బ్లాగ్వాసుడి మోక్ష ప్రాప్తి భాగం రెండు
..... మొదటి భాగం ఇక్కడ
... శ్రీకాంతుడు టపా తరువాయి టపా చదువు తూంటే ప్రవీణుడు శిలా ప్రతిమలా నిలబడి విన సాగాడు . వింటూ వింటూ ఆనందం తాళ లేక జుట్లు పీక్కోవడం మొదలెట్టాడు . రాక్షస శరీరం లో ని జుట్లు అట్లా కుప్పలు తెప్పలు గ నేల మీద పడి పోతే , ఆతని శరీరం కూడా సౌందర్య రూపమై తేజోమయమై మళ్ళీ బ్లాగ్రాజు ప్రవీణుడి గా మారి పోయి తన ప్రొఫైల్ ఫోటోలో లా చిరునవ్వులు చిందించ సాగాడు .
ఆ తరువాత శ్రీకాంతుడు, ప్రవీణుడు ఆదరా బాదరా నగరానికి వెళ్ళేరు . అప్పుడు ప్రవీణుడు మంత్రి శ్రీకాంతుడి తో , " నువ్వు వ్రాసిన బ్లాగ్రాతలు మా గొప్పగా ఉన్నాయి ; జుట్లు పీక్కోవ టానికి వీలుగా ఉన్నాయి. ఇట్లాంటి టపాలు మరిన్ని వ్రాసి , నన్నూ , నా బ్లాగ్దేశ ప్రజలను ఆనంద పరచు" అన్నాడు .
దానికి శ్రీకాంతుడు , 'మహా ప్రభో ప్రవీణ్ మహారాజా ! ఇట్లాంటి టపాలు ఇక మీదట వ్రాయటం నా తరం కాదు . మిమ్మల్ని దక్కించు కావాలన్న కోరిక తో మాత్రమె వీటిని కట్టి మాలిక లో వదిలాను . ఇక మీదట వేరే ఎవరి చేత నైనా ఇట్లాంటి టపాలు వ్రాయించు కోండి ' అంటూ చేతులెత్తేసేడు .
బ్లాగ్రాజు ప్రవీణుడు తన బ్లాగ్ సంస్థానం లో ని శంకరాభరణం కొల్వు లోని పండితుల కు, శ్యామలీయం మొదలైన బ్లాగ్ శ్రేష్టులకు, పంతుల జోగారావు లాంటి మంచి కథా మంజరి సాగించు కథకులకు శ్రీ లలిత లాంటి జిలేబి కథానిక లు వ్రాయు ప్రౌఢ మహిళా మణులకు పిలుపు నిచ్చి శ్రీకాంతుడు వ్రాసిన టపాల లాంటి టపాలు కోకొల్లలు గా వ్రాయ మని ఆదేశించాడు .
వాళ్ళందరూ ఆ టపాలని చదివి రాజు తో, ' హి రాజన్ ! మేమే కాదు . సరస్వతీ దేవిని ఉపాసించే సాహితీ వేత్త లెవరూ ఇట్లాంటి టపాలు వ్రాయడానికి ఒప్పుకోరు ' అంటూ ఆ టపాలు చదివిన వేడి తో జుట్లు లాక్కుంటూ వెళ్లి పోయేరు .
అది విని ప్రవీణుడికి విపరీత మైన కోప మొచ్చింది . తనే బులుసు సుబ్రహ్మణ్యం వారిలా, శ్రీకాంతుడి టపా లని సెల్ఫ్ పబ్లిషింగ్ క్రింద పీ డీ ఎఫ్ లా ప్రచురించి , తన బ్లాగ్ దేశం లో ని లక్షలాది ప్రజలకు పంచి పెట్టాడు ఈమెయిలు ద్వారా.
కినిగె లో దానికి టాం తాం వేయించి ఫ్రీ గా డౌన్లోడ్ చేసు కోవడానికి కినిగె కి అమెజాన్ కి సబ్సిడీ లు అంద జేసాడు . అంతే గాక , వాటి పై ఆకర్షణీయం గా నెమలి కన్ను వారి చేత రివ్యూ వ్రాయించేడు, వేణువు బ్లాగ్ ద్వారా, దానికి ఎదురుగా సెన్సేషనల్ హరి బాబు ద్వారా కౌంటర్ క్రిటికల్ రివ్యూ కూడా వ్రాయించి , అబ్బా దాంట్లో ఏముందో అని అందరి చేతా చదివి జుట్లు పీక్కు నే టట్టు చేయించే డు .
