సభా ప్రాంగణమున బుడతడి గురించి చర్చా ఘట్టము
శ్యామలీయం మాష్టారు సభా ప్రాంగణమున ప్రవేశించి పిడుగు బుడతడి రాక ని కవి పండితాదులకి తెలియజేసారు.
"మన ఈ కవితా ప్రాంగణమున ఆ బుడతడు ఏమి నేర్చుకునును? దీనికి కొంత తెలుగు జ్ఞానము కలిగిన వారై , గ్రాంధికము తెలిసిన వారై వుండిన కదా ఏమైనా వారికి అర్థమగును ? అందులోనూ , బుడతడు అంటున్నారు శ్యామలీయం వారు . అంత చిన్న పిల్లవాడు మనతో ఎలా సంభాషించ గలడు ? "అన్న పండిత నేమాని వారి పృచ్చ తో సభా ప్రాంగణమున కలకలము, మంచి విషయము చర్చకు వచ్చినది అన్న సంతోషము వారిలో కలిగినది.
ఈ ప్రశ్న కి స్వయముగా సమాధానము జెప్పక ఎప్పటి వలె శంకరార్యులవారు అష్ట దిగ్గజముల వైపును, మీదు మిక్కిలి పండిత లోకమును గాన్చినారు చిరునగవుతో , మీ సమాధానం ఏమిటి జెప్పుడు అన్నట్లు. ! ఆర్యులవారు ఎప్పుడు తమ అభిప్రాయమును మొదటే జెప్పరు. అది వారి సొబగు. అప్పుడే కదా కవితా లోకమున ఇంద్రధనుస్సులు వెల్లి విరియును !
లక్కాకుల వారు వెంటనే లేచి, 'అయ్యలారా, మనం ఇంత సంకోచించ రాదు. మనము వృద్ధులమై పోతున్నాము. ఈ సభ మనతో నే ముగిసి పోవలెయునా ? నది పారును. తటాకము ఒక్క చోటే ఉండును. మనము తటాకం వలె ఒక్కరే ఉన్నాము. మనము నదియై పారవలె. అప్పుడే కదా ఈ కవితా లోకము అభివృద్ధి చెందును ? కాల ఘట్టములో చూడుడు, నదీ ప్రవాహక ప్రదేశములలో నే కదా జన జీవనము ? కావున నా అభిప్రాయం , మనము నదియై పారవలె. మనతో బాటు చిన్న కాలువలు రావచ్చును. అవి కొంత కాలం తరువాత మనలో కలసి, ఆవియును నదియై , మహానదియై రాబోవు కాలమునకు స్ఫూర్తి నిచ్చుదురు " అని భావవేశాముతో తమ నిర్దుష్ట అభిప్రాయమును తెలియ జేసినారు.
ఈ మారు శ్యామలీయం వారికి 'భేషో లక్కాకుల మాష్టారు' అని మొదటి మారు అనాలన్న సంతోషము గలిగినది. తన మనసున వున్న మాటయే వారు కూడా అనేయటం తో వారికి ఇక బ్లాగ్కామెంటు ఇవ్వటం కుదరక శ్యామలీయం వారు లక్కాకులవారికి బ్లాగ్కామ్ప్లిమెంటు ఇచ్చి ముసి ముసి నవ్వులతో తమ ఆనందాన్ని తెలియ జేశారు.
ఇక మిగిలిన మాష్టార్లు , ఓ మోస్తరు గా , తమ అభిప్రాయమును లక్కాకుల వారి వలె తెలియజేసారు, తమదైన స్వంత శైలి లో. రాజేశ్వరీ అక్కయ్య గారికి మొదటి మారు సంతోషం వేసినది. ఇప్పటిదాకా అందరు పెద్ద మనుషల సాంగత్యం తో తన చిలిపిదనం కట్టు బెట్టి కొంత గంభీరం గా ఉండవలసి వచ్చే. ఈ బుడతడి రాకతో వారి మాతృ హృదయము కొంత ఊరట జెందినది.
