Tuesday, December 6, 2011

మాయన్ కాలెండరు - 12-Dec-2012 సారూప్యతలు - ఇది జిలేబి పరిశోధన!




మాయన్ క్యాలెండరు గురించి జరుగుతున్న పరిశోధనలు గురించి మీలో చాలామంది చదివే ఉంటారు.



దీనికి సంబంధించి కొంత చదివాక సరే - మన జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఏమైనా ప్లానెటేరి పొసిషన్స్ కనిపిస్తున్నాయా అని ఆ రోజు కి అంటే డిసెంబర్ ఇరవై ఒకటి , రెండు వేల పన్నెండు కి చక్రం గీస్తే నాకైతే ఎలాంటి విశేషాలు కనిపించలేదు చార్ట్ లో.


సరే - ఇంత గగ్గోలు అవుతోంది కదా - ఈ మాయన్ కాలెండర్ సబ్జెక్టు అని కొంత ముందు వెళ్లి డిసెంబర్ పన్నెండో తేది ,(కాకుంటే పదమూడో తేది ) రెండు వేల పన్నెండు కి చార్ట్ చూస్తె - ఓ పాటి విలక్షణమైన జ్యోతిష చార్ట్ కనిపించింది. అంటే - రెండు ప్లానెట్ లు తప్పించి, ( మంగళ, శని గ్రహాలూ తప్పించి మిగిలిన వన్ని కల గట్టుకుని ఎదురెదురు గా కనిపించడం, ఆ పై డిసెంబర్ పదమూడో తేది అమావాస్య కూడా కావడం లాంటివి నాకు తట్టిన విశేషాలు. మీకు జ్యోతిష్య శాస్త్రం తెలిసి ఉంటె మరీ మీరు  పరిశోధించి ఉండ వచ్చు.

అంతె కాకుండా - పదమూడో తేది అమావాస్య కాబట్టి - డిసెంబర్ ఇరవై ఒకట వ తేది నవమి.

త్రేతాయుగ కర్త శ్రీ రాముని జననం     నవమి లో.

ద్వాపర యుగ కర్త శ్రీకృష్ణుడి జననం  అష్టమి లో.


కలి యుగ కర్త ( ఎవరు? ) తెలియదు, నాకైతే - కలి ప్రభావం అనుకుంటే - శ్రీ కృష్ణ పరమాత్ములవారు ఈ కలి యుగానికి కూడా అవతార పురుషుడు  గా అనుకోవచ్చు. (వచ్చే అవతారం దాక, లాస్ట్ అవతార పురుషుడు ఇన్-చార్జ్ అన్న మాట!)


సో, ఈ రీతిలో ఆలోచిస్తే - సప్తమి రోజున ఏదైనా విశేషం ఉండవచ్చా?

అంటే ఈ డిసెంబర్ పన్నెండు నించి ఇరవై ఒకటి లోగా ఏదో విశేషం జరగవచ్చు అని ఊహించవచ్చా?

ఈ టపా ముఖ్యోద్దేశం మీకు తెలిసిన ఏదైనా పాయింటులు వుంటే వాటి గురించి రాయగలరు.

ఈ శీర్షిక పై మొదటి సారి నేను రాసినప్పుడు, సందీప్ అనే బ్లాగరు, పంచవటి అన్న గ్రూప్ కి ఈ మేటర్ ని పంపిస్తానని అందులో నిష్ణాతులు ఏదన్నా చెబ్తారేమో చూస్తామని అన్నారు. కాని ఆ తరువాత ఆ సందీప్ అన బడే ఆసామి దీని ని పంచవటి కి రెఫెర్ చేసారా, దాని పర్యవసానాలు నాకు తెలీదు. వారి నించి ఎట్లాంటి స్పందనా రాలేదు. శ్రీ తెలుగు యోగి శర్మ గారి ప్రకారం ఈ తేదీలలో ఎట్లాంటి విశేషాలు లేవు. (నా కు తెలిసి వారు రాసిన టపాలని బట్టి, - వేరుగా పంచవటి లో వేరే ఏమైనా సవివరం గా చర్చించి వుంటే నాకు తెలియదు)

ఆ  పంచవటి వారు గాని, వేరే వారేమైనా దీని ని పరిశోధించి వుంటే వివరాలు తెలుప గలిగితే మరీ సంతోషం !

సర్వే జనాః సుఖినో భవంతు ! సమస్త  మంగళాని భవంతు. !!



చీర్స్
జిలేబి

17 comments:

  1. మీ పరిశోధన బాగుంది. జరగబోయేదాని గురించి మానవుడికి ఆసక్తి ఎక్కువ. జరిగేదాన్ని ఆపలేము. తెలుసుకోవడం పొరపాటనటంలేదు.

    ReplyDelete
  2. వరూధిని గారు యుగాంతం నిజామా?:( 2012 మూవీ ప్రజలలోకి వెళ్ళటానికి ఆ టాపిక్ తీసుకొని వచ్చారు అని కొంతమంది చెప్పారు.. అది నిజం అయితే ఇంక సముత్సరం ఆరు రోజులేనా టైం ఉంది

    ReplyDelete
  3. నేనేమి చెప్పను ...జరగబోయేది చూస్తాను....నాకు ధైర్యం ఎక్కువ !!!!!

