Tuesday, July 28, 2026

సమస్యా పూరణము

 

సమస్యాపూరణము 

ఉన్మత్తుండైన నృపతి యుద్దండుండౌ

మానడు మంచిని గోరు, గు
ణానుక్రమముగ విభుడు జనహితోన్మత్తుం
డైన నృపతి యుద్దండుం
డౌ నడచ బరిణెపురుగుల రౌద్రమ్మునయో

జిలేబీయము

19 comments:

  1. -

    దేవుళ్లెల్లరొకరని న
    మోవాకమిడదగు కాని మోకరిలి ప్రభుం
    డా వేంకటేశుని వినా
    దేవుడు లేడని పలికి మదిన్ పూజింతున్

    ReplyDelete
  2. -
    చోద్యంబుగ రఘురాముం
    డాద్యంతరహితుడొక శిశువై యర్చించెన్
    వేద్యంబుగ ఋషిమునులన్
    పాద్యాదులతోడు‌ సన్నిభత్వము తెలుపన్


    ReplyDelete

  3. చోద్యంబుగ రఘురాముం
    డాద్యంతరహితుడొక శిశువై యర్చించెన్
    వేద్యంబుగ ఋషిమునులన్
    పాద్యాదులతోడు‌ సన్నిభత్వము తెలుపన్

    https://youtube.com/shorts/gn0zeM4Gj6k?is=uM5BDdHsvUQhpKNo


    ReplyDelete
  4. -
    భక్షణములివిగొ గొనుడీ
    అక్షరకౌముది విరిసె, నహస్కరు ప్రభలన్
    వీక్షింప వేళ నిదియే
    తక్షణమే శంకరార్యు తలమున రండూ

    ReplyDelete
  5. -
    జగడములు తదుపరి తృటిన్
    సిగబట్టుకొనిరి
    భళారె శిష్యుఁడు గురువ
    య్యె గురులు శిష్యుండ్రగుటన్
    జగమెరిగిన సత్యమాయె
    సాఫ్ట్వేర్ కళలోన్

    https://youtube.com/shorts/vwpGIPOuxMA?is=BZIFjg2mvQhogI35



    ReplyDelete
  6. -
    குட்டி ப்பய்யன் இப்பவே கன்னடிக்கிரானே:)

    అగణితమైన పిరియమున
    మగని మొగముఁ జూచి, కనెను మగువ సుతుని వా
    డగుపించెను పో తండ్రి వ
    లె గుంభనపు నగవులన్ బలీయపు కనులన్


    రామ రామ
    జిలేబి

    ReplyDelete
  7. -
    https://youtube.com/shorts/ULvboz37KmE?is=u5fRAevfi77EPSu6

    ReplyDelete
  8. -

    గంటి కలయొక్కటిని యేసు కరుణ జూప
    విషముఁ ద్రాగి క్షీరమొసఁగె భేకభుక్కు
    ప్రభువు పాలించు మనలెల్ల పాపములను
    ద్రోలి పరుగిడి రండు ప్రత్యూష మందు

    జిలేబీయము

    ReplyDelete
  9. -
    తమ్ములు పెద్దన్నల తో
    రమ్ముల సంతస బరచి బరాతము గొని, మా
    యమ్మా! గావుమనుచు హా
    రమ్ము నిడెదరంట స్త్రీలు రమకున్ భక్తిన్


    ReplyDelete
  10. -
    శ్రీశంకరి కృప గరువము
    నాశార్థము నాడు దక్కె నా మనువకటా
    రాశిఫలముల దయ నిపుడు
    దేశద్రిమ్మరి బతుకు కుదేలు మనెగదా


    ReplyDelete
  11. -
    వామనుని కత వినెను యే
    మో! మాయను బన్ని వచ్చె నో చీమవలెన్?
    ధీమతి నగుదును నేనిదె
    చీమం జూచి భయపడెను సింహమ్ము గడున్




    ReplyDelete
  12. -

    ప్రాప్తించును బ్రహ్మపదము బలదర్పములన్

    తపమాచరింపగా ప్రతి
    భ పరిమళింప మనుజులకు ప్రాప్తించును బ్ర
    హ్మపదము; బలదర్పములన్
    కపటత్వముపెరుగు వినవె కంద జిలేబీ


    ReplyDelete
  13. -
    అబ్బురమైన నేత్రములు యామిని భామిని దీటు చూడ్కలా
    పబ్బుల కిక్కు మద్యములు పారిన కన్నుల కుర్రకారు పై
    కప్పుల చీల్చు గాత్రముల కైపుల రెక్కలనార్చు‌ మ్రోతతో
    గబ్బిలమా మనోజ్ఞములు గావె భవద్రమణీయవీక్షణల్


    ReplyDelete
  14. -
    అబ్బె నిశిరాత్రి చూడ్కలు నచ్చె పోవె
    గబ్బిలమ నీ కనులు; మనోజ్ఞములు గావె
    శంకరాభరణమ్మున చక్కనైన
    పూరణలు నీకు వేనోళ్ల పొగిడికలును


    ReplyDelete
  15. -

    భగభగ బంగారమ్ము! బ
    డుగుజీవికి మాటలే గడు పసిడి గానన్
    నగలు కొనెదనని చెవిలో,..
    “సిగ లేని సతికిఁ,... బువులిడ శ్రేయమ్మె యగున్

    ReplyDelete
  16. -
    పగలే వన్నెల చూపు తోడు మగడిన్ బాళిన్ ప్రకాశమ్ముగా
    జగమే వూయల గాను జేయ బిలువన్ జాప్యమ్ములేలా!వడిన్
    మొగుడై బుట్టను తప్పుగాదు చెవిలో మూరంత తోరమ్ముతో
    సిగ లేనట్టి పడంతికిన్ బువులిడన్ శ్రేయమ్ము మోదంబగున్


    ReplyDelete
  17. -
    బ్లాగులందు వ్యాఖ్యలతో పదపడచునిదె
    పద్యములు సెప్పకుడు విన్న బాపమగును
    గూగులమ్మి నిదురపోయె గోడు గోడు
    మనిరి పంచదశపులోక మానుజులరె


    ReplyDelete
  18. -
    కాము కవివరులము గనమలంకారపు
    పదములు ప్రభు! యీ సభకు నమనము
    లిడుచు హృదయమును తెరిచి వ్రాసినట్టి యా
    మూగవాని భాష ముదముఁ గొలుపు


    ReplyDelete
  19. ~-
    వేగ మెంతొ కలిగె వాడి వేడుకైన జాడగా
    రాగ తాళ భావ మెల్ల రంజరిల్లె నీటుగా
    బాగు బాగు భావమెల్ల పద్యమంత నీటుగా
    మూగవాని భాష విన్న మోదమెంతొ గల్గుగా


    ReplyDelete