పండిత నేమాని వారు ముసి ముసి నవ్వులతో, మొత్తం చర్చని గమనించి, 'ఆర్యులారా, నేనలా మొదటే అనడం వల్ల మన చర్చా కార్యక్రమము రమ్యముగా జరిగినది. గురువు గా తమ మొదటి కర్తవ్యం శిష్యులలో ఉత్సుకతతని నెలకొల్పటం ! ఆ కర్తవ్యమును నేను సరిగ్గా నెరపినానని భావిస్తాను ! ఇక మనం శంకరార్యులవారి అభిప్రాయమును తెలుసు కొందుము ' అని ఆర్యులవైపు చూసారు వారు.
శంకరార్యులవారేమైనా తక్కువ వారా ? నాలుగు పదుల సంవత్సరం అధ్యాపక వ్రత్తి ని కడు రమ్యముగా గావిన్చినవారు. వారు అవుననీ కాదనీ అనకుండా , ఎప్పటి వలె,
' ఆర్యులారా, మనం ఏదైనాను సమస్యా పూరణము ద్వారానే కదా అన్నిటికి పరిష్కారము గావిన్చేదము. కావున ఈ బుడతడికి కూడా ఒక ప్రశ్న ఇచ్చెదము . వాడు దానికి జెప్పు జవాబు బట్టి మనము తీర్మానించ వచ్చును ' అని శ్యామలీయం వారి వైపు తిరిగి, ' శ్యామలరావు గారు, ఆ బాలకుడు జేప్పినది ఏమి ? తన మాత మాట గా వచ్చితి నని కదా ? " అన్నారు
' అవును ఆర్యా' అన్నారు శ్యామలీయం మాష్టారు. ' ఇందులో ఏదైనా వేరే సూక్షమ్ము ఏదైనా ఉందా ' అని ఆలోచిస్తూ.
'కావున ఆ బాలకునికి, వారి మాత గురించి జెప్పుమని ఒక ప్రశ్న వేసెదము. వాడు దానికి ఏమి జేప్పునో దానిని బట్టి మనము ఆతనికి సభా ప్రవేశము ను ఇచ్చుట యో లేక తిప్పి పంపి వేయుటాయో జేసేదము !' అని ఆర్యులవారు జెప్పారు.
అష్టదిగ్గజములు ఎప్పటి వలె దీనికియునూ తలయూపి, శ్యామలీయం మాష్టారు వైపు జూసినారు.
శ్యామలీయం వారు, 'నెమిలి' యై చెంగున ఎగిరి, బుజ్జి పండుని తమ మూపురము పై నిడుకుని సభా ప్రాంగణమున తిరిగ రాగా, ఆ షణ్ముఖు డే వచ్చాడా అన్నంత గా ఆ సభా ప్రాంగణము దివ్య కాంతులతో ప్రజ్వరిల్లినది. !
(సశేషం)
(నేడు డిసెంబర్ పదకొండు ! -
ప్రముఖ తమిళ కవి సుబ్రహ్మణ్య భారతి(సుందర తెలిన్గినిలే పాటిసై త్తేన్ అని తెలుగు సొబగు ని మెచ్చుకున్న తమిళ కవి వారు ) గారి జన్మ దినం అని మా సింగపూరు వారి oli ఎఫ్ఫెం వారి మాంచి తమిళ పాటలు పెడుతున్నారు. ఈ శుభ దినమున మన బుడతడు శంకరాభరణము కొల్వును జేరుట శుభ సూచకం గా భావిస్తాను !
మీదు మిక్కిలి కందుకూరి పంతులుగారి జన్మదినం అని మన నవ రసజ్ఞ వారు తెలుపుతున్నారు రాజమహేంద్రవరం నించి.. ఆ పై ఎందుకో ? ఏమో ? గారు తెలుగు బ్లాగు మహోత్సవ దినం కోసం ఒక మాంచి వీడియొ తయారు జేసి అందరినీ ఆశ్చర్యామ్భుధిలో ఓల లాడిస్తూ వున్నారు ! - ఈ శుభ దినాన శ్రీమాన్ బుజ్జి పండు వారు శంకరాభరణం కొలువు ప్రవేశం మరీ శుభ సూచకం! జ్యోతిర్ మాయీ వారు సంతోషమే కదా !
- చీర్స్ జిలేబి )