Saturday, December 3, 2011

ఖబడ్దార్ - మీరెక్కడి నించి రాస్తున్నారో , మీరెవరో అంతా మాకు తెలుసు !

బాబయ్యా - బిగ్ బ్రదర్ మిమ్మల్ని తోలుకు రమ్మన్నాడు !

బాబయ్య కి తానేం తప్పు జేసాడో తెలీలే ! తాను చిన్నప్పుడు సినిమాలలో జూసేడు - వూళ్ళో ఎవడైనా ఏదైనా జేస్తే , 'అన్న' కబురంపే వాడు - ఆ తరువాత ఆ కబురు అందుకున్నవాడు గాయబ్ !

ఆ మధ్య కోల్డ్ వార్ సమయాల లో వీడు వాణ్ణీ, వాడు వీణ్ణీ అద్దాలు బెట్టి గమనిమ్చుకునే వాళ్ళు.  స్పై , క్రాస్ , డబల్ క్రాస్స్ మొదలగు పేర్లతో వీళ్ళు ప్రసిద్ధులు.

మన ఒక కాలపు తెలుగు సినిమాలో 'అన్న' ఎప్పుడు  కరకు మనిషే. అన్న రమ్మన్న డంటే , మన కు మూడి నట్టే లెక్క అన్న మాట !

ఇప్పుడు ఆ పెద్దన్నయ్య మన భారద్దేశం అయి పోయిందని వార్తా పత్రికల భోగట్ట !

ఇక మీదట జిలేబి ఏదైనా రాస్తే వెంటనే (ఆల్రెడీ తెలుసేమో?) పెద్దన్నయ్యకి ఖబురు వెళుతుంది.

జిలేబి మీ గురించి రాసిన్దటండి !

ఏమి గీకిన్దిరా ఆవిడ ?

మీరు బిగ్ బ్రదర్ అనండి

వెంటనే ఆవిణ్ణి బొక్కలో పెట్టు. ఏమిటా ఖండ కావరం? నన్ను మిస్టర్ బిగ్ బ్రదర్ అని వుండాలి కదా !

ఇప్పుడు జిలేబి కి సందేహం వస్తోంది. ఈ సంకలునులు, హారం లు కూడా ఈ బిగ్ బ్రదర్ కి సీక్రెట్ ఎజెంట్లేమో ?

ఎందుకంటే మనం ఏమైనా రాస్తే, వీళ్ళకి వెంటనే తెలిసి పోతోన్దబ్బా ! అదే ఎలా నో తెలీయటం లేదు.!

వెంటనే మనం గాయబ్ అయి పోవటం మంచిది ఈ బ్లాగ్ లోకం నించి!

చీర్స్

జిలేబి.

10 comments:

  1. వరూధిని గారు చాలా బాగా వ్రాశారు నాగురించి మీకు ఎలా తెలిసిందో అని కంగారు పడ్డాను... :)

    ReplyDelete
  2. నాకు అర్ధం కాలేదు :(

    ReplyDelete
  3. కామెంటిన తెలుగు పాటలు గారికి, సుభ గారికి, హుస్నా గారి కి, శర్మ గారికి అందరికి నెనర్లు. టపా అర్థం కాలేదని తెలుస్తోంది. కాబట్టి మరీ మంచిదే!
    అర్థం ఐతే అర్ధం ప్రాబ్లం బిగిన్ అగును. కాబట్టి అర్ధం అవకపోవటమే మంచిది !
    శుభం భ్రూయత్ !

    చీర్స్
    జిలేబి.

    ReplyDelete
  4. పోస్ట్ ఏమో కానీ కామెంట్స్ అర్ధం కాలేదు ( టపా అర్థం కాలేదని తెలుస్తోంది. కాబట్టి మరీ మంచిదే!
    అర్థం ఐతే అర్ధం ప్రాబ్లం బిగిన్ అగును. కాబట్టి అర్ధం అవకపోవటమే మంచిది !)

    ReplyDelete
  5. జేలేబి ఉరుఫ్ వరూధిని గారు ....ఈ టపా చుసిన తరువాతా నాకేమి అనిపిస్తుందో ...నిర్భయంగా రాస్తున్నా!!
    అన్న పిలిచాడు, రామారావు గారు ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు రాజశేఖర్ రెడ్డి గారి అనుచరుడు చెవిరెడ్డి భాస్కరెడ్డి తిన్నాడు .మా పొలం లో గేద పాలు ఇవ్వట్లేదని కర్నూలు కాంతారావు ఇంట్లో మీటింగ్ పెట్టాం. అసలు మీ గొడవ ఏందీ రా బై అని వచాడు తిక్కలోడు కాకపొతే వాడికేందుకండి?. అయినా పెళ్లి పూట ఆ మాటలేన్టండి? 7 సెన్సు అనే సినిమా పర్వాలేదు కాని అర్ధం కాలేదు పాటలు బాగున్నై కాని సరిగ్గా వినలేదు నేను...మంచోడినే కోడి ముందా గుడ్డు ముందా? ఇది ఏమిటి?

    ఇంతకీ ఏమి raasanu ? వీల్లేదు ? ఏంటి? వస్తున్నా !! ఎక్కడ? కుదరదు ? అంతేనా? సరే !! వెళ్ళాలి ! ఎవరికీ?

    :) :) : )

    అర్ధం ఐందా????????????????? :) :)

    శ్రేయోభిలాషి
    RAAFSUN

    ReplyDelete
  6. అయ్యా, రాఫ్సన్ మహాశయా,

    నా టపా వెనక్కి లాగేసు కుంటున్నాను. ఇంతమంది కి అర్థం కాలేదంటే, టపా కట్టేయ్యవల్సినదే !

    చీర్స్
    జిలేబి.

    ReplyDelete
  7. తెలుగు పాటలు గారు,

    నెనర్లు. పోస్టు తో బాటు టపా కూడా గాయబ్!

    చీర్స్
    జిలేబి.

    ReplyDelete
  8. టపా వెనుకకు మంచి ఐడియా.. ఒక ఐడియా టపా నే క్లోజ్ చేసింది ... హాహా

    ReplyDelete
  9. తెలుగు పాటలు గారు,

    If you think nobody cares if you're alive, try missing a couple of payments!

    చీర్స్

    జిలేబి.

    ReplyDelete