Monday, March 16, 2009
పుంగనూరు జవాను కథ
బ్రిటిషు జమాన లో తాసిల్దార్ ఆఫీసు లో ఓ జవాను ఉండేవాడట ! వాడ్ని "ఒరేయ్ జవాను చిత్తూరు వెళ్లి కలెక్టరు గారున్నారా చూసి రారా" అంటే వాడు ఖచ్చితింగా చిత్తూరు వెళ్లి కలెక్టరు ఉన్నారా లేదా అని చూసి ఇంకా ఎట్లాంటి వాకబు చెయ్యకుండా టపీమని తిరిగి వచ్చి ఉన్నారనో లేకుంటే లేరనో చెప్పేవాడు.
"ఒరేయ్ నేను రావచునో లేదో అడిగావారా? " అంటే వాడు తల గోక్కుని "మీరు ఆ విషయం అడగమని చెప్పలేదు కదండీ? " అనే వాడు.
ఈ కథా క్రమం గా ఈ నానుడి ఏర్పడింది. ఇది జాతియమా లేకుంటే నానుడియా యా అన్నది నాకున్న సందేహం ! ఎంతైనా పుంగనూరు చిత్తూరు జిల్లాలో ఉండడం వల్ల ఇది రాయలసీమ మాండలీకం కూడం కాక పోవచ్చు. దీని పరిధి చిత్తూరు జిల్లా వరకే పరిమితి అయి ఉండవచ్చు!
ఛీర్స్
జిలేబి
Saturday, March 14, 2009
నాకు సలహా కావాలి
నా బ్లాగులోని టపాలని నేను PDF లో కి మార్చి ఈ - పుస్తకం గా వెలువరిన్చాలని ( వచ్చిన వ్యాఖ్యలతో సహా) అనుకుంటున్నాను. మీలో ఎవరికైనా ఇది ఎలా చెయ్యడమో తెలిస్తే దయ చేసి తెలియ జేయ్యగలరు. నా PDF దాకుమేంట్ తయారైనప్పుడు సాంకేతిక సహాయం అన్న పెరుకింద మీకు కృతజ్ఞతలు తెలియ జేసుకుంటాను.
ఛీర్స్
జిలేబి.
రాజకీయ వేత్తలు బహు పరాక్ !
ఈ మధ్య సినిమా నటీ నటులు ప్రభంజనం లా రాజకీయం లోకి దూసుకు వచ్చేస్తున్నారు!
కనీ వినీ ఎరుగని రీతి లో వీళ్ళు నేనంటే నేనని ముందుకు వచ్చి ఉన్న పార్టీ లోనో లేకుంటే మన చిరంజీవి గారిలా కొత్త పార్టీ తోనో ప్రజావాహిని జన జీవితం లో "కిక్కు" కలిగిస్తున్నారు!
ఈ మధ్య నటీమణి నగ్మా ముంబై నాదేనని పై ఎదలపై చెయ్యేసి మరీ ఘంటాపథం గా ఘోషిస్తున్నారు కాంగ్రెస్స్ హెడ్ క్వార్టర్స్ తో!
రాజకీయవేత్తలు మీరెప్పుడైనా ఇలాంటి "కిక్కులు" సినిమా ఫీల్డ్ లో కెళ్ళి దుమారం లా చెయ్య గలిగారా? లేదు. అంటే, దీని వల్ల తెలియ వచ్చే దేమి టంటే రాజకీయం చెయ్యడానికి ఎవ్వరైనా చెయ్య వచ్చు ! అదీ పాపులారిటీ ఉన్న సినీ నటీ నటులకి మరీ తేలిక! జన మహా ప్రభంజనం లో వాళ్ళకి ఎప్పుడు ఆహ్వానమే!
రెండో పాయింటు దీని వల్లే తెలిసేది ఏమిటంటే రాజకీయ వేత్తలు సినిమా ఫీల్డ్ లో రాణించలేరు కాని సినిమా వాళ్లు రాజకీయమ్లో భేషుగ్గా ఇమిడి పోగలరు!
వాళ్ళకి ఈ ఫీల్డ్ అచ్చోచ్చినదని శ్రీ రామారావు గారు ఆల్రెడీ నిరూపించి చూపించారు !