అంతే గాక జిలేబి సౌజన్యం తో ఆంధ్ర జ్యోతి నవ్య లో పది వేల వరహాల కిన్నూ, గుండు వారి సౌజన్యం తో నమస్తే తెలంగాణా లోనూ , శ్రీకాంతుడి లా టపాలు వ్రాయ గలవారికి బహుమతి ప్రకటించేడు కూడాను .
సాహితీ వేత్త లెవరూ పది వేల వరహాలకు ఆశ పడ లేదు . కానీ నాన్ స్టాప్ నాన్సెన్స్ ఏంకర్ల లా ఖబుర్లు చెప్ప గలవాళ్ళు , కట్ పేస్ట్ సాహిత్యం చేయగలిగే జిలేబి లాంటి వాళ్ళూ మాత్రం చాలా మంది ముందుకు వచ్చారు . క్రమంగా అలాంటి బ్లాగులూ టపాలు చాలా అగ్రిగేటర్ లో రావడం మొదలెట్టేయి . బ్లాగ్ వీక్షకులకి కూడా అవి బాగా నచ్చటం మొదలెట్టేయి . ఆ పై ఆ బ్లాగులో ళ్ళకి కూడా అవి మంచి పేరుని తెచ్చి పెట్టేయి . చదివే వాళ్లకి అవి 'కిక్' ని కలిగించడం మొదలెట్టేయి .
ఇలా కొంత కాలం జరిగేక బ్లాగ్దేశం లో ని కవి, పండితులకు సాహితీ వేత్తలకు ఆదరణ లేకుండా పోయింది . తప్పించి శ్యామలీయం లాంటి వాళ్ళు రవ్వంత దిటవు చేసుకుని అయ్యలారా అమ్మలారా ఇట్లా నిష్కారణం గాపనికి రాని టపాల తో , కామింట్ల తో బ్లాగు లోకాన్ని దుర్వినియోగం చేయకండి అని చెప్ప బూనుకున్నా అట్లాంటి వాళ్ళని ఛీ ఛీ అని చీత్కరించడం మొదలెట్టేరు .
అప్పడు వాళ్ళంతా పంచ దశ లోకం నించి బయట పడి ఆదరా బాదరా నగరాన సమావేశమై విషయం చర్చించాక - ఇటువంటి ఇబ్బంది కలగడానికి కారణం బ్లాగ్వాస మహాముని మాత్రమె చెప్ప గలడను కున్నారు .
'ఆ బ్లాగ్వాసుడు మహా కోపిష్టి . ఆయన మనందర్నీ కలిపి శపిస్తే ఏం చేయాలి' అని ఒక పండితుడు అడిగాడు .
అందుకు మిగతా బ్లాగ్పండితులు ' ఈ బ్లాగ్దేశం లో ఉండి పనికి రాని టపాలు చదవటం కంటే బ్లాగ్వాస మహాముని శాపానికి గురి కావటమే మేలు ' అని ఏక కం టం తో అన్నారు .
వాళ్ళు శ్రీకాంతుడి బ్లాగు డబ్బాని టపాలని తీసుకుని బ్లాగ్వాసుడి ఆశ్రమానికి వెళ్ళారు . వాళ్ళు వెళ్ళే సరికి తదేక ధ్యానం తో తపస్సు చేసుకుంటున్న బ్లాగ్వాస మహాముని కి వాళ్ళ కోలాహలానికి తపో భంగం అయ్యింది .
ఆయన కళ్ళు తెరిచి క్రోధ వదనం తో వారి వైపు చూపులు సారించాడు . బ్లాగ్ పండితులు పాహి పాహి అంటే కొంత శాంతించి వచ్చిన కారణ మడిగి శ్రీకాంతుడి టపాలని ఏక బిగిన గ్రహించి , ప్రసన్న వదనుడు అయి పోయి , "బ్లాగ్ సాహితీ వేత్త లారా ! మీ కారణం గా, ఈ శ్రీ కాంతుడి టపాల కారణం గా నాలోని కోపం మొత్తం నశించి పోయింది ! నేను మోక్షం కోసం ఎన్నో సంవత్సరాలు గా తపస్సు చేస్తున్నా ! కానీ కోపాన్ని విడిచి పెట్ట లేక పోవటం మూలాన నాకు మోక్షం గిట్టటం లేదు . ఈ పని లేక వ్రాసిన టపాలు చదివేక నా కోపం మొత్తం నశించి పోయింది " అన్నాడు .
'మహా మునీ ! అదెలాగా ! ఈ కాలక్షేపం కబుర్ల, బటానీ పేపర్ కబుర్ల టపాలు చదివితే మీకు కోపం తగ్గి పోయిందా ! కొంచెం వివరించండీ ' అన్నారు వారిలో దీర్ఘ కాలం గా విశ్రామ పండితు డైన కంది శంకరా మాత్యులు .
(సశేషం )