Wednesday, December 7, 2011

బుజ్జి పండు తెలుగు చదువు !

బుజ్జి పండు తన తల్లి గారైన శర్కరీ జ్యోతిర్ 'మాయీ' వద్ద వారు నేర్పిన తెలుగుని నేర్చుకుంటూ తెలుగు కాంతుల విరజిమ్ముతూ తెలుగు బిడ్డగా అమెరికా దేశమునందు పెరుగు చున్నాడు.

ఆ తల్లికి, తన తనయుడు మరి ఇతర తెలుగు గురువుల వద్ద తెలుగు ని నేర్చుకోవలె అనెడి కోరిక గలిగెను. తాను ఎంత నేర్పినను , సరియైన గురువు చెంత నేర్చిన విద్యయే కదా విరాజిల్లు అని ఆ తల్లి తలబోసి

'పుత్రా, బుజ్జి పండూ,  నీవు నా దగ్గిర నేర్చిన తెలుగు ని ఇంకను అభివృద్ధి చేసుకొనుటకై నేను నిన్ను మరి కొందరు మన 'తెలుగు బ్లాగ్ గురువుల  చెంత గురుకుల వాసము చేయుటకు పంపవలెనని నిశ్చయించితి అని ఆ మాత పలుకగా,

తనయుడు బుజ్జి పండు 'మాతా, నీ వాక్కు నాకు శిరోదార్యము. వెంటనే సెలవీయుడు , నేను మొదట ఏ e-గురువుల వారి వద్ద వాసము చేయవలె నని అడుగగా

 ఆ మాత కడుంగడు ముదావహము తో

'పుత్రా బుజ్జి పండూ,  నాకొక్క దినము అవకాశము నిమ్ము, నీకు ఆ గురువుల పేరు తెలిపెదను ' అని బహు సంతోషానంద  భరితు రాలై 'పుత్రోత్సాహముతో' ఆ నాటి కార్యక్రమములను ముగించుటకు సంసిద్దురాలాయెను.

పుత్రుడు బుజ్జి పండు తాను నేర్చుకోబోవు తెలుగు ను దృశ్య కావ్యముగా జూచుచు నిదురయందు జారుకొనెను.


(సశేషం)

16 comments:

  1. హిహిహిహిహి...బుజ్జిపండు ఎవరిదగ్గరకెళతాడో..ఈ ఉత్కంఠకి తెర పడేదెప్పుడు?

    ReplyDelete
  2. అర్థం కాలేదు కానీ ఇది కూడా అక్షరాలు నేర్పించడం గురించేనా? http://videos.teluguwebmedia.in/84352308 ఎందుకంటే నేను కూడా మా అన్నయ్య గారి అబ్బాయికి అక్షరాలు నేర్పిస్తూ వీడియో ఒకటి తీశాను.

    ReplyDelete
  3. ఆ సౌ గారు,

    నాకూ ఇంకా కథ పూర్తిగా తెలీదు. కాబట్టి వేచి చూడవలె నిదురలో ఆ బుజ్జి పండు ఎలాంటి దృశ్య కావ్యమును చూచెదడో అని ! జేకే! మీరే చెప్పండి మొదట ఎ గురువు గారో ?

    చీర్స్
    జిలేబి.

    ReplyDelete
  4. ప్రవీణ్ శర్మ గారు,

    మీరు ఇదే నా బ్లాగుకి మొదటి మారు రావడమేమో? నెనర్లు. బుజ్జి పండు చదువు చాలా బృహత్తరమైనది. మీ వీడియో తో దానికి సంబంధం లేదు. !

    'చీస్'

    జిలేబి.

    ReplyDelete
  5. చదివిన తరువాత అదేదో పిల్లలకి అక్షరాలు నేర్పించడం లాంటిది అనిపించిందిలెండి.

    ReplyDelete
  6. బాబ్బాబు! బుజ్జిపండుకి మంచి గురువుని రికమండ్ చేయండి.

    ReplyDelete
  7. ప్రవీణ్ శర్మ గారు,

    బుజ్జి పండు అక్షరాలూ అవన్నీ ఎప్పుడో నేర్చేసుకున్నాడు. చక్కగా తెలుగు మాల్లాడుతాడు కూడాను ! గురువుల వద్ద వాడు నేర్చుకోవాలని ఆ మాత కోరిక ! అంతే !

    చీర్స్
    జిలేబి.

