ఈ మధ్య ఈ ప్రశ్న ఉదయించింది. మహానుభావులు ఇచ్ఛా మరణం పొందుతారంటారు - ఉదాహరణకి కపాల మోక్షం ద్వారా ప్రాణాన్ని త్యజించడం లేక సజీవ సమాధి కావడం లాంటివి. జ్ఞాని ఐన మహానుభావులు ఈ లాంటి మరణం తో ఈ లోకాన్ని విడిచి పెట్టడానికి ఆత్మ హత్య కి సాదృశ్యం ఉన్నదా అన్నదే నా సందేహం. సామాన్య మానవుడు తాళలేని కష్టాలతో ఇక ఈ జీవితం తాను భరించడం లేడనుకుని ఆత్మ హత్య కి పాల్పడడం లేకుంటే ఆత్మ హత్యే సమస్యకి పరిష్కారం అన్న ఆలోచనతో జీవితాన్ని ముగించడం జరుగుతుంది. ఇదే మహానుభావులు శాస్త్రాలు "ఆత్మ హత్య మహా పాతకం" అంటారు! మరి నా కర్థం కాని విషయం ప్రాణాన్ని కపాలం ద్వారానో లేక సజీవ సమాధి ద్వారానో త్యజించడం ఆత్మ హత్య కాదా? తార్కికానికి అందని ఈ విషయం ! బ్లాగు రీడర్లు దీన్ని గురించి అభిప్రాయం తెలుప గలరు. ఇది పెద్ద మనుషుల ఫార్సు ఆలోచనలా ఉన్నది నాకైతే- అంటే పెద్దవాళ్ళు చేస్తే ఓ న్యాయం చిన్నవాళ్ళు చేస్తే మరో న్యాయం లాంటిది?
జిలేబి.
ఎవరు వృద్ధులు?
-
నేడు వృద్ధుల దినోత్సవంశర్మ కాలక్షేపంకబుర్లు-ఎవరు వృద్ధులు?
Posted on జనవరి 29, 2015
*చిత్రగ్రీవుడు** అనే పావురాల రాజు, ఒక రోజు తన పరివారంతో ఆహారం కోసం ...
10 hours ago