకెడు గోళీల్
    రంగీలా రోజులందు రాధనమాయెన్



    ReplyDelete
  162. -

    నేనొక జీరో అయినా హీరోనే

    నేనొక జీరో తెలివిడి
    లేనాకు! అయినను భువిని లెస్సగ నే చు
    ట్టాను ! కృషియె కారణమని
    నానమ్మకము ప్రగతి పథమందునడువగాన్




    ReplyDelete
  163. -
    తాతాశ్రీ!కొ.దె. శ్రీలు స
    దాతాండవ మాడు చుంద్రు! దానిని‌ గానన్
    వాతలొకరి‌కొకరిడుకొను
    టే తమ పనియొ అనునట్టు! ట్రేడ్మార్కు కతల్



    ReplyDelete
  164. -
    వేసుకొను హారములుగా
    పూసుకొనుచు పదముల సరి పుర్రెల మాలల్
    రాసుకొనుచుండు పద్యము
    లాసువుగా కొరివి దెయ్యమౌర జిలేబీ



    ReplyDelete
  165. -
    ఊరు పిశాచపురమ్మా?
    పేరు జిలేబియొ? తెలుపుడు విదురా! తాతా
    శ్రీ! రుజునామమ్ము కొదె
    శ్రీ?రూఢియొ? పుర్రెలన్ శిరీషము దాల్చున్?


    ReplyDelete
  166. -
    జనులకు బాధ్యత తెలియదు
    కనులు తెరిపిపడదు ! పూటుగా తాగిన వా
    ళ్ళను మించిన మూర్ఖశిఖా
    మణులు నటుల మోహమందు మతిబోవు గదా



    ReplyDelete