    ReplyDelete
  8. శర్మ గారు(కష్టేఫలె)

    కంటే భలే !! బుజ్జి పండు నిదురలో ఎవరి తో గురు శిష్య సంభాషణలు లాగిస్తున్నాడో నాకు కూడా తెలియదు. అందుకే సశేషం అక్కడ! మీకు తెలిసిన మాంచి ఈ- గురువులని తెలపండి !

    చీర్స్
    జిలేబి.

    ReplyDelete
  9. నన్ను లాగకండి నేను అసలే తెలుగులో చాలా చాలా వీక్

    ReplyDelete
  10. బులుసు గారు ఎక్కడ ఈ మధ్య కనిపించటం లేదు...బహుశా బుజ్జి పండుకి సిలబస్ తయారు చేయుచున్నారేమో..

    ReplyDelete
  11. "విష్ణు శర్మ english చదువులా"
    blog లో బోధన
    అనే కార్యక్రమం ఎమన్నా చేపట్ట బోతున్నారా?
    మీరే నేర్పెట్లైతే చెప్పండి బుజ్జి పండుకి తోడుగా నేను నేర్చుకుంటాను
    ముందే fees అడక్కూడదు సుమా !!
    విద్యాభ్యాసం పూర్తి కాగానే గురువులు మెచ్చేదే దక్షిణగా ఇవ్వటం జరుగుతుంది...

    ReplyDelete
  12. clue" నిదురలో ఆ బుజ్జి పండు ఎలాంటి దృశ్య కావ్యమును చూచెదడో "

    క్లూ పట్టేశాను !!
    ఇంతకి ఇది జాగ్రదావస్థ యందలి బోధ కాదన్నమాట స్వప్నము నందు భోదన
    భలే భలే "అవతార్" movie లో కధానాయకుడు నాయకి వద్ద స్వప్నంలో విద్యలు అభ్యసిన్చినటుల"
    ఇంతకి ఏమి topic (సిలబుస్) సారీ సిలబస్
    ?!

    ReplyDelete
  13. మొదట్లో నాకు పై లింక్ కనిపించలేదు, అందుకే అర్థం కాలేదు.

    ReplyDelete
  14. జిలేబి గారూ మా 'బుజ్జిపండు'విద్య గురించి మీకున్న ఆసక్తికి మహదానందముగానున్నది. గురువును వెతికే గురుతరమైన బాధ్యత మీకప్పగించుచున్నాము. మా బుజ్జి పండుతో పాటు వారి మిత్రులునూ మీ సమాచారము కొరకు ఆసక్తిగా ఎదురుచూచున్నారు. ధన్యవాదములు.

    మరొక్క మనవి
    "తనయుడు బుజ్జి పండు 'మాతా, నీ వాక్కు నాకు శిరోదార్యము. వెంటనే సెలవీయుడు." ఈ వాక్యము కడు వినసొ౦పుగనున్నది.

    ReplyDelete
  15. తప్పుకున్న తెలుగు పాటల గారికి నెనర్లు !

    @ ?! గారు, బుజ్జి పండు తో చేరి మీరు ను తెలుగు చదువుటకు నిర్ణయించినండులకు బహు సంతోషం ! తినబోతూ రుచి అడుగనేల! బుజ్జి పండు తో చేరి చదువు కొందురు అప్పుడే సర్వమూ తెలిసి వచ్చును !

    @ప్రవీణ్ శర్మ గారు,

    మీ ఓపికకు జోహారులు. మొత్తం మీద లింకు కనిపెట్టి అర్థం చేసుకున్నందులకు దవా
    @మాతా జ్యోతిర్ 'మాయీ'

    బుజ్జి పండు చదువుకి మీరు అప్పజెప్పిన భారము కడు దొడ్డది. దీనిని నేను పరిపూర్ణముగా నిర్వహించ గలదానినా అన్న సందేహం నాకు ఉన్నను నా వంతు ప్రయత్నము గావించ దెను!

    ఇంతకీ బుజ్జి పండు నిదురలో ఎవరితో సంభాషణలాడుచున్నాడో రండు పోయి చూసెదము అతిశీఘ్రముగా !

    చీర్స్
    జిలేబి.

    ReplyDelete
  16. జిలేబీగారు! ఈపాటికే గురువుల చిట్టా తయారుచేసి వుంటారు. తొందరగా గుట్టు విప్పండి.

    ReplyDelete