ఈ కారణాల రీత్యా రాజకీయ వేత్తలు బహు పరాక్! మీ సదరు ఉద్యోగాలకి మీరు తిలోదకం ఇవ్వడానికి అంత్య కాలం చాల దరిదాపుల్లో నే ఉన్నట్టుంది! సో ఈ ప్రస్తుతపు మాంద్యం లో మీ ఉద్యోగాలు హుషు కాకి కాకుండా చూసు కొండి!బహు పరాక్! బహు పరాక్ ! బీ హోషియార్! బీ హోషియార్!
కొసమెరుపు: ఈ టపా ని మా అమ్మాయికి చూపిస్తే "మరీ నీ చోద్యం గాని రాజకీయ వేత్తలు సినిమా లోకి వస్తే సినిమా ఎవరు చూస్తా రే అమ్మా ! అయినా రాజకీయం వాళ్ళని సినిమా వాళ్లు రానిస్తారా అంటా ? ఆ ఫీల్డ్ ఆల్రెడీ "క్లోసేడ్ సర్క్యూట్" కాదే? రాజకీయం వాళ్ల తెలివి ఏంటో మనకి తెలియదటే? సినిమా వాళ్లు మరీ బుర్ర ఉన్న వాళ్లు కాదటే ? " అని సందేహం లేపింది!
ఛీర్స్
జిలేబి!
(ఈ మధ్య నటీమణి నగ్మా ముంబై నాదేనని ఘోషిస్తున్నారు కాంగ్రెస్స్ హెడ్ క్వార్టర్స్ తో అన్న వార్త చదివాక వచ్చిన జ్ఞానోదయం తో !)
Thursday, March 12, 2009
వరూధిని చిత్రంలో శ్రుతిమించిన శృంగారం !
కొసమెరుపు:
అన్నమయ్య కే ద్విపత్ని సమేతం గా ఆసేతుహిమాచలం తన చిత్రం ద్వారా ప్రాచుర్యాన్ని తెచ్చిన మన రాఘవేంద్ర రావు బీ. ఎ. గారికి ఈ వరూధిని ఇంతదాకా తట్టక పోవడానికి కారణం ఏమి ఉంటుంది చెప్మా?
ఛీర్స్
జిలేబి.
లంకె:
1. http://www.cscsarchive.org/MediaArchive/art.nsf/(docid)/4C9F991856F2F392E5256D06003DF1DD
http://www.cscsarchive.org/MediaArchive/art.nsf/94ff8a4a35a9b8876525698d002642a9/4c9f991856f2f392e5256d06003df1dd/$FILE/Te230122.pdf
Wednesday, March 11, 2009
గొల్టి గాడి గోడు - చిత్తూరు గొల్టీలు
"ఎన్నబ్బ గొల్టి కథ అర్థమాచ్చ? "
ఛీర్స్
జిలేబి.
Sunday, March 8, 2009
బ్లాగ్లోకం లో బంగరు పాప
మీ బ్లాగేస్వరి జిలేబి.
Wednesday, March 4, 2009
చెప్పుల బాబాయి - ఫైనాన్స్ గీత
ఈ చెప్పుల దుకాణం ఈయన ఎప్పుడు పెట్టేదో నాకు తెలీదు. ఎందుకంటే నేను పుట్టి బుద్ధి వచ్చి నప్పటి నించి ఈ బాబాయి దుకాణం ఉంది కాబట్టి ఈయన మా వాడకందరకి బాబాయ్! ఆ మధ్య మా వీధికో కొత్త ఫ్యామిలీ వచ్చింది. నా చెప్పులు కుట్టుకునేందుకు వీధి చివర్న ఉన్న బాబాయి అంగడికి వెళితే ఆ ఫ్యామిలీ పెద్ద తన చెప్పులు కుట్టించుకుంటూ "ఏమిటోయి చెప్పులు కుట్టేదాని కి 10 రూపాయలు తీసుకుంటావ్ ఎన్ని రోజులకి గ్యారంటీ? అనడమున్ను చెప్పుల బాబాయి సీరియస్ గా ఈ కొత్తాయన వైపు చూడడమున్ను ఆ పై ఈ గీతోపదేశం చెయ్యడమున్ను కనుల ముందు చేవులాస్చర్యంగా సాగి పోవడమున్ను జరిగింది.
