Saturday, November 12, 2011

2011 సంవత్సరపు ప్రాంతంలో బ్లాగ్వ్యవసాయం చేసే వారి సామెతలు

బ్లాగ్ రాయటానికి కామెంటు కౌంట్లు పనికి రావు

'తిం కిన ' కొద్దీ టపా, మూడు కొద్దీ కామెంటు

బ్లాగు మీద రాతలు కూటి కైనా పనికి రాదు (ఇది జ్యోతక్క  గారికి వర్తించదు!)

అంతర్జాలం లో పొత్తు లాగ్ అవుట్ తో సరి

టపా కి సైజు , కామెంటు కి నిబద్దత ఉండవలె

రాసిన టపాలన్నీ హిట్లయితే , ఇక రాయడానికి ఏమీ ఉండదు

బ్లాగు కి టెంప్లేటు పుష్టి , టపా కి కంటెంటు పుష్టి

అరవ బ్లాగు లో తెలుగు కామెంటులు పండవు

బులుసు బ్లాగుకు నవ్వులు, భారారే బ్లాగు కి తెక్నీకులు

బ్లాగరు పేరు జిలేబి ఐతే టపా తియ్య నౌనా ?

అన్ని టపాలకి అమెరికా టైము

టపా రాయటానికి శుక్ర వారము, కామెం ట డానికి శనివారము

కామెంటినవాడికి నెనర్లే మిగులును

కామెంట్లతో నిండిన టపా కన్నుల పండువగా ఉండును

టపా లు లేని బ్లాగు, మూత బడ్డ సైటూ పనికి రాదు

కామెంటులు  ఇచ్చు కిక్కు, ఈనాడు తిరగేసి చదివినా రాదు

టపా కి మేటరు సిద్ధము చేసుకుని టపా రాయవలె

మేటరు లేని బ్లాగు,  కామెంటులు లేని టపా ఒక్కటే

టపా కి ఏడు లైన్లు, కామెం ట డానికి నాలుగు లైన్లు

గ్రిప్పు చెదరక టపా రాయ వలె

కంటెంటు ఉన్న టపాకి చదువరి ఎక్కువ

సమయము చూసి టపా పబ్లిషు చేయ్యవలె (దీపావళీయం  లాగా అన్నమాట )

అనానిమస్సు కామెంటు టపాకి చేటు , వివాదభరిత టపా దూషణల కి మూలం

000000000000000000000000000000000000000000

కొంత కాలం మునుపు రాసిన 'బ్లాగ్ వెతలు ' చదవ దలిస్తే ఇక్కడ 'క్లిక్కండి '

000000000000000000000000000000000000000000


చీర్స్ చెబితే జిలేబి
నెనర్లు చెబితే తెలుగు బ్లాగరు

చీర్స్
జిలేబి.

పీ ఎస్: ఈ టపా కి ప్రేరణ భారారే గారి టపా 1920 సంవత్సరపు ప్రాంతం లో వ్యవసాయం చేసే  వారి సామెతలు )

14 comments:

  1. అందరూ బ్లాగు రచయితలైతే కామెంటేది ఎవరు ? ( అందరూ పల్లకీ....)

    ReplyDelete
  2. స్వానుభవమున చాటు సందేశమిదే

    ReplyDelete
  3. మీ టపాకి నాదో చిన్న సామాత జత చేయనా..
    సమాచారమున్న అమ్మ ఏ టపా అయినా పెడుతుంది.
    ధన్యవాదములు

    ReplyDelete
  4. @జాన్ గారు,

    అందరూ బ్లాగర్లైతే, ఒకరికొకరు ఓదార్పు కామెంట్లు ఇచ్చుకోవల్సినదే !

    @శర్మ గారు,

    స్వాను 'భావమూల్' 'చాటు ' సందేశమూల్'

    @జ్యోతిర్మయి గారు,

    మీ సమాత మోత అదిరింది. మరి ఈ సమాచారమున్న 'అమ్మ' ఎవరండీ? విశదీకరించగలరు.