    పై మూడు ముక్కలు నా అంతరాత్మ మీ టపాలో రాయమంది ...అంతే రాసేసా...నాకేమి సంబంధం లేదు.బై బై ,,,

    శ్రేయోభిలాషి,
    RAAFSUN

    ReplyDelete
  4. 2012 యుగాంతమా.. :-( , సినిమాలో చూపించినట్టు సముద్రాలు భూమిని ముంచేస్తాయా.. :-( , అయినా మరేం పర్లేదు నాకు ఈతొచ్చు .. :p

    ReplyDelete
  5. శ్రీకాంత్ గారు ఈత వస్తే ఒకే కాని.. అగ్ని పర్వతాలు ప్రజ్వరిల్లితే ఏమి చేస్తారు.. మరీ గొడుగు వాడుత అని చెప్పకండి :)

    ReplyDelete
  6. ఎప్పుడో 30 ఏళ్ళనాడు skylab పడిపోతుంది అందరం పోతామని ఇళ్ళు, భూములు అమ్మి సరదాచేసుకున్న అమాయకుల గురించి విన్నాం గదా! కనీసం ఇప్పుడలాంటి పిచ్చిపన్లెవరూ చేయరని ఆశిద్దాం.

    ReplyDelete
  7. శర్మ గారు,

    బహు విస్తారముగా మేరు సెలవిచ్చారు. నెనర్లు.

    Freeze the Past
    Spin the Present
    Thaw the Future !

    cheers

    zilebi.

    ReplyDelete
  8. తెలుగు పాటలు గారు,

    యుగాంతం నిజమని నేననుకోను. కొన్ని బృహత్తర మార్పులు జరుగ వచ్చని నా ఊహ. మన భూమండలం లో అక్కడక్కడా , చెదురు ముదురు గా జరుగుతున్నా ఘటనాఘటనలు ప్రస్తుతానికి విసిరి వెయ బడ్డ isolated సంఘటనలు గా కనిపించినా , రాబోవు కాలం లో వాటి కి ఓ కలబోత వుందని ప్రస్ఫుటమవ వచ్చన్నది నా అంచనా.

    ReplyDelete
  9. రాఫ్సన్ మహాశయా,

    మీరు సరిఐన మార్గం ఎంచుకున్నారు. మానవ మాత్రులం చేయ వలసినది అదియే !

    ReplyDelete
  10. శ్రీకాంత్ గారు,

    పైన తెలుగు పాటల గారికి చెప్పిన సమాధానమే మరికొంత వివరం గా చెప్పాలంటే, వేచి చూడవలె, కాల గతి ఎ రీతిన పోవునో అని !

    చీర్స్
    జిలేబి.

    ReplyDelete
  11. అన్వేషి గారు,

    ముప్పై సంవత్సారాల మునుపు మాటేందుకు ? పది సంవత్సరాల మునుపు సంవత్సరం రెండు వేలు వస్తే నాశనం అని గుహలలో కెళ్ళి (తమాషా ఏమిటంటే ఓ నెలకి సరిపడా తిండి సామానులతో వెళ్లి) మకాం పెట్టిన వాళ్ళూ వున్నారని చదివాను. పుర్రె కో బుద్ధి ! వేచి చూద్దాం, మార్పు రావడం సహజం. అలాగే పైన చూపినట్టి గ్రహ పరిస్తుతులు ఇంతకు మునుపు రాకుండా వుండి వుంటుందా? ఇది ఒక సంఖ్యా శాస్త్రానికి కట్టు బడ్డది కాబట్టి ఖచ్చితం గా ఇట్లాంటి కూర్పు ఎన్నో మార్లు వచ్చి వుండవచ్చు. రాబోయే కాలం లో రానూ రా వచ్చు. కాబట్టి ... వేచి చూద్దాం !

    చీర్స్
    జిలేబి.

    ReplyDelete
  12. ఛీ ఛీ... మీరసలు మనుషులేనా? పని లేని తిక్క సన్నాసి ఒక నాలుగు లైన్ల పోశ్ట్ రాస్తే వచ్చి యుగాంతం, డాంకీ ఎగ్గు అంటూ టైం పాస్ చేస్తున్నారా.. ఒక్కొక్కడిని రోడ్లు శుభ్రం చేసే పనిలో పెట్టాలె..

    ReplyDelete
  13. ఈ కాయ ఎప్పడు పండు గా మారునో !

    చీర్స్
    జిలేబి.

    ReplyDelete
  14. :)

    జిలేబి గారు,
    చీర్స్

    ?!

    ReplyDelete
  15. @ కాయ
    :) :) :)
    (మీతో సహా ) మేము మనుషులకన్నా ఒక మెట్టు ఎక్కువ
    అంతర్జాల బ్లాగరీ బ్లాగరులం
    బ్లాగు భారతపు సహోదరీ సహోదరులం
    తమరు ఒక్క మారు గీత చూచిన యడల
    మా యీ అకర్మ (పని లేని/కాని పని) యందు కర్మను చూడగలరు

    ?!

    ReplyDelete
  16. సాధారణంగా లభించే జ్యోతీష్య Softwareలు, ఒక రాశిలో కొన్ని గ్రహాలను చూపినా, అవి ఆరంభంలోనా, మధ్యలోనా లేక చివరిలోనా అని చూపవు. నా లెక్క ప్రకారం రవి రాశి చివర్న, మిగతా గ్రహాలన్నీ రాశి మొదట్లో ఉన్నాయి. నేటి నుండి 2013 డిసెంబరు వరకు ఉన్న గ్రహగతిని ఒక ఆనిమేషన్ సహాయంతో నా బ్లాగులో పెట్టే ప్రయత్నం చేస్తాను

    ReplyDelete
  17. @తెలుగు భావాలు గారు,

    చాలా మంచి ప్రయత్నం. మీ అనాలసీసు కోసం ఎదురు చూస్తూ

    చీర్స్
    జిలేబి.

    ReplyDelete