"ఏమండి ఓ పది రూపాయలిచ్చి పాత చెప్పుకు గ్యారంటీ అడుగుతారు? ఏమి గ్యారంటీ ఉందని ఈ వీధి మొదట్లో ఉన్న బ్యాంకులో డబ్బులు పెట్టేరు? తెలియకడుగుత మీరు ఆ బాంకులో డబ్బులు పెట్టి ఉంటే దీనికన్నా గ్యారంటీ గా తిరిగి వస్తుందని చెబ్తారా? "
పోనీ మన మున్సిపాలిటీ కోన్సేల్లెర్ మీకీ ఎ సహాయం చేస్తాడని గ్యారంటీ? మీ మంత్రులు మీకే మేలు చేస్తారని గ్యారంటీ కింద వాళ్ళని ఎన్నుకున్నారు? ఆ మాటకీ వస్తే మీ కి ఎ గ్యారంటీ ఉందని దేశం మంత్రులు వరల్డు బాంకులో అప్పు తీసేసుకుంటున్నారు? ఈ లా ఈయన ఉపన్యాసం మొదలెట్టేసరికి ఆ పెద్దాయన కి ఏమి పాలు పోక మనకెందుకులే అని సీరియస్ గా ఓ లూక్కు విసిరి వీసా వీసా వెళ్ళిపోయేరు. నాకైతే నవ్వాగ లేదు. ఏమి బాబాయ్ మరీ అంత సీరియస్ అయి పోయేవ్ అంటే " ఎమున్దమ్మ అంతా ఈ మధ్య గ్యారంటీ లదగతం మొదలెట్టేరు ! అదేదో అమెరికా దేశం లో ఇన్సురన్సు కంపనీలే మునిగి పోతావుంటే నా చెప్పులకి ఆ కుట్టుకి ఈళ్ళు గ్యారంటీ లదిగితే నేనేమి చేసేది! ఈ కుట్టే దారం నాదా ? ఈ సూది నాదా? లేకుంటే ఈ చెయ్యి నాదా? ఈ కన్నూ నాదా? - వీటి కన్ని టికి గ్యారంటీ ఇచ్చేవాడు ఉన్నాడో లేదో ఏమి గ్యారంటీ అంటూ వేదాంతము లోకి దిగి పోయీడు!
ఛీర్స్
జిలేబి.
Tuesday, March 3, 2009
గూగుల్ అయ్యవారు - యాహూ అమ్మవారు
ఏమిటోయ్ మీ దేశం లో జనాలు ఎట్లా చదువు సాగిస్తున్నారు? అని అడిగితె అదేముంది ఎ ప్రశ్న కైనా గూగుల్ గాని యాహూ చేస్తేగాని సరిపోతుంది - చాంతాడంత ఆన్సర్ రాయవచ్చు అని కొట్టి పారేసాడు.
అదేమిటి విడ్డూరం ఇంక పిల్లకాయాకి ఎలారా విజ్ఞానం వస్తుంది? అని అడిగితె - విజ్ఞానం ఎందుకె పిన్నమ్మ - ఎ చదువైన "ధనం మూలం ఇదం జగత్" కొరకే గదా గూగుల్ అయ్యవారు యాహూ అమ్మవారు ఇంటింటా జ్ఞానాన్ని క్షణాల్లో ఇచీస్తుంటే - జ్ఞానాన్ని సముపార్జించుకుని లేకుంటే మూటకట్టుకుని ఏమి చేస్తాము ? అని శివాజీ బాస్ లెవల్లో అయిన ఈ జ్ఞానం ఇవన్ని మనం పోయేటప్పుడు మనతో బాటు వస్తాయా అని వేదాంతము వేరే చెప్పాడు!
అవురా ఈ జమానా కుర్రాళ్ళు ఏమి ఫాస్ట్ రా బాబోయ్ అని బుగ్గ నొక్కేసుకున్నా! అంటా విష్ణు మాయ గాకుంటే మరేమీ తన్టారూ?
మీ జిలేబి.
Thursday, February 26, 2009
అమ్మాయి పెళ్లి
అక్కయ్య ఆశీర్వదించి వ్రాయునది. ఉభయ కుశలోపరి.
అమ్మాయి సౌమ్య పెళ్లి విషమై కాబినెట్ మీటింగ్ బామ్మ ఇవ్వాళ పెట్టింది.
మన ఇంటి పెద్ద మంత్రులు ఐన అన్నయ్యలు హాజారైనారు మీటింగుకి. మీ బావగారు నిమిత్త మాత్రులు కాబట్టి బామ్మే మీటింగుని ఖరారు చేసి ఉచిత పీఠాన్ని అలంకరించింది.