    కామేన్టిన అందరికీ నెనర్లు ( కామేమ్టిన వారికి నెనర్లు మాత్రమె మిగులును అని సామెత మరి)

    చీర్స్
    జిలేబి.

    ReplyDelete
  5. మీ సామెతలు బాగున్నాయి
    కి. ప. దొ . న
    మీ పేరడీ పోస్ట్లు కెవ్వ్ కేక
    @ జాన్
    >>అందరూ బ్లాగు రచయితలైతే కామెంటేది ఎవరు ?
    అంటే కామెంట్స్ రాసే నాలాంటి వాళ్ళు కామెంట్స్ మాత్రమె రాయాలా ?
    మేము మూడేళ్ళ గా కామెంట్స్ రాసుకున్తూనే ఉన్నాం
    తోక్కేసారు. టాలెంటు ని తోక్కేసారు.
    @ శర్మ గారు
    ఈ సామెతలు నా బ్లాగ్ చదివి రాసారనుకుంటా :)

    ReplyDelete
  6. >>>అందరూ బ్లాగు రచయితలైతే కామెంటేది ఎవరు ?

    Ans : మార్తాండ

    ReplyDelete
  7. బ్లాగో బ్లాగస్య బ్లాగః అన్నారు పెద్దలు! జిలేబీ గారికి అభివందనములు!

    ReplyDelete
  8. జిలేబిగారు,

    ఇక్కడ నా వంతుగా ఒక మాట. బ్లాగులు సీరియస్ గా రాసి తమ రాతలను మెరుగుపరుకుని మంచి వ్యాసాలు, కధలు రాసేవారికి, రాయాలనుకునేవారికి ఈరోజు పత్రికలలో మంచి ఆదరణ ఉంటుంది. కొందరు బ్లాగర్లు ఆ ప్రయత్నాలు చేసి సఫలులైనారు. కాని టైమ్ పాస్ కబుర్లు, కెలుకుడు రాతలు, వెక్కిరింపు టపాలు రాసేవారికి వారి బ్లాగులే మేలేమో.

    ReplyDelete
  9. Appa Rao Sastri,

    నెనర్లు. కి.ప.డో.న అనగా ఏమి ? మీరు ఉత్త కామెంట్లు మాత్రమె రాయటం లేదు. మాంచి టపాలు రాస్తున్నారు. కాబట్టి మీ టాలెంటు తొక్కడం అన్నది కాని పని.


    @జ్యోతి గారు,

    సరిగ్గా చెప్పారు. అందుకే ఆ సామెత కి (బ్లాగు మీద రాతలు కూటి కైనా పనికి రాదు (ఇది జ్యోతక్క గారికి వర్తించదు!)_ ఆ తోక తగిలించడం.

    ఈ విషయమై , శంకరాభరణం బ్లాగులో మీకు జే జే లు జరుగుతున్నాయి. గమనించారా ?

    చీర్స్
    జిలేబి.

    ReplyDelete
  10. @రసజ్ఞ గారు,

    ధన్యవాదములు. బ్లాగో బ్లాగస్య బ్లాగోన్నతః అని తెలుగులో మా పెద్ద వాళ్ళూ చెప్పారండీ.

    ReplyDelete
  11. జిలేబిగారు,

    కి. ప. దొ . న = ROFL అనుకుంటా..

    పన్లో పని నా కొత్త సామెత............

    బ్లాగు లో రాయలేనమ్మ నోబెల్ (అవార్డ్ ) కి రాస్తానందట...!

    ReplyDelete
  12. అయ్యా జాన్ గారు,

    అల్ రెడీ ఒక కంఫ్యూషన్ - కి ప దొ న. ఇప్పుడు మరొకటా, ROFL ? అయ్య బాబొయ్ , నేనీ గేం కి రాలేను స్వామీ !

    మీ కొత్త సామెత బహు బాగు.

    చీర్స్
    జిలేబి.

    ReplyDelete
  13. ROFL = Rolling on Floor laughing

    ReplyDelete
  14. కిం ప దొ న = కింద పడి దొర్లి నవ్వడం :))

    ReplyDelete