పాత సామెత ఉండనే ఉంది. ఆకు మీద ముల్లు పడ్డా, ముల్లు మీద ఆకు పడ్డా నష్టం మరి ఆకుకే అని.
ఆ తీరులో , మన బ్లాగులని, బ్లాగరులని గమనిస్తే, ఒక విషయం స్ప్రష్టం గా కానవస్తుంది.
పాపం ఈ అమాయక బ్లాగర్లు (ఈ జిలేబి తో చేర్చి) ఏదో అల్లా టప్పా గా అలా 'నేనెందుకు బ్లాగు మొదలెట్టాను , చదువరులారా నన్ను ఆశీర్వదించు డీ అని వినమ్ర ముగా పలికి బ్లాగు మొదలెడుతారు.
ఇక అప్పట్నించీ వీరి కనా కష్టాలు మొదలు.
ఓ టపా రాసేక, అమ్మయ్య అని ఊపిరి పీల్చు కునే సమయలోపలె, టపా కి వెల్లువగా వచ్చి కామెంటుల తుంపరలు పడతాయి - 'మీకు బ్లాగ్ లోకమునకు ఇదే, మా సుస్వాగతం', మీరు ఆ డిపార్ట్మెంటు వారా, ఐతే మీరే మా మొదటి ఈ స్టైల్ బ్లాగరు, ఈ బ్లాగ్లోకం మీకు కొంగొత్త ఐడియా లు ఇవ్వు గాక లాంటి ఆశీర్వచనములు కోకొల్లలు గా వీరి కి వస్తుంది.
ఇక చూడండి మజా, - రాసే వాడికి చదువరి లోకువ చందాన టప టపా తమ జ్ఞానం అంతా బ్లాగ్ రూపేణ బహిష్కారం అవుతుంది. _ ఈ వ్యాక్యం లో ఏదో తప్పుందే, ఏమిటి చెప్మా ?
ఇక అక్కడ్నించీ దురద గొంటాకు ఎఫ్ఫెక్టు మొదలు. మెల్లి గా కామెంటడం మొదలెడతారు. తమకొచ్చిన కామేన్తులకి నెనర్లు పలుకుతారు. వేరొకరి టపా కి జేజేలు పలుకుతారు.
ఇంకా కొంచం ముందుకెళ్ళి, అప్పుడప్పుడూ , ఎవరినైనా అలా మరీ తీవ్రం గా గోకేసారనుకొండీ, ఇక ఉన్నది తంటా, కామెంటుల హోరాహోరి వరల్డ్ వార్ మొదలు.
ఇలా, పాపం అసంస్ప్రుస్య అయిన వాళ్ళు , బ్లాగటం అనే దురద గొంటాకు మీద పడి ఆ పై, ఆ దురద గొంటాకు ఎఫ్ఫెక్టు కి బలి అయి పోతారు.
దీనికి పరాకాష్ట, వారే దురద గొంటాకు గా రూపాంతరం చెందడ మన్న మాట. !
ఇంతటి తో ఈ దురద గొంటాకు సమాలోచనా విశ్లేషణకి 'కామా పెట్టి, ఈ దురద ఎఫ్ఫెక్టు ఎంత మందికి ఉందొ వేచి చూస్తాను. -
దురదస్య దురదః ,
జిలేబి నామ్యా దురదగొంటాకు హ !
చీర్స్
జిలేబి.