మూడోతరం మంత్రులు అంటే చిన్న చితకా కుర్రకారు అందరు క్వాలిటి కంట్రోల్ ప్రోగ్రాం కోసం దేశాల మీద ఉన్నారు కాబట్టి (నిన్నూ చేర్చి) వాళ్ళంతా గైరు హాజారు మీటింగుకి.
దరిమిలా బామ్మ నీ పెళ్లి ఖాతా వెతికి దాని ప్రకారం అమ్మాయి సౌమ్య పెళ్లికి బడ్జెట్ తయారుచేసింది. అందు ప్రకారం పెళ్లి ఖర్చులు వెరసి పది రెట్లు ఎక్కువై పోయినాయి. బడ్జెట్ బ్రతుకులు కాబట్టి బామ్మ బుగ్గ నొక్కేసుకుని బావ గారి వైపు చూసింది - మీ బావగారు ఎలాంటి ఫీలింగు లేకుండా నా వైపు చూడడం నేను ఏమి చెయ్యాలో పాలుపోకుండా మన ఇంటి పెద్ద మంత్రులు వైపు చూడడం వాళ్లు ఏమి చెయ్యాలో తెలియకుండా బామ్మ వైపు చూడడం బామ్మ తీక్షణ ద్రిష్టి తో మమ్మల్ని వీక్షించి "ఒరేయి బడుద్దాయిలు - మీరేమి చేస్తారో నా కవసరం. ఎట్లా చేస్తారో నాకనవసరం. అమ్మాయి పెళ్లి మూడు నెలల్లో ఖరారు అయిపోవాలి " అని అల్టిమేటం జారి చేసింది.
ఈ తంతు తో ఇవ్వాల్టి కాబినెట్ మీటింగ్కి బామ్మ వీడుకోలు చెప్పి అందర్నీ పని మీదికి అంటే అమ్మాయి సౌమ్య పెళ్లి కి పురమయ్యించడం తో నా మనసు కొంత కుదుట పడింది. ఈ మీటింగు తరువాయి మీ బావగారు యథా ప్రకారం దిన పత్రిక పడక కుర్చీలో కూర్చుని తిరగేయ్యటం మొదలెట్టేరు ! ఏమి చేతును నా చిట్టి చెల్లీ?
ఇదీ కథ!
బావగారికి నా నమస్సులు. !
ఇట్లు
నీ పెద్ద అక్కయ్య
భామతి.
Saturday, February 21, 2009
చిత్తూరోళ్ళ కథ-౩
ఈ మూడో ఎపిసోడ్ లో నాకు తెలిసిన చిత్తూరోళ్ళ తెలుగు గురిన్చి రాస్తాను. ఈ చిత్తూరు జిల్లాలో అదీను చిత్తూరులో తెలుగు భాష మీద మక్కువతో తెలుగు ని నేర్చుకుని తెలుగు లో రచనలు చెయ్యగల సత్తా ఉన్న తమిళులు ఉన్నారు. కాని పత్రికా ముఖముగా వీళ్ళు ప్రాముఖ్యులా అన్న విషయం నాకు తెలియదు.
రాయల సీమ రాళ్ళ సీమ లో భాషా ఉద్యమం అంటూ ఎప్పుడైనా జరిగిందా అన్న విషయం నాకు తెలియదు. కాని ప్రముఖులైన మధురాంతకం రాజారాం, కలువకొలను సదానంద, మునిసుందరం, లాంటి ఆ కాలపు రచయితల్ని వదిలి పెడితే ఈ మన ప్రస్తుతపు జమానా లో చిత్తూరు నించి ఎవరయినా వ్రాస్తున్నారా లేక కథా వ్యాసంగం ఎవరైనా చేస్తున్నారా అంటే సందేహమే! దీనికి కారణం ఏమయి ఉండవచ్హన్నది నా చిన్ని బుర్రకి అందని విషయం!
ఈ విషయం గురించి ఎవరికైనా ఇంకా ఎక్కువైన సమాచారం తెలిసి ఉంటే కామెంటగలరు!
21-02-2009 అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం పురస్కరించుకుని శుభాకంక్షలతో
జిలేబి.
PS: ఈ పై టపా బరహ నోటేపాడ్ సహాయం తో రాసినది. బాగుందని ఆశిస్తాను. Its a really good unicode software. Thanks to: http://www.baraha.com